పరాయి పదాలతో పనేంటి?

  • 1079 Views
  • 8Likes
  • Like
  • Article Share

సొంత భాషలోకి పరాయి భాషా పదాలను తెచ్చుకోవడమెందుకని ఓ దేశాధ్యక్షుడే ప్రశ్నించారు. రష్యన్‌ భాషను అతిగా లాటినీకరించే ప్రక్రియకు ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పిలుపునిచ్చారు. సాంస్కృతిక, కళల మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘కొన్ని నగరాలకు వెళ్లినప్పుడు ప్రతిమూలలో పలు సంస్థల ప్రకటనలు పూర్తిగా లాటిన్‌ అక్షరాల్లోనే కనిపిస్తున్నాయి. ఎలాంటి దేశంలో మనం నివసిస్తున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల్ని మరింత నిశితంగా, జాగ్రత్తగా పరిశీలించాలని భాషావేత్తలకు సూచించారు. మరోవైపు... రష్యన్‌ భాషలోకి విదేశీ భాషా పదాల రాకను అడ్డుకోవడానికి ఆ దేశ చట్టసభ (డ్యూమా) సభ్యులు చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్‌ మద్దతు ప్రకటించారు. ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న పదాలను రష్యన్‌లో కలిపి ఉపయోగిస్తున్న వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్న డ్యూమా ఉపాధ్యక్షుడు వ్లాదిమిర్‌ ఝిరినోవ్‌స్కీని పుతిన్‌ సమర్థించారు. డీలర్, ట్రేడర్, మేనేజర్‌ వంటి ఆంగ్ల పదాల స్థానంలో రష్యన్‌ పదాల్ని వాడాలని ఝిరినోవ్‌స్కీ ఎప్పణ్నుంచో వాదిస్తున్నారు. ఈ మేరకు గత ఏడాది జులైలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఓ ముసాయిదా బిల్లును డ్యూమాలో ప్రవేశపెట్టింది. విదేశీ భాషా పదాల వినియోగాన్ని నిషేధించాలని డిమాండు చేసింది. ఆ సమయంలో ఆ వాదనకు పెద్దగా స్పందన వ్యక్తమవలేదు. కానీ, తాజాగా దేశాధ్యక్షుడి నుంచే దానికి గట్టి మద్దతు లభించింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం