విజయానికి పరీక్ష

  • 1521 Views
  • 9Likes
  • Like
  • Article Share

    సాయి మనూష

వివిధ పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల సాధన కోసం తెలుగు భాషాసాహిత్యానికి సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలు...
1.   నేనింకా నిషిద్ధ మానవుణ్నే అన్నది ఎవరు?
    1. జాషువా     2. కుసుమ ధర్మన్న      3. సుధాకర్‌     4. నగ్నముని
2.   మహాప్రస్థానం అనే గేయ సంపుటితో సంబంధం ఉన్నవారు?
    1. పఠాభి     2. ఆరుద్ర     3. శ్రీశ్రీ     4. సోమసుందర్‌
3.   ‘లలిత’ కావ్య రచయిత?
    1. దేవులపల్లి     2. గురజాడ     3. కందుకూరి     4. రాయప్రోలు
4.   ‘అమలిన శృంగార సిద్ధాంతం’ ప్రతిపాదించింది ఎవరు?
    1. సి.నా.రె.   2. దేవులపల్లి    3. రాయప్రోలు   4. షెల్లీ
5.   ఎరుపంటే కొందరికి భయం భయం...
    1. శ్రీశ్రీ     2. శివసాగర్‌     3. చలం  4. సుబ్బారావు పాణిగ్రాహి
6.   హేతువాదం ప్రధానంగా రచనలు చేపట్టిన తొలి తెలుగు కవి?
    1. త్రిపురనేని     2. బుచ్చిబాబు      3. గురజాడ     4. కందుకూరి
7.   ‘సారస్వతాలోకం’ గ్రంథకర్త ఎవరు?
    1. రామకృష్ణయ్య   2. అనంతకృష్ణ శర్మ     3. శివరామశాస్త్రి  4. రావి శాస్త్రి
8.   భావ కవిత్వంలో భాగం కానిది?
    1. పల్లీజన కవిత్వం     2. దేశభక్తి కవిత్వం     3. ప్రణయ కవిత్వం  4. స్మృతి కవిత్వం
9.   భావకవిత్వానికి పర్యాయపదంగా ఇతనిని చెబుతారు?
    1. రాయప్రోలు  2. దేవులపల్లి     3. గురజాడ     4. బసవరాజు
10.   గురజాడ కవిత్వంలోకెల్లా అత్యుత్తమమైన ఖండిక?
    1. దేశభక్తి     2. కన్యక     3. పూర్ణమ్మ   4. లవణరాజు కల
11.   అడవి బాపిరాజు గారి ఊహాప్రేయసి?
    1. శశికళ     2. ఊర్వశి             3. స్నేహలత     4. జ్యోత్స్న
12.   నల్లదొరతనము పాటలో అగ్ని జ్వాలల్ని రగిలించిందెవరు?
    1. గరిమెళ్ల సత్యనారాయణ     2.సుబ్బారావు     3. ధర్మన్న      4. బోయి భీమన్న
13.   ప్రబంధాలలో కనిపించే వర్ణనలెన్ని?
    1. 2    2. 12    3. 5     4. 18
14.   ప్రకృష్టమైన బంధం (కూర్పు) గల కావ్యాన్ని ఏమంటారు?
    1. పురాణం     2. ప్రబంధం             3. చిత్రకావ్యం     4. నాటకం
15.   కుమార భారతి బిరుదాంకితుడెవరు?
    1. పెద్దన    2. తెనాలి రామకృష్ణుడు     3. మల్లన     4. తిమ్మన
16.   ‘సంగీత రహస్య కళానిధి’ బిరుదాంకితుడు?
    1. శ్రీకృష్ణదేవరాయలు     2. పెద్దన         3. తిమ్మన     4.రామరాజభూషణుడు
17.  ‘ఆంధ్ర కవితా పితామహ’ బిరుదాంకితుడు?
    1. అల్లసాని పెద్దన    2. గురజాడ     3. తిమ్మన    4. శ్రీకృష్ణదేవరాయలు
18.   ‘ఆంధ్రభాషా వికాసం’ కర్త?
    1. చిలుకూరి నారాయణరావు    2. గంటిజోగి సోమయాజి   3. స్ఫూర్తిశ్రీ   4. పింగళి లక్ష్మీకాంతం
19.   తుది వర్ణానికి ముందున్న వర్ణం?
    1. ఉత్తమం     2. ఉపోత్తమం     3. ఉపధ     4. పైవేవీకావు
20.   భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నదెవరు?
    1. నన్నయ    2. తిక్కన        3. ఎర్రన     4. శ్రీనాథుడు
21.   నగ్నముని అసలు పేరు?
    1. భాస్కర్‌రెడ్డి     2. భైరవయ్య       3. హృషీకేశవరావు    4.మన్‌మోహన్‌ సహాయ్‌
22.   రఘునాథ నాయకుని రచన?
    1. వాల్మీకి చరిత్ర   2. గోపాల చరిత్ర         3. విష్ణుపురాణం 4. భోజరాజీయం
23.   గురజాడ ‘దిద్దుబాటు’లోని కథానాయిక?
    1. నాంచారమ్మ  2. కమల     3. సరళ      4. కమలిని
24.   సాంఘిక విమర్శకు ఆద్యుడు?
    1. ల్యూకస్‌     2. టైనీ      3. యాంగ్‌     4. ప్లేటో
25.   కల్పిత ప్రబంధం?
    1. మనుచరిత్ర     2. వసుచరిత్ర    3. కళాపూర్ణోదయం   4. పైవన్నీ
26.   కేయూరబాహు చరిత్ర?
    1. చారిత్రక కావ్యం 2. ప్రబంధం  3. కథాకావ్యం    4. ఇతిహాసం
27.   కిందివానిలో వర్గ పంచమాక్షరం?
1. స  2. ట  3. ప  4. మ
28.   వాక్యానికి గల అంగం? 
    1. యోగ్యత  2. ఆకాంక్ష    3. ఆసత్తి     4. పైవన్నీ
29.   తల్లావఝల శివశంకరశాస్త్రి రచన?
    1. కావ్యావళి      2. హృదయేశ్వరి             3. వకుళమాలిక 4. పైవన్నీ
30.   పింగళి-కాటూరి వారి ‘తొలకరి’ కావ్యానికి తొలిపలుకు రాసిందెవరు?
    1. కట్టమంచి     2. తల్లావఝల   3. సి.నా.రె    4. నాయని సుబ్బారావు
31.   కవి చౌడప్పను ఎవరి ఆస్థాన కవిగా పేర్కొంటారు?
    1. విజయ రాఘవ నాయకుడు    2. రఘునాథ నాయకుడు   3. శహాజీ    4. కృష్ణాజీ
32.   కంచర్ల గోపన్న ఏ శతాబ్ది కవి?
    1. 16    2. 18     3. 20     4. 17
33.   ‘ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై అన్న పలుకులెవరివి?
    1. బసవరాజు అప్పారావు     2. గురజాడ     3. రాయప్రోలు 4. అడవి బాపిరాజు
34.   ‘మోహనా ఓ మోహనా!’ కర్త ఎవరు?
    1. వేగుంట మోహనప్రసాద్‌   2. శివారెడ్డి    3. రావిశాస్త్రి     4. తిలక్‌
35.   ‘ఎందరో మహానుభావులు’ కీర్తన రచించిందెవరు?
    1. అన్నమయ్య 2. రామదాసు             3. త్యాగరాజు     4. క్షేత్రయ్య
36.   ‘జాత్యము గామి నిప్పయిన సంస్కృతమయ్యెడ జొప్ప’ ఎవరి కవితా లక్షణం?
    1. నన్నెచోడుడు    2. నన్నయ    3. ఎర్రన     4. తిక్కన
37.   ‘దేశీ కవిత్వోద్యమ’ కారుడెవరు?
    1. నన్నెచోడుడు    2. పాల్కురికి   3. శ్రీనాథుడు     4. వేమన
38.  నృసింహపురాణం కర్త ఎవరు?
    1. తిక్కన     2. నన్నయ      3. శ్రీనాథుడు     4. ఎర్రన
39.   ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించిన వారిలో ప్రథముడెవరు?
    1. నన్నయ     2. నన్నెచోడుడు       3. సోమన    4. శ్రీనాథుడు
40.   ‘చదువనివాడజ్ఞుండు, చదివిన సదసద్వివేక చతురత’ అన్న పద్యం ఎవరిది?
    1. శ్రీనాథుడు     2. పోతన       3. ఎర్రన     4. తిక్కన
41.   ‘నౌకా విజయం’ కర్త ఎవరు?
    1. త్యాగయ్య     2. క్షేత్రయ్య      3. రామదాసు     4. అన్నమయ్య
42.   అవతారికా సంప్రదాయానికి ఆద్యుడు?
    1. నన్నయ    2. తిక్కన      3. ఎర్రన     4. పైవారందరూ
43.   ‘వరవిక్రయం’ నాటకకర్త?
    1. కోరాడ     2. చిలకమర్తి    3.కాళ్లకూరి   4. తిరుపతి వేంకట కవులు
44.   ‘పాలేరు నుంచి పద్మశ్రీ’ అన్నది ఎవరి స్వీయ చరిత్ర?
    1. శ్రీశ్రీ     2. జాషువా    3. శ్రీపాద     4. బోయి భీమన్న
45.   ‘ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌’ స్థాపించినదెవరు?
    1. అజంతా     2. కుందుర్తి       3. శిష్ట్లా     4. కాళోజీ
46.   ‘టీ కప్పులో తుఫాను’ అనే ఏకాంకిక కర్త ఎవరు?
    1. ముద్దుకృష్ణ     2. ఆత్రేయ     3. ఆరుద్ర     4. సినారె
47.   ‘వ్యాస చంద్రిక’ కర్త ఎవరు?
    1. పానుగంటి     2. మల్లంపల్లి     3. కట్టమంచి     4. గురజాడ
48.   ‘నీలగిరి యాత్ర’ కర్త ఎవరు?
1. వీరాస్వామి     2. రామస్వామి     3. నాయని కృష్ణకుమారి    4. కోలా శేషాచల కవి
49.   ‘వచన కవిత్వ పితామహుడు’ ఎవరు?
    1. శిష్ట్లా     2. కుందుర్తి      3. శ్రీశ్రీ     4. తిలక్‌
50.   ‘గద్యతిక్కన’ ఎవరు?
    1. గురజాడ     2. సామినేని     3. చిలకమర్తి     4. కందుకూరి
51.   ‘గబ్బిలం’ ఏ కావ్యం?
    1. స్మృతి     2. దేశభక్తి   3. సందేశం     4. భక్తి
52.   ‘సాహిత్య సోపానాలు’ ఎవరివి?
    1. పానుగంటి     2. నరసింహం      3. మల్లంపల్లి సోమశేఖర శర్మ   4. దివాకర్ల వేంకటావధాని
53.   ‘మనోభారం’లోని సంధి?
    1. గుణసంధి     2. వృద్ధసంధి        3. విసర్గసంధి     4. సరళాదేశ సంధి
54.   ‘మైథాలజీ’ అంటే తెలుగు సాహిత్యంలో?
    1. ఇతిహాసం     2. పురాణం      3. యక్షగానం     4. ఉదాహరణం
55.   ‘వామనుడి మూడో పాదం’ ఎవరి కవిత్వం?
    1. ఓల్గా       2. విమల        3. సావిత్రి     4. జయప్రభ
56.   వ్యాఖ్యాన పద్ధతి ఉపకరించే బోధన?
    1. నాటక బోధన    2. కథా బోధన   3. వ్యాకరణ బోధన    4. ఉపవాచక బోధన
57.   విరామకాల వినియోగానికి ఉపకరించేది?
    1. క్షుణ్ణ పఠనం    2. విస్తార పఠనం    3. దృష్టలేఖనం  4. దూరశ్రవణం
58.   ఉత్తమ పరీక్ష లక్షణాలలో ఒకటి?
    1. క్లుప్తత     2. స్వాభావికత     3. సమగ్రత     4. విశ్వసనీయత
59.   విద్యార్థుల ఊహలకు, అనుభవాలకు, సృజనాత్మకతకు రూపమిచ్చేది?
    1. విశేష సంచిక     2. పాఠశాల పత్రిక     3. వార్తా పత్రిక    4. అభినందన సంచిక
60.   భాషా ప్రయోగశాలలో ప్రధానమైన పరికరం?
    1. వినికిడి యంత్రం   2. శ్రవణ అర     3. మాట     4. టేపురికార్డర్‌
61.   మౌఖిక భాషకు స్థిరత్వం కల్పించేది?
    1. పఠనం     2. లేఖనం       3. వాచికం     4. శ్రవణం
62.   పునర్బలన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఆధునిక బోధన వ్యూహం?
    1. బృందబోధన    2. కృత్యాధార బోధన   3. కార్యక్రమయుత బోధన   4. సూక్ష్మబోధన
63.   ‘యత్నకాల పద్ధతి’ ఈ దశలోని విద్యార్థులకు ఉపయోగపడదు?
    1. పరిశోధనా దశ     2. ఉన్నత దశ  3. మాధ్యమిక దశ   4. ప్రాథమిక దశ
64.   వ్యాకరణ బోధనలో మనోవైజ్ఞానిక శాస్త్రం ఆమోదించిన పద్ధతి?
    1. ఆగమన పద్ధతి     2. నిగమన పద్ధతి     3. అనుసంధాన పద్ధతి     4. ప్రయోగ పద్ధతి
65.   కింది వానిలో గ్రహణశీలాలు?
    1. శ్రవణం, పఠనం     2. భాషణం, లేఖనం     3. శ్రవణం, లేఖనం     4. పఠనం, భాషణం
66.   స్వగతం అనేది?
    1. ప్రకాశం     2. ఆత్మగతం      3. వాగ్రూపం     4. గ్రహణం.
67.   పుట్టగానే శిశువు ఏడ్చుట?
    1. స్తబ్ధ చిహ్నం     2. అభ్యసన చిహ్నం     3. చైతన్య చిహ్నం     4. గ్రహణ చిహ్నం
68.   దీర్ఘకాలికమైంది?
    1. ఉద్దేశం     2. గమ్యం     3. లక్ష్యం     4. ధ్యేయం
69.   ఆయా సందర్భాల్లో గుర్తించడం అనేది?
    1. జ్ఞానం     2. అవగాహన      3. వినియోగం     4. నైపుణ్యం
70.   జ్ఞప్తికి తెచ్చుకోవడం?
    1. అవగాహన     2. జ్ఞానం     3. వినియోగం     4. నైపుణ్యం


వెనక్కి ...

మీ అభిప్రాయం