‘నా గీతం పులిపంజా’

  • 284 Views
  • 11Likes
  • Like
  • Article Share

‘‘తేనె తేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామతల్లి’’ అంటూ అమ్మభాష గొప్పదనాన్ని కీర్తించారు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలివి..! 
1. జానపద విజ్ఞానవేత్తలు జానపద కథల్లోని ప్రక్రియగా భావించే ‘మార్చెన్‌’ ఏ భాషాపదం?  

    అ. స్పానిష్‌   ఆ. జపనీస్‌      ఇ. జర్మనీ    ఈ. ఆంగ్లం
2. ‘వంటింటి నుంచి వల్లకాటిదాక’ ఎవరి కవిత?
    అ. రత్నమాల    ఆ. శిలాలోలిత
    ఇ. జయప్రభ    ఈ. మందరపు హైమవతి
3. ‘‘తాళి కట్టిన మృగం తాగి ఇంటికి వచ్చి చేసే ఉన్మాద క్రియల్లో కంచం ఎగిరి దూరాన పడుతుంది’’ అంటూ ‘ఊసరవెల్లి’ కవిత రాసిందెవరు? 
    అ. తుర్లపాటి రాజేశ్వరి    ఆ. అబ్బూరి ఛాయాదేవి
    ఇ. సావిత్రి    ఈ. కె.గీత
4. ‘‘దేశమేదైతేనేం మట్టంతా ఒక్కటే, అమ్మయెవరైతేనేం, చనుబాల తీపంతా ఒక్కటే’’ అన్న కవి? 
    అ. నిఖిలేశ్వర్‌    ఆ. గద్దర్‌
    ఇ. చెరబండరాజు    ఈ. జ్వాలాముఖి
5. సినారెను జ్ఞానపీఠ పురస్కారం వరించిన సంవత్సరం? 
    అ. 1980   ఆ. 1975    ఇ. 1979   ఈ. 1988
6. భద్రిరాజు కృష్ణమూర్తి ఏ భాషకు సంబంధించిన జానపద గాథల్ని సేకరించారు? 
    అ. కువి   ఆ. గదబ    ఇ. పర్జీ   ఈ. నాయకీ
7. తొలి తెలుగు పద్య వ్యాకరణం? 
    అ. ఆంధ్రశబ్ద చింతామణి    ఆ. ఆంధ్రభాషా భూషణం        
    ఇ. బాలవ్యాకరణం    ఈ. ప్రౌఢవ్యాకరణం
8. ‘జాతావు’ అన్నది ఏ భాషకు ప్రాంతీయ నామం? 
    అ. కువి   ఆ. గోండీ    ఇ. కొండ   ఈ. పెంగో
9. నాచన సోముని జీవిత విశేషాలు తెలిపే శాసనం?   
    అ. మైదుకూరు    ఆ. అద్దంకి
    ఇ. పెంచుకలదిన్నె    ఈ. గూడూరు
10. శ్రీశ్రీ మొదట ఏ కవి?
    అ. భావకవి    ఆ. అభ్యుదయ కవి
    ఇ. విప్లవకవి    ఈ. నయాగరా కవి
11. తెలుగులో సంగీత నాటకాలకు శ్రీకారం చుట్టిందెవరు?
    అ. గొల్లపూడి మారుతీరావు    ఆ. విశ్వనాథ    
    ఇ. కొప్పరపు సుబ్బారావు    ఈ. భమిడిపాటి కామేశ్వరరావు
12. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర లేవన్నదెవరు? 
    అ. రావి శాస్త్రి    ఆ. చలం
    ఇ. అద్దేపల్లి    ఈ. మిరియాల రామకృష్ణ
13. ‘చిరుతొండనంబి’ కథ ఉన్న కావ్యం? 
    అ. శివరాత్రి మహాత్మ్యం    ఆ. హరవిలాసం
    ఇ. కాశీఖండం    ఈ. భీమఖండం
14. ‘కుంభకోణం’ అన్నది?
    అ. లక్ష్యార్థ ప్రయోగం    ఆ. జాతీయం
    ఇ. సారూప్యరూపం    ఈ. నిష్పన్నరూపం
15. కింది వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి గ్రంథం?
    అ. ఆంధ్రుల సాంఘిక చరిత్ర
    ఆ. శ్రీమద్రామాయణ కల్పవృక్షం
    ఇ. విశ్వంభర    ఈ. పాకుడురాళ్లు
16. ‘నా దేశం - నా ప్రజలు’ గ్రంథకర్త? 
    అ. గుంటూరు శేషేంద్రశర్మ    ఆ. కె.వి.రమణారెడ్డి
    ఇ. త్రిపురనేని    ఈ. దాశరథి
17. ‘కళ కళకొరకే’ అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు? 
    అ. మిల్టన్‌    ఆ. వర్డ్స్‌వర్త్‌
    ఇ. ఆస్కార్‌వైల్డ్‌    ఈ. జాన్సన్‌
18. రసం ‘అనుకార్యనిష్ఠం’ అన్నది ఎవరి మతం?
    అ. భట్టలోల్లటుడు    ఆ. శ్రీశంకుకుడు
    ఇ. భట్టనాయకుడు    ఈ. అభినవగుప్తుడు
19. కాళిదాసు ‘కుమారసంభవం’లోని సర్గల సంఖ్య?
    అ. 13     ఆ. 15    ఇ. 17        ఈ. 19
20. మాఘుడికి ఇష్టమైన వృత్తం? 
    అ. ఉత్సాహం    ఆ. మహాస్రగ్ధర
    ఇ. మాలిని    ఈ. మందాక్రాంతం
21. జగన్నాథుడి దృష్టిలో అథమ కావ్యం?
    అ. ధ్వనికావ్యం    ఆ. గుణీభూతవ్యంగ్యం
    ఇ. చిత్రకావ్యం    ఈ. ప్రబంధం
22. ‘కథా సరిత్సాగరం’ కర్త?
    అ. క్షేమేంద్రుడు    ఆ. సోమదేవసూరి
    ఇ. హాలుడు    ఈ. గుణాఢ్యుడు
23. గోల్కొండ పత్రిక ప్రారంభమైన సంవత్సరం? 
    అ. 1926   ఆ. 1930    ఇ. 1936   ఈ. 1940
24.    ‘నేను - నాదేశం’ ఎవరి ఆత్మకథ? 
    అ. ఆచంట జానకిరాం    ఆ. దర్శి చెంచయ్య
    ఇ. రావి నారాయణరెడ్డి    ఈ. దాశరథి రంగాచార్య
25. పాల్కురికి ఏ రచన దేశి నాటక రీతులను పేర్కొంది? 
    అ. బసవోదాహరణం    ఆ. అనుభవసారం
    ఇ. పండితారాధ్య చరిత్ర    ఈ. వృషాధిప శతకం
26. సంస్కృతంలో పొడుపు కథను ఏమంటారు? 
    అ. లోకోక్తి   ఆ. సూక్తి    ఇ. ప్రహేళిక   ఈ. సుభాషితం
27. చలం ‘శశాంక’ ఏ ప్రక్రియకు చెందిన రచన? 
    అ. నవల  ఆ. నాటకం    ఇ. నాటిక   ఈ. చిన్నకథ
28. ‘హేంగ్‌మీ క్విక్‌’ ఎవరి నవల? 
    అ. చంద్రలత    ఆ. రంగనాయకమ్మ
    ఇ. బీనాదేవి    ఈ. మల్లాది వసుంధర
29. ‘సాహిత్య ప్రయోజనం’ విమర్శనా వ్యాస సంకలనానికి సంపాదకత్వం వహించి వెలువరించిందెవరు? 
    అ. కొడవటిగంటి    ఆ. పింగళి
    ఇ. నార్ల    ఈ. విశ్వనాథరెడ్డి
30. ‘కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం’ అని అన్నదెవరు? 
    అ. కె.వి.రమణారెడ్డి    ఆ. శ్రీశ్రీ
    ఇ. ఆర్‌.ఎస్‌.సుదర్శనం    ఈ. చలం
31. మహాభారతాన్ని మహా కవిత్వ దీక్షావిధితో పూర్తిచేసిందెవరు? 
    అ. నన్నయ   ఆ.తిక్కన    ఇ. ఎర్రన   ఈ. అధర్వణుడు
32. ‘ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి’ అన్నదెవరు? 
    అ. విశ్వనాథ  ఆ. పానుగంటి  ఇ. పింగళి    ఈ. కట్టమంచి
33. ‘‘కౌశిక విదర్భ వత్సాంధ్ర ఛేదికాశ్చోర్వితండకాః’’ అని ఆంధ్ర పదాన్ని దేశవాచకంగా ప్రయోగించిందెవరు? 
    అ. వరాహమిహిరుడు    ఆ. ఉద్యోతనుడు
    ఇ. భరతుడు    ఈ. మెగస్తనీస్‌
34. ‘‘కావ్యం తు జాయతే జాతకస్య చిత్ప్రతిభావతః’’ అన్న అలంకారికుడు?
    అ. రుద్రటుడు    ఆ. భామహుడు
    ఇ. దండి    ఈ. మమ్మటుడు
35. ‘చావువిందు’ ఎవరి కథ?
    అ. తుమ్మేటి రఘోత్తమరెడ్డి    ఆ. బండి నారాయణస్వామి    
    ఇ. సత్యం శంకరమంచి    ఈ. అల్లం శేషగిరిరావు
36. కలది, కలవాడు అనే అర్థం కలిగిన వ్యాకరణ పారిభాషిక పదం?
    అ. దఘ్నార్థం    ఆ. మతుబర్థకం
    ఇ. ఉపోత్తమం    ఈ. అధికరణం
37. ‘‘జాత్యముగామి నొప్పయిన సంస్కృత మెయ్యడ జొన్పను’’ అన్న కవి?
    అ. కేతన    ఆ. మంచన
    ఇ. పాల్కురికి సోమన    ఈ. నాచన సోమన
38. ‘‘కవిత్వమంటె పందిరిమీదికి ద్రాక్ష తీగను పాకించడం’’ అన్నదెవరు?
    అ. దేవిప్రియ  ఆ. స్మైల్‌    ఇ. ఆరుద్ర  ఈ. సినారె
39. ‘‘నా గేయం కుబుసం వదలిన సర్పం... నా గీతం పులిపంజా’’ అన్నదెవరు? 
    అ. పుట్టపర్తి  ఆ. పురిపండా  ఇ. కాళోజీ  ఈ. శివసాగర్‌
40. కర్మణి వాక్యాల్లో చేరే ప్రత్యయం?
    అ. గల    ఆ. కొను    ఇ. బడు    ఈ. ఇంచు
41. ‘‘నాదధేనువును పిండి నవనీత మందించె’’ అని రాయప్రోలు ఎవరిని ఉద్దేశించి పేర్కొన్నాడు?
    అ. అన్నమయ్య    ఆ. త్యాగయ్య
    ఇ. క్షేత్రయ్య    ఈ. రామదాసు
42. ‘‘ఎ మెమొరాండం ఆన్‌ మోడ్రన్‌ తెలుగు ప్రోజ్‌’’ వ్యాస కర్త? 
    అ. గురజాడ.    ఆ. గిడుగు
    ఇ. జె.ఎ.యేట్స్‌    ఈ. శ్రీనివాస అయ్యంగార్‌
43. ఖండ కావ్య ప్రక్రియకు ఆద్యుడు?
    అ. కందుకూరి    ఆ. గురజాడ
    ఇ. రాయప్రోలు    ఈ. ఇస్మాయిల్‌
44. ‘లక్ష్యార్థసిద్ధికి’ ఉదాహరణ?
    అ. సూది   ఆ. చీర    ఇ. కంపు   ఈ. ఉద్యోగం
45. ఏ సంవత్సరంలో కాంప్‌బెల్‌ తెలుగుభాషకు నవీన పద్ధతిలో వ్యాకరణం రచించాడు?
    అ. 1810   ఆ. 1816    ఇ. 1822   ఈ. 1832
46. ‘అర్థగ్రామ్యత’కు ఉదాహరణ?
    అ. కైంకర్యం  ఆ. సభికులు  ఇ. నెయ్యి  ఈ. ముష్టి
47. ‘తెలంగాణ’ కావ్య కర్త?
    అ. కాళోజీ  ఆ. శివసాగర్‌     ఇ. కుందుర్తి    ఈ. పఠాభి
48. ‘రామయణ విషవృక్షం’ ఎవరి రచన?
    అ. విశ్వనాథ    ఆ. తెన్నేటి హేమలత
    ఇ. ముప్పాళ్ల రంగనాయకమ్మ    ఈ. ఓల్గా
49. ‘ఉదయం నా హృదయం’ కర్త?
    అ. సినారె    ఆ. అందెశ్రీ
    ఇ. ఉత్పల సత్యనారాయణాచార్య    ఈ. ఆరుద్ర
50. నాయకీ భాషపై ఏ భాషా ప్రభావం కనిపిస్తుంది?
    అ. హిందీ  ఆ. తెలుగు    ఇ. మరాఠీ  ఈ. కన్నడం


వెనక్కి ...

మీ అభిప్రాయం