కథావిజయం - విజేతలు

  • 4179 Views
  • 89Likes
  • Like
  • Article Share

తెలుగు కథా సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు, రచయితలను ప్రోత్సహించేందుకు రామోజీ ఫౌండేషన్‌ ‘కథావిజయం’ పేరుతో పోటీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019 పోటీల ఫలితాలు సెప్టెంబరు 29న విడుదలయ్యాయి. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈఎఫ్‌.ఎం., ఉషాకిరణ్‌మూవీస్‌ సంస్థలు ఈ పోటీల నిర్వహణలో భాగస్వాములు. మొత్తం 2.50 లక్షల రూపాయల విలువైన బహుమతులను అందించే ఈ పోటీకి కథలు వెల్లువెత్తాయి. 4 విదేశాలు, తెలుగేతర రాష్ట్రాలు 12 నుంచి కలిపి మొత్తం 1991 రచనలు వచ్చాయి. 18 నుంచి 90 ఏళ్ల వరకూ అన్ని వయోవర్గాల వారూ రచనలు పంపారు. ప్రాథమిక పరిశీలనలో 263 కథలు ఎంపికయ్యాయి. రెండో దశ వడపోత అనంతరం 130 కథలు తేలాయి. వాటిని సుప్రసిద్ధ రచయితలు, సాహితీ విమర్శకులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం పరిశీలించింది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, అట్టాడ అప్పల్నాయుడు, పెద్దింటి అశోక్‌కుమార్, ఎ.వి.రమణమూర్తి ఈ బృంద సభ్యులు. వీరు ఈ 130 కథలనూ చదివి, అన్ని కోణాల్లోనూ విశ్లేషించి విజేతలను ఎంపిక చేశారు. రూ.25 వేలు, రూ.15 వేలు బహుమతులకు అర్హమైన కథలేవీ లేవని వారు అభిప్రాయపడ్డారు. రూ.10 వేలు, రూ.5 వేలు బహుమతులకు పదేసి కథలను న్యాయనిర్ణేతలు ఎన్నిక చేశారు. సాధారణ ప్రచురణకు 78 కథలు ఎంపికయ్యాయి. రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో సాధారణ ప్రచురణకు తీసుకున్న కథలకు రూ.2,000 పారితోషికంగా ఇవ్వాలని రామోజీ ఫౌండేషన్‌ నిర్ణయించింది. ఎంపికైన కథలు ఈనాడు ఆదివారం, తెలుగువెలుగు, చతుర, విపుల పత్రికల్లో ప్రచురితమవుతాయి. ఈ కథలన్నింటితోనూ సంకలనాన్ని కూడా ప్రచురిస్తాము.
      ఈ పోటీల్లో అనుభవజ్ఞులతో పాటు యువ రచయితలూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది మంచి అంశాలను ఎంచుకున్నా కథారచన ఒడుపులు తెలియకపోవడం, చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల బహుమతి సాధించలేకపోయారని న్యాయనిర్ణేతలు అభిప్రాయపడ్డారు. ‘కథావిజయం’ కార్యక్రమంలో తదుపరి అంకంగా రచయితలకు రామోజీ ఫౌండేషన్‌ కార్యశాలను నిర్వహించనుంది. దీని వివరాలను త్వరలో ప్రకటిస్తాము.


రూ.10,000 బహుమతి కథలు - 10
క్ర.సం కథ రచయిత
1 ఆకుపచ్చని కన్నీళ్లు డా.జడా సుబ్బారావు 
2 ఈ సంస్థ యాజమానులు డా.మూలా రవికుమార్‌ 
3 తపసు మాను కె.ఎ.మునిసురేష్‌ పిళ్లె
4 మూగరోదన మండపాక శివప్రసాద్‌
5 ఒకానొక దేవత ఇప్పుడు లేదు పసుపులేటి అనురాధ
6 నమ్మదగిన మాట గంగుల నరసింహారెడ్డి
7 ఎలా దాచను? ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి
8 పెంపకం షేక్‌ అహమద్‌ బాష
9 విలోమ చిత్రాలు ఎస్‌.జి.జిజ్ఞాస
10 పరపతి శరత్‌ చంద్ర

రూ.5,000 బహుమతి కథలు - 10
క్ర.సం కథ రచయిత
1 అనుకున్నదొక్కటీ... వాత్సల్య గుడిమళ్ల
2 మనసు మరక రమ ఇరగవరపు
3 బూట్లు చిత్తలూరి సత్యనారాయణ
4 ఐదో కోతి నాదెళ్ల అనూరాధ
5 నల్లచెప్పులు పి.విజయలక్ష్మి 
6 తల్లి హృదయం జియో లక్ష్మణ్‌
7 పెద్దిరెడ్డి పంచాయితి శేషచంద్ర (ఆంజనేయులు)
8 దేవుడు వెలిశాడు తెన్నేటి శ్యామకృష్ణ
9 జిట్టపులి మ్యాకం రవికుమార్‌
10 ఏకాంతస్వప్నం పి.సృజన్‌సేన్‌

 


సాధారణ ప్రచురణ - 78
క్ర.సం కథ రచయిత
1 బతుకు విలువ నాగాభట్ల సింధు మిహిర
2 నిఖార్సైన అబద్ధం విజయ్‌ భాస్కర్‌ నరసింగం
3 ప్రవాహం జి.వి.రేవంత్‌
4 రాతి గుండెలో నీళ్లు దొండపాటి కృష్ణ
5 నిశ్శబ్ద శబ్దం బి.నరేష్‌ కుమార్‌
6 వినినంతనే వేగపడక కె.కె.సందీప్‌
7 కుట్లు  దేవనపల్లి వీణావాణి
8 చేదెక్కిన తీపి రాచమళ్ల ఉపేందర్‌
9 పెద్దల్లుడు డేగల అనితాసూరి
10 న్యాయనిర్ణేత డేగల అనితాసూరి
11 ప్రకృతి తీర్పు డా.మూలా రవికుమార్‌
12 అంతేగా! అంతేగా! డి.సూరిబాబు
13 మిరపమొక్క కిరణ్‌ జమ్మలమడక
14 నీరవరాగం శ్యామాచరణ్‌ (వి.రఘుబాబు)
15 వెన్నెలలో వాన శ్యామాచరణ్‌ (వి.రఘుబాబు)
16 రాజయోగం మల్లాది వేంకట గోపాలకృష్ణ
17 నేనూ నల్లగా పుట్టాల్సింది గంటి వేంకట రమేష్‌
18 అనగనగా ఓ రాజు కథ  రమ ఇరగవరపు
19 బంగారు నాణెం నూవుశెట్టి గిరిచంద్‌
20 మాంగల్యం తంతునానేనా అప్పరాజు నాగజ్యోతి0
21 నాన్నా నేనొచ్చేస్తా ఈశ్వరి (గంటి రాజేశ్వరి)
22 భువి కోరని భ్రమణం ఉమా మహేష్‌ ఆచాళ్ల
23 గుండెచప్పుడు డా.వి.కృష్ణవేణి
24 ఒరేయ్‌! జగన్నాథం! వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీనివాసు
25 చిగురించిన ఆశ మల్లాది మంజుల
26 దీపం   పంతుల శ్రీనివాస్‌
27 నీళ్లు వదిలేసిన ఊరు అవ్వారు శ్రీధర్‌ బాబు
28 అసలు ప్రేమ  నామని సుజనాదేవి
29 జొండ్ల ‘పాతర’ మంగారపు రమేష్‌యాదవ్‌
30 అందమైన అనుబంధం సి.యమున
31 ఆపన్న హస్తం  ఓలేటి శశికళ
32 పందిరి పర్కపెల్లి యాదగిరి
33 అంతరాత్మ నమోనమః  యస్‌.సంపత్‌కుమార్‌
34 మూడుతరాలు కె.వి.నరేందర్‌
35 నదిని మళ్లించిన చేతులు ఎమ్‌.ఎస్‌.సూర్యనారాయణ
36 ఎగిరే వృక్షాలు  బారు శ్రీనివాసరావు
37 తెరిపి వి-రాగి (ఉండవల్లి సూర్యచంద్రరావు)
38 నాన్న నేర్పిన పాఠం  కె.కె.రఘునందన
39 కాలం లోనికి ప్రయాణం వి.వెంకట్రావు
40 చిత్రం డా।। వి.పోతన్న
41 మల్లేశు కుక్క డా।। వి.ఆర్‌.రాసాని
42 శకునం  పి.వి.నాగేంద్ర ప్రసాద్‌
43 ‘‘థు’’బాయ్‌   డా.టి.సంపత్‌ కుమార్‌
44 అమ్మ మళ్లీ వచ్చింది అపర్ణ తంగిరాల
45 చలి చీమలు  శేషచంద్ర (ఆంజనేయులు) 
46 ద్వంద్వం వాడపల్లి చంద్రశేఖర వర్మ
47 దెబ్బే గురువు కల్లూరు రాఘవేంద్రరావు
48 గుండె పగిలింది ఎన్నవెళ్లి రాజమౌళి
49 విప్రయోగి  పి.వి.ఆర్‌.శివకుమార్‌
50 ఒక నీలికథ...!  శ్రీకంఠస్ఫూర్తి
51 పేరడైజ్‌ లాస్ట్‌  డి.ఆర్‌.ఇంద్ర
52 కోటి విద్యలు గంటి భానుమతి
53 ఒంటరి విరించి (తల్లాప్రగడ గోపాలకృష్ణ)
54 పెద్ద పండగ అలపర్తి రామకృష్ణ
55 ధ్యానం  షేక్‌ అహమద్‌ బాష
56 బల్లకట్టు దేవుడు తమ్మా సత్యనారాయణ
57 ఎండమావులు  డా.ఎం.సి.దాస్‌
58 ఒక అమ్మ(మ్మా)యికథ కాళ్లకూరి శైలజ
59 క్షణక్షణం  పినిశెట్టి శ్రీనివాసరావు
60 ఇత్తనాల చెనిక్కాయలు వొలుస్తూ... ఎండపల్లి భారతి
61 వివేచన  తులాల సవరమ్మ
62 సత్కారం రావాడ శ్యామల
63 ఆమె గెలిచింది బలభద్రపాతుని ఉదయశంకర్‌
64 మావయ్యకు నచ్చిన భోజనం యం.రమేష్‌ కుమార్‌
65 పెద్దరికం  వాడపల్లి రాధ
66 పొగడపూల చెట్టు యం.రమేష్‌ కుమార్‌
67 మగాడు  పెదపాటి రామకృష్ణ
68 సర్దుకుపోవద్దు పోలంరాజు శారద
69 వలస బతుకులు ఎల్‌.వెంకటరావు
70 ఆఖరి కోరిక      డా.సిద్దెంకి యాదగిరి
71 తానూ... నేనూ ఎస్‌.జైమిని సాయి
72 అమ్మో ఆధార్‌ కె.రాజేశ్వరి
73 అయ్యా చెప్పుండ్లా రామిశెట్టి వేంకటేశ్వర
74 పుత్తడి బొమ్మ ఉమాబాల చుండూరు
75 రుణం   సర్వజిత్‌ (పెండ్యాల సూర్యనారాయణ)
76 స్వేచ్ఛ  బత్తులూరి నాగ బ్రహ్మచారి
77 రైటింగ్‌ కౌచ్‌ డా।। యం.ప్రగతి
78 బూట్లు ప్రతాప్‌ రాజులపల్లి 

విజేతలందరికీ అభినందనలు


వెనక్కి ...

మీ అభిప్రాయం