పాత్రికేయ స్ర‌ష్ట‌

  • 137 Views
  • 0Likes
  • Like
  • Article Share

సుప్రసిద్ధ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా పనిచేశారు. 1957లో ఆంధ్రజనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరు అనతికాలంలోనే విశిష్టమైన పాత్రికేయులుగా ఎదిగారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త లాంటి పత్రికల్లో పనిచేశారు. 2000లో నాటి పత్రికలు మేటి విజయాలు పేరిట రాసిన పుస్తకం విశేష పాఠకాధారణ పొందింది. 2001లో వచ్చిన చింతన, చిరస్మరణీయులు లాంటి పుస్తకాలు మంచి గుర్తింపునిచ్చాయి. తెలుగు పత్రికలు, కాశీనాథుని నాగేశ్వరరావు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, విధి నా సారథి, పారమార్థిక పదకోశం.. వీరి ఇతర రచనలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైైర్మన్‌గా పరిచేశారు. పి.వి పై వచ్చిన ‘ఇయర్స్‌ ఆఫ్‌ పవర్‌’ కి సహ రచయితగా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొత్తూరి ఈరోజు ఉద‌యం హైదరాబాదు బంజారాహీల్స్‌ విజయ్‌నగర్‌ కాల‌నీలోని త‌న నివాసంలో  తుదిశ్వాస విడిచారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం