ఇది ఏ నాగరికథకు ఫలశృతి?

  • 661 Views
  • 2Likes
  • Like
  • Article Share

‘‘నాలుగువేల యేండ్ల నాడు పుట్టిన భాష/ విన్నకొద్ది రుచులు పెరుగు భాష/ శబ్ద సుందరతకు సంకేతమగు భాష/ తేనెలూరు నట్టి తెలుగు భాష’’ అంటూ మన భాష గొప్పదనాన్ని తెలియజెప్పారు డా।। మల్లెమాల. సహస్ర వసంతాలకు పైబడిన సాహిత్య చరిత్ర,  ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ లిపిగా ఖ్యాతి మన భాష సొంతం. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలివి..!
1. ‘ఆంధ్ర శాసన సారస్వతములందలి ఉర్దూ మరాఠీ పదాలు’ ఎవరి పరిశోధన? 

    అ. లకంసాని చక్రధరరావు      ఆ. చిలుకూరి నారాయణరావు
    ఇ. పి.స్వరాజ్యలక్ష్మి        ఈ. తూమాటి దొణప్ప
2. ‘తెలుగు జానపద సాహిత్యం- పిల్లల పాటలు’ ఎవరి పరిశోధనా గ్రంథం? 
    అ. కె.సుమతి        ఆ. పి.సరస్వతి     
      ఇ. జి.వసుంధర     ఈ. రావి ప్రేమలత
3. కింది వాటిలో సంశ్లేషణాత్మక భాష?     
    అ. లాటిన్‌ ఆ. గ్రీకు ఇ. సంస్కృతం     ఈ. అన్నీ
4. ‘1000’ని సూచించే దేశ్యపదం ఏ భాషలో ఉంది? 
      అ. గోండి ఆ. కొండ  ఇ. తెలుగు   ఈ. పెంగో
5. విరియాల కామసాని వేయించిన శాసనం? 
     అ. అద్దంకి ఆ. బెజవాడ     ఇ. గూడూరు  ఈ. కందుకూరు
6. కింది వాటిలో భావార్థక ప్రత్యయం? 
      అ. ర        ఆ. ట    ఇ. త       ఈ. క
7. ‘పుష్పలావికలు’ కర్త? 
      అ. ఆరుద్ర           ఆ. నాయని సుబ్బారావు    
      ఇ. గురజాడ          ఈ. రాయప్రోలు    
8. కింది వాటిలో ‘ప్రకరణానికి’ సంబంధించిన రచన? 
      అ. అభిజ్ఞాన శాకుంతలం     ఆ. మృచ్ఛకటికం    
      ఇ. విక్రమోర్వశీయం     ఈ. మాళవికాగ్నిమిత్రం
9. ‘‘సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌’’ అన్నదెవరు?
      అ. వాల్మీకి  ఆ. వ్యాసుడు ఇ. భర్తృహరి  ఈ. భాసుడు
10. ‘శివ రామాభ్యుదయం’ కర్త?
      అ. పిండిప్రోలు లక్ష్మణకవి    ఆ. పోడూరి పెదరామామాత్యుడు    
      ఇ. కామేశ్వరామాత్యుడు    ఈ. చిత్రకవి సింగరాచార్యుడు
11. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ‘వ్యావహారిక భాషావికాసం- చరిత్ర’ గ్రంథకర్త?    
      అ. గిడుగు             ఆ. అక్కిరాజు రమాపతిరావు    
      ఇ. గంటి జోగిసోమయాజి   ఈ. బొడ్డుపల్లి పురుషోత్తం 
12. సూరన ప్రభావతీ ప్రద్యుమ్నానికి మూలం?    
      అ. మార్కండేయ పురాణం   ఆ. అగ్నిపురాణం    
      ఇ. పద్మపురాణం              ఈ. సంస్కృత హరివంశం
13. ‘‘ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?/ ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?/ ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి?...’’ అని ప్రశ్నించిన కవి? 
    అ. మాదిరాజు రంగారావు         ఆ. శ్రీశ్రీ      
    ఇ. తిలక్‌             ఈ. నగ్నముని
14. ‘‘వెలుగు నీటను గ్రుంకె చుక్కలు/ చదల చీకటి కదల బారెను/ యెక్కడనొ వొక చెట్టు చాటున/ నొక్క కోకిల పలుకసాగెను/....’’ అన్న భావనాశక్తి ఎవరిది?
      అ. కొడాలి సుబ్బారావు    ఆ. కృష్ణశాస్త్రి
      ఇ. గురజాడ            ఈ. దువ్వూరి రామిరెడ్డి
15. కృష్ణశాస్త్రి రచించిన గేయనాటిక? 
      అ. శర్మిష్ఠ          ఆ. కృష్ణాష్టమి 
    ఇ. యమునా విహారి     ఈ. అన్నీ
16. ‘‘భావకవిత్వంపై తిరుగుబాటుగా వచన కవిత్వంలో ఒక ప్రయోగం చేస్తూ మాత్రా ఛందోరీతుల్లో మరికొన్ని ప్రయోగాలు చేసి ఛందస్సులను దౌడు తీయించాడు నిత్యప్రయోగశీలి పట్టాభి’’ అని అన్నదెవరు? 
      అ. శివ శంకరశాస్త్రి     ఆ. కేతవరపు రామకోటిశాస్త్రి          ఇ. చేకూరి రామారావు   ఈ. పింగళి లక్ష్మీకాంతం
17. ‘‘స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి’’ అన్న మాటలెవరివి? 
    అ. రావిశాస్త్రి         ఆ. చలం      
    ఇ. ఆర్‌.ఎస్‌.సుదర్శనం   ఈ. వల్లంపాటి వెంకటసుబ్బయ్య
18. ‘కవిత్వంలో నిశ్శబ్దం’ కర్త? 
      అ. ఇస్మాయిల్‌    ఆ. అజంతా ఇ. ఎల్లోరా  ఈ. నగ్నముని
19. ‘‘జానపదుల్‌ పురీజనుల సంతసముం బ్రమదంబెలర్పనీ...’’ పద్యకర్త? 
      అ. నాచన సోమన ఆ. ఎర్రన  ఇ. పెద్దన      ఈ. సూరన
20. తెలుగు శాసనాల ఆధారంగా తెలుగు భాషా పరిణామాన్ని పరిశోధించిందెవరు? 
    అ. ఎం.కందప్ప చెట్టి       ఆ. బూదరాజు రాధాకృష్ణ    
    ఇ. కె.కె.రంగనాథాచార్యులు   ఈ. అందరూ
21. ‘ద్రావిడ భాషా క్రియానిర్మాణం- తులనాత్మక పరిశీలన’ సిద్ధాంత వ్యాసకర్త?   
    అ. పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం      ఆ. భద్రిరాజు        
    ఇ. గంటి జోగిసోమయాజి      ఈ. కోరాడ రామకృష్ణయ్య
22. ‘‘నలభైకోట్ల ప్రజా విప్లవ కంఠం నాది’’ అన్నదెవరు? 
      అ. అనిశెట్టి ఆ. అజంతా ఇ. ఎల్లోరా ఈ. కె.వి.రమణారెడ్డి
23. కింది వాటిలో తాలవ్య స్వరాలు?     
      అ. ఇ, ఈ  ఆ. ఉ, ఊ    ఇ. అ, ఆ  ఈ. ఋ, ౠ
24. కింది వాటిలో పృష్ఠాచ్చు? 
      అ. అ    ఆ. ఇ    ఇ. ఉ      ఈ. ఎ
25. ఉభయోష్ఠ్యానునాసికం?    
      అ. ఙ        ఆ. ఞ    ఇ. ణ      ఈ. మ
26. ఏ ధ్వని అయినా ఇంకోధ్వనితో పరస్పరాభావంలో పూరకంగా ప్రవర్తిల్లుతూ రెండూ ఒక వర్ణాన్ని ఏర్పరుస్తుంటే దాన్ని ఏమని భావించవచ్చు?     
      అ. పదం   ఆ. పదాంశం  ఇ. సపదాంశం ఈ. సవర్ణం
27. ‘మేలుకొను’ అన్నది?    
      అ. కృదంతం  ఆ. తద్ధితం  ఇ. శబ్దపల్లవం    ఈ. దఘ్నార్థం
28. ‘జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను’ ఇందులోని కారకం?     
      అ. అపాదానం  ఆ. అధికరణం ఇ. సంప్రదానం ఈ. కరణం
29. తెలుగులో వ్యతిరేకార్థక క్రియలు? 
      అ. వర్తమాన కాలబోధకాలు  ఆ. భూతకాల బోధకాలు
      ఇ. భవిష్యత్కాల బోధకాలు  ఈ. కాలత్రయ బోధకాలు 
30. ‘‘త్రిప్పుమింక జననీ! రమ్యాక్షర క్షోణికిన్‌’’ అని భారతిని కోరుకున్న కవి? 
      అ. రాయప్రోలు      ఆ. వేంకట పార్వతీశ్వర కవులు 
      ఇ. తిరుపతి వేంకటకవులు     ఈ. జాషువా
31. అనుకరణమున తుదిహల్లునకు? 
      అ. లోపంబగు           ఆ. లోపంబు విభాషనగు    
      ఇ. ద్విర్వచనంబగు       ఈ. హ్రస్వంబగు
32. ‘రసధ్వని’ని ప్రతిపాదించిందెవరు? 
      అ. భరతుడు        ఆ. వామనుడు      
      ఇ. వాగ్భటుడు        ఈ. అభినవగుప్తుడు
33. నిర్ధారణ షష్ఠికి ఉదాహరణ?    
      అ. రాముని యొక్క సేవకుడు       ఆ. సర్వమునందు ఈశ్వరుడు కలడు 
      ఇ. ఘటమందు జలమున్నది      ఈ. గోవుల లోపల కపిల బహుక్షీర
34. కారణం లేకుండా కార్యాన్ని వర్ణిస్తే అది ఏ అలంకారం?     
      అ. దీపకం ఆ. దృష్టాంతం ఇ. ఉత్ప్రేక్ష  ఈ. విభావన
35. శృంగార నాయికల్లో భేదాలు?     
      అ. ఆరు  ఆ. ఎనిమిది     ఇ. ఏడు   ఈ. తొమ్మిది
36. మహాశ్వేత పాత్ర ఉన్న కావ్యం? 
  అ. దశకుమార చరితం  ఆ. కాదంబరి
  ఇ. హర్షచరితం       ఈ. కథా సరిత్సాగరం
37. కింది వాటిలో సరైన వరుసక్రమం?
   అ. ఉపోత్తమం, ఉత్తమం, ఉపధ    ఆ. ఉపోత్తమం, ఉపధ, ఉత్తమం 
   ఇ. ఉపధ, ఉత్తమం, ఉపోత్తమం     ఈ. ఉపధ, ఉపోత్తమం, ఉత్తమం 
38. విశేషణాలను సాభిప్రాయంగా వాడితే ఏ అలంకారం? 
      అ. పరికరాంకురం      ఆ. పరికర
    ఇ. అపహ్నవం          ఈ. విరోధాభాసం
39. తత్సమాల్లో బహువచన లకారం ఏ ప్రాతిపదిక మీద రేఫగా మారుతుంది? 
    అ. ఉత్తమం        ఆ. ఉపోత్తమం   
    ఇ. ఉపధ        ఈ. అదంత దీర్ఘపూర్వ లోపధం
40. ‘ఇంగలం’ అన్నది? 
      అ. సంస్కృతం    ఆ. ప్రాకృతం ఇ. ప్రాకృతభవం     ఈ. తెలుగు
41. ‘వీడు బృహస్పతి’ అన్నది? 
  అ. జహల్లక్షణ       ఆ. అజహల్లక్షణ     
  ఇ. సారుపలక్షణ       ఈ. విపరీతలక్షణ
42. ఖాండిక్య కేశిధ్వజుల కథను ప్రబంధీకరించిన కవి? 
  అ. పెద్దన  ఆ. సూరన  ఇ. రాయలు    ఈ. తిమ్మన
43. ‘తీరా నేను కాస్తా ఎగిరిపోయాక’ ఎవరి రచన?    
  అ. సోమసుందర్‌       ఆ. అనిశెట్టి ఇ. కుందుర్తి    ఈ. పురిపండా
44. ‘జ్వాల’ పత్రిక సంపాదకులు?    
  అ. ముద్దుకృష్ణ      ఆ. కొంపెల్ల జనార్దనరావు    
  ఇ. శ్రీశ్రీ        ఈ. పి.వి.రాజమన్నార్‌
45. ‘జనప్రియ రామాయణం’ కర్త?
  అ. పుట్టపర్తి ఆ. పురిపండా  ఇ. కాళోజీ ఈ. బోయి భీమన్న
46. ‘‘నూకలివ్వక పోయినా భావాల మేకలెందుకు కాస్తున్నావ్‌?’’ అని ఆరుద్ర ఎవరితో సంభాషించారు? 
  అ. అబ్బూరి వరదరాజేశ్వరరావు  ఆ. ఎల్లోరా   
    ఇ. శ్రీశ్రీ          ఈ. రెంటాల గోపాలకృష్ణ


వెనక్కి ...

మీ అభిప్రాయం