కవి సమూహమందు కాళిదాసుడు లెస్స/ మహలులందు తాజమహలు లెస్స/ నగరులందు భాగ్యనగరమె కడు లెస్స/ దేశభాషలందు తెలుగు లెస్స’’ అన్నారు కరుణశ్రీ. వివిధ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు భాషా సాహిత్యాల్లోంచి కొన్ని మాదిరి ప్రశ్నలివి..!
1. గ్రంథం ప్రతి విభాగంలోనూ ‘ఆనంద’ ముద్రతో కావ్య రచన సాగించిన కవి?
అ. తిక్కన ఆ. నాచన సోమన
ఇ. శ్రీకృష్ణదేవరాయలు ఈ. భట్టుమూర్తి
2. రాధాకృష్ణుల గురించి కావ్యం రాసిందెవరు?
అ. శ్రీనాథుడు ఆ. పోతన ఇ. సంకుసాల నృసింహకవి ఈ. చింతలపూడి ఎల్లన
3. ఉత్తరాల రూపంలో విరచితమైన తొలి తెలుగు నవల?
అ. మైదానం ఆ. బలిపీఠం ఇ. అతడు ఆమె ఈ. స్వేచ్ఛ
4. ధాతువుకి ‘తే, ఇతే’ అనే ప్రత్యయాలు చేరి ఏర్పడే రూపాలు?
అ. క్త్వార్థకాలు ఆ. శత్రర్థకాలు
ఇ. చేదర్థకాలు ఈ. అనంతర్యార్థకాలు
5. శిరీష కుసుమ పేశల సుధామయోక్తులు ఎవరివి?
అ. తిక్కన ఆ. నాచన సోమన ఇ. పెద్దన ఈ. భట్టుమూర్తి
6. ‘సినీవాలి’ కర్త?
అ. సినారె ఆ. వసీరా ఇ. త్రిపురనేని శ్రీనివాస్ ఈ. ఆరుద్ర
7. ‘మిత్రవైరుధ్యమా’ ఎవరి కవిత?
అ. పాటిబండ్ల రజని ఆ. మొక్కపాటి సుమతి ఇ. ఓల్గా ఈ. సావిత్రి
8. ‘కవిత్వం ఒక మెస్మరిజం.. కవి కన్ను ఒక ప్రిజం’ అన్న కవి?
అ. శ్రీశ్రీ ఆ. తిలక్ ఇ. కుందుర్తి ఈ. శేషేంద్రశర్మ
9. ‘శతక కవుల చరిత్ర’ కర్త
అ. వంగూరి సుబ్బారావు ఆ. నిడదవోలు వెంకటరావు ఇ. పింగళి లక్ష్మీకాంతం ఈ. శిష్ట్లా రామకృష్ణశాస్త్రి
10. ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ కర్త?
అ. దేవులపల్లి రామానుజరావు ఆ. కోగంటి సీతారామచార్యులు ఇ. కురుగంటి సీతారామయ్య ఈ. బహుజనపల్లి సీతారామాచార్యులు
11. ‘‘లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్జ్వల ఉదయం ప్రభవించదు.. కోటి స్వగతాలు పోరాడందే ఉన్నత సమాజం ఆవిష్కరించదు’’ అన్న మాటలు ఎవరివి?
అ. నగ్నముని ఆ. నిఖిలేశ్వర్
ఇ. జ్వాలాముఖి ఈ. చెరబండ రాజు
12. ‘‘ప్రజను సాయుధం చేస్తున్న రెవెల్యూషనరీ నేటి కవి’’ అన్నదెవరు?
అ. శ్రీశ్రీ ఆ. శివసాగర్ ఇ. నారాయణబాబు ఈ. గద్దర్
13. ‘‘ఈ చిన్న విత్తనంలో మహా వటవృక్షం వేచి ఉంది ఈ నీటిబొట్టులో ప్రళయసాగరం పొంచి ఉంది’’ అన్నదెవరు?
అ. కె.వి.రమణారెడ్డి ఆ. గోపాల చక్రవర్తి ఇ. వసీరా ఈ. అజంతా
14. ‘బల్లకట్టు పాపయ్య’ ఎవరి కథ?
అ. కరుణకుమార ఆ. చాసో ఇ. మాగోఖలే ఈ. గోపీచంద్
15. పెద్దనకు పూర్వకవుల్లో ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అనే బిరుదు ఎవరికి ఉందని చెబుతారు?
అ. విన్నకోట పెద్దన ఆ. కొరవి సత్యనారాయణ ఇ. కొఱవి గోపరాజు ఈ. మడికి అనంతయ్య
16. వేంకటరామకృష్ణ కవుల రచన?
అ. శతఘ్ని ఆ. పాశుపతము ఇ. పాపాగ్ని ఈ.నీరాజనము
17. ‘మంజువాణి’ పత్రికా సంపాదకుడు?
అ. గట్టుపల్లి శేషాచార్యులు ఆ. కొచ్చెర్లకోట వేంకట కృష్ణారావు ఇ. మంత్రిప్రగడ భుజంగరావు ఈ. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
18. ‘‘సామాజిక చారిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్యస్థానం నిర్ణీతమవుతుంది’’ అన్నదెవరు?
అ. కొ.కు ఆ. వల్లంపాటి ఇ. రా.రా ఈ. శ్రీశ్రీ
19. ‘శారదాధ్వజము’ కర్త?
అ. శ్రీవాత్సవ ఆ. శిష్టా లక్ష్మీకాంతశాస్త్రి ఇ. టేకుమళ్ల కామేశ్వరరావు ఈ. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
20. ‘సంస్కృత కవి జీవితములు’ ఎవరి రచన?
అ. మల్లాది సూర్యనారాయణశాస్త్రి ఆ. ముదిగంటి సుజాతారెడ్డి ఇ. చిలుకూరి నారాయణరావు ఈ. మేడేపల్లి వేంకట రమణాచార్యులు
21. ‘ఆరు యుగాల ఆంధ్ర కవిత’’ పేరుతో ఆరు రుతువులుగా భావించి వింగడించిన ఆంధ్ర కవితా సమీక్ష ఎవరిది?
అ. చాగంటి శేషయ్య ఆ. కొర్లపాటి శ్రీరామమూర్తి
ఇ. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఈ. వారణాసి వేంకటేశ్వర్లు
22. ‘సాహిత్య పరిచయం’ (1978) గ్రంథాన్ని రచించిందెవరు?
అ. కురుగంటి సీతారామయ్య ఆ. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇ. బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి ఈ. టేకుమళ్ల కామేశ్వరరావు
23. హంసడిభకోపాఖ్యానం ఉన్న రచన?
అ. కాశీఖండం ఆ. ఉత్తర హరివంశం ఇ. మదన విజయం ఈ. నవనాథ చరిత్ర
24. ‘సదసత్సంశయ గోచరోదరీ’ ప్రయోగం ఎవరి రచనలో కనిపిస్తుంది?
అ. పోతన ఆ. శ్రీనాథుడు
ఇ. అనంతామాత్యుడు ఈ. కొఱవి గోపరాజు
25. ‘పద్మపురాణోత్తర ఖండం’ కర్త?
అ. మడికి సింగన ఆ. దూబగుంట నారాయణ కవి ఇ. దగ్గుపల్లి దుగ్గన ఈ. జక్కన
26. ‘జీర్ణ కర్ణాట రాజ్య చరిత్ర’ కర్త?
అ. చిలుకూరి నారాయణరావు ఆ. చిలుకూరి వీరభద్రరావు ఇ. చాగంటి శేషయ్య ఈ. నిడదవోలు వేంకటరావు
27. ‘జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై...’ పద్య కర్త?
అ. మల్లన ఆ. భట్టుమూర్తి ఇ. నంది తిమ్మన ఈ. పింగళి సూరన
28. ‘‘అన్నగరి చిరుత ఏనుగు/ గున్నలపై నెక్కి నిక్కి కోయగవచ్చున్’’ అంటూ హేమధన్వుడి నగరం గురించి అతిశయించి వర్ణించిందెవరు?
అ. అల్లసాని పెద్దన ఆ. మాదయగారి మల్లన ఇ. భట్టుమూర్తి ఈ. పింగళి సూరన
29. ‘రుక్మిణీ కృష్ణ వివాహం’ యక్షగాన కర్త?
అ. కందుకూరి రుద్రకవి ఆ. రఘునాథ నాయకుడు ఇ. విజయరాఘవ నాయకుడు ఈ. శహాజీ
30. ‘‘అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ’’ అన్న చాటువు ఎవరి పేరిట ప్రచారంలో ఉంది?
అ. శ్రీనాథుడు ఆ. వేటూరి ప్రభాకరశాస్త్రి ఇ. దీపాల పిచ్చయశాస్త్రి ఈ. అల్లసాని పెద్దన
31. ‘చిలువ పడగ రాఱేని చరిత్రం’ కర్త?
అ. ములుగు పాపయారాధ్యుడు ఆ. మరింగంటి రసింహాచార్యులు
ఇ. దాసు శ్రీరామకవి ఈ. కూచిమంచి తిమ్మకవి
32. ‘మతమన్నది నా కంటికి మసకైతే/ మతమన్నది నీ మనసుకు మచ్చైతై/ మతం వద్దు, గితం వద్దు, మాయామర్మం వద్దు’’ అంటూ మతాన్ని నిరసించిందెవరు?
అ. విశ్వనాథ ఆ. శ్రీశ్రీ ఇ. గురజాడ ఈ. కృష్ణశాస్త్రి
33. ‘అశ్రుమాల’ కర్త?
అ. రెంటాల గోపాలకృష్ణ ఆ. నారపరెడ్డి ఇ. కుందుర్తి ఈ. సోమసుందర్
34. ‘‘నవ్య సంప్రదాయ వాదమన్నది కొత్త ధోరణేమి కాదు. ఇది జాతీయవాద కవితలో ప్రధానమైంది. ఇందులో హిందూ జాతీయత, కమ్యూనిస్టు వ్యతిరేకత కానవస్తాయి. ఈ ధోరణి బలమైన ధోరణిగా నిలబడినట్లు కన్పించదు’’ అన్నదెవరు?
అ. జి.వి.సుబ్రహ్మణ్యం ఆ. కోవెల సంపత్కుమార ఇ. చేకూరి రామారావు ఈ. అక్కిరాజు రమాపతిరావు
35. ‘‘నేను నిర్మించిన భవనం నా మీదే కూలింది.. నేను పెంచిన కుక్క పిచ్చిదై నన్నే కరచింది’’ అన్నదెవరు?
అ. నరసింహారెడ్డి ఆ. పేర్వారం జగన్నాథం
ఇ. కోవెల సంపత్కుమాచార్య ఈ. కోవెల సుప్రసన్నాచార్యులు
36. ‘‘కవిత్వం రోజూ వాడని ట్రూత్బ్రష్’’ అన్నదెవరు?
అ. శ్రీశ్రీ ఆ. ఆరుద్ర ఇ. అబ్బూరి ఈ. అజంతా
37. ‘‘కవిత్వం విధ్వంసక కారణ విచ్ఛేదన.. కవిత్వం నిత్య సౌందర్యారాధన’’ అన్న కవి?
అ. ఎల్లోరా ఆ. అబ్బూరి వరదరాజేశ్వరరావు ఇ. కుందుర్తి ఈ. దాశరథి
38. ‘ఆంధ్రవాఙ్మయమున చారిత్రక కావ్యములు’ సిద్ధాంత గ్రంథకర్త?
అ. వేటూరి ఆనందమూర్తి ఆ. బి.అరుణకుమారి
ఇ. వాసా ప్రభావతి ఈ. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి
39. సాహిత్య అకాడెమీ ఉత్తమ విమర్శ బహుమతి పొందిన ‘సాహిత్య వివేచన’ కర్త?
అ. అద్దేపల్లి రామమోహనరావు ఆ. కోవెల సుప్రసన్నాచార్య
ఇ. టి.ఎల్.కాంతారావు ఈ. రాచమల్లు రామచంద్రారెడ్డి
40. ‘ఆంధ్రసాహిత్య పునర్వికాసం’ కర్త?
అ. కొండూరు వీర రాఘవాచార్యులు ఆ. మద్దుకూరి చంద్రశేఖరరావు ఇ. తేరాల సత్యనారాయణశర్మ ఈ. కొత్త సత్యనారాయణ చౌదరి
41. ‘లావాలో ఎర్రగులాబి’ ఎవరి రచన?
అ. గొల్లపూడి మారుతీరావు ఆ. గోపీచంద్ ఇ. చలం ఈ. బుచ్చిబాబు
42. ‘విజయనగర సామ్రాజ్యమునందలి ఆంధ్ర వాఙ్మయము’ కర్త?
అ. బి.వేెంకట రమణయ్య ఆ. టేకుమళ్ల అచ్యుతరావు ఇ. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ఈ. నిడదవోలు వెంకటరావు
43. సాహిత్యాన్ని గతితార్కిక భౌతికవాద దృష్టితో సమాలోచించే విమర్శనా రీతి?
అ. కళావిమర్శ ఆ. రూప విమర్శ
ఇ. సాంఘిక విమర్శ ఈ. మార్క్సిస్టు విమర్శ
44. పురాణగాథలు, జానపద కథలు తదితరాల నిర్మాణంలోని సంకేతాలను గుర్తించి వాని మౌలిక రూపాలను వివరించడానికి తోడ్పడే విమర్శ?
అ. ఆర్కిటై పల్ విమర్శ ఆ. శైలీశాస్త్ర విమర్శ
ఇ. నైతిక విమర్శ ఈ. మనస్తత్వ విమర్శ
45. ‘సప్తతంతువు’ పేరుతో 1959 ఏడు వ్యాసాల సంపుటి వెలువరించెందెవరు?
అ. ఎస్వీ జోగారావు ఆ. కేతవరపు రామకోటిశాస్త్రి ఇ. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఈ. మల్లాది సూర్య నారాయణశాస్త్రి