తెలుగువెలుగు అక్టోబరు సంచిక విశేషాలు

  • 1064 Views
  • 155Likes
  • Like
  • Article Share

అమ్మభాషలో విద్యాబోధనే... భవితకు మేలు అని వివరిస్తూ, అందులో చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగినవాళ్లు, తెలుగు మాధ్యమం కోసం న్యాయస్థానాల్లో పోరాడుతున్న వాళ్ల ప్రత్యేక వ్యాసాలు... ఇంకా ప్రముఖుల ముఖాముఖిలు, వ్యాసాలు, కవితలు, ప్రేమలేఖలు మరెన్నో శీర్షికలతో మీ ముందుకు వచ్చింది తెలుగువెలుగు అక్టోబరు సంచిక... 

      మీరు teluguvelugu.eenadu.net ‌లో ముందుగా రిజిస్ట్రర్‌ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్‌ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.

ఐనో, యూనో అంటే చాలా!! : బారు శ్రీనివాసరావు
‘‘సబ్జెక్టు కావాలి గానీ భాష నేర్చుకోవడం ఎందుకండీ.. మంచి ఉద్యోగం సాధించాలి కానీ, కవిత్వాలు చెప్పరు కదా అనే వారు ఎక్కువ. కానీ పిల్లలకు మాతృభాషపైనే పట్టు లేకపోవడం, వ్యాసరచన- వక్తృత్వం లాంటి పోటీల్లో పాల్గొనకపోవడంతో తమ భావాలను సూటిగా, స్పష్టంగా ఎదుటివారికి వ్యక్తీకరించలేకపోతున్నారు. ఇది వారి వ్యక్తిగత, వృత్తిజీవితంపైనా పడుతుంది’’ అంటున్నారు క్యాప్‌జెమినీ క్లౌడ్‌- ఇన్‌ఫ్రా ఉత్తర అమెరికా విభాగం ప్రెసిడెంట్‌ బారు శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన ఆయన ఇంటర్‌ వరకూ తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. మాతృభాషలో చదువుకున్నవారు జీవితంలో ఎదగలేరనే వాదనలో వాస్తవం లేదంటూ ‘తెలుగువెలుగు’తో శ్రీనివాసరావు పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు ఆయన మాటల్లోనే..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మభాషలకి మంచి రోజులు: ఎ.సూర్యప్రకాశ్‌ 
భారత్‌లో ఆంగ్లం ఆధిపత్యం ఎందుకు పెరిగింది? జాతి ఐక్యతలో మాతృభాషల ప్రాధాన్యం ఏంటి? జాతీయ నూతన విద్యా విధానం 2020 ఏం చెబుతోంది? ఈ అంశాల మీద అనుభవజ్ఞులైన పాత్రికేయులు, ప్రసార భారతి మాజీ అధ్యక్షులు ఎ.సూర్యప్రకాశ్‌ ‘తెలుగువెలుగు’కు అందించిన ప్రత్యేక వ్యాసం..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మేధావుల మౌనం ప్రమాదకరం: డా।। గుంటుపల్లి శ్రీనివాస్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్బంధ ఆంగ్ల మాధ్యమం మీద న్యాయపోరాటంలో ఒక వైద్యుడి సామాజిక బాధ్యత ఉంది. భావి తరాలకు తీరని అన్యాయం చేసే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏలూరుకు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మాధ్యమం విషయంలో పోరాటానికి ప్రేరణ ఏంటి? ఆంగ్ల బోధన పరంగా మన దగ్గర ఉన్న లోపాలేంటి? మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యం ఏంటి? తదితర అంశాల మీద ఆయన ‘తెలుగువెలుగు’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాధ్యమం పేరిట మభ్యపెట్టడమే: సుధీష్‌ రాంభొట్ల  
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్బంధ ఆంగ్ల మాధ్యమ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తూ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేసిన వారిలో ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభొట్ల ఒకరు. మాధ్యమం పేరుచెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఓట్లు దండుకోవాలని చూడటం సరికాదని ఆయన అంటున్నారు. అమ్మభాషను విస్మరిస్తే ప్రపంచంతో పోటీ పడటం సాధ్యం కాదని చెప్పే రాంభొట్ల ‘తెలుగువెలుగు’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ్యాసాలు

అమ్మభాషే సంజీవని - గాంధీజీ
స్వేచ్ఛా భావనల్ని అర్థం చేసుకోవడానికీ, ఆలోచనల్లో స్పష్టత రావడానికీ ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరి అనుకోవడమే మన దేశాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద మూఢ నమ్మకం. 
- వివిధ సందర్భాల్లో మహాత్ముడు చెప్పిన మాటలు, ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో ఆయన రాసిన వ్యాసాల్లోంచి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మా
శరణము కోరుతు అమ్మా భవానీ!  
నీ దరినుంటే తొలగు భయాలు
నీ దయ ఉంటే కలుగు జయాలు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమ్మోహన గానం... సమబాహు త్రిభుజం - ఓలేటి శ్రీనివాసభాను  
గాయకులకు భాషపట్ల అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి.. దాన్ని ఆనందించాలి. ఆ ఆస్వాదనలోంచి పాటను బయటికి తీసుకురావాలి. అప్పుడే ఆ పాట చాలా అందంగా తయారవుతుంది. ఒక పాట కోసం సంగీత దర్శకులు, రచయితలు చాలా కసరత్తు చేస్తారు. అలా పాటంతా సిద్ధమైన తర్వాతే మా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత గాయకులు తమ వంతు కసరత్తు చేసి పాడాలి. ఒప్పుకున్న ప్రతి పాటకూ ఇలాగే న్యాయం చేయాలి. - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మభాషే ఆలంబన - డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు 
అమ్మభాషా మాధ్యమంలో చదువుకుంటే భవిష్యత్తు ఉండదంటున్నారు కొంతమంది! ప్రభుత్వాలు కూడా వారికి వంతపాడుతూ పాఠశాలల నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించేస్తున్నాయి. కానీ, ఈ పద్ధతి సరైంది కాదంటున్నారు హైదరాబాదు నిమ్స్‌ నెఫ్రాలజీ (మూత్రపిండ శాస్త్రం) విభాగాధిపతి డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు. పదో తరగతి వరకూ తెలుగులోనే చదువుకున్న ఆయన మాతృభాష- విద్యకు సంబంధించి తన ఆలోచనలు పంచుకుంటూ రాసిన ప్రత్యేక వ్యాసమిది..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్షర తపస్వి - గుండు పాండురంగశర్మ 
అచ్చమైన తెలుగులో అందమైన కవితలను జాలువార్చే ఆయన కలం.. అంతే నైపుణ్యంతో స్వచ్ఛమైన ఆంగ్లంలో ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాలనూ సృజించగలదు. కథలు, నవలల నుంచి సినిమాలకు రచన వరకూ విస్తృత సాహితీసేద్యం చేస్తున్న ఆయన, అంతే అవిశ్రాంతంగా తరగతి గదిలో పాఠాలూ బోధిస్తున్నారు. అక్షర హాలికుడిగా విభిన్న సాహితీ ప్రక్రియలను సుసుంపన్నం చేస్తున్న ఆచార్య రామా చంద్రమౌళికి తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ‘కాళోజీ భాషా పురస్కారాన్ని’ అందజేసింది. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్కడే.. విశ్వనాథుడొక్కడే! 
సువిశాలమైన తన సారస్వత మాగాణంలో తెలుగుదనాన్ని నిండుగా పండించిన విద్వన్మణి..  దేశీయ సంస్కృతే జాతి మనుగడకు పుష్టినిస్తుందని ప్రబోధించిన నిరంతర తపశ్శీలి.. తొలి తెలుగు జ్ఞానపీఠ గ్రహీత, కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతి సంవత్సరమిది. ఈ సందర్భంగా విజయవాడ విశ్వనాథ ఫౌండేషన్, సెప్టెంబరు పదిన అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవిదేశాల నుంచి దాదాపు తొంభైకి పైగా కవులు, రచయితలు, పరిశోధకులు, ప్రవచనకర్తలు, సినీ ప్రముఖులు ఈ వేదికలో పాల్గొని విశ్వనాథ సాహిత్యాన్ని, ఆయనతో తమ సామీప్యాన్ని గుర్తుచేసుకున్నారు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బత్తయోగ పదన్నాసి..! - సురా 
దేవీ.. కస్టములు ఎట్నున్నునూ పున్య చేత్తరమైన వోరనాసిని వొచ్చితిమి సూడు.. ఈ వోరనాసి.. బత్తయోగ పదన్నాసి వోరనాఁ...సీ.. బవదురిత సాచ్చములురాసి వోరనాఁ..సీ... సాంబడి గొంతు ఆరున్నొక్కటి ఏస్కుంటుంది. బలిజేపల్లి రాసిందైనా, జాషువా రాసిందైనా పల్లె గొంతులో పడ్డాక ఆ పద్యం ఉచ్చారణ నలుగుపెట్టుకుని నిగనిగలాడిపోవాల్సిందే.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శభాష్‌ దక్షిణ కొరియా! 
సామ్‌సంగ్, ఎల్జీ, హ్యుండాయ్, కియా, పోస్కో లాంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ల సృష్టికర్తల పురిటిగడ్డ దక్షిణకొరియా. నర్సరీ నుంచి విశ్వవిద్యాలయాల వరకూ అమ్మభాషలోనే చదువుకుంటూ అమేయ విజయాలు సాధిస్తున్నారీ దేశీయులు. పరదేశ పాలనలో తమ భాషకు ఓ నిఘంటువు తయారుచేసుకున్నందుకే రాజద్రోహం కేసులు ఎదుర్కొన్న కొరియన్లు, ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మాతృభాష ద్వారానే అభివృద్ధి సాధిస్తున్నారు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు కోసం ఓ ముందడుగు - ముహమ్మద్‌ ముజాహిద్‌
రోగి సమస్య ఏంటో పూర్తిగా తెలిస్తేనే కదా ఏ వైద్యుడన్నా నయం చేయగలిగేది! రోగి భాష వైద్యుడికి అర్థంకాకపోతే అసలుకే మోసం వస్తుంది కదా. ఇదే సమస్య ఓ వైద్యుణ్ని వేధించేది. ఆయన మాతృభాష ఉర్దూ, చదువుకుందంతా ఆంగ్లం.. తెలుగు తెలియదు. తన దగ్గరికి వచ్చే రోగుల్లో తెలుగు మాత్రమే తెలిసిన వారు చాలామందే ఉంటారు. మరి వారికెలా వైద్యం చేయడం? ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలనుకున్నా ఎవరు నేర్పుతారు?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిమెంటు విగ్రహమై గాంధి..!
సత్యం, అహింస మనిషి సంకల్ప బలానికి పదునుపెట్టే ఆయుధాలు. స్వరాజ్య సాధనని, సురాజ్య పాలనని ని¸ర్దేశించే తూనిక రాళ్లు. అణ్వాయుధాలకంటే శక్తివంతమైన ధార్మికపథంలో దేశాన్ని నడిపి, సాధించుకున్న రాజ్యం నాలుగు కాలాలూ నిలబడాలంటే అవే ధర్మపద్ధతులు అవసరమని చెప్పిన గాంధీ మార్గానికి కవులు ఇచ్చిన కితాబు ఎలాంటిదీ! నైతిక వర్తనమే దేశ సంకీర్తనమన్న బాపూజీ బాటలో వారు పూయించిన కవితా కుసుమాలేంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అభ్యుదయ కథకుడు - ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి   
విశ్వనాథ అతి తీవ్ర సంప్రదాయ వాది అని, ఆ చట్రంలోనే గిరిగీసుకుని నిలిచిపోయిన కవి అనే ఏకపక్ష అభిప్రాయం కలిగిన వారు ఆయన రచించిన కథలను పరిశీలించాలి. అప్పుడే ఆయనలోని నవ్య సంప్రదాయ భావన, సామాజిక ప్రగతి శీలత, అభ్యుదయ కాంక్ష తేటతెల్లమవుతాయి. అవి సామాజిక పరిణామాలను సునిశితంగా పరిశీలించి మానవతా దృక్పథంతో విరచితమైన కథలు. సార్వజనీన, సార్వకాలిక దార్శనికతకు ప్రతిఫలనాలు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేవుడి జాతకం బాగుండాలి! - శంకరనారాయణ 
ఎవరినైనా పలకరించి ఎలా ఉన్నారు? అని అడిగితే ‘దేవుడి దయ వల్ల బాగున్నాను’ అని ఠక్కున అంటారు. ఇది ఎంత అన్యాయం! దేవుడి దయవల్ల మనం బాగుండటమేంటి? ఎవరైనా వింటే నవ్వుతారు. మన దయవల్ల దేవుడు బాగున్నాడు అనడం సబబు. నా జాతకం బాగుండాలి అని మనం ప్రార్థిస్తాం. అది మన స్వార్థం! దేవుడి జాతకం గనక బాగుంటే అందరూ బాగుంటారు. ఇదీ మనం కోరుకోవాల్సింది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ చారిత్రాత్మక తీర్పు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెలిసిందే. విద్యాహక్కు చట్టం, సుప్రీంకోర్టు గత తీర్పులతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ సందర్భంగా హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చింది. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను కూలంకషంగా వివరించే ఈ తీర్పు ప్రతి మొత్తాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించారు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు. ఆ అనువాదాన్ని పరవస్తు పద్యపీఠం ‘మాతృభాషే న్యాయం’ పేరిట పుస్తకంగా ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాలివి (హైకోర్టు తీర్పులోని వివిధ భాగాలు)... 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భక్తిరాగం - అప్పరుసు రమాకాంతరావు
నాదం, స్వరం, శృతి ఏకమైతే ధారలా సాగేదే రాగం. అనంతాలుగా చెప్పే ఈ రాగాల్లో కొన్ని మానసిక ఉత్సాహాన్నిస్తాయి. మరికొన్ని అలౌకిక భావనలకు గురిచేస్తాయి. ఆర్తి, భక్తి, ఆత్మ సమర్పణ లాంటి భావోద్వేగాలను కలిగించే ‘ఖరహరప్రియ’ రాగం గురించిన విశేషాలివి..!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుణము మేలుకాని కులమేమి మేలురా
‘‘తేనెలూరెడు భాష మా తెలుగుభాష/ చెవులకింపైన సొంపైన జీవభాష/ అందమానంద మందించు నమర భాష/ భాషలన్నిట మిన్నయై పరగు భాష/ తెలుగు వెలుగును తిలకించు తెలివి గలిగి/ తెలుగు కీర్తి నిలుపుదశ దిశలయందు/ తెలుగు తేజంబు మరువక తెలిసికొనుము/ పూర్వ వైభవమును నీవు పొందుపరచు’’ అంటూ పిలుపునిచ్చారు దేవులపల్లి విశ్వనాథం. భాషా సాహిత్యాల పరిశోధకుల సాధన కోసం కొన్ని ప్రశ్నలు.. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘కవిరాజహంసలు’ ఎవరు?  
‘‘తేనెలు కురిపించు తేటైన భాష/ ధీశక్తి పెంచెడు దివ్యమౌభాష/ ఊనిక గలయట్టి ఉత్తమ భాష/ ఓజస్సు దీపించు వొప్పైన భాష/ గానమ్ము వలనన కరగించు భాష/ గౌరవమ్మును పెంచు ఘనమైన భాష/ మేనెల్ల కదిలించు మెరుగైన భాష/ మేలైన తెలుగుగా మెరసెడి భాష’’ అంటూ కీర్తించారు గుమ్మా సాంబశివరావు. రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థుల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలివి..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బందుమియ్యా నుంచి దావూద్‌ వరకూ! - జి.సుబ్రహ్మణ్యశాస్త్రి    90  92
తెలుగులో పద్యకవిత్వం వెలువరించిన ముస్లిం కవులు ఎందరున్నారు? వాళ్ల రచనలేంటి? చప్పున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే, దీని మీద దృష్టిపెట్టిన సాహితీచరిత్రకారులు ఎక్కువగా లేరు. అంతగా ప్రచారానికి నోచుకోలేదు కానీ, వాసి కలిగిన పద్యకవితలను అల్లిన ముస్లిం కవులున్నారు. వారి కవన విశేషాలివి..! 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కథలు

సినీడెజావు - చరణ్‌ పరిమి
సినీ సముద్రాన్ని ఈదుతూ గతి తప్పి మునిగిపోయిన నావలెన్ని?
వాటిని మింగేసిన కర్కశ తిమింగలాలెన్ని? 
రంగుల ప్రపంచంలో నవ్వుతూ రంపపు కోత అనుభవించే ప్రాణులెన్ని?
యశ్వంత్‌ అదృశ్యం వెనకున్న కారణాలేంటి? 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రుద్రగజం - పుప్పాల కృష్ణమూర్తి
రాజుల్నీ, రాజ్యాల్నీ గెలవాలంటే రక్తపాతం తప్పదు!
కానీ, ఇక్కడ ఒక్క రక్తపుబొట్టూ చిందలేదు! 
ఎదుటి రాజు చేతులు జోడించి వియ్యానికి 
సిద్ధమన్నాడు! ఇదెలా సాధ్యమైంది! 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలిపటం - ఇనుగంటి జానకి 
కొందరి జీవితాలంతే, గమ్యంలేని గాలిపటాలు. బాధ్యతలు వారికి
భరించరాని బరువులు. కానీ, వారి వల్ల కొందరి జీవితాలు
కల్లోలాల్లో కూరుకుపోతాయి. జోగారావు వల్ల పాపమ్మ జీవితమూ
సుడిగుండంలో చిక్కుకుపోయింది. దాన్నుంచి ఆమె బయటపడిందా?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విముక్తి - దినకర్‌ 
‘‘ముజ్‌రా అంటే ఏంటి?’’ ఎనిమిదో తరగతి చదివే ఆసిఫా అడిగిన
మాటకు ఫాయక్‌ సార్‌ ఉలిక్కిపడ్డాడు. ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి 
బెంగపడ్డాడు. అటువైపు ఆసిఫా తల్లిదీ అదే ఆందోళన. అసలు ఆసిఫాకొచ్చిన 
కష్టమేంటి? ఆమె దాన్నుంచి ఎలా బయటపడింది?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మతనం - బోండ్ల అశోక్‌  
పనిమనిషి లక్ష్మిలో ఏదో మార్పు? పెద్దపిల్లలున్న ఆమె
అనూష బిడ్డకు తన చనుబాలిస్తోంది!
ఎప్పుడూ ఏదో దిగులులో కూరుకుపోయి ఉంటోంది!
అందుకు కారణాలేంటో అనూష ఆరాతీసింది! తర్వాతేమైంది?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నల్లకాలర్‌ - పాణ్యం దత్తశర్మ
కాలరు మాయకుండా, హాయిగా ఏసీలో కూర్చుని ఉద్యోగం జెయ్యాలని
చదువుకునేవాళ్లందరి కోరిక! కానీ, అలాంటి ఉద్యోగాలు ఎంత మందికి
దొరుకుతాండాయి? దొరికినా ఎంతకాలం ఉంటుండాయి? ఇలాంటి 
పరిస్థితిలో ఏం జెయ్యాల? మున్రెడ్డిదీ ఇదే పరిస్థితి! మరి ఆయప్ప ఏంజేసినాడు!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాటకట్టు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖ
ఇంగ్లీషు మమ్మీ! నువ్వు ఫీలవ్వకూడదు!, ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖ

బాపూ! నువ్వు మళ్లీ రావద్దు, ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమస్యావినోదం

పరువు హత్యలొసగు పట్టమోయి!
* మీ పూరణం చేరేందుకు గడువు: ప్రతినెలా 18వ తేదీ. మీ పూరణాలను మెయిల్, ఎస్‌.ఎం.ఎస్, వాట్సప్‌ల ద్వారా కూడా పంపవచ్చు.
* ఏ నెలలో ఇచ్చిన సమస్య ఆ నెలలోనే పూరించి పంపాలి. రచయిత ఒక పద్యం మాత్రమే పంపాలి. పూరణం సరళ భాషలో రసానుభూతిని కలిగించేలా ఉండాలి.
* వచ్చిన పూరణాల్లో అత్యుత్తమమైన అయిదింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం.
* ప్రచురితమైన ఒక్కో పూరణానికి Rs100 బహుమతి. మిగిలిన వాటిలో మేలైనవి సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాం.
* ఈ పద్యం ఎక్కడా ప్రచురితం, ప్రసారం కాలేదని హామీపత్రం జతచేయాలి.
* ఎంపికలో తుది నిర్ణయం సంపాదక వర్గానిదే. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భాషాయణం

నంగనాచి
అమాయకంగా ప్రవర్తించే గరిత. చేసిందంతా చేసి ఏమీ తెలీనట్లు ప్రవర్తించే మనిషి అని లోక వ్యవహారం. దిసమొలతో నాట్యం చేసేటంతటి సాహసికురాలనే మరో అర్థం ఉంది. ఇది హిందీ పదం కాదు. రెండు ద్రవిడ పదాల సమాహారం. నంగై అంటే అమాయకురాలైన చిన్న పాప. నాచి అంటే మాయా మర్మం తెలియనిది. అమాయకురాలైన చిన్నపాపగా కనిపించే నాతి. చతురురాలు అని అర్థం. ఇలా మరిన్ని తెలుసుకోవడానికి... తెలుగువెలుగు పత్రికలో భాషాయణం చదవండి.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింజిరి 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొండ అద్దమందు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సప్‌కథ

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనక్కి ...

మీ అభిప్రాయం