మాట తిరుగలేదు మానధనులు

  • 304 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఇటలీ మొదల్‌ చోట్లకేగి రత్నమ్ములు వినిపించినట్టిది తెలుగుభాష/ ఒకనాడు సేతుశీతోర్వీ నగాంత వీధిని పడగెత్తిన తెనుగుభాష/ త్యాగరాజ మహర్షి యాత్మలో రసభావముల యైక్యమరసిన తెలుగుభాష/ ఆసేతు నగావధి నొకనాడు తనకైత వ్రాయించె తెనుగుభాష’’ అన్నారు తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే తెలుగు ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాల కోసం తెలుగు భాషా సాహిత్యాలు, వ్యాకరణ, అలంకార శాస్త్రాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు..!
1. ‘పురుషులూ జీవులే పొలతులూ జీవులే’ అన్న కవి?
 

    అ. త్యాగయ్య     ఆ. రామదాసు 
    ఇ.అన్నమయ్య    ఈ. వేమన
2. ‘చితాభస్మం’ స్మృతికావ్యాన్ని విశ్వనాథ మీద రచించిందెవరు? 
    అ. తుమ్మపూడి కోటేశ్వరరావు    ఆ. పింగళి లక్ష్మీకాంతం    
3. కింది వాటిలో సరైన వరుసక్రమం? 
    అ. బలిపీఠం, మరీచిక, మీనా, స్వేచ్ఛ    
    ఆ. మీనా, బలిపీఠం, మరీచిక, స్వేచ్ఛ    
    ఇ. బలిపీఠం, మీనా, మరీచిక, స్వేచ్ఛ    
    ఈ. మరీచిక, బలిపీఠం, స్వేచ్ఛ, మీనా
4. ‘పటాలము ఏ భాషా పదం? 
    అ. ఫ్రెంచి  ఆ. పోర్చుగీసు  ఇ. కన్నడం    ఈ. తమిళం
5. ‘కనికట్టు’ విద్యను ప్రదర్శించే జానపదులు? 
    అ. దుబ్బులవాళ్లు    ఆ. పంబలవాళ్లు    
    ఇ. బవనీలు        ఈ. కాటిపాపలు
6. బవనీల వాద్య విశేషం? 
    అ. జమిడిక  ఆ. శారద    ఇ. పంబ  ఈ. ఒగ్గు
7. కావ్యప్రయోజనం గురించి చెప్పిన లాక్షణికులు? 
    అ. భరతుడు, దండి    ఆ. భామహుడు, మమ్మటుడు    
    ఇ. విశ్వనాథుడు, దండి    ఈ. రుద్రటుడు, జగన్నాథుడు
8. మానుషారోహణ ప్రధానాంశంగా ఉన్న ప్రబంధం?
    అ. రాజశేఖర చరిత్ర    ఆ. ప్రభావతీప్రద్యుమ్నం    
    ఇ. మనుచరిత్ర        ఈ. వసుచరిత్ర
9. పర్యాయపద నిఘంటుకారుడు? 
    అ. బహుజనపల్లి సీతారామాచార్యులు     ఆ. జి.ఎన్‌.రెడ్డి    ఇ. భద్రిరాజు    ఈ. రవ్వా శ్రీహరి
10. కింది వాటిలో రణ వాద్యం? 
    అ. వీణ  ఆ. దుందుభి      ఇ. తంబుర   ఈ. మృదంగం
11. ‘పసిడి పలుకులు’ సామెతల సంకలన కర్త? 
    అ. నేదునూరి గంగాధరం    ఆ. కృష్ణశ్రీ    
    ఇ. తూమాటి దొణప్ప        ఈ. జి.ఎస్‌.మోహన్‌
12. తెలుగుదేశపు సుబ్రహ్మణ్యభారతి? 
    అ. చిలకమర్తి ఆ. పానుగంటి ఇ. గరిమెళ్ల ఈ. రాయప్రోలు
13. ‘త్వార్థం’ అంటే? 
    అ. క్త్వార్థకం    ఆ. శత్రర్థకం   ఇ. భావం ఈ. అనంతర్యార్థకం
14. ‘పంచమం’ ఎవరి నవల? 
    అ. కొ.కు    ఆ. బండి నారాయణస్వామి   ఇ. చిలుకూరి దేవపుత్ర    ఈ. జి.కళ్యాణరావు
15. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ తొలి పురస్కారం పొందిన రచన? 
    అ. ద్రౌపది   ఆ. ఆంధ్రుల సాంఘిక చరిత్ర    ఇ. రజనీగంధ    ఈ. విముక్త
16. ‘‘అరుణ గభస్తి బింబముదయాద్రిపయిన్‌...’’ పద్యకర్త? 
    అ. నాచన సోమన ఆ. శ్రీనాథుడు ఇ. పోతన     ఈ. ఎర్రన    
17. ‘ముండా’ ఏ భాషా కుటుంబానికి చెందిన భాష?
    అ. సవర  ఆ. నాయకి  ఇ. ఇరుళ   ఈ. అన్నీ
18. వేటి సమ్మేళనం పంచ సంధులు? 
    అ. అర్థప్రకృతులు, దశరూపకాలు      ఆ. అర్థోపక్షేపకాలు, కార్యావస్థలు    
    ఇ. అర్థప్రకృతులు, కార్యావస్థలు    ఈ. కార్యావస్థలు, దశరూపకాలు
19. ‘‘గ్రామము చేత నుండి పరికల్పిత ధాన్యము యింట నుండి’’ అన్న చాటువు ఎవరిదిగా పేర్కొంటారు? 
    అ. పెద్దన  ఆ. శ్రీనాథుడు  ఇ. పోతన  ఈ. అన్నమయ్య
20. ‘‘వాగర్థావివ సంపృక్తౌ’’ శ్లోకకారుడు? 
    అ. భవభూతి    ఆ. దండి   ఇ. వాల్మీకి   ఈ. కాళిదాసు
21. పాణిని అష్టాధ్యాయికి ‘శబ్దకౌస్తుభం’ అనే వ్యాఖ్య రాసింది?  
    అ. భట్టోజి దీక్షితులు    ఆ. భాస్కరదీక్షితులు    
    ఇ. నాగేశభట్టు        ఈ. వరదరాజు
22. ‘నవ్యాంధ్రసాహిత్య వీధులు’ రచయిత?  
    అ. వల్లంపాటి వెంకట సుబ్బయ్య    
    ఆ. కురుగంటి సీతారామచార్యులు   ఇ. రా.రా  ఈ. కొ.కు
23. అవంతి సుందరి కథానుసారంగా భారవి పేరు?
    అ. సింహవిష్ణువు    ఆ. దామోదరుడు        
    ఇ. విష్ణువర్ధనుడు    ఈ. హర్షవర్ధనుడు
24. మాఘుని శిశుపాలవధ లోని సర్గలెన్ని? 
    అ. 16    ఆ. 12     ఇ. 20       ఈ. 24
25. ఏ కవికి ‘దీపశిఖ’ అనే పేరొచ్చింది? 
    అ. కృష్ణానందుడు     ఆ. మాఘుడు    
    ఇ. చంద్రప్రభసూరి    ఈ. కాళిదాసు
26. ‘న్యాయ రక్షామణి’ పేరుతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిందెవరు? 
    అ. అప్పయ్య దీక్షితులు    ఆ. సుకుమార కవి
    ఇ. నీలకంఠ దీక్షితులు    ఈ. రామభద్ర దీక్షితులు
27. ‘ఉత్పాదక వర్ణ నిర్మాణం’ సిద్ధాంత స్థాపకులు?
    అ. చోమ్‌స్కీ     ఆ. యాకోబ్‌సన్‌     ఇ. ఫర్త్‌  ఈ. బ్లూమ్‌ఫీల్డ్‌
28. ఒక భాషలో పదాలని విశ్లేషించి అర్థకాలని గుర్తించడానికి సహాయకారులుగా ఉండే ఎన్ని సూత్రాలను నైడా పేర్కొన్నారు? 
    అ. 4     ఆ. 6    ఇ. 8   ఈ. 12
29. ‘పదం’ ‘కనిష్ఠానిబద్ధరూపం’ అని, పదమంటే దానంతట అదే వాక్యంగా ఉచ్చరించదగిన కనిష్ఠరూపం అని నిర్వచించింది?   
    అ. బ్లూమ్‌ఫీల్డ్‌         ఆ. సైమన్‌పాటర్‌        
    ఇ. మాక్స్‌ముల్లర్‌    ఈ. ఎం.ఎన్‌.బచ్‌
30. ఆధునిక భాషాశాస్త్రజ్ఞులు ఉచ్చారణలో రెండు విరామాల మధ్య ఉండే ధ్వని సముదాయం ఏదని నిర్వచించారు? 
    అ. పదాంశం    ఆ. సపదాంశం  ఇ. వాక్యం     ఈ. సవర్ణం
31. ‘తపుకు’ అనే పదం వాడుకలో ఉన్న మాండలికం? 
    అ. కళింగాంధ్ర   ఆ. రాయలసీమ   ఇ. తెలంగాణ   ఈ.కోస్తాంధ్ర
32. వస్తు కవీశ్వరుడు?
    అ. పెద్దన ఆ. శ్రీనాథుడు ఇ.నన్నెచోడుడు ఈ.నాచనసోమన
33. ‘మాట తిరుగలేరు మానధనులు’ అన్న పంక్తులెవరివి? 
    అ. నన్నయ    ఆ. తిక్కన  ఇ. శ్రీనాథుడు    ఈ. పోతన
34. తిమ్మన ‘సత్యభామ’ను ఏ శృంగార నాయికగా వర్ణించాడు? 
    అ. విప్రలబ్ధ        ఆ. స్వాధీన పతిక
    ఇ. ఖండిత        ఈ. ప్రోషితభర్తృక
35. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను’’ అన్న కవి? 
    అ. జాషువా    ఆ. తిలక్‌   ఇ. శివప్రసాద్‌      ఈ. శ్రీశ్రీ
36. ‘ఇల్లలకగానే’ కథా సంపుటి ఎవరిది? 
    అ. ఓల్గా ఆ. రేవతీదేవి ఇ. పి.సత్యవతి ఈ. ఇల్లిందల 
37. కిందివాటిలో కొలకలూరి ఇనాక్‌ కథ? 
    అ. అస్పృశ్య గంగ ఆ. తలలేనోడు ఇ. ఊరబావి ఈ. అన్నీ
38. ‘ఆసుపత్రి గీతం’ కర్త? 
    అ. కె.శివారెడ్డి     ఆ. కె.వి.రమణారెడ్డి    
    ఇ. శివసాగర్‌     ఈ. నారాయణబాబు
39. ‘ఆకాశంలో సగం’ ఎవరి నవల? 
    అ. కేశవరెడ్డి         ఆ. ఓల్గా    
    ఇ. ముప్పాళ్ల రంగనాయకమ్మ    ఈ. సుజాతారెడ్డి
40. ‘ఆత్మవంచన’ ఎవరి నాటకం? 
    అ. బుచ్చిబాబు        ఆ. ఆత్రేయ    
    ఇ. ఎల్బీ శ్రీరాం        ఈ. డి.వి.నరసరాజు
41. ‘‘రాజకీయాలలో నానాజాతి సమితి ఎటువంటిదో కళాప్రపంచంలో సర్రియలిజం అటువంటిది’’ అన్న కవి? 
    అ. కుందుర్తి ఆ. శ్రీశ్రీ ఇ. శివసాగర్‌ ఈ. నారాయణబాబు
42. ‘‘ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారికన్న నయం నయం’’ అన్నదెవరు? 
    అ. వరవరరావు      ఆ. గద్దర్‌
    ఇ. శివసాగర్‌      ఈ. సుబ్బారావు పాణిగ్రాహి
43. నాచన సోమన గురించి తెలియజేసే శాసనం? 
    అ. విప్పర్తి ఆ. పెంచుకలదిన్నె ఇ. అద్దంకి ఈ. కందుకూరు
44. ‘దేశంపట్టనంత మహాకవి’ అని మల్లాది స్తుతించిన కవి? 
    అ. శ్రీశ్రీ   ఆ. కృష్ణశాస్త్రి       ఇ. విశ్వనాథ   ఈ. చలం
45. ‘నక్షత్రక’ పాత్రను సృష్టించిన సృష్టి చేసిన కవి?  
    అ. జక్కన     ఆ. మడికి సింగన    
    ఇ. గౌరన     ఈ. అనంతామాత్యుడు


వెనక్కి ...

మీ అభిప్రాయం