అచ్చతెనుగు ఆదికవి ఎవరు?

  • 758 Views
  • 4Likes
  • Like
  • Article Share

తెలంగాణ ప్రభుత్వం ‘డీఈఈ సెట్‌ 2020’ (డీఎడ్‌ ప్రవేశపరీక్ష) ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 20 మార్కులకు తెలుగుకి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఇందులో భాగంగా 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లోని కవి పరిచయం, ఇతివృత్తం, కొటేషన్లు, వ్యాకరణాంశాలు తదితరాల మీద ఎక్కువగా దృష్టి సారించాలి. వాటికి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలివి.. 
1. భాగవతంలో ‘వామన చరిత్ర’ ఎన్నో స్కంధంలోది?
    అ. ఆరు  ఆ. ఏడు   ఇ. ఎనిమిది  ఈ. అయిదు
2. ‘క్షేత్రం’కు నానార్థం? 
    అ. శరీరం  ఆ. ఇల్లు    ఇ. వంశం  ఈ. కరుణ
3. ‘‘భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాషగావాలె’’ అన్న కవి? 
    అ. సామల సదాశివ      ఆ. కాళోజి     ఇ. సినారె         ఈ. దశారథి
4. ‘పేదరాలు’లో ఆగమంగా వచ్చింది?    
    అ. పే  ఆ. ద     ఇ. రా  ఈ. రు
5. ‘‘ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష’’ అన్నకవి? 
    అ. సినారె    ఆ. గిడుగు   ఇ. గురజాడ    ఈ. కాళోజి
6. ‘శతపత్రము’ పేరుతో గ్రంథస్థమైన అనుభవాలు, జ్ఞాపకాలెవరివి?
    అ. దాశరథి రంగాచార్య        ఆ.గడియారం రామకృష్ణశర్మ    
    ఇ. ఉత్పల సత్యనారాయణాచార్య    ఈ. కోవెల సంపత్కుమారాచార్య
7. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చివరి ఆస్థాన కవి? 
    అ. సినారె         ఆ. దాశరథి 
    ఇ. తిరుపతి వేంకట కవులు    ఈ. కాళోజి
8. దాశరథి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన సంవత్సరం? 
    అ. 1961    ఆ. 1967     ఇ. 1974    ఈ. 1977
9. ‘‘జయభేరి మోగించెరా తెలంగాణ... జయము రైతులకందెరా!’’ పలుకులతో తెలంగాణ పోరాట పాటలు రాసిందెవరు?     
    అ. కొత్తపల్లి రంగారావు      ఆ. వేముగంటి నరసింహాచార్యులు    
    ఇ. సలంద్ర లక్ష్మీనారాయణ    ఈ. దాశరథి
10. ‘‘అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలిక లొకచోట, అలసిన దేహాలొకచోట’’ అన్న మాటలెవరివి? 
    అ. సలంద్ర లక్ష్మీనారాయణ    ఆ. కాళోజి    
    ఇ. ఇరివెంటి కృష్ణమూర్తి        ఈ. వట్టికోట ఆళ్వారుస్వామి
11. నన్నయ చివరి పద్యం ‘శారదరాత్రులు’ అరణ్య పర్వం ఎన్నో ఆశ్వాసంలోది?     
    అ. రెండు    ఆ. మూడు    ఇ.నాలుగు  ఈ. అయిదు
12. ‘లలిత సుగుణ జాల తెలుగుబాల’ మకుటంతో శతకం రాసిందెవరు? 
    అ. కరుణశ్రీ        ఆ. వేమన    
    ఇ.మరింగంటి పురుషోత్తమాచార్యులు    ఈ. వేంటకరావు పంతులు
13. ‘రమ చక్కగా రాయగలదు’ ఏ వాక్యం?     
    అ. ప్రశ్నార్థక         ఆ. సామర్థ్యార్థక    
    ఇ. ఆశ్చర్యార్థక        ఈ. ప్రార్థనార్థక
14. ‘భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల’ పద్యం ఏ శతకంలోది?
    అ. వేణుగోపాల        ఆ. దాశరథి    
    ఇ. విశ్వనాథేశ్వర     ఈ. నరసింహ
15. ‘యాత్రానుభవం’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం? 
    అ. అసామాన్యులు    ఆ. మంజీర    
    ఇ. చిన్నప్పుడే        ఈ. సముద్రప్రయాణం
16. ‘బహుళం’లో సంధి ఎన్ని రూపాల్లో జరగవచ్చు?     
    అ. రెండు    ఆ. నాలుగు    ఇ. ఆరు    ఈ. మూడు
17. తెలుగులో ‘మణిప్రవాళ శైలి’ని వాడిన తొలికవి? 
    అ. మల్లికార్జున పండితుడు    ఆ. పాల్కురికి సోమనాథుడు    
    ఇ. పోతన     ఈ. గోన బుద్ధారెడ్డి
18. ‘దిశ’కు వికృతి? 
    అ. దిస  ఆ. దిశా    ఇ. దిసా  ఈ. దెస
19. ‘మౌక్తికం’కు నానార్థం కానిది?     
    అ. శంఖం    ఆ. ఏనుగు   ఇ. మేఘం    ఈ. అమృతం
20. ‘రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు’ ఏ వాక్యం?     
    అ. సామాన్య      ఆ. సంశ్లిష్ట    
    ఇ. సంయుక్త      ఈ. సామర్థ్యార్థక
21. ‘చిత్త’ శతక కర్త?     
    అ. శ్రీపతి భాస్కరకవి     ఆ. తిరువాయిపాటి వేంకటకవి    
    ఇ. పండిత రామసింహకవి     ఈ. వేంకటరావు పంతులు
22. ‘చరిత్రకెక్కని చరితార్థులు’ ఎవరి రచన?     
    అ. బిరుదురాజు రామరాజు ఆ. జి.ఎస్‌.మెహన్‌    
    ఇ. ఆర్‌.వి.ఎస్‌.సుందరం     ఈ. బూదరాజు రాధాకృష్ణ
23. ‘గదాధరుడు’ అన్నది ఏ తత్పురుష భేదానికి ఉదాహరణ?     
    అ. ప్రథమ        ఆ. ద్వితీయ    
    ఇ. తృతీయ        ఈ. చతుర్థి
24. ‘వేముగంటి నరసింహాచార్యులు’ని ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది? 
    అ. తెలుగు        ఆ. ఆంధ్ర   
    ఇ. ఉస్మానియా     ఈ. కాకతీయ    
25. ‘చంద్రవంకను శిరస్సున ధరించినవాడు’ అనే వ్యుత్పత్తి గల పదం?     
    అ. సైరికుడు      ఆ. కామారి    
    ఇ. సోమార్థధరుడు   ఈ. సంయమి
26. ‘గిడస’ అంటే? 
    అ. బాతాలు    ఆ. గడ్డి    ఇ. శుష్కించడం      ఈ. సోపతి
27. సినారె ‘విశ్వంభర’కు ఏ సంవత్సరంలో ‘జ్ఞానపీఠ’ లభించింది?
    అ. 1986    ఆ. 1987    ఇ. 1988      ఈ. 1989
28. ప్రతిపద్య చమత్కారచణుడు? 
    అ. పోతన         ఆ. పెద్దన        
    ఇ. చేమకూర వేంకటకవి    ఈ. శ్రీనాథుడు
29. ‘తమ్ము కుర్రలు’ ఏ సమాసం? 
    అ. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం    ఆ. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం      
    ఇ. ఉపమానపూర్వపద కర్మధారయ సమాసం   ఈ. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
30. ‘వ్యర్థం’ అనే అర్థంలో ఉపయోగించే జాతీయం? 
    అ. చుక్క తెగిపడ్డట్టు        ఆ. పీనుగ సింగారం
    ఇ. నిండుచెరువు            ఈ. అగ్గి బుక్కుట
31. పి.వి.నరసింహారావు నడిపించిన పత్రిక?     
    అ. గోల్కొండ        ఆ. కాకతీయ    ఇ. శోభ  ఈ. సుజాత
32. ముకురాల రామారెడ్డి రచించిన గేయ సంపుటి?     
    అ. మేఘదూత     ఆ. దేవరకొండ దుర్గం    
    ఇ. నవ్వేకత్తులు        ఈ. హృదయశైలి
33. బి.ఎన్‌.శాస్త్రి ఏ తరగతిలోనే ‘సంధ్యారాగం’ నవల రాశారు? 
    అ. ఎనిమిది   ఆ. తొమ్మిది  ఇ. పది  ఈ. ఏడు 
34. ఇంద్రగణాలెన్ని?     
    అ. 2     ఆ. 4    ఇ. 3  ఈ. 6
35. ‘నింబగిరి నరసింహ’ శతక కర్త? 
    అ. అందె వేంకటరాజం         ఆ. ఇమ్మడిజెట్టి చంద్రయ్య    
    ఇ. గౌరీభట్ల రఘురామశాస్త్రి    ఈ. ఉత్పల సత్యనారాయణాచార్య
36. ‘వడిబట్టి’లోని సంధి?     
    అ. గసడదవాదేశ    ఆ. ఆమ్రేడిత    
    ఇ. సరళాదేశ        ఈ. ఇకార
37. అచ్చతెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడైనవారు? 
    అ. పాల్కురికి సోమనాథుడు    ఆ. పొన్నికంటి తెలగన   ఇ. గోన బుద్ధారెడ్డి     ఈ. పోతన
38. ‘గాథా సప్తశతి’ ఏ భాషకు చెందిన గాథల సంకలనం? 
    అ. సంస్కృతం       ఆ. ప్రాకృతం    
    ఇ. మరాఠీ      ఈ. తెలుగు
39. సూర్య ఇంద్ర గణాలతో ఏర్పడే పద్యం? 
    అ. చంపకమాల      ఆ. మత్తేభం 
    ఇ. తేటగీతి      ఈ. ఉత్పలమాల
40 ‘పిత్రార్జితం’లోని సంధి? 
    అ. సవర్ణదీర్ఘ   ఆ. అత్వ  ఇ. యణాదేశ   ఈ. గుణ


వెనక్కి ...

మీ అభిప్రాయం