కవులు, నదులు భూగోళపు రక్తనాళాలు’

  • 702 Views
  • 6Likes
  • Like
  • Article Share

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ప్రకటన వెలువడింది. ఈ నెలలోనే పరీక్ష జరగబోతోంది. అధ్యాపక వృత్తిలో ప్రవేశానికి, ఫెలోషిప్‌ సాధనకూ అక్కరకొచ్చే ఈ పరీక్షలోని రెండో పేపర్‌- తెలుగుకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేద్దాం.  
1. అర్థ వ్యాకోచం చెందిన పదం?

అ. చాడీ  ఆ. గ్లాసు    ఇ. నెయ్యి  ఈ. ఆరాధ్యుడు
2. ‘ఆయన భార్య కొత్త కుర్చీలు కొంది’ వాక్యంలో ‘కొత్త’ అనేది?     
అ. నామవాచకం      ఆ. సర్వనామం    
ఇ. విశేషణం         ఈ. అవ్యయం
3. కారక భేదాలెన్ని?     
అ. 4    ఆ. 6     ఇ. 8   ఈ. 7
4. అ‘చేతనము’ అనే అర్థం కలిగిన పదం? 
అ. తిర్యక్కులు        ఆ. జడము    
ఇ. క్లీబం         ఈ. ఆమంత్రణం
5. ‘కన్యాశుల్కం’ నాటకం మొదటి కూర్పు ఎప్పుడు వెలువడింది?     
అ. 1894    ఆ. 1897      ఇ. 1909    ఈ. 1911
6. దక్షిణాపథంలో జన్మించిన పుళింద, శబరాది జాతుల్లో ఆంధ్రకులు ఒకరని భారతంలోని ఏ పర్వంలో కనపడుతుంది?
అ. అరణ్య    ఆ. కర్ణ     ఇ. శాంతి    ఈ. ద్రోణ
7. ‘చీపురుపుల్ల’ శతక కర్త? 
అ. సామినేని వేంటాద్రి కవి    ఆ. కొండూరి వీరరాఘవాచార్యులు    
ఇ. వావిలికొలను సుబ్బారావు ఈ. అద్దంకి గంగాధర కవి
8. ఖండకావ్య రచనకు ఆద్యుడు?     
అ. గురజాడ ఆ. రాయప్రోలు ఇ. కృష్ణశాస్త్రి    ఈ. శ్రీశ్రీ
9. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బండి నారాయణస్వామి ‘శప్తభూమి’ రచన ఏ ప్రక్రియకి చెందింది?     
అ. కథానిక    ఆ. నవల    ఇ. కవిత్వం   ఈ. నాటకం
10.    ‘కవుల్ని కనడంలో తెలుగు తల్లిదే ప్రపంచ రికార్డ్‌’ అన్నదెవరు? 
అ. ఆరుద్ర    ఆ. తిలక్‌    ఇ. అజంతా   ఈ. శ్రీశ్రీ
11. ‘కవులు, నదులు భూగోళపు రక్తనాళాలు’ అన్న కవి?     
అ. శేషేంద్రశర్మ     ఆ. కాళోజీ    
ఇ. రెంటాల గోపాలకృష్ణ    ఈ. గోపాల చక్రవర్తి
12. ‘రాణి’ అన్నది చిన్నయసూరి ప్రకారం..?     
అ. సంస్కృత సమం    ఆ. ప్రాకృత సమం    
ఇ. సంస్కృత భవం     ఈ. ప్రాకృత భవం
13. అలుక్సమాసానికి ఉదాహరణ?     
అ. నీ చేతిప్రోపు    ఆ. నీతోడి చెలిమి    
ఇ. నీవలని భయము     ఈ. అన్నీ
14. ‘నకలు’ అనేది ఏ భాషాపదం?     
అ. పారశీ   ఆ. పోర్చుగీసు   ఇ. ఉర్దూ    ఈ. హిందీ
15. ‘భాషానువర్తనం’ గ్రంథకర్త?     
అ. బూదరాజు రాధాకృష్ణ      ఆ. చేకూరి రామారావు    
ఇ. బొడ్డుపల్లి పురుషోత్తం       ఈ. భద్రిరాజు కృష్ణమూర్తి
16. ‘తెలుగు జర్నలిజం - అవతరణ వికాసం’ గ్రంథకర్త?     
అ. జె.చెన్నయ్య    ఆ. వి.లక్ష్మణరెడ్డి    
ఇ. కె.గోపాలకృష్ణారావు    ఈ. మారేపల్లి రామచంద్రశాస్త్రి
17. ‘శ్వేతరాత్రులు’ కథాసంపుటి సంపాదకులు?
అ. కాళీపట్నం రామారావు    ఆ. దేవరాజు మహారాజు    
ఇ. కేతు విశ్వనాథరెడ్డి      ఈ. సింగమనేని నారాయణ
18. పా‘లె’ పదం తెలుగునాట ఏ మండల భేదానికి చెందింది? 
అ. పూర్వ  ఆ. దక్షిణ    ఇ. ఉత్తô  ఈ. మధ్య 
19. ద్రావిడ భాషల్లో లింగభేదం లేని భాషలు?     
అ. కలమీ, కన్నడం    ఆ. తుళు, తెలుగు    
ఇ. తొద, బ్రాహుయీ    ఈ.నాయకీ, మలయాళం
20. ‘కల్యాణ కింకిణి’ ఎవరి రచన?     
అ. ఎల్లోరా     ఆ. బుచ్చిబాబు    
ఇ. మల్లవరపు విశ్వేశ్వరరావు    ఈ. శ్రీనివాస సోదరులు
21. ‘హేంగ్‌మీ క్విక్‌’ ఎవరి నవల?     
అ. యద్దనపూడి ఆ. బీనాదేవి ఇ.యండమూరి ఈ.గొల్లపూడి    
22. ‘గీరతం’ కర్త?     
అ. వేంకట పార్వతీశ్వర కవులు ఆ. తిరుపతి వేంకట కవులు    ఇ. పింగళి కాటూరి కవులు  ఈ. వెంకట రామకృష్ణ కవులు
23. ‘గతంబు గతంబె ఎన్నటికి కన్నులగట్టదు’ అన్నకవి?     
అ. జాషువా       ఆ. గురజాడ   
ఇ. పఠాభి         ఈ. దువ్వూరి రామిరెడ్డి
24. ‘చీకటి నీడలు’ ఎవరి కవితా సంపుటి?     
అ. ఆలూరి బైరాగి     ఆ. చెరబండ రాజు    
ఇ. భైరవయ్య           ఈ. మహాస్వప్న
25. ‘నా దేహాన్నే ఒక వథ్యశిలగా మార్చుకొని అవ్యక్త వేదన రాగాన్నై అనంత వాయువుల్లోకి పయనిస్తాను’ అన్న కవయిత్రి?     
అ. చల్లపల్లి స్వరూప రాణి    ఆ. జయప్రభ    
ఇ. కె.వరలక్ష్మి        ఈ. సావిత్రి
26. ‘పంచమ వేదం’ కవితా సంపుటి ఎవరిది?     
అ. జి.లక్ష్మీనరసయ్య    ఆ. సతీష్‌ చందర్‌    
ఇ. మద్దూరి నగేష్‌బాబు   ఈ. శిఖామణి
27.  ‘జానపద కళాసంపద’ పేరుతో ఉత్తమ వ్యాస సంపుటాలు వెలువరించిన వారు?    
అ. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి    ఆ. తూమాటి దొణప్ప    ఇ. నాయని కృష్ణకుమారి    ఈ. తంగిరాల వెంకట సుబ్బారావు
28. సి.పి.బ్రౌన్‌ సేకరించిన జానపద గేయకథ?     
అ. బొబ్బిలి కథ     ఆ. కుమారరాముని కథ    
ఇ. కాటమరాజు కథ    ఈ. అన్నీ
29. రఘునాథ నాయకుడి నుంచి కనకాభిషేకం పొందిన కవయిత్రి?
అ. రంగాజమ్మ  ఆ. మధురవాణి   ఇ. చంద్రరేఖ   ఈ. మొల్ల
30. ‘జైమినీ భారతం’ వచన కావ్యకర్త?     
అ. పిల్లలమర్రి పినవీరభద్రుడు   ఆ. సముఖము వేంకటకృష్ణప్పనాయకుడు    
ఇ. అంగనమఖి కామేశ్వర కవి    ఈ. విజయరంగ చొక్కనాథుడు
31. ‘ఆనంద భైరవి’ రాగాన్ని మొదట ఉపయోగించిన వాగ్గేయకారుడు?     
అ. అన్నమయ్య     ఆ. త్యాగయ్య    ఇ. క్షేత్రయ్య   ఈ. రామదాసు
32. ‘కవి జనరంజనం’ కర్త? 
అ. అడిదం సూరకవి   ఆ. పరశురామపంతుల లింగమూర్తి కవి    
ఇ. దిట్టకవి నారాయణకవి  ఈ. కనుపర్తి అబ్బయామాత్యుడు
33. కందుకూరి రచించిన నాటకం?     
అ. దక్షిణ గోగ్రహణం     ఆ. సత్యహరిశ్చంద్ర    
ఇ. భక్తప్రహ్లాద         ఈ. అన్నీ
34. విరియాల కామసాని గూడూరు శాసన కాలం?    
అ. క్రీ।।శ 610        ఆ. క్రీ।।శ 885 
ఇ. క్రీ।।శ 1000      ఈ. క్రీ।।శ 1050
35. మణిప్రవాళ శైలి ఎక్కువగా కనిపించే భాష?    
అ. కన్నడం    ఆ. మలయాళం    ఇ. తమిళం  ఈ. కువి
36. ‘చలిచీమలు’ ఎవరి కథ?    
అ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి    ఆ. చింతా దీక్షితులు    
ఇ. వేలూరి శివరామశాస్త్రి    ఈ. భమిడిపాటి కామేశ్వరరావు
37. ‘భారతంలో బీజప్రాయంగా, ఎర్రనలో అంకుర ప్రాయంగా, సోమన్నలో మొలకగా పొడచూపిన ప్రబంధలత శ్రీనాథుని చేతిలో కొనసాగి చిగిర్చి మారాకు వేసింది. అది పుష్పఫల సమన్వితమగుట రాయలకాలంలోనే. మనుచరిత్రయే ఆ లతకుపూచిన తొలిపూవు, పండిన తొలిఫలం’ అన్న విమర్శకులు?    
అ. కొర్లపాటి శ్రీరామమూర్తి    ఆ. కట్టమంచి రామలింగారెడ్డి    
ఇ. పింగళి లక్ష్మీకాంతం       ఈ. కె.వి.ఆర్‌.నరసింహం
38. ‘వసంత లేఖలు’ ఎవరివి?     
అ. వంగూరి సుబ్బారావు    ఆ. చింతా దీక్షితులు    
ఇ. కనుపర్తి వరలక్ష్మమ్మ   ఈ. చలం
39. ‘శబ్దార్థౌ సహితౌ కావ్యం’ అన్నదెవరు?     
అ.  రుద్రటుడు     ఆ. భామహుడు    
ఇ. వాగ్భటుడు       ఈ. కుంతకుడు
40. ‘శ్రీశ్రీ కవిత్వం - వస్తువు - సంవిధానం’ కర్త?     
అ. మిరియాల రామకృష్ణ        ఆ. యస్‌.వి.రామారావు
ఇ. పల్లా దుర్గయ్య        ఈ. జి.వి.సుబ్రహ్మణ్యం
41. ‘శృంగార శ్రీనాథం’ కర్త?     
అ. దీపాల పిచ్చయ్యశాస్త్రి   ఆ. వేటూరి ప్రభాకరశాస్త్రి    
ఇ. విశ్వనాథ       ఈ. జంధ్యాల పాపయ్యశాస్త్రి


వెనక్కి ...

మీ అభిప్రాయం