తెలుగు వెలుగు కి స్వగతం

పాఠకులకు విజ్ఞప్తి

నమస్కారం..!

తెలుగు మనది. దాని వెలుగు మనది. అమృతమయమైన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన చారిత్రక బాధ్యత మనది. అజంతమైన భాష అందచందాలను భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం మనది.

తెలుగును పునరుజ్జీవింపచేసి ఆధునికీకరించడానికి, విశ్వవ్యాప్తం చెయ్యడానికి, మన కళా సాంస్కృతిక, చారిత్రక సంపదలను కాపాడుకోవడానికి, శాశ్వతీకరించడానికి, కొత్త తరాలకు అందించడానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అవసరం. అందుకు ఏం చేయాలి? మన భాషా సంస్కృతులకు కొత్త ఊపిరులూదడం ఎలా అన్న అంశాలపై ‘తెలుగువెలుగు’ నిరంతరం విస్తృత అధ్యయనం జరుపుతూ ఉంటుంది. ఆ అంశాలపై అధికార హోదాల్లోని వారికి సందర్భోచితంగా ఆచరణాత్మక నివేదికలు, పాఠకులకు కథనాలు అందిస్తూ ఉంటుంది. అయితే భాషారక్షణ అన్నది తెలుగువారందరూ చేయీ చేయీ కలిపి చేయాల్సిన బృహత్కార్యం. ప్రతి తెలుగు బంధువూ ఈ యజ్ఞంలో యథాశక్తి పాలుపంచుకుంటే... మన జాతి వైభవం విశ్వవ్యాప్తం అవుతుంది, ఆచంద్రతారార్కం నిలుస్తుంది. మీ పూనిక తెలుగు జాతికి కానుక.

అయితే ఒక్క మాట...

తెలుగు వెలుగు వెబ్‌సైట్‌లోని రచనల మీద మీ అభిప్రాయాలను తెలియజేసేటప్పుడు, వెబ్‌సైట్‌లోని ఇతర వేదికల మీద మీ వాఖ్యలను జోడించేటప్పుడు ఈ షరతులు, నిబంధనలను దృష్టిలో ఉంచుకోగలరు.

* మీ అభిప్రాయాలు పూర్తిగా ఆయా రచనలకు సంబంధించే ఉండాలి. రచనకు సంబంధం లేని బయటి విషయాల మీద వ్యాఖ్యానించడం ఔచిత్యం కాదు.

* మాండలికం- యాస, ప్రాంత, మత, కుల, వర్గ, లింగ పరంగా ఇతరులను బాధించే అభిప్రాయాలు, వ్యాఖ్యలకు ‘తెలుగు వెలుగు’ వెబ్‌సైట్‌లో స్థానం ఉండదు. అనవసర వాదప్రతివాదాలకూ చోటు లేదు. అలాగే.. సహ పాఠకులు, రచయితలు, సంపాదకులను వ్యక్తిగతంగా నిందిస్తూ.. వారికి దురుద్దేశాలను ఆపాదిస్తూ రాసే అభిప్రాయాలు, వ్యాఖ్యలనూ తొలగించే అధికారం సంపాదకులకు ఉంది.

* అభిప్రాయాలు, వ్యాఖ్యలు సూటిగా, స్పష్టంగా, మర్యాదపూర్వకమైన భాషలో వీలైనంతగా సంక్షిప్తంగా ఉంటే బాగుంటుంది.

* అభిప్రాయాలు, వ్యాఖ్యలు మీ పేరుతో వెబ్‌సైట్‌లో ప్రచురితమవుతాయి. ఒకవేళ మీరు ఏదైనా నిర్దేశిత రచన మీద ‘అజ్ఞాత పాఠకుడి’ రూపంలో అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే- ఆ విషయం సంపాదకులకు తెలియజేయాలి. సహేతుకమైన అభ్యర్థనను సంపాదకులు పరిశీలించి, ఆ అవకాశమిస్తారు.

* వెబ్‌సైట్‌లో ప్రచురణకు మీ రచనలు పంపించదలిస్తే తగిన హామీపత్రాన్ని జోడించి tvweb@ramojifoundation.org కు మెయిల్‌ చేయవచ్చు. అభిప్రాయాలు, వ్యాఖ్యలు తెలియజేయడానికి ఉద్దేశించిన వేదికల్లో పెట్టే రచనలు సంపాదకుల పరిశీలనకు వెళ్లవు.

* * *

ధన్యవాదాలతో....,
సంపాదక వర్గం
తెలుగు వెలుగు
రామోజీ పౌండేషన్

bal bharatam