<p>అల&zwnj;రిస్తున్న ఆటా- &ldquo;ఝుమ్మంది నాదం&rdquo; పాటల పోటీలు</p>

అల‌రిస్తున్న ఆటా- “ఝుమ్మంది నాదం” పాటల పోటీలు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వ‌ర్యంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హిస్తున్న‌ “ఝుమ్మంది నాదం” పాటల పోటీలు ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రింత‌గా జరుగుతున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా జూన్ 28వ తేదీ నుంచి ఆగ‌స్టు 2వ తేదీవ‌ర‌కు శ‌ని, ఆదివారాల్లో సెమీ ఫైనల్స్ నిర్వ‌హిస్తున్నారు. జూన్ 28వ తేదీన‌ నాన్ క్లాసికల్ విభాగంలో సబ్ జూనియర్స్‌కు పోటీ నిర్వ‌హించగా , జులై 4, 5 తేదీలలో నాన్ క్లాసికల్ విభాగంలో జూనియర్స్‌కు పాటల పోటీలను నిర్వహించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి 82 మందికిపైగా గాయనీగాయకులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఝు‌మ్మంది నాదం కార్య‌క్ర‌మానికి బోర్డు అఫ్ ట్రస్టీ రామక్రిష్ణా రెడ్డి ఆల, శ్రీమతి శారదా సింగిరెడ్డిలు నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. పోటీల‌కు ప్ర‌ధాన న్యాయ‌నిర్ణేత‌లుగా సంగీత ద‌ర్శ‌కులు, గాయ‌కులు నిహాల్ కొండూరి, సంగీత ద‌ర్శ‌కులు (యూఎస్ఏ) శ్రీని ప‌భ‌ల‌, క‌ర్ణాట‌క సంగీత విద్వాంసులు వాసా గోపినాథ్ రావులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కులు రాజశేఖ‌ర్ సూరిభొట్ల‌, స‌ప్త‌స్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ ప్రిన్సిప‌ల్‌, కర్ణాట‌క సంగీత‌కారులు ఎమ్‌డీ లాయ‌క్ అహ్మ‌ద్‌, స్వ‌ర‌కర్త కార్తీక్ కొడ‌కండ్ల‌, నేప‌థ్య గాయ‌నీ గాయ‌కులు నూత‌న మోహ‌న్‌, మాన‌స ఆచార్య‌, అనుదీప్ దేవ్‌, ప్ర‌వీణ్ కుమార్ కొప్పులు, పీవీఎన్ఎస్ రోహిత్‌లు గెస్ట్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆటా ప‌రిధిలోని ఉత్త‌ర‌ తూర్పు, ద‌క్షిణ తూర్పు, మ‌ధ్య పశ్చిమ, ద‌క్షిణ ప‌శ్చిమ, ప‌శ్చిమ ప్రాంతాల నుంచి నాన్ క్లాసికల్ - సబ్ జూనియర్స్ విభాగంలో సెమీ ఫైనల్స్‌లో పాల్గొన్న‌వారిలో అమ్రిత వుడుముల, అనన్య జొన్నాదుల, అనన్య యెర గుడిపాటి, కృతి రాచకొండ, మహి ఓత్ర, మిత్ర చెబియం, పర్ణిక వుల్లగంటి, శరణ్య ఎస్ , తన్వి గొంగల, వైష్ణవి రెండుచింతల ఫైనల్స్‌కు ఎంపిక‌య్యారు. ఆటా అధ్య‌క్షులు పరమేష్ భీం రెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. అమెరికాలోని ఔత్సాహిక గాయ‌నీగాయ‌కులు ఈ పోటీల్లో పాల్గొని త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అన్నారు. ఈ పోటీలను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తున్న‌ మన టీవి, మన టీవి ఇంటర్నేషనల్, టీవి 5 , జి .యెన్. యెన్ , ఏబీఆర్ ప్రొడక్షన్స్ , తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, టోరీ రేడియోలు ఇత‌ర‌ మీడియా మాధ్య‌మ నిర్వాహ‌కుల‌కు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఫైన‌లిస్టులుగా నిలిచిన గాయ‌నీగాయ‌కుల‌కు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల, బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ స‌భ్యులు, రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్, కాన్ఫరెన్స్ టీం, ఝుమ్మంది నాదం పోటీ నిర్వ‌హ‌ణ బాధ్యులు, సోషల్ మీడియా బృంద స‌భ్యులు తదిత‌రులు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.