తమిళనాడులో తెలుగు పరిరక్షణకు కృషి: తమిళిసై

  • 77 Views
  • 6Likes
  • Like
  • Article Share

తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హామీ ఇచ్చినట్లు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందరరావు నేతృత్వంలో ప్రతినిధుల బృందం డిసెంబరు 24న తమిళిసైని కలిసి తెలుగు రాష్ట్రాలకు బయట నివసిస్తున్న తెలుగువారి సమస్యల మీద వినతిపత్రం సమర్పించింది. ముఖ్యంగా తమిళనాడులోని తెలుగువారికి అమ్మభాషలో చదువుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను గవర్నర్‌ వద్ద ప్రతినిధులు ప్రస్తావించారు. వీటి మీద సానుకూలంగా స్పందించిన ఆమె, ఈసారి తమిళనాడుకు వెళ్లినప్పుడు ఈ సమస్యల మీద అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు సమాఖ్య పేర్కొంది. అలాగే తెలంగాణలో సమాఖ్య కార్యాలయం కోసం హైదరాబాదులో స్థలాన్ని కేటాయించేలా చూడాలని కూడా గవర్నర్‌ను అభ్యర్థించినట్లు తెలిపింది. తమిళిసైని కలిసిన వారిలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యదర్శి పి.వి.పి.సి.ప్రసాద్, ప్రతినిధులు వి.వి.రామారావు తదితరులు ఉన్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం