‘‘నగరం చిక్కువీడని పద్మవ్యూహం’’

  • 609 Views
  • 1Likes
  • Like
  • Article Share

ఇంటర్‌ విద్యార్హతతోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి మార్గం డీఎడ్‌. దీనికి అర్హత కోసం ఆంధ్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీఈఈ సెట్‌లో 20 మార్కులు తెలుగుకి కేటాయించారు. 8, 9, 10 తరగతుల తెలుగు వాచకాల్లో భాగంగా కవుల కాలం, బిరుదులు, రచనలు, కావ్య అంకితాలు, కవితా, ఆస్థాన విశేషాలు, ఇతివృత్తాలు, పాఠ్యభాగ సందర్భాలు, భాష, వ్యాకరణాదుల మీద దృష్టిసారించాలి. వీటిలోంచి కొన్ని మాదిరి ప్రశ్నలు..
1. ఎర్రన రచనా ప్రభావం ఏ కవి మీద ఉందని విమర్శకుల భావన
?  
    అ. శ్రీనాథుడు   ఆ. పోతన   ఇ. గౌరన   ఈ. పెద్దన
2. ‘వెల్లి’కి నానార్థం కానిది? 
    అ. ప్రవాహం   ఆ. తెలుపు   ఇ. వరస    ఈ. నెమలి
3. ‘‘కుముదినీరాగ రసబద్ధ గుళికయనగ/ జంద్రుడుదయించె గాంతినిస్తంద్రుడగుచు’’లోని అలంకారం? 
    అ. ఉపమ   ఆ. రూపకం  ఇ. ఉత్ప్రేక్ష   ఈ. శ్లేష
4. ‘కైరవం’కు పర్యాయ పదం? 
    అ. ఉత్పలం   ఆ. స్రోతస్సు  ఇ. చంద్రిక   ఈ. తమస్సు
5. చిన్నయసూరి రచన కానిది?  
    అ. సూత్రాంధ్ర వ్యాకరణం     ఆ. శబ్దలక్షణ సంగ్రహం   ఇ. అక్షరగుచ్ఛము    ఈ. వ్యాకరణ చంద్రిక
6. ‘మామిడిగున్న’ ఏ సమాసం? 
    అ. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం    ఆ. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం    
    ఇ. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం      ఈ. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
7. ‘‘ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది’’లోని భాషాశైలి? 
    అ. ప్రాచీన శైలి          ఆ. శిష్ట వ్యవహారిక శైలి    
    ఇ. మాండలిక పద్ధతి      ఈ. సరళ గ్రాంథిక శైలి
8. పారతంత్య్రాన్ని నిరసించి, స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా రగిలించిన గడియారం వేంకట శేషశాస్త్రి రచన?
    అ. పుష్పబాణ విలాసం   ఆ. రఘునాథీయం   ఇ. శివభారతం   ఈ. మురారి
9. చంపకమాల వృత్త పద్యంలో ఎన్నో అక్షరం యతి స్థానం?
    అ. 10    ఆ. 11      ఇ. 13    ఈ. 14
10. బోయి భీమన్న ‘గుడిసెలు కాలిపోతున్నాయ్‌’కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎప్పుడు వచ్చింది?
    అ. 1973    ఆ. 1975    ఇ. 2001  ఈ. 2004
11. ‘కెందామరలు’ విడదీయండి? 
    అ. కెను+తామరలు    ఆ. కెంత+తామరలు    
    ఇ. కెంపు+తామరలు    ఈ. కెం+దామరలు
12. ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపం ఏవిధంగా వస్తుంది? 
    అ. నిత్యంగా  ఆ. విభాషగా  ఇ. బహుళంబుగా ఈ. నిషేధంగా
13. ‘శ్రీలొంక రామేశ్వర’ శతక కర్త? 
    అ. నంబి శ్రీధరరావు    ఆ. అందె వేంకటరాజం    
    ఇ. గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ    ఈ. వడ్డాది సుబ్బారాయ కవి
14. ‘వచోనిచయం’లోని సంధి? 
    అ. గుణ    ఆ. వృద్ధి    ఇ. ఉత్వ    ఈ. విసర్గ
15. ‘సత్యదూరము’ అనేది ఏ తత్పురుష సమాస భేదానికి ఉదాహరణ?  
    అ. ప్రథమా    ఆ. ద్వితీయ  ఇ. పంచమీ     ఈ. షష్ఠీ
16. ‘రామకృష్ణారావు చేత ఆమోదముద్ర వేయబడింది’ అన్నది ఏ వాక్యం?  
    అ. కర్తరి వాక్యం    ఆ. కర్మణి వాక్యం    
    ఇ. ప్రత్యక్ష వాక్యం    ఈ. పరోక్ష వాక్యం
17. ‘‘నగరం అర్థంకాని రసాయనశాల! నగరం చిక్కువీడని పద్మవ్యూహం’’ అన్న కవి? 
    అ. అలిశెట్టి ప్రభాకర్‌    ఆ. పఠాభి    
    ఇ. కుందుర్తి        ఈ. శ్రీశ్రీ
18. విశ్వనాథ ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? 
    అ. శ్రీమద్రామాయణ కల్పవృక్షం    ఆ. ఆంధ్రప్రశస్తి    
    ఇ. విశ్వనాథ మధ్యాక్కరలు    ఈ. కిన్నెరసాని పాటలు
19. ‘‘చుక్కలు తలపూవులుగా/ అక్కజముగ మేను పెంచి యంబర వీధిన్‌/ వెక్కసమై చూపట్టిన/ అక్కోమలి ముదము నొందె ఆత్మ స్థితిలోన్‌’’లోని అలంకారం? 
    అ. అతిశయోక్తి    ఆ. అర్థాంతరన్యాసం    
    ఇ. శ్లేష    ఈ. ఉపమ
20. ‘‘జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియుంగూర్చి...’’ పద్య కర్త? 
    అ. తిక్కన      ఆ. ఎర్రన    
    ఇ. తిరుపతి వేంకట కవులు    ఈ. నన్నయ
21. పాల్కురికి సోమన ఏ సాహిత్య ప్రక్రియకు ఆద్యుడు?  
    అ. ద్విపద    ఆ. రగడ     ఇ. అష్టకం    ఈ. అన్నీ
22. వీరశైవాచారంలో జంగమ దేవరలను, గురువులను, పీఠాధిపతులను ఆహ్వానించేటప్పుడు విభూతి కలిపి సమర్పించే తాంబూలం? 
    అ. పేరిణి    ఆ. కేళిక     ఇ. జతి       ఈ. విభూతి వీడ్యం
23. ద్విపద ప్రక్రియలో రచన చేయనివారు? 
    అ. తిమ్మక్క    ఆ. తాళ్లపాక చిన్నన్న    
    ఇ. గౌరన        ఈ. మంచన
24. ‘స్వేచ్ఛ’ ఎవరి నవల?  
    అ. వసంత కన్నబిరాన్‌     న కన్నబిరాన్‌    ఇ. ఓల్గా    ఈ. పి.సత్యవతి
25. ‘‘ఈ శతాబ్ది నాదే’’ అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి? 
    అ. గద్దర్‌    ఆ. శ్రీశ్రీ      ఇ. శివసాగర్‌     ఈ. చలం
26. విద్వాన్‌ విశ్వం రచన? 
    అ. ప్రేమించాను       ఆ. ఒకనాడు    
    ఇ. పెన్నేటి పాట      ఈ. అన్నీ
27. ‘నాలుగ్గాళ్ల మండపం’ ఎవరి రచన? 
    అ. పులికంటి కృష్ణారెడ్డి    ఆ. గోపీచంద్‌    
    ఇ. నవీన్‌     ఈ. పొట్లపల్లి రామారావు
28. ‘జగజ్జనని’ ఏ సంధి రూపం?
    అ. జశ్త్వసంధి    ఆ. శ్చుత్వసంధి    ఇ. ష్ఠుత్వసంధి   ఈ. సరళాదేశ సంధి
29. శ్రీనాథుడు ఏ పద్యాలకు ప్రసిద్ధి?  
    అ. ఆటవెలది    ఆ. ద్విపద   ఇ. సీసం    ఈ. కందం
30. ‘పౌలస్త్యవధ’ అని ఏ గ్రంథానికి నామాంతరం? 
    అ. భారతం    ఆ. రామాయణం      ఇ. భాగవతం  ఈ. భగవద్గీత
31. వాల్మీకి రామాయణంలోని శ్లోకాల సంఖ్య? 
    అ. 16000    ఆ. 24000   ఇ. 18000    ఈ. 26000
32. ‘రామరాజీయం’ వ్యాస సంకలన కర్త?  
    అ. బిరుదురాజు రామరాజు    ఆ. సురవరం ప్రతాపరెడ్డి    
    ఇ. పింగళి లక్ష్మీకాంతం    ఈ. ఆర్వీఎస్‌ సుందరం
33. ‘ఇది ఇలా జరిగింది’ అనే అర్థం చెప్పే ప్రక్రియ? 
    అ. పురాణం    ఆ. ఇతిహాసం  ఇ. ప్రబంధం  ఈ. కావ్యం
34. ‘‘జనని సంస్కృతంబు సకల భాషలకును/ దేశ భాషలందు తెలుగు లెస్స’’ పంక్తులు ఏ కావ్యంలోవి?
    అ. హర విలాసం    ఆ. ఆముక్తమాల్యద    
    ఇ. క్రీడాభిరామం    ఈ. శృంగార శాకుంతలం
35. ‘‘చదువు జీర్ణమైన స్వాంత్వంబు పండును/ తిండి జీర్ణమైన నిండు బలము’’ పద్య పంక్తులు ఏ శతకంలోవి?
    అ. సభారంజన     ఆ. శ్రీకాళహస్తీశ్వర    
    ఇ. మిత్రసాహసి     ఈ. వేంకటేశ
36. ‘‘...విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌’’ అన్న కవి?
    అ. శివసాగర్‌      ఆ. ఆరుద్ర
    ఇ. అలిశెట్టి ప్రభాకర్‌    ఈ. శ్రీశ్రీ
37. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ కర్త? 
    అ. శంకరకవి     ఆ. శ్రీనాథుడు        
    ఇ. గౌరన       ఈ. తాళ్లపాక చిన్నన్న
38. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించిన కవి? 
    అ. వట్టికోట ఆళ్వారుస్వామి    ఆ. దాశరథి    
    ఇ. కాళోజి      ఈ. సినారె
39. ‘గజల్‌’ ప్రక్రియ జీవగుణం?
    అ. సరసభావన    ఆ. చమత్కార ఖేలన  ఇ. కుదింపు, ఇంపు    ఈ. అన్నీ
40. ‘‘అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’’ అని నినదించిందెవరు? 
    అ. శ్రీశ్రీ      ఆ. అలిశెట్టి ప్రభాకర్‌    
    ఇ. కాళోజి    ఈ. దాశరథి
41. ‘బందిపోట్లు’ ఎవరి కవిత?  
    అ. ఓల్గా    ఆ. సావిత్రి
    ఇ. కొండేపూడి నిర్మల    ఈ. శ్రీమతి
42. ‘కృషీవలుడు’ కావ్యకర్త? 
    అ. జాషువా   ఆ. దువ్వూరి రామిరెడ్డి    ఇ. కుందుర్తి    ఈ. ఆరుద్ర
43. ‘‘మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు.. సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు’’ అన్నదెవరు? 
    అ. జిడ్డు కృష్ణమూర్తి    ఆ. ఇరివెంటి కృష్ణమూర్తి
    ఇ. రెంటాల గోపాలకృష్ణ    ఈ. పురిపండా అప్పలస్వామి
44. ‘ప్రాచీన గాథాలహరి’ కర్త?  
    అ. వేమూరి శ్రీనివాసరావు    ఆ. పిలకా గణపతి శాస్త్రి    
    ఇ. పూదూరి సీతారామశాస్త్రి    ఈ. చిన్నయసూరి


వెనక్కి ...

మీ అభిప్రాయం