ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టబోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే ఎక్కువగా భర్తీ కానున్నాయి. ఇందులో తెలుగు పాఠ్యాంశాలు, బోధన పద్ధతులు కీలకమైనవి. వీటి రెండింటికి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దాం.
1. ‘‘మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష’’ అన్నదెవరు?
అ. ఐస్లర్ ఆ. హాకెట్
ఇ. సైమన్పాటర్ ఈ. రామచంద్రవర్మ
2. ‘‘భాషే నేను కట్టుకున్న గోపురం.. భాషే నాకు దేవుడిచ్చిన వరం’’ అన్నవారు?
అ. సినారె ఆ. విశ్వనాథ ఇ. జాషువా ఈ. తుమ్మల
3. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిందెవరు?
అ. బ్లూమ్‌ఫీల్డ్ ఆ. ఛామ్స్కీ
ఇ. గాల్టన్ ఈ. మాక్స్‌ముల్లర్
4. ‘లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’లో గ్రియర్సన్ పేర్కొన్న భాషలు, మాండలికాల సంఖ్య?
అ. 169, 444 ఆ. 179, 544
ఇ. 170, 342 ఈ. 182, 545
5. 1948లో ఏ కమిషన్ మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పింది?
అ. మొదలియార్ ఆ. కొఠారి
ఇ. రాధాకృష్ణన్ ఈ. తిలక్
6. పాఠశాల దశలో మాతృభాషా బహిష్కారం ఎంత శాతం దాటితే ఆ భాష క్షీణ దశకు చేరుకున్నట్లని యునెస్కో హెచ్చరించింది?
అ. 10 ఆ. 15 ఇ. 25 ఈ. 30
7. కనీస అభ్యసన స్థాయిలు ప్రవేశపెట్టడంలోని లక్ష్యం?
అ. విద్యలో నాణ్యత ఆ. సమానత్వం
ఇ. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం ఈ. అన్నీ
8. ‘‘వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు... మార్చగలదు మాట మనిషి మనసు’’ అని ‘ప్రగతి గీత’లో పేర్కొన్నదెవరు?
అ. నండూరి రామకృష్ణమాచార్యులు ఆ. వేమన
ఇ. బద్దెన ఈ. నార్ల వెంకటేశ్వరరావు
9. ‘నేను రేపు పాఠశాలకు వెళ్లాను’లోని దోషం?
అ. భాషాదోషం ఆ. భావదోషం
ఇ. వర్ణక్రమ దోషం ఈ. ఉచ్చారణ దోషం
10. ‘వర్ణసమామ్నాయ పద్ధతి’ అని ఏ పద్ధతికి పేరు?
అ. అక్షర ఆ. నవీనాక్షర ఇ. పద ఈ. వాక్య
11. ‘తెలుగు బోధనాప్రదీపిక’ కర్త?
అ. బులుసు సాంబమూర్తి ఆ. రావి రంగారావు
ఇ. కృష్ణకుమార్ ఈ. నాళం కృష్ణారావు
12. ‘శిశుగీతాల’ ప్రయోజనం?
అ. నిర్దుష్ట ఉచ్చారణ అలవడుతుంది
ఆ. జట్టు కృత్యం వల్ల సంఘీభావం వృద్ధి పొందుతుంది
ఇ. నూతన పదాలు పరిచయమై పదజాలాభివృద్ధి జరుగుతుంది
ఈ. పైవన్నీ
13. తార్కికమైన ఆలోచనా శక్తిని పెంపొందించేవి?
అ. చిత్రాలు ఆ. బాలల బొమ్మల కథల పుస్తకాలు
ఇ. పొడుపుకథలు ఈ. గేయాలు
14. ‘దృష్టలేఖనం’ ప్రయోజనం?
అ. విరామ చిహ్నాలను పాటించడం అలవాటవుతుంది
ఆ. అక్షరాలు సమాన పరిమాణంలో రాస్తారు
ఇ. అక్షరాలు గుండ్రంగా, పొందికగా రాయగలుగుతారు
ఈ. పైవన్నీ
15. మన దేశంలో మొదటగా ‘కృత్యాధార పద్ధతి’ని ప్రస్తావించిన కమిటీ?
అ. ఈశ్వరీభాయి పటేల్ ఆ. మెకాలే
ఇ. వుడ్స్ ఈ. కొఠారి
16. ఎన్నేళ్లలోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్యనందించాలని రాజ్యాంగం నిర్దేశించింది?
అ. 5- 10 ఆ. 6- 14 ఇ. 6- 16 ఈ. 4- 14
17. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రథమంగా ‘చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు’ పేరుతో పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది?
అ. 2004-05 ఆ. 2005-06 ఇ. 2006-07 ఈ. 2007-08
18. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆవాస ప్రాంతంలోని ఏన్నేళ్ల వయసులోపు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలి?
అ. 5- 14 ఆ. 6- 12 ఇ. 5- 10 ఈ. 6- 14
19. ‘‘ఐచ్ఛిక సాధనాల ద్వారా, భవిష్యత్తు దృక్పథంతో గమ్యాన్ని చేరడానికి వరుసక్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక’’ అన్నదెవరు?
అ. వై.డోర్ ఆ. కొఠారి ఇ. ఠాగూర్ ఈ. మెకాలే
20. పద పద్ధతి ద్వారా అక్షరాల్ని బోధించడానికి ‘మెరుపు అట్టలు’ ఉపయోగపడతాయి. ఒక పదానికి ఎన్ని మెరుపు అట్టలు తయారుచేయాలి?
అ. 2 ఆ. 4 ఇ. 6 ఈ. 8
21. 2009-10 విద్యా సంవత్సరంలో ఏ రాష్ట్రంలో తోలుబొమ్మలాటకు ధ్వన్యనుకరణ సంగీతాన్ని జోడించి అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టారు?
అ. బిహార్ ఆ. కర్ణాటక
ఇ. ఉత్తరప్రదేశ్ ఈ. తమిళనాడు
22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ‘నాన్ డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేసింది?
అ. 1968 ఆ. 1966 ఇ. 1969 ఈ. 1971
23. ‘‘పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులకు ఒక ప్రయోగశాలలా ఉపయోగపడాలి’’ అన్నదెవరు?
అ. కస్తూరి రంగన్ ఆ. డా।। కె.రంగనాథన్
ఇ. గాడిచర్ల ఈ. రాధాకృష్ణన్
24. గోడపత్రిక నిర్వహించడం వల్ల ప్రయోజనం?
అ. పిల్లలు తమ సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఆ. బడిపట్ల ఆసక్తి
ఇ. నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఈ. పైవన్నీ
25. ‘జీవితానికో నిర్వచనం’ కర్త?
అ. మధురాంతకం రాజారాం ఆ. కరుణశ్రీ
ఇ. కృష్ణశాస్త్రి ఈ. ఆరుద్ర
26. ‘రామేశ్వర మాహాత్మ్యము’ ఎవరి రచన?
అ. సంకుసాల నృసింహకవి ఆ. ఏనుగు లక్ష్మణకవి
ఇ. ఎలకూచి బాలసరస్వతి ఈ. పుష్పగిరి తిమ్మన
27. ‘మనసైన’ లోని సంధి?
అ. వృద్ధి సంధి ఆ. గుణ సంధి
ఇ. ఉకార సంధి ఈ. అకార సంధి
28. ‘కూనలమ్మ పదాలు’ కర్త?
అ. దాశరథి ఆ. అజంతా ఇ. ఆత్రేయ ఈ. ఆరుద్ర
29. ‘అతిథి మర్యాద’ పాఠ్యభాగ ‘కథనం’ ఎవరిది?
అ. కరుణశ్రీ ఆ. ఉషశ్రీ ఇ. భవ్యశ్రీ ఈ. పోతన
30. ‘గుర్వాజ్ఞ’లోని సంధి?
అ. సవర్ణదీర్ఘ ఆ. గుణ ఇ. అకార ఈ. యణాదేశ
31. ‘‘పుస్తకముల నీవు పూవువలెను జూడు... చింపబోకు మురికి చేయబోకు’’ అన్న పలుకులు ఏ శతకంలోవి?
అ.తెలుగుపూలు ఆ. కుమార ఇ.గువ్వలచెన్న ఈ. వేమన
32. శేషప్ప కవి ఏ శతాబ్దం వాడు?
అ. 17 ఆ. 18 ఇ. 19 ఈ. 20
33. ‘‘నీ బొమ్మల చెంత ముగ్ధగతినందున్; శిల్పికంఠీరవా!’’ అన్న పల్కులెవరివి?
అ. జాషువా ఆ. కొడాలి సుబ్బారావు
ఇ. పోతన ఈ. తిక్కన
34. ‘దాంపత్యోపనిషత్తు’ కర్త?
అ.పాలగుమ్మి పద్మరాజు ఆ.మునిమాణిక్యం నరసింహారావు
ఇ. రావూరి భరద్వాజ ఈ. కొడవటిగంటి కుటుంబరావు
35. ‘ఎందుకు పారేస్తాను నాన్నా’ అన్న ‘చాసో’ రచన ఏ ప్రక్రియకు చెందింది?
అ. నవల ఆ. నాటిక ఇ. కథ ఈ. గల్పిక
36. భరతుడు ‘నాట్యశాస్త్రం’లో ప్రధానంగా నాట్యానికి ఎన్ని అంగాలు పేర్కొన్నాడు?
అ. 8 ఆ. 9 ఇ. 10 ఈ. 11
37. ‘‘పసిపాపల నిదుర కనులలో/ ముసిరిన భవితవ్యం యెంతో?/ గాయపడిన కవి గుండెల్లో/ రాయబడిన కావ్యాలెన్నో’’ అన్న పలుకులెవరివి?
అ. శ్రీశ్రీ ఆ. కాళోజీ ఇ. దాశరథి ఈ. సినారె
38. నామవాచకాలకు క్రియ చేరిన పదాలను ఏమంటారు?
అ. పృథక్కరణం ఆ. త్వార్థం
ఇ. శబ్దపల్లవం ఈ. క్త్వార్థకం
39. ‘చరమరాత్రి’ కథల ద్వారా శ్రీశ్రీ ఏ పద్ధతిని తెలుగులో ప్రవేశపెట్టారు?
అ. చైతన్య స్రవంతి ఆ. అధివాస్తవికవాదం
ఇ. అస్తిత్వవాదం ఈ. ఏదీకాదు
40. ‘ఊరు వల్లెలు’లోని సంధి, సమాసం?
అ. ఉకార, కర్మధారయం ఆ. గసడదవాదేశ, ద్వంద్వం
ఇ. సరళాదేశ, తత్పురుష ఈ. రుగాగమ, ద్విగు
41. ‘పాపభీతి’లోని సమాసం?
అ. కర్మధారయం ఆ. బహువ్రీహి
ఇ. పంచమీ తత్పురుష ఈ. ద్వంద్వం
42. ‘అజంతా చిత్రాలు’ పాఠ్యభాగకర్త?
అ. అజంతా ఆ. ఎల్లోరా
ఇ. నార్ల వెంకటేశ్వరరావు ఈ. ఆరుద్ర
43. ‘‘అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది. అయినా, అది అతివాస్తవికమైన లోకమే’’ అన్నదెవరు?
అ. గాంధీ ఆ. తిలక్ ఇ. పటేల్ ఈ. లాల్‌బహదూర్‌శాస్త్రి