మన భాషలకు మూలం అదేనా?

  • 506 Views
  • 0Likes
  • Like
  • Article Share

మనుషుల మనసుల్ని అనుసంధానించే భాషకు మూలం గురించిన అనుమానం ఇప్పటిది కాదు. ఇది శాస్త్రవేత్తల్ని గిబ్బన్ల మీద అధ్యయనానికి బాటలువేసింది. ‘గిబ్బన్లు అద్భుతమైన స్వరప్రాణులు. వీటిమీద పరిశోధన ద్వారా సంక్లిష్టమైన సమాచార పరిణామాన్ని అధ్యయనం చేసే అవకాశం దక్కింద’ంటారు దర్హం విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్‌ ఎస్తేర్‌ క్లార్క్‌. ఈ ఆసియాజాతి వానరాలు పెద్ద శబ్దాలతోపాటు, ‘హూ’ అనే ధ్వనితో మృదువైన పిలుపులు, సంకేతాలూ అందించుకంటాయి. నిర్దిష్ట సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఇవి గుసగుసల్నీ ఉపయోగిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఇవి భాష పరిణామానికి సంబంధించి విలువైన ఆధారాలను అందజేస్తాయన్నది పరిశోధకుల భావన. భవిష్యత్తులో గిబ్బన్‌ స్వరీకరణ, సమాచార మార్పిడి ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. తమ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఈశాన్య థాయ్‌లాండ్‌ అడవుల్లో నాలుగు నెలలపాటు గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటి పిలుపుల్ని, ప్రతిస్పందనల్ని నమోదు చేశారు. వీటినుంచి 450 దాకా హూ శబ్దాల్ని ఎంచుకుని కంప్యూటర్‌ విశ్లేషణ చేశారు. మగ, ఆడ గిబ్బన్లు ఒకే తరహా పిలుపులు చేస్తున్నా.. ఆడవాటిలో స్వరస్థాయి కాస్త తక్కువట! ఈ లక్షణం క్షీరదాల్లో అసాధారణం. గిబ్బన్ల శబ్దాలు మనలాగే విషయ సంబంధమని తేల్చారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం