వ్యాకరణంలో ఆగమయకారం?

  • 130 Views
  • 5Likes
  • Like
  • Article Share

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) డిగ్రీ అధ్యాపక పరీక్షలో రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. రెండో పేపరులో ఆయా సబ్జెక్టులకు సంబంధించి 300 మార్కులకుగాను 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపరులో తెలుగుకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలను చూద్దాం.  
1.    వర్ణ వ్యత్యయానికి ‘ప్రో ఎన్థెసిస్‌’ అనే పేరు పెట్టిందెవరు?

    అ. కె.వి.సుబ్బయ్య    ఆ. ఎల్‌.వి.స్వామి అయ్యర్‌    
    ఇ. ఎం.బి.ఎమెనో    ఈ. ఎ.మాస్టర్‌
2.    అకర్మకాలకు ఏ ప్రత్యయం చేరితే సాధ్య సకర్మకాలు ఏర్పడతాయి? 
    అ. ఇ     ఆ. అక    ఇ. చు       ఈ. ఇనా
3.    ‘శ్రీరామాయణసార కావ్య తిలకం’ ఎవరి రచన? 
    అ. రంగాజమ్మ    ఆ. మొల్ల    
    ఇ. మధురవాణి    ఈ. రామభద్రాంబ
4.    ‘‘కుపుత్రత్వంబు కంటె నపుత్రత్వంబు మేలు’’ అన్న కవి? 
    అ. తిక్కన    ఆ. భట్టుమూర్తి    
    ఇ. శ్రీనాథుడు    ఈ. పింగళి సూరన
5.    ‘‘బాల పల్లవ గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్‌’’ అన్న పలుకులెవరివి?
    అ. పెద్దన    ఆ. తిమ్మన
    ఇ. తెనాలి రామకృష్ణుడు    ఈ. రఘునాథ నాయకుడు
6.    ‘అశ్లీల మోహ శృంగార కావ్యం’గా పేర్కొన్న గ్రంథం?  
    అ. మనుచరిత్ర    ఆ. వసుచరిత్ర
    ఇ. రాధికాసాంత్వనం    ఈ. పాంచాలీ పరిణయం
7.     ‘అపౌరుషేయాలు’ ఏవి? 
    అ. వేదాలు    ఆ.పురాణాలు
    ఇ. ప్రంబధాలు    ఈ. చారిత్రక కావ్యాలు
8.    ‘‘రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద ఆంధ్ర వాణికిన్‌’’ అన్న కవి? 
    అ. కుసుమ ధర్మన్న    ఆ. శ్రీశ్రీ
    ఇ. జాషువా    ఈ. పురిపండా అప్పలస్వామి
9.    లక్ష్యార్థ ప్రయోగానికి ఉదాహరణ? 
    అ. తీపిమాట  ఆ. వాడిచూపు  ఇ. రాతిగుండె  ఈ. అన్నీ
10.    ‘అర్థాపకర్ష’కు ఉదాహరణ?
    అ. సభికులు    ఆ. ముహూర్తం    
    ఇ. సన్యాసి    ఈ. సూది
11.    అనుభూతి కవితకు అచ్చమైన ప్రతినిధి?    
    అ. కుందుర్తి    ఆ. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
    ఇ. ఆవంత్స సోమసుందర్‌    ఈ. రెంటాల
12.    ‘అరణ్యపర్వం’ నవలా కర్త? 
    అ. సలీం  ఆ. బుచ్చిబాబు      ఇ. చలం  ఈ. గోపీచంద్‌
13.    ‘అమ్మ కడుపు చల్లగా’ ఎవరి ఆత్మకథ? 
    అ. ముళ్లపూడి రమణ    ఆ. గొల్లపూడి మారుతీరావు
    ఇ. సినారె    ఈ. అజంతా
14.    ‘సౌందరనందం’ రచనను ‘ప్రేమోపనిషత్తు’ అన్నదెవరు? 
    అ. వేదుల సత్యనారాయణ    ఆ. కృష్ణశాస్త్రి
    ఇ. ఉన్నవ లక్ష్మీనారాయణ    ఈ. కట్టమంచి
15.    సుబ్బారావు పాణిగ్రాహి అంకితం పొందిన కవితా సంకలనం? 
    అ. మరోప్రస్థానం  ఆ. ఝంఝ    ఇ. లే    ఈ. ఖడ్గసృష్టి
16.    ‘‘పద్యం అద్దంలా ఉండదు, అబద్ధంలా ఉంటుంది’’ అన్నదెవరు?
    అ. దేవిప్రియ  ఆ. హెచ్చార్కె  ఇ. శివసాగర్‌  ఈ. శ్రీశ్రీ
17.    ‘గాయాలూ- గేయాలు’ కర్త?
    అ. ఎల్లోరా  ఆ. ఆరుద్ర    ఇ. అజంతా  ఈ. ఆత్రేయ
18.    ‘‘సాలగ్రామఖనిన్‌ జనించునె కదా జాత్యల్ప పాషాణముల్‌’’ అన్న పలుకులెవరివి?
    అ. పెద్దన    ఆ. తెనాలి రామకృష్ణకవి
    ఇ. తిమ్మన    ఈ. భట్టుమూర్తి
19.    ‘చంద్రికా పరిణయం’ కర్త? 
    అ. సురభి మాధవరాయలు      ఆ. సముఖం వెంకట కృష్ణప్పనాయుడు    
    ఇ. చెంగల్వ కాళకవి    ఈ. చిత్రకవి సింగరార్యుడు
20.    ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ ఎన్ని సంపుటాల స్థానిక చరిత్రలను సిద్ధంచేశారు? 
    అ. 20    ఆ. 42    ఇ. 62       ఈ. 100
21.    సంస్కృతంలో ‘కర్పూరమంజరి’ నాటక కర్త? 
    అ. బిల్హణుడు    ఆ. రాజశేఖరుడు
    ఇ. కృష్ణమిశ్రుడు    ఈ. వేదాంత దేశికుడు
22.    ‘సౌగంధికాహరణం’ అనే వ్యాయోగాన్ని సంస్కృతంలో రచించిందెవరు?
    అ. విద్యానాథుడు    ఆ. విశ్వనాథుడు
    ఇ. యశశ్చంద్రుడు    ఈ. భారవి
23.    వ్యాకరణంలో ఆగమ యకారం?
    అ. లఘువు  ఆ. అలఘువు  ఇ. గురువు    ఈ. ప్లుతం
24.    ‘హృది’ అన్నది?
    అ. సంస్కృతం    ఆ. సంస్కృతసమం
    ఇ. ప్రాకృతం    ఈ. ప్రాకృతసమం
25.    అచ్చుకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి? 
    అ. నిత్యముగానగు     ఆ. తరచుగానగు
    ఇ. వైకల్పికముగానగు    ఈ. బహుళముగానగు
26.    ‘ఆంధ్రసాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం’ కర్త? 
    అ. కొత్తపల్లి వీరభద్రరావు       ఆ. జి.వి.సుబ్రహ్మణ్యం    
    ఇ. వి.వి.ఎల్‌.నరసింహారావు   ఈ. పోరంకి దక్షిణామూర్తి
27.    ‘ద్రావిడ భాషా పరిశీలనం’ కర్త?
    అ. పి.ఎస్‌ సుబ్రహ్మణ్యం ఆ. వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రి  
     ఇ. గంటిజోగి సోమయాజి    ఈ. కోరాడ రామకృష్ణయ్య
28.    టేకుమళ్ల అచ్యుతరావు ‘ఆంధ్ర పదములు - పాటలు’ 1917లో మొదట ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి?
    అ. ఆంధ్ర   ఆ. కృష్ణా    ఇ. గోల్కొండ   ఈ. దేశోద్ధారక
29.    ‘పాత పాటలు’ శీర్షికతో జానపద సాహిత్య వివరణ దృష్టితో రాసిన వ్యాసాలను ‘ఆంధ్ర జానపద గేయ వాఙ్మయ చరిత్ర’ పేరిట గ్రంథంగా వెలువరించిందెవరు? 
    అ. నేదునూరి గంగాధరం    ఆ. టేకుమళ్ల కామేశ్వరరావు    
    ఇ. శ్రీహరి ఆదిశేషువు    ఈ. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
30.    రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం వరుసగా వచ్చే అక్కర భేదం? 
    అ. మహాక్కర    ఆ. మధురాక్కర
    ఇ. మధ్యాక్కర    ఈ. అల్పాక్కర
31.    ల-ళ లకు, ల-డ లకు చెల్లే ప్రాస భేదం? 
    అ. సంధిగతప్రాసం    ఆ. అభేదప్రాసం
    ఇ. లఘుయకార ప్రాసం    ఈ. స్వవర్గజప్రాసం
32.    వ్యాకరణార్థంలో ‘అధికరణం’? 
    అ. ఆధారం    ఆ. త్యాగోద్దేశం
    ఇ. సాధనం    ఈ. అధిక ప్రయోజనం
33.    పృష్ట స్వరాలు? 
    అ. ఇ, ఈ    ఆ. ఎ, ఏ    ఇ. అ, ఆ    ఈ. ఉ, ఊ
34.    ఈషత్‌ స్పృష్టాలు? 
    అ. య, వ   ఆ. ర, డ   ఇ. క, చ   ఈ. ల, ళ
35.    సంధ్యక్షరాలకు, ఊష్మాలకు ప్రత్యేక లిపి సంకేతాల్ని ఏర్పాటు చేసిన భాషా శాస్త్రవేత్త?  
    అ. జాన్‌హార్ట్‌    ఆ. రాబర్ట్‌ రాబిన్‌సన్‌
    ఇ. విలియం హోల్డర్‌    ఈ. పిట్‌మన్‌
36.    1885లో అంతర్జాతీయ ధ్వనిమాలకు పునాది వేసిందెవరు? 
    అ. ఇల్లిస్‌  ఆ. స్వీట్‌  ఇ. పాల్‌పారి  ఈ. మాక్స్‌ముల్లర్‌
37.    ఒక పదంలో అర్థవంతమైన కనిష్ఠ శబ్దాన్ని ఇలా అనవచ్చు? 
    అ. సపదాంశం  ఆ. పదాంశం  ఇ. సవర్ణం  ఈ. కారకం
38.    ప్రధాన క్రియతో పాటు జరిగే వ్యాపారాన్ని సూచించడానికి ఉపవాక్యంలో క్రియ ఏ రూపంలో ఉంటుంది? 
    అ. క్త్వార్థకం  ఆ. శత్రర్థకం  ఇ. చేదర్థకం    ఈ. అప్యర్థకం
39.    వాక్యానికి ఏ అపదం చేర్చడం వల్ల వాక్యాంతశ్శబ్దాపేక్షక ప్రశ్నలు ఏర్పడతాయి? 
    అ. కదా    ఆ. ఆ    ఇ. ఏ    ఈ. కదూ
40. భరతుడు పేర్కొనని రసం? 
    అ. శృంగారం  ఆ. వీరం    ఇ. శాంతం  ఈ. కరుణం
41.    శ్రీనాథుడి ఏ రచనలో ‘త్రిపురాసుర సంహారం’ కనిపిస్తుంది? 
    అ. కాశీఖండం    ఆ. భీమఖండం
    ఇ. హరవిలాసం    ఈ. శృంగారనైషధం
42.    నన్నయ భారతం, ఎర్రన భారతం రెండింట్లో కనిపించే జన్మవృత్తాంతం? 
    అ. ధర్మరాజు  ఆ. కర్ణుని  ఇ. అర్జునుని  ఈ. ద్రౌపది
43.    ఓజోగుణం కలిగిన రీతి భేదం?
    అ. వైదర్భి   ఆ. గౌడి      ఇ. పాంచాలి   ఈ. సుకుమార
44.    ‘నన్నయను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి, లేపకు’ అన్న దిగంబర కవి?
    అ. నగ్నముని    ఆ. నిఖిలేశ్వర్‌
    ఇ. మహాస్వప్న    ఈ. జ్వాలాముఖి
45.    ‘డిప్రెషన్‌ చెంబు’ ఎవరి కథ?
    అ. వేలూరి శివరామశాస్త్రి    ఆ. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
    ఇ. చలం    ఈ. మునిమాణిక్యం
46.    ‘సాహిత్యకారుడిగా జీవితం నాకు ప్రమాణం’ అన్న కవి? 
    అ. కాళీపట్నం రామారావు    ఆ. కేతు విశ్వనాథరెడ్డి
    ఇ. చాసో    ఈ. కొడవటిగంటి కుటుంబరావు
47.    ‘‘ఆమె నవనీత హృదయ నా యంతరంగ శాంతిదేవత’’ అన్న భావకవి? 
    అ. కృష్ణశాస్త్రి    ఆ. బసవరాజు
    ఇ. వేదుల సత్యనారాయణశాస్త్రి   ఈ. నాయని సుబ్బారావు
48.    ఎవరి నాయిక ముద్దుముద్దుగా ఏడ్చిందంటారు? 
    అ. భట్టుమూర్తి  ఆ. పెద్దన  ఇ. తిమ్మన  ఈ. సూరన
49.    మండపాక పార్వతీశ్వర కవి ఏ సంస్థాన కవి? 
    అ. గద్వాల    ఆ. పిఠాపురం
    ఇ. వెంకటగిరి    ఈ. అమరావతి
50.    ‘‘చెళ్లపిళ్ల కవితో తులతూగెడువారె?’’ అన్న కవి?
    అ. అబ్బూరి రామకృష్ణారావు  ఆ. విశ్వనాథ
    ఇ. రాయప్రోలు    ఈ. కృష్ణశాస్త్రి


వెనక్కి ...

మీ అభిప్రాయం