‘మంచి గతమున కొంచెమేనోయ్‌’

  • 196 Views
  • 8Likes
  • Like
  • Article Share

‘‘తలచినంతనె తన్మయత్వము కల్గి/ తీపినొందించు పీయూష తెలుగు భాష/ చదివినంతనె మదిలోన సుధలు గురియు/ దివ్యకావ్య సమున్మేష తెలుగుభాష’’ అన్నారు కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించే అధ్యాపక, ఉపాధ్యాయ పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దాం. 
1. నన్నయ, నన్నెచోడుడు ప్రయోగించని రూపం? 
    అ. తెనుంగు    ఆ. తెనుగు  ఇ. తెలుంగు  ఈ. అన్నీ
2. ‘కృపాంబోనిధి’ శతక కర్త? 
    అ. కందుకూరి     ఆ. చిలకమర్తి   ఇ. దువ్వూరి    ఈ. శ్రీశ్రీ
3. తమిళ, మలయాళాల్లో తాలవ్యాచ్చు తర్వాత ఏ అక్షరం ఉంటే తాలవ్యీకరణం జరగదు? 
    అ. పరుషం    ఆ. సరళం  ఇ. మూర్ధన్యం    ఈ. తాలవ్యం
4. ‘‘కమ్బురాఞ్చెరువ’’ అనే పదం ఉన్న శాసనం? 
    అ. పెదవేగి    ఆ. అద్దంకి  ఇ. కందుకూరు    ఈ. ధర్మవరం
5. ‘ఏంథాలజీ’ అంటే?
    అ. పురాణం     ఆ. ఇతిహాసం    
    ఇ. సంకలనం  ఈ. ఉదాహరణం
6. చారిత్రక నాటక పితామహుడు? 
    అ. ధర్మవరం కృష్ణమాచార్యులు  ఆ. కోలాచలం శ్రీనివాసరావు    
    ఇ. పానుగంటి      ఈ. కందుకూరి
7. ఉపరిచర వసువృత్తాంతం ఉన్న పర్వం? 
    అ. ఆది  ఆ. సభా   ఇ. అరణ్య  ఈ. ఉద్యోగ
8. తెలుగు వచన వాఙ్మయంలో తొలి చారిత్రక కావ్యం?  
    అ. రాయవాచకం    ఆ. రఘునాథాభ్యుదయం    
    ఇ. అన్నమాచార్య చరిత్ర   ఈ. ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర
9. ఖాండిక్య కేశిధ్వజుల కథను ప్రబంధీకరించిన కవి?
    అ. పెద్దన      ఆ. తిమ్మన    
    ఇ. భట్టుమూర్తి    ఈ. రాయలు
10. వాల్మీకి గాథను ప్రబంధీకరించిన కవి? 
    అ. కృష్ణాధ్వరి     ఆ. చేమకూర వేంకటకవి    
    ఇ. రఘునాథ నాయకుడు    ఈ. రుద్రకవి
11. అగ్రాచ్చు? 
    అ. అ     ఆ. ఎ     ఇ. ఓ  ఈ. ఇ    
12. ప్రశ్నార్థక వాక్య భేదాలెన్ని? 
    అ. 2    ఆ. 3     ఇ. 4   ఈ. 1
13. కింది వాటిలో దక్షిణ మండలంలో వ్యవహరించే పదం? 
    అ. గొలుసు  ఆ. చిలుకు  ఇ. చూరు  ఈ.పోము
14. నిజంగా జరిగిన జానపద కథలను ‘సాగె’ అంటారు. ఇది ఏ భాషాపదం? 
    అ. ఫ్రెంచి   ఆ. జర్మన్‌    ఇ. స్పానిష్‌  ఈ. లాటిన్‌
15. ‘రాణి’ అన్న పదం? 
    అ. ప్రాకృతసమం   ఆ. సంస్కృతసమం
    ఇ. సంస్కృతం      ఈ. ప్రాకృతం
16. కింది వాటిలో దేశ్యపదం? 
    అ. వచ్చేని  ఆ. మోవి    ఇ. తెస్తాడు  ఈ. జడ
17. కింది వాటిలో స్త్రీ సమం? 
    అ. జాణ  ఆ. గోడ     ఇ. అన్న  ఈ. అన్నీ
18. కయిరాదుల్లో ఒకటి?
    అ. కత్తళ    ఆ. జన్న    ఇ. నీల   ఈ. అన్నీ
19. పృథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబును ఏమంటారు?
    అ. సమాసం     ఆ. సామర్థ్యం 
    ఇ. అధికరణం    ఈ. ఔపశ్లేషికం
20. రుగ్వేదం ఎన్ని అష్టకాలుగా విభజితమైంది? 
    అ. 6     ఆ. 8    ఇ. 10  ఈ. 12
21. ‘ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు’ గ్రంథ సంపాదకులు? 
    అ. వల్లంపాటి వెంకటసుబ్బయ్య   ఆ. కేతు విశ్వనాథరెడ్డి    
    ఇ. కె.కె.రంగనాథాచార్యులు  ఈ. రాచమల్లు రామచంద్రారెడ్డి
22. ‘న్యాయవార్తికం’ కర్త?
    అ. క్షేమేంద్రుడు  ఆ. ఉద్యోతనుడు   ఇ. భామహుడు  ఈ. కుంతకుడు
23. శ్రీశ్రీ ‘ప్రభవ’ రచనకు పీఠిక రాసిందెవరు? 
    అ. చలం     ఆ. పురిపండా అప్పలస్వామి        
    ఇ. ఆరుద్ర   ఈ. నారాయణబాబు
24. ఉదంకోపాఖ్యానంలో ఉదంకుణ్ని శపించిన రాజు? 
    అ. చ్యవనుడు    ఆ. రురుడు  ఇ. పైలుడు    ఈ. పౌష్యుడు
25. ‘‘నువ్వెక్కదలచుకున్న రైలు ఒక జీవితకాలం లేటు’’ అన్నదెవరు? 
    అ. ఉషశ్రీ    ఆ. ఆరుద్ర   ఇ. అజంతా    ఈ. కాళోజీ
26. ‘చెట్టుకవి’ అని ఎవరిని అంటారు? 
    అ. తిలక్‌        ఆ. ఇస్మాయిల్‌   
    ఇ. శేషేంద్రశర్మ        ఈ. శ్రీకాంతశర్మ
27. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో లభించిన పద్యం? 
    అ. కందం        ఆ. మధ్యాక్కర    
    ఇ. సీసం        ఈ. తేటగీతి
28. జీవుని వేదనతో రామాయణం రాసిందెవరు? 
    అ. తిక్కన        ఆ. మొల్ల    
    ఇ. కంకంటి పాపరాజు    ఈ. విశ్వనాథ
29. ‘‘స్పర్శ నిశ్శబ్దంలో మోగిన నాదంలా ఉంటుంది’’ అంటూ స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ కవిత రాసిందెవరు? 
    అ. ఓల్గా        ఆ. జయప్రభ    
    ఇ. కొండేపూడి నిర్మల    ఈ. శివలెంక రాజేశ్వరీదేవి
30. ‘‘అమ్మ అంటుంది... ఆడపిల్లవి, పెళ్లి కావలసిన అబలవి, గుండెల్లో గుబులివి’’ అంటూ ‘విన్నావా’ కవిత రాసిందెవరు?  
    అ. అబ్బూరి ఛాయాదేవి    ఆ. శ్రీమతి
    ఇ. అంజన        ఈ. పార్వతి
31. ‘నాదేశంలో నేను ఏకాకిని’ ఎవరి కవిత? 
    అ. నగ్నముని        ఆ. నిఖిలేశ్వర్‌
    ఇ. జ్వాలాముఖి        ఈ. చెరబండరాజు
32. 1955 జులై 30, 31 తేదీల్లో విజయవాడ షాహెన్‌షా మహల్లో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల ఎన్నో మహాసభకు శ్రీశ్రీ అధ్యక్షులుగా వ్యవహరించారు? 
    అ. రెండో    ఆ. నాలుగో    ఇ. అయిదో    ఈ. ఎనిమిదో
33. నవ్యసాహిత్య పరిషత్తు అవతరించిన సంవత్సరం?
    అ. 1911   ఆ. 1926    ఇ. 1933  ఈ. 1944
34. ‘‘కాలధర్మానుగతమై జగత్ప్రవృత్తి మారునపుడు వాఙ్మయమును మారు, నిజము’’ అన్నదెవరు?
    అ. రాయప్రోలు              ఆ. గురజాడ    
    ఇ. అబ్బూరి రామకృష్ణారావు     ఈ. నండూరి సుబ్బారావు
35. ‘స్వరభక్తి’కి మరోపేరు? 
    అ. వర్ణవ్యత్యయం    ఆ. విప్రకర్ష    
    ఇ. తాలవ్యీకరణం    ఈ. వర్ణనాశం
36. ‘భాషాచారిత్రక నియమావళి’ గ్రంథకర్త? 
    అ. విలియం వివిట్నీ    ఆ. హెర్మన్‌పాల్‌    
    ఇ. విలియం హోల్డర్‌    ఈ. రాబిన్‌సన్‌
37. ‘‘మంచి గతమున కొంచమేనోయ్‌’’ అన్నదెవరు?
    అ. చలం        ఆ. శ్రీశ్రీ        
    ఇ. గురజాడ    ఈ. రాయప్రోలు
38. ‘రాగరాగిణి’ ఎవరి నాటకం? 
    అ. కాళ్లకూరి నారాయణరావు    ఆ. రావిశాస్త్రి    
    ఇ. గొల్లపూడి మారుతీరావు    ఈ. వావిలాల వాసుదేవశాస్త్రి
39. ‘వాగర్థావివ సంపృక్తౌ’ శ్లోక కర్త?
    అ. భారవి    ఆ. కాళిదాసు   ఇ. దండి    ఈ. మాఘుడు
40. ‘తెలుగు కావ్యావతారికలు’ కర్త?
    అ. ఎస్వీ జోగారావు        ఆ. జి.నాగయ్య    
    ఇ. పాటిబండ మాధవశర్మ     ఈ. మద్దూరి సుబ్బారెడ్డి
41. ‘‘కవిత్వమొక తీరని దాహం’’ అన్న కవి? 
    అ. దాశరథి    ఆ. శ్రీశ్రీ   ఇ. పఠాభి   ఈ. శేషేంద్రశర్మ
42. గిడుగు రామమూర్తి ఏ భాషకు వ్యాకరణం రాశారు?
    అ. కొడగు  ఆ. బడగ    ఇ. సవర  ఈ. తుళు
43. ‘ప్రహేళిక’ అంటే? 
    అ. సామెత      ఆ. నానుడి  
    ఇ. జాతీయం   ఈ. పొడుపు కథ
44. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ప్రస్తుత అధ్యక్షులు?
    అ. పొత్తూరి వెంకటేశ్వరరావు    ఆ. ఎ.బి.కె.ప్రసాద్‌    
    ఇ. యార్లగడ్డ లక్ష్మీప్రసాదు      ఈ. మాడుగుల నాగఫణిశర్మ
45. భరతుడు నాట్యశాస్త్రంలో పేర్కొన్న విభాషలెన్ని? 
    అ. 5    ఆ. 7     ఇ. 9     ఈ. 12
46. య, వ, ర, ల స్థానంలో ఇ, ఉ, ఋ లు రావడాన్ని ఏమంటారు?
    అ. అచ్సంకోచం     ఆ. తాలవ్యీకరణం    
    ఇ. వర్ణవ్యత్యయం   ఈ. సంప్రసారణం
47. ‘దొంగాటకం’ ఎవరి హాస్య నాటిక?
    అ. విశ్వనాథ కవిరాజు    ఆ. ముద్దుకృష్ణ    
    ఇ. త్రిపురనేని        ఈ. ఎవరూ కాదు
48. ‘చిత్రభారతం’ కర్త?
    అ. సారంగు తమ్మయ్య     ఆ. చరిగొండ ధర్మన్న    
    ఇ. అద్దంకి గంగాధర కవి   ఈ. నాదెండ్ల గోపన్న
49. ‘చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ’ బిరుదాంకితుడు? 
    అ. రఘునాథ నాయకుడు    ఆ. విజయరాఘవ నాయకుడు    
    ఇ. శహాజీ   ఈ. తుక్కోజీ


వెనక్కి ...

మీ అభిప్రాయం