తెలుగు పతాకం ఎగురని దిశయే లేదు/ తెలుగు దివ్వె వెలుగనట్టి నిశయే లేదు/ తెలుగుపులుగు చేరలేని దేశం లేదు/ తెలుగువెలుగు దూరలేని కోశం లేదు...’’ అంటూ అమ్మభాష గొప్పదనాన్ని కీర్తించారు దాశరథి. మన రెండు రాష్ట్రాల్లో ఆయా పోటీ పరీక్షలు, ప్రధానంగా ఉపాధ్యాయ, అధ్యాపక, నెట్, సెట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు భాషా సాహిత్యాల్లోంచి కొన్ని మాదిరి ప్రశ్నలు..!
1. ‘‘నదులు కవులు భూగోళపు రక్తనాళాలు’’ అన్న కవి?
అ. తిలక్ ఆ. శ్రీశ్రీ ఇ. శేషేంద్రశర్మ ఈ. సినారె
2. ‘‘కృష్ణశాస్త్రి వ్విష్పరించు చారు వేదనారోగం’’ అని చమత్కరించిందెవరు?
అ. విశ్వనాథ ఆ. శ్రీశ్రీ ఇ. చలం ఈ. ఆరుద్ర
3. జయేతిహాసంలోని శ్లోకాల సంఖ్య?
అ. 22000 ఆ. 8800 ఇ. 12000 ఈ. 16800
4. క్రీ.శ. 634- రెండో పులకేశి కాలం నాటిదైన ఐహోళె శాసనంలో కాళిదాసుతోపాటు ఏ కవి ప్రసక్తి ఉంది?
అ. భారవి ఆ. మాఘుడు ఇ. కాళిదాసు ఈ. క్షేమేంద్రుడు
5. శ్రీహర్షుడి ‘నైషధచరితం’లోని సర్గల సంఖ్య?
అ. 11 ఆ. 22 ఇ. 14 ఈ. 24
6. ‘‘ప్రబంధ కవిత్వానికి స్త్రీ అంటే కేవలం శరీరం. భావకవిత్వానికి స్త్రీ కేవలం హృదయం. అక్కడ ఆమెకు హృదయం లేదు. ఇక్కడ ఈమెకు శరీరం లేదు’’ అన్నదెవరు?
అ. వేల్చేరు నారాయణరావు ఆ. వల్లంపాటి వెంకటసుబ్బయ్య
ఇ. కేతు విశ్వనాథరెడ్డి ఈ. పింగళి లక్ష్మీకాంతం
7. ‘‘కేశవయని నిన్ను వాసిగ భక్తులు/ వర్ణించుచున్నారు మేలుకో’’ అన్నది?
అ. పారమార్థిక గేయం ఆ. బాంధవ్యగేతం
ఇ. వేడుకపాట ఈ. వలపుగేయం
8. ‘నరసింహావలోకనమ్’ ఎవరి కవితా సంకలనం?
అ. చంద్రసేన్ ఆ. స్మైల్ ఇ. కుందుర్తి ఈ. శివారెడ్డి
9. ‘‘కవీ! గాలిని గురించీ రాయి/ గాలిని మాత్రం నీ గీతాల్లో నింపకు’’ అన్నదెవరు?
అ. శ్రీశ్రీ ఆ. నగ్నముని
ఇ. ఆరుద్ర ఈ. అబ్బూరివరదరాజేశ్వరరావు
10. ‘సింగారము’ అన్నది?
అ. పాకృత సమం ఆ. ప్రాకృతభవం
ఇ. సంస్కృత సమం ఈ. పాకృత భవం
11. ‘‘కంటికి నిద్ర వచ్చునె సుఖంబగునే రతికేళి, శాత్రవుడొకడు తనంతటి వాడు గల్గినన్’’ అని శ్రీనాథుడు ఏ కావ్యంలో పేర్కొన్నాడు?
అ. భీమఖండం ఆ. కాశీఖండం
ఇ. శివరాత్రి మాహాత్మ్యం ఈ. పల్నాటి వీరచరిత్ర
12. ‘‘కఠినచిత్తుల దురాగతములు ఖండించి కనికారమొలకించు కలము నాది’’ అన్న పలుకులెవరివి?
అ. త్రిపురనేని ఆ. తుమ్మల
ఇ. జాషువా ఈ. పుట్టపర్తి నారాయణాచార్యులు
13. ‘‘మంటలచే మాట్లాడించి, రక్తంచేత రాగాలాపన చేయిస్తా’’నన్న కవి?
అ. గద్దర్ ఆ. వరవరరావు ఇ. శ్రీశ్రీ ఈ. శివసాగర్
14. ‘‘అమ్మకచెల్ల. నా హృదయమమ్మక చెల్లదు’’ అన్న కవి?
అ. చేమకూర వేంకటకవి ఆ. రఘునాథనాయకుడు
ఇ. నివర్తి శేషాచలకవి ఈ. దర్భాగిరి రాజకవి
15. జనమంచి శేషాద్రిశర్మ ఆంధ్రీకరించిన పురాణం?
అ. నారదీయ ఆ. బ్రహ్మాండ ఇ. పద్మ ఈ. విష్ణు
16. రఘునాథ శతక కర్త?
అ. జన్నయ మంత్రి ఆ. పుష్పగిరి తిమ్మన
ఇ. వసురాయ కవి ఈ. మంగిపూడి వేంకటశర్మ
17. ‘సత్యద్రౌపదీ సంవాదం’ పేరిట ద్విపద కావ్యం రాసిందెవరు?
అ. పుట్టపర్తి ఆ. కందుకూరి
ఇ. చరిగొండ ధర్మన్న ఈ. అడిదం సూరకవి
18. అస్తిత్వవాద ప్రభావం ఉన్న రచయిత?
అ. ఆర్.ఎస్.సుదర్శనం ఆ. బుచ్చిబాబు
ఇ. స్మైల్ ఈ. అందరూ
19. ‘మాయా రసాన్ని’ పేర్కొన్నదెవరు?
అ. విశ్వనాథుడు ఆ. భానుదత్తుడు
ఇ. రుద్రటుడు ఈ. రూపగోస్వామి
20. జీన్‌పాల్ సార్త్రేకి సంబంధమున్న వాదం?
అ. అధివాస్తవికతావాదం ఆ. ప్రతీకవాదం
ఇ. అస్తిత్వవాదం ఈ. కాల్పనిక వాదం
21. తొలిసారిగా నవలా పోటీలను నిర్వహించిన పత్రిక?
అ. సరస్వతి ఆ. చింతామణి ఇ. మంజువాణి ఈ. కళావతి
22. ‘సత్తిరాజు లక్ష్మీనారాయణ’ కలం పేరు?
అ. అజంతా ఆ. ఎల్లోరా ఇ. బాపు ఈ. అమరేంద్ర
23. ‘గద్దలాడతండాయి’ నవల ఏ మాండలికంలో సాగుతుంది?
అ. తెలంగాణ ఆ. రాయలసీమ ఇ. కోస్తా ఈ. ఉత్తరాంధ్ర
24. ‘సాహిత్య దర్శనం’ కర్త?
అ. దివాకర్ల వెంకటావధాని ఆ. పింగళి లక్ష్మీకాంతం
ఇ. కె.వి.ఆర్.నరసింహం ఈ. వల్లంపాటి వెంకట సుబ్బయ్య
25. ‘దుర్యోధనుని ఘోష యాత్ర’ కవిత్రయంలోని ఎవరి రచనలో కనిపిస్తుంది?
అ. నన్నయ ఆ. తిక్కన ఇ. ఎర్రన ఈ. ముగ్గురి భారతంలో
26. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కలహం ఉన్న ప్రబంధం?
అ. వసుచరిత్ర ఆ. కళాపూర్ణోదయం
ఇ. రాజశేఖరచరిత్ర ఈ. మనుచరిత్ర
27. ‘లాఠీయ’ రీతిని పేర్కొన్న అలంకారికుడు?
అ. సింహభూపాలుడు ఆ. రుద్రటుడు
ఇ. కుంతకుడు ఈ. విద్యానాథుడు
28. ‘హృదయదర్పణం’ కర్త?
అ. హేమచంద్రుడు ఆ. భట్టనాయకుడు
ఇ. వాగ్భటుడు ఈ. భానుదత్తుడు
29. వక్రోక్తి భేదాలెన్ని?
అ. 2 ఆ. 4 ఇ. 6 ఈ. 8
30. నాయికకు మాత్రమే తెలిసేటట్టు అప్రియం ఆచరించే శృంగార నాయకుడు?
అ. దక్షిణుడు ఆ. అనుకూలుడు ఇ. దుష్టుడు ఈ. శఠుడు
31. కాలాన్నిబట్టి సరైన వరుస క్రమం?
అ. రాస్మస్ క్రిస్టియన్ రాస్క్, జాకబ్గ్రిమ్, అగస్ట్ ఫెడరిక్పాట్, కారల్బ్రగ్మన్
ఆ. కారల్బ్రగ్మన్, అగస్ట్ ఫెడరిక్పాట్, జాకబ్గ్రిమ్, రాస్క్
ఇ. రాస్క్, జాకబ్గ్రిమ్, కారల్ బ్రగ్మన్, అగస్ట్ ఫెడరిక్పాట్
ఈ. జాకబ్గ్రిమ్, రాస్క్, కారల్బ్రగ్మన్, అగస్ట్ ఫెడరిక్ పాట్
32. క్రీ.శ.1818లో పదాంశ విభజనని ప్రతిపాదించిందెవరు?
అ. అగస్ట్ వాన్ష్లెగల్ ఆ. కాల్డ్వెల్ ఇ. ఎలిస్ ఈ. రాస్క్
33. ధాతు విశ్లేషణాత్మక భాష?
అ. చైనా ఆ. గ్రీకు ఇ. అరబిక్ ఈ. టర్కిష్
34. ‘‘అలతియలతి మాటలతో కాహళ సంధించిన విధమున కవిత చెప్పవలె’’నని అన్నదెవరు?
అ. శ్రీనాథుడు ఆ. తిక్కన ఇ. పోతన ఈ. పెద్దన
35. సమబుద్ధిభూషణుడు శాంతప్రసన్నుడు, ద్విజుడు అయి ఉండే నాయక భేదం?
అ. ధీరోదాత్తుడు ఆ. ధీరోద్ధతుడు
ఇ. ధీరశాంతుడు ఈ. ధీరలలితుడు
36. ఒక వస్తువులోని ధర్మాలను వేరొక వస్తువులో ఆరోపించేలా ఉండే గుణభేదం?
అ. సమాధి ఆ. ఓజస్సు ఇ. శ్లేషము ఈ. కాంతి
37. ‘లోక వృత్తాంత దర్శకమ్’ అని పేరొందిన ప్రక్రియ?
అ. నవల ఆ. నాటకం ఇ. ప్రబంధం ఈ. ఉదాహరణం
38. భరతుడు రసప్రవక్తగా ఎవరిని పేర్కొన్నాడు?
అ. నందికేశ్వరుని ఆ. విఘ్నేశ్వరుని
ఇ. మన్మథుని ఈ. కుమారస్వామిని
39. తెలుగు నాటకాల్లో తొలిసారి ‘ఫ్రీజ్’ పద్ధతిని ప్రవేశపెట్టిందెవరు? ఆయన నాటకం?
అ. రావిశాస్త్రి- నిజం ఆ. డి.వి.నరసరాజు- వాపస్
ఇ. పడాల రామారావు- ఇదా స్వతంత్రం
ఈ. ఎన్.ఆర్.నంది- మరో మొహంజొదారో
40. సారంగధర చరిత్రకు దీపాల పిచ్చయ శాస్త్రి రాసిన వ్యాఖ్య?
అ. సురభి ఆ. ఆమ్నాయ కళానిధి
ఇ. జితకాశి ఈ. మందర
41. వాచ్యార్థాన్ని బోధించే శబ్దశక్తి?
అ. అబిధ ఆ. లక్షణ ఇ. వ్యంజన ఈ. వైదర్భి
42. ‘‘నడుస్తున్న ప్రతి మనిషి నన్ను ప్రతిబింబిస్తున్నవాడే’’ అన్నకవి?
అ. ఆలూరి బైరాగి ఆ. పఠాభి
ఇ. బోయి భీమన్న ఈ. అజంతా
43. ‘విశాల నేత్రాలు’ నవలా కర్త?
అ. పిలకా గణపతిశాస్త్రి ఆ. వినుకొండ నాగరాజు
ఇ. రావూరి భరద్వాజ ఈ. కేతు విశ్వనాథరెడ్డి
44. శరద్వంతుని కుమారుడు?
అ. ద్రోణుడు ఆ. కృపాచార్యుడు
ఇ. జయద్రధుడు ఈ. నహుషుడు
45. 30 అక్షరాలు ఒక పాదంగా ఉండే మాలికా వృత్త పద్యభేదం?
అ. లయగ్రాహి ఆ. లయవిభాతి
ఇ. త్రిభంగి ఈ. లయహారి
46. విసర్గ లోపించినపుడు పరస్వరానికి యతి వేసే యతి భేదం?
అ. లుప్త విసర్గక స్వరయతి ఆ. వృద్ధయతి
ఇ. ప్రాణియతి ఈ. వర్గజయతి
47. ‘‘జెండాలు, నినాదాలు, సిద్ధాంతాల సంకెళ్లతో నిమిత్తం లేకుండా కేవలం కవిత్వం కోసం కలం పట్టిన సరికొత్త తరం ప్రతినిధి శ్రీకాంతశర్మ’’ అని చెప్పిందెవరు?
అ. ఎల్లోరా ఆ. అజంతా
ఇ. వేగుంట మోహనప్రసాద్ ఈ. శివసాగర్
48. ‘‘వంతెనమీద/ ప్రజలు ప్రవహిస్తారు/ ఎదురొచ్చే రాత్రిని/టార్చిలైట్లతో నిరోధిస్తూ’’ అన్న భావనా వైచిత్రి ఎవరిది?
అ. గోదావరి శర్మ ఆ. దిలావర్
ఇ. విహారి ఈ. దేవిప్రియ