ఆ ఒక్కటీ చాలదు!

  • 515 Views
  • 4Likes
  • Like
  • Article Share

బడిలో ఆంగ్లం... ఇంట్లో ఆంగ్లం... ఇప్పుడు చాలామంది చిన్నారులు ఇలాగే మాట్లాడుతున్నారు! కారణం... తెలుగులో మాట్లాడితే ఆంగ్లం రాకుండా పోతుందన్న తల్లిదండ్రుల భయం. దాన్ని పెంచిపోషించే ‘ప్రైవేటు’ ఉపాధ్యాయుల మిడిమిడి జ్ఞానం! వీళ్లందరూ కలిసి పిల్లల సామర్థ్యాలకు ఎసరుపెడుతున్నారు. ‘చిన్నారి’ మెదడు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని పరిశోధనల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒకటి కంటే ఎక్కువ భాషలను ఉపయోగించే వాళ్ల మెదడు చురుగ్గా ఉంటుందని, చిన్నతనం నుంచే ఈ పద్ధతిని అనుసరిస్తే వృద్ధాప్యంలోనూ మెదడు పనితీరు క్షీణించదని ఇంగ్లాండ్‌లోని కెంట్‌ విశ్వవిద్యాలయ మానసిక పాఠశాల పరిశోధకులు తేల్చారు. రోజువారీ జీవితంలో ఒకటికన్నా ఎక్కువ భాషల్ని ఉపయోగించడం వల్ల మెదడుకు అభిజ్ఞాపరమైన ప్రేరణ అందుతుందని చెప్పారు. ఈ విషయాలను నిర్ధరించడానికి వాళ్లు... 30 ఏళ్ల వయసులో ఉన్న 20 మంది మెదళ్ల పనితీరును పదమూడు నెలల పాటు విశ్లేషించారు. ఈ ఇరవై మంది కూడా పదేళ్ల వయసులో ఆంగ్లాన్ని ద్వితీయ భాషగా నేర్చుకోవడం ప్రారంభించినవాళ్లు. వీళ్ల మెదళ్ల చురుకుదనాన్ని కేవలం ఆంగ్లం మాత్రమే మాట్లాడే పాతికమందితో పోల్చిచూశారు. తేలిందేంటంటే... ఆంగ్లానికే పరిమితమైనవాళ్ల కంటే, రెండు భాషలు మాట్లాడేవాళ్ల మెదళ్లలోని ‘వైట్‌మ్యాటర్‌’ అభివృద్ధి మెరుగ్గా ఉంది. మెదడు భాగాల్లో నిర్మాణపరమైన సమగ్రత కనిపించింది. చూశారు కదా... ఆంగ్లానికి మాత్రమే పరిమితమైతే నవతరం కోల్పోయేదేంటో! 


వెనక్కి ...

మీ అభిప్రాయం