‘శప్తభూమి’కి జాతీయ గౌరవం

  • 674 Views
  • 10Likes
  • Like
  • Article Share

ప్రఖ్యాత రచయిత బండి నారాయణస్వామి ‘శప్తభూమి’ నవల 2019 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. పద్దెనిమిదో శతాబ్దం నాటి అనంతపురం పాలెగాళ్ల సంస్థానంలోని రాజకీయాలూ, అప్పటి జీవితాలను చిత్రించిన చారిత్రాత్మక నవల ఇది. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాలు, దేవదాసీ వ్యవస్థ లాంటివి ఇందులో కనిపిస్తాయి. రాయలసీమ దళిత బహుజన చారిత్రాత్మక నవలగా ‘శప్తభూమి’ ప్రసిద్ధికెక్కింది. తానా- 2017 నవలల పోటీల్లో ఉత్తమ నవలగా బహుమతి పొందింది. బండి నారాయణస్వామి 1952, జూన్‌ 3న అనంతపురంలో జన్మించారు. ఈ జిల్లాలోనే ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి 2010లో ఉద్యోగ విరమణ చేశారు. 1987 నుంచి సాహితీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన వీరగల్లు కథా సంపుటి, గద్దలాడతండాయి, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశమ్, నిసర్గమ్‌ వంటి నవలలు రాశారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం