విలక్షణ సాహిత్య పథగామి

  • 57 Views
  • 0Likes
  • Like
  • Article Share

పరిశోధకుడిగా ఉర్దూ, తెలుగు సాహిత్యాల్లో విశేష కృషిచేసిన షేక్‌ మహమ్మదు ముస్తఫా.. రుబాయీ కవిగా ప్రసిద్ధులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించారు. అనిబిసెంట్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తిచేశారు. గుడివాడ ఆంధ్ర నలందలో సంస్కృతాంధ్ర సాహిత్యాలను అధ్యయనం చేశారు. హిందీలో సాహిత్య రత్న స్థాయి ఉన్నత విద్యను పూర్తిచేశారు. మొదట హిందీ ఉపాధ్యాయులుగా జీవితాన్ని ప్రారంభించినా ఎమ్మే తెలుగు చేసి తెలుగు ఉపన్యాసకులుగా కల్యాణదుర్గం, కదిరి, ప్రొద్దుటూరు కళాశాలల్లో పనిచేశారు. ప్రసిద్ధ కవి ఉమర్‌ అలీషా రుబాయీలకు ఆకర్షితులయ్యి తెలుగులో రుబాయీ రచనకి పూనుకున్నారు. నిరాడంబరత్వం, మృదు స్వభావి అయిన ముస్తఫా గొప్ప సాహిత్య సృజన చేశారు. పారసీక రుబాయీలు అనే అంశంపై పరిశోధన చేశారు. ‘వెలుగుల రవ్వలు’ పేరిట కవితా సంకలనం, ‘మానవ హృదయం’ అనే రుబాయీ కవితల సంకలనాన్ని వెలువరించారు. 1980లో ముఖ్యమంత్రి అంజయ్య చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. 1990 - 92 మధ్యకాలంలో ఖాద్రి కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకి అధ్యక్షులుగా పనిచేశారు. ప్రొద్దుటూరు నవ్యసాహితీ సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఉమర్‌ ఖయ్యాం రుబాయీ కవితల తీరుతెన్నులపై పరిశోధన చేశారు. పాలవేకరి కదరీపతి ‘శుక సప్తతి’లో విశిష్ట అంశాలను శోధించి వెలుగులోకి తెచ్చారు. 1986లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సమక్షంలో కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. కవిగా, పరిశోధకుడిగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన ముస్తఫా ఏప్రిల్‌ 13న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం