తెలుగువెలుగు నవంబరు సంచిక విశేషాలు

  • 1176 Views
  • 118Likes
  • Like
  • Article Share

ప్రత్యేక వ్యాసాలు... ప్రముఖుల ముఖాముఖిలు, వ్యాసాలు, కవితలు, ప్రేమలేఖలు మరెన్నో శీర్షికలతో మీ ముందుకు వచ్చింది తెలుగువెలుగు నవంబరు సంచిక... 
మీరు teluguvelugu.eenadu.net ‌లో ముందుగా రిజిస్ట్రర్‌ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్‌ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.

పిల్లలనే గౌరవించవలెను! (కామ్రేడ్‌ వితండం) - శంకరనారాయణ
మన పెద్దలకు ఎంత స్వార్థమో! ఎంత అహమో! ‘పెద్దలను గౌరవించవలెను’ అని టముకు వేస్తుంటారు. అభంశుభం తెలియని పిల్లకాయలతో కాళ్లకు మొక్కించుకోవాలన్న తాపత్రయం తప్ప ఇందులో ఇంకేమైనా ఉందా? నిజానికి పెద్దలే సాగిలబడి పిల్లలకు సాష్టాంగ దండ ప్రణామాలు చేయాలి. ఉన్నవాళ్లను లేనివాళ్లు గౌరవించడమే కదా విధాయకం. అది ఎలాగో ఏంటో విని అవధరించండి.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భజన ప్రభంజనం! - అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌
భజన... అలసిపోయిన పల్లె మనసుకు సాంత్వన. అలతి అలతి పదాలతో పండిత పామర జన రంజకంగా ఆధ్యాత్మిక భావ తరంగాల్లో ఓలలాడిస్తాయి భజన గీతాలు.  తరతరాల సంస్కృతి సంప్రదాయాలు, సంగీతాదులకు ఇవి ఆలవాలాలు కూడా. ఆర్తి, నమ్మకం నింపుకుని మనసులో నూతనోత్తేజం నింపే ఈ పాటలు నేటికీ పల్లెల్లో విస్తృతంగా వినిపిస్తుంటాయి.  వాడవాడలా వీటికి ఉద్యమ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు పటిష్ట బాటలు వేశారు మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్ష్మీ... లడ్డూ.. మహా (కథ) - వీరా కోగటం
ఆడ పిల్లలకూ ఆశలు, ఆశయాలుంటాయి.
వాటినెందుకు సమాజం అర్థం చేసుకోదు!
తన స్వప్న సాకారానికి మూడు దశలు దాటింది లక్ష్మి!
ఆమె గెలుపుని ఎలా అందుకుంది?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏదీ! దివ్యమైన దీపావళి 
గుడిలో ఉన్నా గుడిసెలో ఉన్నా దీపం చెప్పేదొకటే, జగతిలో వెలుగురేఖలు అందరివని. కానీ, శ్రమజీవనంతో లోకాలని రాగరంజితం చేసే వారి ఇళ్లలో మాత్రం ‘దీపాలు’ వెలగవు. దగాపడ్డ జీవుల నవ్వుల్లో మతాబుల మాటెలా ఉన్నా కటిక చీకటిరాశులు పేరుకుని ఉంటాయి. రంగుల దీపాలతో లోకమంతా శోభిల్లుతుంటే కష్టజీవుల మట్టి ప్రమిదెలు శూన్యాకాశం వైపు చూస్తుంటాయి. దివ్వెల పండగకి దూరంగా ఏ వెలుగులకీ నోచుకోని శ్రమజీవుల దీనత్వాన్ని పట్టి చూపిన కవుల దీపకరాగమిది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది చేయడానికి మీరెవరు? అన్నారు! - బి.మదనమోహన్‌ రెడ్డి 
సినిమా నటులో, క్రికెట్‌ ఆటగాళ్లో, నాయకులో.. ఎవరైనా కానివ్వండి- ఫొటో చూడగానే పిల్లలు కూడా గుర్తుపట్టేస్తారు కదా! మరి మన సాహితీవేత్తల్లో ఎంతమందిని అలా పెద్దవాళ్లు అయినా గుర్తుపట్టగలరు? భాషా సాహిత్యాలను చదువుకున్న వారిలోనూ చాలామందికి ఆయా రచయితలు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఈ దుస్థితిని చూసి అనంతపురం జిల్లాకు తెలుగు భాషోపాధ్యాయ దంపతులు సున్నపురాళ్ల శ్రీనివాసులు, వజ్రాల యశోద, వాళ్లబ్బాయి షణ్ముఖ కలతచెందారు. రూ.25 లక్షలు వెచ్చించి 400 మందికి పైగా సాహితీవేత్తల ఫొటోలు, వివరాలు సేకరించారు. వాటిని ‘తెలుగు సాహితీమూర్తులు.. ముఖచిత్రాలు- రేపటితరం కోసం’ పేరిట ప్రచురిస్తున్నారు. ఈ అరుదైన కృషికి సంబంధించి శ్రీనివాసులు ఏమంటున్నారో.. ఆయన మాటల్లోనే..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తృవ్వట బాబా..! - పొన్నపల్లి శ్రీరామారావు 
కృష్ణదేవరాయల ఆస్థానంలోకి ప్రెగడరాజు నరసరాజు ప్రవేశించాడు. నానా హడావుడి చేశాడు. ‘‘రాజనందనరాజరాజాత్మజులు సాటితలపనల్లయవేమధరణిపతికి’’.. మొత్తం సీస పద్యం నాలుగు పాదాలివే! 

‘‘భావభవభోగసత్కళాభావములను’’.. ఎత్తుగీతిలో నాలుగు పాదాలూ ఇవే! అర్థంచెప్పండి- చేవ ఉంటే! అని సవాలు చేశాడు. అష్టదిగ్గజాలకు దిక్కుతోచని పరిస్థితి...

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ద్రౌపది నవ్వు - విశాలి 
ద్రౌపది నవ్వు గురించి దుర్యోధనుడి కంటే భారత విమర్శకులే ఎక్కువ పట్టించుకుని బాధపడ్డారు. ఈ మధ్య కాలంలో వస్తున్న మహాభారతాల్లో ద్రౌపది నవ్వు ఓ విచిత్రంగా, అపహాస్యంగా మారింది. అసలు అందరూ అనుకుంటున్నట్టు.. మయసభలో సుయోధన పరాభవం వాస్తవమేనా? ద్రౌపది నిజంగానే నవ్విందా? 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏడూర్ల భజన (కథ) - ఎమ్‌. హనుమంతరావు
వానదేవుడు తొంగి సూడక పైర్లు వాడుమొకం పెట్టె. 
రైతుల గుండెల్లో గుబులు మొదలాయె.
దయతలచి కాసిని సినుకులు రాల్చు తండ్రీ అని ‘ఏడూర్ల’ భజన జరిపినారు!
అదెట్ల జరిగె! ఆఖరికి వాన కురిసెనా?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొయ్యర మోత... బీరపూల వాయిదా! - డా।। రంగు రాజపాపయ్య
భాషకు అందాన్నీ, లోతైన భావాన్నీ, సమగ్రతనూ ఇస్తాయి పలుకుబళ్లు, నానుళ్లు, జాతీయాలు, సామెతలు. పాయసంలో జీడిపప్పులాగ సందర్భాన్నిబట్టి మాటల మధ్యలో తగులుతూ భాషను సుసంపన్నం చేసే పలుకుబళ్లు తెలంగాణలో విరివిగా వినిపిస్తాయి. ఒక్కసారి వాటిలోని సౌందర్యాన్ని, అర్థరమణీయతను అవలోకిస్తే... 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నెలనెలా సాహితీ సుమగంధం - శివారెడ్డి
అక్షరాల్లోనూ సాగరానికి ఉన్నంత లోతు ఉంటుంది. అన్వేషించి, అవగాహన చేసుకుంటే ఎన్నో కొత్త అంశాలు అవగతమవుతాయి. దానికోసం నిరంతరం చర్చలు సాగాలి. సరికొత్త దృక్కులు ప్రసరించాలి. కడపలో ఇలాంటి మథనమే కొనసాగుతోంది. ‘నెల నెలా మన జిల్లా సాహిత్యం’ పేరిట మొదలైన ఈ కార్యక్రమం వంద నెలలు పూర్తి చేసుకుంది. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీమద్రమారమణ గోవిందో హరి - అచ్యుతుని రాజ్యశ్రీ
‘‘ఆంధ్రదేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాల్లో ముఖ్యమైనది హరికథా గానం. తెలుగువారి చరిత్రలో హరికథ ఓ ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది’’ - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
‘‘ఆస్తిక్యమును, ధర్మాధర్మములను సర్వజన మనోరంజనముగ నృత్యగీత వాద్యములతో నుపన్యసించుట హరికథ యనఁబరుగును. అట్టి ఉపన్యాసకుడు కథకుఁడనఁబడును. దైవభక్తియు, సత్యము, భూతదయయు హరికథ యందలి ముఖ్యాంశములు’’ - ‘హరికథ పితామహ’ ఆదిభట్ల నారాయణ దాసు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆగని ప్రయాణం... - పి.సుష్మ 
ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ
ప్రియమైన రాగ మహితకి
గాజుల గలగలల మధ్య అందరూ కలిసి ఒకేసారి కిలకిలానవ్వడం ఎంత హాయో. ఎటుచూసినా తెల్ల పంచెలు, పట్టుచీరలే. ‘‘దుర్ముహూర్తం వస్తుంది అమ్మాయిని తీసుకురండి!’’ అంటూ..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాలచక్రం (కథ) - గన్నవరపు నరసింహమూర్తి 
పల్లె ఖాళీ అవుతోంది. నవతరం వ్యవసాయం వద్దంటోంది. పంట భూములు వ్యాపార క్షేత్రాలుగా మారుతున్నాయి. కొన్నేళ్లు పోతే పండించే వారే ఉండరా? అమ్మానాన్నల త్యాగాలు ఎంతవరకు?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నటరాజ పాద సుమరజం 
నాట్యం రసజీవన జగత్తు. అదొక సమ్మోహన ప్రక్రియ. బతకడానికి డబ్బు ఎంత ముఖ్యమో మనసును బతికించుకోవడానికి కళ అంత అవసరమంటారు ‘పద్మశ్రీ’ శోభానాయుడు. ఆధ్యాత్మిక శక్తికి, నిశ్చల భావానురక్తికి నర్తనమే ఉత్తమ సాధనమని విశ్వసించి జీవితమంతా నటరాజ సేవలో తరించిన ఆవిడ, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చుళుక మణిక రహస్యములు! - సురా 
ఒకప్పటి రోజుల్లో అర్ధరాత్రి తోటకు వెళ్లాడంటే.. అది భగ్నప్రేమ. సాయంత్రం అందులో షికారు చేస్తే అది తొలిప్రేమ. మధ్యాహ్నం అక్కడ సేదదీరితే కొంటెప్రేమ. చద్దన్నం మూటకట్టుకుని ఠీవిగా కదిలాడంటే అది పవిత్రప్రేమ. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సార్వభౌముడి కవనంలో సామాన్యులు - ఎర్రాప్రగడ రామమూర్తి 
ఆంధ్రభోజుడు, అష్టదిగ్గజ కవన భువన విజయుడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు మీద ఎనలేని ప్రేమా గౌరవమూ గలవాడు. అరివీరభయంకరుడై తెలుగు నేలను ఒకే గొడుగు నీడకు చేర్చిన సార్వభౌముడు. తెలుగు కవి కాలికి గండపెండేరం స్వయంగా తొడిగి, ఆ చేతులతో ఆ కవి ఊరేగింపు పల్లకీని మోసి, కవివరుల గౌరవ పతాకాన్ని నింగికెత్తిన వాడు. అన్నింటికీ మించి సంస్కృత ఆంధ్రభాషల్లో ప్రౌఢకవి. ఆయన రచించిన ‘ఆముక్తమాల్యద’ ప్రబంధం, సామాజిక స్పర్శతో పాఠకులకు బెల్లం పాలను చవిచూపిస్తుంది. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెల్ఫీ - నామని సుజనాదేవి 
‘‘అమ్మాయ్‌! అలా తలదించుకుని కూర్చుంటే అబ్బాయికి నీ ముఖమెలా కనబడుతుంది. నువ్వు అబ్బాయినెలా చూస్తావు. తలెత్తు’’ పెళ్లికొడుకు తాలూకు వాళ్లు ఎవరో అనడంతో  చిన్నగా తలపైకెత్తాను. అతణ్ని చూసి, పెద్దగా పైకి రాబోతున్న కేక ఆపుకోవడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. అతనితో నా పరిచయం కళ్లముందు సినిమా రీలులా తిరిగింది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతర్జాలంలో ఆపాతమధురాలు - కణ్వస
దూరదర్శన్‌ చూడక ఎన్నాళ్లయింది.. ఆకాశవాణి వినక ఎన్నేళ్లయింది! ఓపిక లేకున్నా.. ఓటీటీ వేదికలు పట్టుకుని వేలాడుతున్నాం కదా.. ఒక్కసారి యూట్యూబ్‌లోకి వెళ్లి చూద్దాం. దూరదర్శన్‌ యాదగిరి తెలంగాణ ఛానెల్లోకి తొంగిచూస్తే.. ఆలిండియా రేడియో హైదరాబాద్‌లోకి వెళ్లి వింటే.. ఎన్నెన్ని జ్ఞాపకాలు చుట్టుముడతాయో తెలుసా!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రకృతి న్యాయం (కథ) - వాడపల్లి చంద్రశేఖర వర్మ
మనిషిలో ఎంత స్వార్థం! ఎంతటి కర్కశత్వం!
తనకి కష్టమొస్తే దీనంగా చూస్తాడు! అది
తీరాక క్రూరుడిగా మారిపోతాడు! కానీ, అంతా
అనుకున్నట్లే నడిస్తే ఎలా? శ్రీధర్‌కీ అదే జరిగింది!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీదే మీదే సమస్త విశ్వం
‘‘ఆటల పాటల పేటికలారా!/ కమ్మని మాటల కొమ్మల్లారా/ కలువల కన్నుల కన్నెల్లారా పిల్లల గన్న తల్లుల్లారా..’’ అంటూ పిల్లల భాషలో ముత్యాలసరాలు కూర్చారు గురజాడ. ‘‘ఏమీ ఎరుగని పువ్వుల్లారా!/ అయిదారేడుల పాపల్లారా!/ మెరుపు మెరిస్తే/ వాన కురిస్తే/ ఆకాశమున హరివిల్లు విరిస్తే/ అవి మాకే అని ఆనందించే కూనల్లారా!’’ అని శైశవగీతిని ఆలపించిన శ్రీశ్రీ పిల్లలదే సమస్త విశ్వం అన్నారు. పిల్లలకి ఒక ప్రపంచముంది. వాళ్లకీ అనుభవాలు ఉన్నాయి. భావ వ్యక్తీకరణకి ప్రత్యేకమైన భాష ఉంది. రసజగత్తు ఉంది. బాలల దినోత్సవం (నవంబరు 14) సందర్భంగా చిన్నారుల్లో ధారణ, పరిశీలన, సృజనశక్తుల పెంపులో జోలపాటలు, గేయాలు, కథాగేయాల పాత్ర ఎలాంటిదో చూద్దాం!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నా జీవం.. నా సర్వం 
ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ
ప్రియమైన నాన్నకు
ఏంటి మా అబ్బాయి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు! అనుకుంటున్నావా నాన్నా! సాధారణంగా అమ్మాయి నాన్నకూచి అని, అబ్బాయి తల్లి చాటు బిడ్డ అంటారు. అది నిజమేనేమో.. నిజానికి తండ్రీ కొడుకుల మధ్య మాటలు అరకొరగానే ఉంటాయి. చెప్పాలంటే మనద్దరి మధ్య ఇప్పటివరకూ జరిగిన సంభాషణ లెక్కగడితే కొన్ని గంటలే. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నెత్తుటి పూల వసంతం
వెలివాడ బతుకుల్లో కూడా సాహిత్యం ఉంది. చిత్రలేఖనం ఉంది. నాటకం ఉంది. ఈ ప్రపంచం చూడటానికి ఇష్టపడని చాలా అందాలు అందులో ఉన్నాయి. అయితే అవన్నీ అంటరాని వసంతాలు. ఈ భూమ్మీద కురిసి వెలిసిన వెలి కదలికలు. అడవిగాచిన వెన్నెలలా ఎవరికీ అక్కరకు రాకుండా పోయిన ఆ కళాస్రవంతీ, బడుగు జీవుల మీద కొనసాగిన దోపిడీ, మతం మారినా కులం మాత్రం పటిష్ఠంగా ఎలా నిలబడి ఉందీ... లాంటివన్నీ తెలియాలంటే ‘అంటరాని వసంతం’ నవలలోకి ప్రయాణించాల్సిందే.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అబల కాదు సబల (కథ) - ఐతా చంద్రయ్య
అతనిది అహంకారం. ఆమెది ఆత్మాభిమానం!
అతనికి చులకన భావం. ఆమెకి భవిష్యత్తు మీద
మమకారం. అతను వదిలించుకుందాం అనుకున్నాడు. 
ఆమెకి మాత్రం శని వదిలిపోయింది! అసలేమైంది?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అచ్చమైన ప్రేమ కథలు - శ్రీస్వామి 
సురలకు చిరాయువునిచ్చేది అమృతమైతే, నరులకు ప్రేమే అమృతం. భావోద్వేగాల్లో ప్రేమది ప్రథమ స్థానం. జనన మరణాలెంత సాధారణమో, మనిషి ప్రేమించడమూ అంతే సాధారణం. అందుకే బ్రహ్మాది దేవతల నుంచి సామాన్య జనుల వరకూ అందరూ ప్రేమామృతాన్ని సేవించినవారే. మన్మథ క్రీడల మాయలో పడినవారే. వారిలో మూడు విశిష్ట జంటల ప్రణయ గాథాలహరి ఇది! 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘ప్రేమించు ప్రేమకై..’ 
‘‘తెలుగు పదాలలోన గల తీయదనమ్మును గూర్చి చెప్పగా/ గలిగిన వాడె ధన్యుడు జగాన అనేకములైన భాషలన్‌/ తెలిసి తెలుంగునందు గల తేట తనమ్మును తెల్పు బాధ్యతన్‌ / తలపయి మోపికొంటి కద!
దాశరథీ! కరుణాపయోనిధీ!’’; ‘‘గాన యోగ్యమని జగాన ఖ్యాతిని గన్న/ దెంత మధురమీ అజంత భాష!/ కటుత లేని బాస, కమనీయమగు బాస/ యాసయున్నయపుడే అగును బాస’’ అని అన్నారు దాశరథి.
‘‘పంచదార కన్న, పనసతొనలకన్న, తేనెకన్న మనదు తెలుగు మిన్న’’ అనీ శ్లాఘించారాయన. తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికోసం కొన్ని మాదిరి ప్రశ్నలివి..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘పద్మవ్యూహం’ నాటకకర్త? 
‘కవుల కంటె తుహిన కర్పూర నిభకీర్తి/ తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి!/ సాహితీ తరంగ సంగీత రసధుని/ దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్నారు నండూరి రామకృష్ణమాచార్యులు. సరిగమపదనిసలకు ఆలవాలమైన భాష మనది. తెలుగు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సాధన కోసం రూపొందించిన మాదిరి ప్రశ్నలివి..!  

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంత్రదండం (కథ) - పెండ్యాల గాయత్రి 
బళ్లో చదివే ఇద్దరు పిల్లలు మాయమయ్యారు!
బదిలీ అయ్యి వెళ్లిపోయిన మరో మాస్టారు మీద ఏవో అనుమానాలు!
మూడు లేఖలు బయటపడ్డాయి. వాటిలో ఏముంది?
అసలు వాళ్లు ఎందుకెళ్లిపోయారు?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాయులీన సమ్మోహనం - బుడితి రామినాయుడు
వాయులీనంతో శాస్త్రీయ సంగీతానికి వన్నె తెచ్చిన ద్వారం వెంకట స్వామి అంతటి వారు.. పాశ్చాత్య  స్వరలయలను జోడించి కర్ణాటక సంగీతాన్ని తేజోమయంచేసిన విద్వన్మణి, ‘గాన కళానిధి’ ద్వారం నరసింగరావు నాయుడు. జీవించింది కొద్దికాలమే అయినా గొప్ప సంగీత ప్రతిభావంతులను దేశానికి అందించిన ఘనత ఈయన సొంతం.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అచ్చతెలుగు అమృత నిధులు - బి.హెచ్‌.వి.రమాదేవి
మనం మాట్లాడే మాటల్లో అచ్చతెలుగు పదాలెన్ని? మనం చదివే కావ్యాలు, ఇతరత్రా పొత్తాల్లో ఎన్ని అచ్చమైన తెనుగు మాటలు కనిపిస్తాయి? అసలు మనవైన పలుకుల్లో వినిపించే కమనీయ నాదం ఏంటి? వాటి అర్థాల్లో దాగున్న జిగి ఏంటి? అక్షరాల్లో ఇమిడి ఉన్న బిగి ఏంటి? వీటన్నింటికీ సమాధానాలు పైడిపాటి లక్ష్మణ కవి ‘ఆంధ్రనామ సంగ్రహం’, ఆడిదం సూరకవి ‘ఆంధ్రనామ శేషం‘, కస్తూరి రంగకవి సాంబ నిఘంటువులు. ఈ అచ్చతెలుగు పద్య పదకోశాల విశేషాలివి!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీమతి (కథ) - దొండపాటి కృష్ణ 
శ్రీధర్‌కి తన శ్రీమతి మీద చాలా కోపంగా ఉంది! ఆమెలో ఈ మధ్య ఏదో మార్పు వచ్చిందని అతని అనుమానం! తన వెనుక ఏదో జరుగుతోందని అనుకుంటున్నాడు! అతని భయం నిజమేనా? 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కవితలు

ఒక కథ - మడిపల్లి హరిహరనాథ్‌ 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జీవన రుతువు - డా।। ఎన్‌.గోపి 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేనెక్కడో తప్పిపోయాను - బంగార్రాజు కంఠ 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనురాగానుబంధాలు - వెగ్గలం ఉషఃశ్రీ 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరగతి గది మదిలో - వేముగంటి మురళి 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉషస్సు! - దండమూడి శ్రీచరణ్‌ 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేనూ అంతే! - కోట్ల వెంకటేశ్వరరెడ్డి 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కల - అనూశ్రీ 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాయమ్మ సాచ్చిగ శెప్తాండా! - బూదుగూరు బాలరాజు 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాటకట్టు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లఘుచిత్ర లహరి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమస్యా వినోదం
ఐపీఎల్‌ ముగిసెనుగద అరచేతులలో
మీ పూరణం చేరేందుకు గడువు: ప్రతినెలా 18వ తేదీ. మీ పూరణాలను మెయిల్, ఎస్‌.ఎం.ఎస్, వాట్సప్‌ల ద్వారా కూడా పంపవచ్చు.
గత నెల ‘సమస్య’కు ఎంపికై ప్రచురితమైన పూరణాల కోసం...

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భాషాయణం
మాదాకవళం
యాచించి తెచ్చిన భిక్షాన్నం. మధుకరం అని వ్యవహరిస్తారు. మాదా అనే తమిళ పదానికి దేవుడు, కవళ (యాచించడం) అనే అర్థాలున్నాయి. ప్రార్థన గీతాలు పాడుతూ తిరిపెమెత్తి తెచ్చుకున్న అన్నానికి మాదాకవళం అని పేరు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింజిరి
‘‘కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా ఊడలజుట్టు వెధవా..’’ అంటూ ప్రాసలతో కొడుకు సుత్తివేలును వాయించి పారేసే తండ్రి సుత్తి వీరభద్రరావు మాటలు ‘నెలవంక’ చిత్రంలో నవ్వులపువ్వులు పూయిస్తాయి. జగమెరిగిన ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల కలం బలానికి వీరభద్రరావు గళం తోడైతే ఎలా ఉంటుందో వినాలంటే యూట్యూబ్‌లో ఆ హాస్య సన్నివేశాలు చూడాలి. ఈలోపు ఈ 56 ‘క’ల సింగిల్‌ టేకు డైలాగును మీరు గుక్కతిప్పుకోకుండా చెప్పగలరేమో ప్రయత్నించండి..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొంద అద్దమందు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సప్‌ కథ

పుకార్లు
చాణక్యుడి దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, ‘‘నీ మిత్రుడి గురించి నీకో విషయం చెప్పాలి. అతను ఏం చేశాడో తెలుసా..’’ అని ఉత్సాహంగా ఏదో చెప్పబోయాడు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనక్కి ...

మీ అభిప్రాయం