అలుపెరగని అక్షర శ్రామికుడు

  • 148 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రామకృష్ణ

  • కర్నూలు

చైతన్య రవళి’ కవితా సంపుటి, హనుతత్త్వ చంద్రిక, వ్యాసమణిహారం, శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి జీవిత చరిత్ర, కర్నూలు జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్ర (అముద్రితం) తదితర రచనలు చేసిన హీరాలాల్‌... కర్నూలు సాహితీ సిగలో మెరిసే జాబిల్లి. జిల్లా రచయితలందరినీ ఒక్కతాటి మీదకి తెచ్చి, రచయితల సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1970లో ‘కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం’ ఏర్పడినప్పటి ఉంచి తను మరణించేంత వరకూ (ఆగస్టు, 2016) అందులో వ్యవస్థాపక సభ్యుడిగా, అధ్యక్షుడిగా కొనసాగారు. జిల్లా ఇతిహాస పరిశోధక సమితి (ఇన్‌టాక్‌), జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని తెలుగు కళాసమితి, గ్రంథాలయ సంస్థ, అక్షరాస్యతా సమితి, దక్షిణభారత హిందీమహాసభల్లో బాధ్యతలు వహించారు. అధికార భాషా సమీక్షా సంఘం సభ్యులుగానూ సేవలందించారు. 
‘కందనవోలు సాహితీ రత్న’గా కీర్తిగాంచిన హీరాలాల్‌ స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు గ్రామం. జూన్‌ 1, 1936న హీరాబాయి, నాగోజీరావులకు జన్మించారు. కర్నూలు పురపాలక ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. విద్యార్థి దశలోనే  ‘ఆగుమో స్వామీ..’ అంటూ ‘గుహుని వాంఛ’ పద్యాలు రాసి పండితుల మెప్పు పొందారు. తర్వాత కర్నూలు జిల్లాలోనే స్థిరపడ్డారు. స్వామి వివేకానంద సంస్కృత ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-1 హిందీ ఉపాధ్యాయులుగా సేవలు అందించారు. తాడికొండ, కిన్నెరసాని (ఖమ్మం) గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తించారు. మంచి వక్త అయిన ఆయన ఆకాశవాణిలో సాహితీ ప్రసంగాలెన్నో చేశారు. కర్నూలు జిల్లాలో అనేక సాహిత్య సభలూ, సమావేశాలూ నిర్వహించారు. సినారె, అక్కినేనిల చేతుల మీదుగా రసమయి సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం