వెనక్కి తగ్గిన యూనికోడ్‌ కన్సార్షియం

  • 165 Views
  • 2Likes
  • Like
  • Article Share

తెలుగు భాషాభిమానుల ఘన విజయం
తెలుగు యూనికోడ్‌లోకి రెండు తమిళ అక్షరాల్ని చేర్చేలా తీసుకున్న నిర్ణయాన్ని యూనికోడ్‌ కన్సార్షియం ఉపసంహరించుకుంది. తమిళంలోని రెండు అక్షరాల్ని తెలుగులో విరివిగా వాడుతున్నందువల్ల వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాలన్న ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు యూనికోడ్‌ కన్సార్షియం ఏప్రిల్‌ 30న ట్విటర్‌లో తెలిపింది. దీని మీద తెలుగు భాషాభిమానులు సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. యూనికోడ్‌ ప్రతినిధులు దీన్ని సరైన చర్చ లేకుండానే ఆమోదించారని తెలుగు కూటమి ప్రతినిధి షేక్‌ రహ్మానుద్దీన్‌ వ్యాఖ్యానించారు. వినోద్‌రాజన్‌ అనే వ్యక్తి ప్రతిపాదనను అనుసరించి యూనికోడ్‌ కన్సార్షియం ఈ నిర్ణయం తీసుకునే ముందు తెలుగు వారిని భాగస్వాములుగా చేసుకోలేదు. దీని గురించి తెలంగాణ ప్రభుత్వం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఇతర తెలుగు ప్రముఖులు లేఖలు రాశారు. సురేష్‌ కొలిచాల ఈ విషయాలన్నింటినీ యూనికోడ్‌ కన్సార్షియం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్టు కన్సార్షియం ప్రకటించింది. తెలుగు భాషాభిమానులందరూ ఏకమై సాధించిన గొప్ప విజయమిది. 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం