సలక్షణ సాహితీ సుమగంధం

  • 137 Views
  • 8Likes
  • Like
  • Article Share

పరిశ్రమ కార్యనిర్వాహకురాలిగా, సాహిత్య సృజనశీలిగా విశేష కృషిచేసిన సోమరాజు సుశీల 1945 ఏప్రిల్‌ 28న తూర్పుగోదావరిజిల్లా సిద్ధం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం విజయవాడలో అధ్యాపకురాలిగా పనిచేశారు. వివాహానంతరం పుణె నేషనల్‌ కెమికల్‌ లాబరేటరీస్‌లో ఉద్యోగం చేశారు. తర్వాత హైదరాబాదులో ‘భాగ్య ల్యాబ్స్‌’ ఏర్పాటు చేసి, తెలుగునాట తొలి మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 
      సుశీల రచనా వ్యాసంగంలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించారు. యాబైఏళ్ల వయసులో కథకురాలై ‘ఇల్లేరమ్మ కథలు’ రచించారు. తనతో మమేకమై ఉన్నవాళ్ల గురించీ, తన కర్మాగారపు స్థితిగతులనూ ‘చిన్న పరిశ్రమలు- పెద్ద కథలు’ పేరిట గ్రంథస్థం చేశారు. కథా రచనలో సుశీలది విలక్షణ శైలి. జీవితానుభవాలను మరింత సున్నితంగా చెప్పడమే కాకుండా హాస్యాన్నీ, వ్యంగ్యాన్ని మేళమించి రాయడం ఈవిడ ప్రత్యేకత. ముగ్గురు కొలంబస్‌లు, దీపశిఖ అనేవి సుశీల ఇతర రచనలు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా।। వై.నాయుడమ్మ జీవిత చరిత్ర రచించారు. లక్ష్మీబాయ్‌ కేల్కర్‌ మరాఠిలో రాసిన రామాయణాన్ని ‘పథదర్శిని శ్రీరామకథ’గా అనువదించారు. అఖిలభారత మహిళా శాస్త్రవేత్తల సంఘం సభ్యురాలిగా, భారత తయారీ సంస్థల సంఘం అధ్యక్షురాలిగానూ బాధ్యతలను నిర్వర్తించిన సుశీల, సెప్టెంబర్‌ 27న స్వర్గస్తులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం