ఆ భాషలూ నేర్చుకోండి

  • 768 Views
  • 6Likes
  • Like
  • Article Share

ఒక వర్గంతో మమేకమవ్వాలంటే.. ఆ వర్గం భాషను నేర్చుకోవాలనేది ప్రాథమిక విషయం. ఈ సూత్రాన్ని ఆధునిక ప్రపంచ దిగ్గజమైన చైనా బలంగా విశ్వసిస్తోంది. అమలు చేస్తోంది. దేశ అధికారభాష ‘మాండరిన్‌’ను ప్రపంచవ్యాప్తం చేయడానికి తీవ్ర కృషి చేస్తున్న చైనా... అదే సమయంలో దేశంలోని అల్పసంఖ్యాకుల భాషలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అల్పసంఖ్యాకుల నివాస ప్రాంతాల్లో పనిచేసే అధికారులు తప్పనిసరిగా స్థానిక భాషలను నేర్చుకోవాలని చైనా ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతులను బాగా అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చింది. చైనాలో 50కిపైగా అల్పసంఖ్యాక వర్గాలున్నాయి. వీటిలో చాలావరకు వాటిదైన సొంత సంస్కృతి ఉంది. ఇందులో టిబెçన్, మంగోలియన్‌ తదితర కాస్త ఎక్కువ మంది మాట్లాడే భాషల నుంచి చాలా తక్కువ మందికే పరిమితమైన పలుకుల వరకూ ఉన్నాయి. ప్రస్తుతం అవి ప్రమాదం అంచున నిలిచాయి. వాటిని కాపాడటానికి పాఠశాలల్లో బోధిస్తున్నారు. దాంతో పాటు అధికార యంత్రాంగంలోనూ ఆ భాషలపై శ్రద్ధ పెంచేందుకు తాజాగా ప్రభుత్వం నడుంకట్టింది. చైనా ఆధిపత్య వర్గమైన ‘హన్‌’కు చెందిన అధికారులు.... అల్పసంఖ్యాకుల భాషలను, రాతప్రతులను అధ్యయనం చేయాలని ఆదేశించింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం