తెలుగువెలుగు సెప్టెంబరు సంచిక విశేషాలు

  • 1650 Views
  • 153Likes
  • Like
  • Article Share

అమ్మభాషలో విద్యాబోధనే భవితకు బంగరు బాటన్నది ఏళ్లుగా మేధావులు, విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణుల మాట. కేంద్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదముద్ర వేసిన జాతీయ నూతన విద్యా విధానం ఇదే విషయాన్ని మరోసారి స్పష్టంచేసింది. అయిదో తరగతి వరకు, వీలైతే ఆ పైన అమ్మ భాషలోనే విద్యాబోధన సాగాలని సూచించింది. ఈ నేపథ్యంలో మాతృభాషలో చదువు ఆవశ్యకతను వివరిస్తూ, నూతన విద్యావిధానాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించిన వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు, వ్యాసాలు.. ఈ సంచిక ప్రత్యేకం!
      మీరు teluguvelugu.eenadu.net ‌లో ముందుగా రిజిస్ట్రర్‌ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్‌ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.

స్వావలంబనకు ఆలంబన

జాతీయ నూతన విద్యా విధానంతో భారత్ మళ్లీ విశ్వగురువుగా అవతరిస్తుందంటున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త చదువులకు శ్రీకారం

జాతీయ విద్యావిధానం- ౨౦౨౦ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ విధానపత్రం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే.. అసలు ఈ పత్రంలోని కీలక అంశాలేంటి? ప్రస్తుత విద్యావ్యవస్థ లోని లోపాలకు అది ఎలాంటి పరిష్కారాలు సూచించింది? దీని అమలు కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఈ విషయాలన్నింటినీ ఓమారు పరిశీలిద్దాం!

- విఠపు బాలసుబ్రహ్మణ్యం,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మభాషలో చదువు.. ప్రాథమిక హక్కు!

అమ్మ భాషలో విద్యాబోధన, మానవ సమాజ వికాసానికి జీవనాడి. అయినా సరే, తెలుగునాట ఆంగ్లంలో విద్యాబోధనకే పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆమేరకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధనను నిరాకరించే అధికారం అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలు ఎలా ఉన్నాయి? న్యాయస్థానాలు తీర్పులు ఏం చెబుతున్నాయి? 

- మాడభూషి శ్రీధర్,
కేంద్ర మాజీ సమాచార కమిషనర్, న్యాయ విద్యావేత్త, హైదరాబాదు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి రాష్ట్రమూ స్వాగతించాలి
పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకుని, ఆ అమ్మభాషే భూమికగా ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) ఉపకులపతి స్థాయికి ఎదిగారు ఆచార్య ఏర్పుల సురేష్ కుమార్. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సభ్యుడిగా నియమితులైన ఈయన, మన చుట్టూ మాట్లాడే భాషలో విద్యాబోధన జరిగితేనే పిల్లల మేధో వికాసం బాగుంటుందని అంటున్నారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని కూలంకషంగా పరిశీలించిన ఆచార్య సురేష్ తో 'తెలుగు వెలుగు' ముఖాముఖి... 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ బడులా? మాథ్యమమా? ఏది అసలు సమస్య!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎమ్మెస్ నం. ౮౧, ౮౫ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అదీ ౨౦౨0 ౨౧ విద్యా సంవత్సరం నుంచే అమలవ్వాలని హుకుం జారీ చేసింది. అసలు ఎలాంటి ప్రజాస్వామిక చర్చ, నిపుణుల అభిప్రాయ సేకరణ లాంటివి లేకుండా నెత్తిన పిడుగు పడ్డట్టు వచ్చిందీ వార్త. ఎందుకు ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది? ఇందులో ఉన్న లాభనష్టాలేంటి? విద్యార్థులకు ఇది ఎంత వరకు ప్రయోజనం? భాషకు, మాధ్యమానికి సంబంధం ఏంటి? 

- నందివెలుగు ముక్తేశ్వరరావు,
విశ్రాంత ఐఏఎస్ అధికారి, హైదరాబాదు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాతృభాష.. ఆత్మ భాష!

మాతృభాషలో చదువు సులభం. ముఖ్యంగా మాతృభాషని అభిమానించే వారు ఆ మాధ్యమాన్నే కోరుకుంటారు. కాని వృత్తిపరంగా చూస్తే, ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వారికి అధిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది మంచిదన్నది కాస్త జటిలమైన సమస్యే. ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్లి మంచి చెడ్డలు విచారిద్దాం.. 

- ఆచార్య వి.శ్రీనివాస చక్రవర్తి,
డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐఐటీ మద్రాసు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటికైనా పట్టించుకుంటారా?

తెలుగుభాష తియ్యదనం తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువ్వు మరచినట్టురా ఇది మరవబోకురా... పదిహేడేళ్ల కిందట విడుదలైన ఓ చలనచిత్రం కోసం సినీగేయ రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాట నేటి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఆంధ్రకు మంచి సందేశం. 

- కత్తి నరసింహారెడ్డి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాతృభాషే జ్ఞానవారథి

“మాతృభాషలో విద్యాబోధన చేసినప్పుడు పిల్లలకు త్వరగా ఆయా సబ్జెక్టుల మీద లోతైన అవగాహన ఏర్పడుతున్నట్టు మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలు గుర్తించాయి. దీన్ని కొంత లోతుగా అర్థం చేసుకోవాలంటే మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని అంశాలను పరిశీలించాలి. పిల్లల్లో జ్ఞాన సముపార్జన ఎలా జరుగుతుందనేది శాస్త్రీయంగా చూడాలి” అంటున్నారు ప్రముఖ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డా||దేశినేని వెంకటేశ్వర రావు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతకు సంబంధించి ఆయన చెబుతున్న కీలక విషయాలివి!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువే బ్రహ్మమూ... సర్వమూ!

గురు భావన, గురుస్తుతి భౌతికమైనది కాదు. అది అనిర్వచననీయ భావప్రసరణ. కొలవలేనిది. వెలకట్టలేనిది. గురుముఖత నేర్చుకున్న చదువుకి రాణింపు ఉంటుంది. అది మనిషి జీవితంలో ఉత్తరోత్తరా బలవత్తరమై మానవ మనుగడకు ఒక ఆలంబన అవుతుంది. కాలమెంత మారుతున్నా జీవన విలువలకీ, నైపుణ్యాలకి పెట్టనికోటలా ప్రకాశించే గురువుల ప్రభావానికి కాలం శిరసొంచుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతికొక సుస్థిరతనీ, పుష్టిని కలిగించే ఉపాధ్యాయుల ఉన్నతిని మననం చేసుకుందాం!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పరభాషలో బోధన పంటి కింది రాయి!

“తెలియని భాషలో పాఠశాల విద్యను ప్రారంభించే వారికంటే మాతృభాషలో చదువుకు నాంది పలికే పిల్లలు విద్యా నైపుణ్యాలను ఒడిసిపట్టడంలో ముందుంటారు. చదువు పూర్తయ్యే వరకూ ఆ స్థాయిలోనే కొనసాగుతార”ని ఘంటాపథంగా చెబుతోంది యునెస్కో. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిన 150కి పైగా అధ్యయనాలు యునెస్కో మాటలకు ఆధారాలను అందిస్తున్నాయి. అలాగే, మాతృభాషలో చదువుకుంటున్న పిల్లలు బడి మానేయట్లేదని అభివృద్ధి చెందుతున్న 22 దేశాల్లో 160 భాషా సమూహాలపై చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగును తీసేస్తే నష్టమే!

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు పాలకులు ఉద్యుక్తులవుతున్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థించే వారు వివిధ వాదనలు చేస్తున్నారు కానీ, పిల్లల సమగ్రాభివృద్ధికి ఏ మాధ్యమం బాగా అక్కరకొస్తుందన్న విషయాన్ని దాటేస్తున్నారు. అంతేకాదు, ఆంగ్ల మాధ్యమంలో బోధించగలిగిన ఉపాధ్యాయులెంతమంది ఉన్నారన్న విషయాన్నీ వారు విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ 'విద్య-మాధ్యమం' అంశాన్ని పిల్లలు- ఉపాధ్యాయుల కోణంలోంచి పరిశీలిస్తే నిగుదేలే విషయాలివి...

- యం.ఎస్.కె.కృష్ణ జ్యోతి,
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రముఖ కథారచయిత్రి, విజయవాడ

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పథం మారాలి!

రాబోయే తరాలకు చదువులు ఏ భాష ద్వారా నేర్పాలి? మన లాంటి దేశంలో తప్ప మరే సర్వ స్వతంత్ర, ప్రజాస్వామిక దేశంలోనూ ఈ అంశాన్ని తలలు బద్దలు కొట్టుకునే సమస్యలాగా ఇంతగా చర్చనీయాంశం చేసుకోరేమో! తెలిసిన విషయ పరిజ్ఞానం ద్వారా తెలియని విషయాలను తెలుసుకోవటమనే పద్ధతి అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ అమలవుతూ ఉన్న సంగతేనని అందరికీ తెలిసిందే! అయినప్పటికీ, శతాబ్దాలు దొర్లిపోతున్నా మనం ఈ అంశాన్ని ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం. 

- దివికుమార్,
అధ్యక్షులు, జనసాహితి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మభాషలో చదువే అత్యుత్తమం

అమ్మభాషలో చదువే భవితకు వెలుగుబాట అని కె.కస్తూరి రంగన్ కమిటీ మరోసారి విస్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఈ మధ్యనే తన నివేదికను సమర్పించింది. అయితే, విద్యకు సంబంధించి గతంలో నియమించిన చాలా కమిటీలు మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యాన్ని తెలియజెప్పాయి.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన భాష మనకుండాలి!

మన సమాజంలో ఆంగ్లం తెలిసిన వర్గాలు ఒకవైపు, ఆ భాష రాని కోట్లాది సామాన్యులు ఒకవైపు అన్న విభజనను ఇక మనమెంత మాత్రమూ సహించలేం. మన భాష మనకు ఉండాల్సిందే. - ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలివి..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అభివృద్ధికి ఆరోప్రాణం

నూతనంగా వెలువడుతున్న శాస్త్ర, సాంకేతిక, పరిశోధన పదజాలాన్ని సమర్థంగా అమ్మభాషలోకి తర్జుమా చేసుకుంటే విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషా మాధ్యమంలోనే విద్యాబోధన చేయవచ్చు. ఈ విషయాన్నే అనేక దేశాలు రుజువు చేస్తున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్ని కోర్సుల్ని అమ్మభాషలోనే అందిస్తూ అభివృద్ధిలో అవి మేటిగా దూసుకుపోతున్నాయి. ప్రపంచం మొత్తమ్మీద తలసరి ఆదాయం(జీడీపీ)లో ముందువరసలో ఉన్న దేశాలన్నీ మాతృభాషలో చదువుకే ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ఆయా దేశాల విద్యావ్యవస్థలు, వాటిలో అమ్మభాషలకు దక్కుతున్న అగ్రతాంబూలాల పరిచయమిది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పరభాషతో ప్రమాదమే!

ఆంగ్ల మాధ్యమంలో చదువుల వల్ల అంతా మేలే అని చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు! పరభాషలోనైనా సరే, పసివాళ్లు ఏ ఇబ్బందీ లేకుండా చదువుకుంటారని వాళ్లు నమ్మబలుకుతున్నారు. వారి వాదనల్లో వాస్తవముందా అంటే లేదు అంటున్నారు అపార అనుభవజ్ఞులైన చైల్డ్ సైకాలజిస్ట్ డా|| చిట్టి విష్ణుప్రియ. పరాయిభాషలో విద్యాబోధన వల్ల చిన్నారుల సహజ నైపుణ్యాలు దెబ్బతింటాయంటూ ఈ విషయానికి సంబంధించి ఆవిడ 'తెలుగువెలుగు'తో పంచుకున్న అభిప్రాయాలివి..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆత్మగౌరవ పతాకలు

“తెలుగులో నవ్యరీతులకు, నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్యకళ నవీనం. కావ్య ఇతివృత్తాలు భారతీయం” అని గురజాడ తన గురించి చెప్పుకున్నారు. అంతకు ముందు వరకూ కావ్యాల్లో రాజులే నాయకులు. గురజాడ ఆ సంప్రదాయాన్ని చెరిపేసి సమకాలీన సమాజంలోని సామాన్య ప్రజలనే తన కావ్యనాయకులుగా ప్రతిష్ఠించారు. 'కన్యక' లో కన్యక, 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ'లో పూర్ణమ్మలు మామూలు స్త్రీలే. గురజాడ జయంతి (సెప్టెంబరు 21) సందర్భంగా ఈ రెండు పాత్రల విశిష్టతలేంటో చూద్దాం! 

- మందరపు హైమవతి
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫలితాలు ప్రశ్నార్థకమే!

ప్రాథమిక విద్యలో మాతృభాషను బోధనా మధ్యమంగా వినియోగించాలన్న కొత్త జాతీయ విద్యావిధానం సూచన మంచిదే. అయితే, భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడంలో ఈ విధానం విఫలమైందన్నది ఒక వాదన. దీనికి సంబంధించిన ఈ పరిశీలన.. నూతన విధానం మీద జరుగుతున్న విస్తృత చర్చలో ఓ భాగమే! 

- డా॥ సామల రమేష్ బాబు,
జాతీయ అధ్యక్షులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆత్మాభిమాన బావుటా.. ఫ్రెంచ్!

“బ్రిటన్ వారు సంపదకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే, ఫ్రాన్స్ దేశస్థులు తమ మాతృభాషకు గుండెల్లో సుస్థిర స్థానం కల్పించారు".. ఆంగ్లో ఫ్రెంచ్ రచయిత ఆండ్రూ గార్లిక్స్ చెప్పిన ఈ మాటలు ఫ్రెంచ్ వారి భాషాభిమానానికి నిదర్శనం. ఆంగ్లీకరణ అనే పెను విపత్తు తమ దేశంలోకి అడుగు పెట్టకుండా అమ్మభాషాభిమాన కంచె ఏర్పాటు చేసుకుని గట్టిగా ప్రతిఘటిస్తోంది ఫ్రాన్స్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ భాషను పటిష్టం చేసుకుంటూ, నూతన తరానికి సమర్థంగా దాన్ని చేరువ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందీ దేశం. 

- అపర్ణ శంకర్
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కథలు

50 అంగుళాల జీవితం

ఓ మాయ.. మార్కెట్ మాయ.. మనుషులను వినియోగదారులుగా మాత్రమే చూసే.. చూపించే పెనుమాయ! అందులో ఇరుక్కున్న కోట్లాది మధ్యతరగతి జీవుల్లో భరణి ఒకడు. ఇంతకూ అతని కథేంటో చూద్దామా!

- కె.ఎల్.సూర్య
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వొక అనుబోగము!

ఆ టెంకాయ మాన్లో దయ్యాలుండియని ఊర్లో కతలు కతలు. ఆ పిల్లోడు తప్పక అటు పోవాల్సొచ్చె. బయంబయంగా అడుగులు యేస్తావుంటే, సెట్టు మింద నుంచి ఏదో దబ్ మని పడె! అంతలోనే ఒక ఆకారం అటువైపు రాబట్టి... తర్వాత ఏమాయె? 

- సడ్లపల్లె చిదంబర రెడ్డి 
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అల్లరి

రాజబాబంటే సుకుమారికి జాలితో కూడిన అభిమానం! అయ్యగారి 'కష్టానికి' వాట్సప్ లోనే 'కన్నీరు కారుస్తుందామె! రమణికి మాత్రం భర్తమీద ఎక్కడాలేని అనుమానం! ఇది కాస్తా ఒక రోజు పెద్ద అల్లరికే దారితీసింది! 

- సత్యవోలు కిరణ్ కుమార్
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మైదానం

ఎన్నేళ్లు గడచినా బాల్య జ్ఞాపకాల పరిమళం జీవితాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది. గౌతమ్ కూడా ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తూనే ఊరికి బయల్దేరాడు. అక్కడ తను పొందిన అనుభూతులేంటి? 
 
- కడిమిచర్ల రామమనోహర్
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెక్కలు తొడిగీ....

ఆశలు ఫలించిన క్షణం ఆమెలో ఆనందం లేదు. తన చిరకాల కోరిక ప్రాణం పోసుకుని తన కళ్ల ముందుకు వచ్చినా ఆ తల్లికి ఆనందాశ్రువులకు బదులు కన్నీళ్లే వస్తున్నాయి. ఎందుకు? ఆ వేదనను ఆమె తట్టుకుందా?

- కె.గీత
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

"అమ్మా! దేవుడికి మంచినీళ్లు కావాలంట..."

పండగరోజు కావడంతో ముందే లేచి స్నానం చేసి పూజ కోసం ఫలహారాలు సిద్ధం చేసే పనిలో పడ్డాను. పనంతా అయిన తర్వాత పిల్లలను నిద్రలేపి తలస్నానం చేయించి పూజ చేసుకోవడానికి కూర్చున్నాను. దేవుడికి ప్రసాదం పెట్టే సమయానికి నా చిన్న కూతురు పూజామందిరంలోకి వచ్చింది. “అమ్మా! నేనొకటి అడుగుతాను చెప్తావా” అని అడిగింది. చెప్పక తప్పుతుందా అన్నట్లు 'ఊ' అన్నాను...

- బి.వరలక్ష్మిబోస్,
తెలుగు ఉపాధ్యాయురాలు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురుభ్యోనమః (ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ)

రాధాకృష్ణ మాస్టారుకి స్కూల్లో ఎవరైనా గుడ్ మార్నింగ్ అంటే చాలు కనీసం అర్ధ గంట సేపు క్లాస్ ఇచ్చేవారు తెలుగు భాష గొప్పదనం గురించి. ఈ సంగతి నాకింకా గుర్తుంది సార్ అందుకే తెలుగులోనే పలకరించాను మిమ్మల్ని...

- ఎం.ధనలక్ష్మి
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ మలిసంధ్యా కాంతుల్లో... (ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ)

“ఎలా ఉన్నావ్ తాతా!” ఇలా.. ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా ఏంటో! నాకు తృప్తిగా అనిపించదు. నాకు బదులిస్తూ నీ గొంతులో ఒలికే పదాల కంటే నీ మనసు నుంచి వచ్చిన అక్షరాలను చూస్తేనే నాకు సంతృప్తి. సెలవులకి ఇంటికొచ్చినప్పుడు నేను రాసిన ఉత్తరాలను మళ్లీ నాతోనే చదివిస్తూ, నువ్వు రాసినవి చదివి వినిపిస్తూ ఆనందించే వాడివి. ఓసారి నువ్వు రాసిన ఉత్తరం ఒకటి పోస్ట్ మాస్టారు పోగొట్టాడని తెలిసి... 

- తుపాకుల సాయిచరణ్
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని ఆసక్తికర శీర్షికలు

మాటకట్టు 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమస్యా వినోదం 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భాషాయణం

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింజిరి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొండ అద్దమందు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సప్ కథ

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనక్కి ...

మీ అభిప్రాయం