తెలుగువెలుగు ఆగస్టు సంచిక విశేషాలు

  • 1375 Views
  • 112Likes
  • Like
  • Article Share

తెలుగువెలుగు మాసపత్రిక ఆగస్టు నెల నుంచి ఈ-పత్రికగా రూపుదిద్దుకుంది. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే ఈనాడు.నెట్‌లో అందుబాటులో ఉంటుంది. పాఠకుల సౌలభ్యం కోసం ఆగస్టు సంచికలోని విశేషాలను మీకందిస్తోంది తెలుగువెలుగు.ఇన్‌. మీరు teluguvelugu.eenadu.net ‌లో ముందుగా రిజిస్ట్రర్‌ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్‌ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.

ముఖాముఖీలు

సాహిత్యమే నా బలం : భాస్కరభట్ల రవికుమార్‌

తెలుగు సినీ సాహిత్యంలో అటు హుషారు గీతాలతో, ఇటు భావాత్మక పాటలతో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న రచయిత భాస్కరభట్ల రవికుమార్‌. ‘బొమ్మను గీస్తే నీలా ఉంది...’ (బొమ్మరిల్లు), ‘పెళ్లెందుకే రమణమ్మా’ (బంపర్‌ ఆఫర్‌), ‘గాల్లో తేలినట్టుందే గుండె జారినట్టుందే’ (జల్సా), ‘కృష్ణానగరే మామ’ (నేనింతే) ఇలా మూడొందల పైచిలుకు గీతాలు భాస్కరభట్ల కలం నుంచి జాలువారాయి. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి.. పూర్తి ముఖాముఖీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నన్ను ‘ఆంధ్రాశరత్‌’ అన్నాడాయన! : అక్కిరాజు రమాపతిరావు
శతాధిక గ్రంథ రచయిత అక్కిరాజు రమాపతిరావు. ముఖ్యంగా జీవిత చరిత్రల రచనలో ఆయనది అందెవేసిన చెయ్యి. కథలు, నవలల నుంచి సాహితీ పరిశోధన, విమర్శల వరకూ విభిన్న ప్రక్రియల్లో తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన ఘనత ఆయన సొంతం. అరున్నర దశాబ్దాలుగా తెలుగు అక్షరాలతో మమేకమై ప్రయాణిస్తున్న అక్కిరాజుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి.. పూర్తి ముఖాముఖీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాఠ్యపుస్తకాలు వస్తాయో లేదో! : రాళ్లపల్లి సుందరరావు
వివిధ రాష్ట్రాల్లోని తెలుగువాళ్లందరినీ ఏకతాటి మీదకు తెస్తున్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అయిదో మహాసభలు జూన్‌ 28న అంతర్జాల వేదికగా జరిగాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో మొదటిసారి సభల్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందరరావుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి.. పూర్తి ముఖాముఖీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ్యాసాలు

బలరామ రాజ్యం - కామ్రేడ్‌ వితండం 
గాంధీ పుట్టిన దేశమా ఇది! నెహ్రూ కోరిన సంఘమా ఇది! సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా అని జనాదరణ పొందిన సినిమా పాట ఉంది. ఇప్పటికీ ఈ పాట ఆగలేదు. ఆ బాట రాలేదు...  పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ తుహినాద్రి పైనే తాచు పామురా! - డా।। ఎం.కనకదుర్గ 
మంచుకొండల్లో మంటలు రాజుకున్నాయి. హద్దుమీరిన చైనా స్వార్థానికి సరిహద్దుల్లో నిత్యసంఘర్షణలు జరుగుతున్నాయి. ముందుండి పోరాడుతున్న సైనికులు అమరవీరులవుతున్నారు. వర్తమానంలోని ఈ అలజడులు, మర్చిపోలేని ఓ గతాన్ని స్ఫురణకు తెస్తున్నాయి. దాదాపు అరవై ఏళ్ల కిందటి భారత్‌- చైనా యుద్ధ కాలంలో సామాన్యులకు ధైర్యంతో పాటు దేశభక్తినీ నూరిపోశారు తెలుగు కవులు. ఆనాటి ఆ అక్షరఫిరంగుల సమరభేరీ నాదాలు ఈనాటికీ స్ఫూర్తిప్రబోధాలే! పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మునుముకో ముద్దు! - డా।। కాలువ మల్లయ్య 
ప్రతి భాషా సమాజంలోనూ ఆ భాషకే ప్రత్యేకమైన పలుకుబడులుంటాయి. వీటినే నుడికారాలనీ, జాతీయాలనీ అంటారు. వీటి వాడకంతో ఆయా రచనలకు అద్భుత అందాన్ని తీసుకురావచ్చు. భాషలకు ఇవి ప్రత్యేక సంపదలు. తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29- గిడుగు జయంతి) సందర్భంగా తెలంగాణ పలుకుబడుల్లోని సౌందర్యం, అర్థగాంభీర్యత, అల్పాక్షరాల్లో అనల్పార్థ భావనల పరిచయమిది! పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ దార్శనికుడు - కల్లూరి భాస్కరం 
పాములపర్తి వెంకట నరసింహారావు అంటే దేశం తలరాతను మార్చిన పరిపాలనాదక్షులు మాత్రమే కాదు! సాహితీక్షేత్రంలో బంగారు పంటలు పండించిన అక్షర హాలికులు కూడా. రాజకీయాల్లో తీరికలేకపోయినా అమ్మభాష, రచనలకు ఎప్పుడూ చేరువలోనే ఉన్న పీవీ.. అచ్చతెలుగు ఠీవీ! ప్రసిద్ధ పాత్రికేయులు, సాహితీవేత్త కల్లూరి భాస్కరానికి ఆయనతో సుదీర్ఘ సాహితీ అనుబంధముంది. పీవీ శతజయంతి సందర్భంగా ‘భాషా, సాహిత్యాల్లోనూ ఆయన ‘‘లోపలి మనిషి’’ అంటూ కల్లూరి చెబుతున్న విశేషాలివి.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాహితీస్పర్శకు అంతర్జాల వారధి
ఈ శతాబ్దంలోనే ప్రపంచం కనీ వినీ ఎరుగని ఉపద్రవం... కరోనా. ఈ విపత్తు అందర్నీ నాలుగు గోడలకే పరిమితం చేసింది. మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం పెంచింది. ఫలితంగా తెలుగునాట నిత్యం మూడు సభలు, ఆరు సమావేశాలుగా సాగే సాహితీ కార్యక్రమాలకు కూడా ‘లాక్‌డౌన్‌’ తప్పలేదు. అయితే, అందివచ్చిన సాంకేతికత ఆలంబనగా తెలుగు భాషా సాహితీ పరిమళాలు ప్రపంచవ్యాప్తంగా గుబాళిస్తున్నాయి. అంతర్జాల వేదికగా ఆయా సభలు, సమావేశాలు నిరాఘాటంగా సాగుతున్నాయి! పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంస్కరణ కవితా విపంచి - ఎస్‌.ఎన్‌.చారి
మనిషిలోని నిజమైన మనిషిని తట్టి లేపుతూ సమాజంలో మానవతా దీపాన్ని వెలిగించేలా నిత్య అక్షర ప్రవాహమై సాగుతున్న కవి డాక్టర్‌ తిరునగరి రామానుజయ్య. వచన కవిత్వం, పద్యం, గేయం, విమర్శ ఏది రాసినా మనసుల్ని విశాలం చేసే లక్ష్యంతో సాగుతుంది ఆయన కలం. మహాకవి దాశరథితో రెండు దశాబ్దాలకు పైగా సన్నిహితంగా మెలిగిన తిరునగరిని ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ‘దాశరథి పురస్కారం’ వరించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మ భాషకు ఆలంబన
మాతృభాషలో విద్యాబోధన సాగినప్పుడే విద్యార్థి సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న నిపుణుల మాటలకు గట్టి ఊతం లభించింది. ఇక నుంచి అయిదో తరగతి వరకు అమ్మభాషలో విద్య ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొత్త జాతీయ విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుత చదువుల విధానంలో భారీ మార్పులు జరగనున్నాయి... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు వంటలు.. కరోనాకి కళ్లాలు  - డా।। జి.వి.పూర్ణచందు
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు? అలాగే, జబ్బులొచ్చాక ఆస్పత్రుల చుట్టూ తిరగడం కంటే అసలు ఏ వ్యాధులూ దరిజేరకుండా చూసుకోవడం ఉత్తమం కదా! ప్రపంచం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కొవిడ్‌-19నూ కొన్ని ముందుజాగ్రత్తలతో అడ్డుకోవచ్చు. ముఖ్యంగా బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యం, ఆయుర్వేద గ్రంథాల్లో ఉట్టంకించిన కొన్ని వంటకాలతో రుచికి రుచే కాదు, బోల్డంత శక్తినీ అందిపుచ్చుకోవచ్చు... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘భావి నా ఉజ్జ్వల నేత్రం’ అన్న కవి?
‘‘దినదినము వర్ధిల్లు తెలుగుదేశం/ దీప్తులను వెదజల్లు తెలుగుతేజం/ తేనెకన్నా తీయనిది తెలుగుభాష/ దేశ భాషలందు లెస్స తెలుగు భాష’’ అన్నారు వేటూరి సుందరరామమూర్తి. పరిశోధనాభిలాష ఉన్నవారి కోసం ఆర్‌ సెట్‌ నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని మాదిరి ప్రశ్నలివి..! పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు చలనచిత్ర చరిత్రకారుడు - ఓలేటి శ్రీనివాసభాను
ఆయన,  తెలుగు సినిమా ఇంచు మించు ఒకే ఈడు వాళ్లు! కలిసి నడిచారు.. కబుర్లు కలబోసుకున్నారు. కదిలే బొమ్మలకు కళ్లప్పగించిన అభిమాన ప్రేక్షకుడిగా మొదలైన ఆయన ప్రయాణం- రంగస్థలం ద్వారా సాగి, సినిమా రంగంలో స్థిరపడింది. తెర వెనక, తెర పైన రకరకాల విభాగాల్లో నడిపించింది. వాటిలో- గాత్రదానం, సహాయ దర్శకత్వం, నటన, కథ, మాటలు, ప్రచారం,  నిర్మాణ నిర్వహణ లాంటివి ఒక పార్శ్వమైతే, సినిమా పాత్రికేయం, సంపాదకత్వం, వెండి తెర నవల, సినిమా చరిత్ర రచనలు రెండో పార్శ్వంలో కనిపిస్తాయి. తెలుగు సినిమాకు సమవయస్కుడిగా రావి కొండలరావు తన జ్ఞాపకాల్ని అక్షరబద్ధం చేసి భావితరాలకు అందించి వెళ్లిపోయారు. అందులో ఆయన స్థానం విశిష్టం.. ముద్ర విలక్షణం... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కథలు

అంతులేని క(వ్య)థ - వరుణ్‌ పారుపల్లి
ఆమెకు క్షణం తీరిక ఉండదు. అలాగని దమ్మిడీ ఆదాయమూ ఉండదు. పైగా ఆమె చేతలకు అతని మతిపోతూ ఉంటుంది. అష్టకష్టాలేంటో అతనికి తెలియదు కానీ, అంతకుమించిన బాధలే పడుతున్నాడు ఆమెతో! చూద్దామా వీళ్లిద్దరి కథేంటో..! పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వర్షం కురిసిన రోజు - బొడ్డేడ బలరామస్వామి
చిలకాగోరింకల్లాంటి వాళ్ల మధ్యలోకి ఓ పాము వచ్చింది. సంసారాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఒకరికి ఒకరు కాకుండా పోయిన ఆ జంటకు కన్నీరే నేస్తమైంది. ఏళ్లు గడచిపోయాయి. మరి వాళ్లిద్దరూ ఏమయ్యారు? పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆఅమ్మే మరణిస్తే... - డా।। ఎ.రవీంద్రబాబు
గంగ తలనుండి కావేరి కాళ్లదాక వెలిగె దిఙ్మోహనమ్ముగా తెలుగుఠీవి తమ్ముడా! మాయనిత్తువే తల్లివన్నె? చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?  - రాయప్రోలు... పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మేనమామ - ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు
ఆ కుర్రాడికి బాగా చదువుకోవాలని ఆశ. కానీ, డబ్బు లేదు. మేనమామను అడిగితే ఇస్తాడులేరా అంది అమ్మ. అంతలో ఈ కుర్రాడు మావకూతుర్ని ఆటపట్టించాడు. అత్తొచ్చి నానాతిట్లూ తిట్టిపోయింది. తర్వాత ఏమైంది? పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరచేతిలో హంతకుడు - పి.వి.ఆర్‌.శివకుమార్‌
ఏవేవో ఆలోచనలతో ఆవిడకు రోజూ రాత్రి నిద్రపట్టదు. పైగా తనకు ‘దొంగలు’ కనిపిస్తుంటారు కిటికీ పక్కన. ఆ రాత్రి కూడా ఒకడు ప్రత్యక్షమయ్యాడు. భర్తను లేపింది. అతను కత్తిపట్టుకుని బయల్దేరాడు.. మరి తర్వాత? పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లాక్‌డౌన్‌లో ప్రేమ - రమేశ్‌ చెప్పాల
కాలం... మొండి పట్టుతో ఉన్న మదిని మాయలా కరిగిస్తుంది. మస్తిష్కంలోని అహాన్ని మంత్రం వేసినట్లు తొలిగిస్తుంది. అంచనాల్ని తలకిందులు చేసి కొత్త తీరాలకు చేరుస్తుంది. వెంకట్, సౌమ్యల విషయంలోనూ ఇదే జరిగింది! పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొంగామియా పిన్నాటా - బాడిశ హన్మంతరావు 
ఆ పిల్లాడు ఏదో చేశాడు. ఉపాధ్యాయుడు అరిచాడు. పిల్లాడి బుర్రలో ఏవేవో పథకాలు. వాటిని చూసి భయపడుతోంది చిట్టి పొంగామియా. చివరికి భయపడినంతా అయ్యిందా? మీరే చూడండి! పూర్తి కథ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని ఆసక్తికర శీర్షికలు

సమస్యా వినోదం
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖలు
నువ్వే.. నువ్వే.. అంతానువ్వే
ఆ చూపులో ఎన్నెన్ని సూర్యోదయాలో.. 

భాషాయణం 
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింజిరి
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొండ అద్దమందు
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లఘుచిత్ర లహరి
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనక్కి ...

మీ అభిప్రాయం