తెలుగువెలుగు డిసెంబరు సంచిక విశేషాలు

  • 1335 Views
  • 54Likes
  • Like
  • Article Share

ప్రత్యేక వ్యాసాలు... ప్రముఖుల ముఖాముఖిలు, వ్యాసాలు, కవితలు, ప్రేమలేఖలు మరెన్నో శీర్షికలతో మీ ముందుకు వచ్చింది తెలుగువెలుగు డిసెంబరు సంచిక... 
మీరు teluguvelugu.eenadu.net ‌లో ముందుగా రిజిస్ట్రర్‌ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్‌ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.

పాపము చేయుమురా నరుడా! -శంకరనారాయణ  
మనిషి పుట్టినప్పటి నుంచీ చచ్చేంత వరకు ఒకటే కోరిక ‘నిండు నూరేళ్లు బతకాలని’! ఇంకా అవకాశం ఉంటే ‘సెంచరీ-నాటౌట్‌’ అనిపించుకోవాలని! ఇందుకోసం మనిషి ఏం చేయడానికైనా వెనకాడడు. అయితే ఇందుకు తిరుగులేని మార్గం ఉంది. అది అందరికీ తెలిసిందే. పాపం చెయ్యడానికి మించిన మా చెడ్డ మార్గం ఇంకొకటి లేదు. ‘పాపీ చిరాయువు’ అన్నారు గానీ పుణ్యవంతుడు చిరంజీవి అని ఎవడూ చెప్పిన ‘పాపాన’ పోలేదు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాతృభాషల వైపే మొగ్గు! 
పాఠ్యాంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి, ఆలోచనా శక్తి విస్తృతమవ్వడానికి అమ్మభాషా మాధ్యమంలో చదువే అత్యుత్తమం. ఈ విషయాన్ని ఏళ్లుగా విద్యావేత్తలు, మేధావులు వివరించి చెబుతున్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని గుర్తించి చదువులో అమ్మభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. మాతృభాషకు విఘాతం కలిగించే నిర్ణయాల్ని ఆయా ప్రభుత్వాలు తీసుకున్న సమయంలో భాషాభిమానులు బలంగా తమ గళం వినిపించి అమ్మభాషను కాపాడుకుంటున్నారు. మాతృభాషలో చదువుకు అగ్రాసనం వేస్తున్న కొన్ని రాష్ట్రాల్లోని స్థితిగతులను పరిశీలిద్దాం!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒంటరి విలుకాడి ఉద్యమ నినాదం - సాహితీసుధ 
వచన కవితకి ఆయనే ఉద్యమ నినాదమయ్యారు. సంప్రదాయ పద్యవేదిక మీద వచన కవితకి పట్టం కట్టారు. భాషలోనూ, భావంలోనూ నవ్యత కోసం ఆరాటపడ్డారు. కవిత్వం ఏ రూపంలో ఉన్నా, సామాన్యుడి పక్షం వహించాలని ఆశించారు. కొనఊపిరితో అల్లల్లాడుతున్న వచనకవితకి ప్రాణప్రతిష్ఠ చెయ్యడం వెనుక కుందుర్తి కృషి ఎంతటిదో చూద్దాం!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ రేలా రేరేలా రేలా - ఆచార్య ననుమాస స్వామి 
ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు. సమష్టి జీవనానికి, స్వచ్ఛతకు, స్వేచ్చకు నిలువెత్తు ప్రతిరూపాలు. కోయల జీవన విధానంలో ఎంత వైవిధ్యముంటుందో అంతకుమించిన వైదుష్యం వీరి కళా సృజనలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ పెనుపోకడల ధాటిలో మరుగున పడిపోతున్న వీరి పటం, పగిడె కథల పరిచయమిది..  

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వందే వందన్న గరిడి గుండన్న..!  - వై.ఎల్‌.వి.ప్రసాద్‌ 
‘‘విజయనగర సైన్యములో భటులకు కుస్తీలు, ఆయుధ ప్రయోగమును, సవారీ మున్నగునవి బాగా నేర్పెడివారు. శ్రీకృష్ణదేవరాయలు మంచి సాములో సవారీలో ఆరితేరిన జెట్టీలలో మేటిజట్టి. ప్రతిదినము కుసుమ నూనెను చిన్న గిన్నెడు త్రాగి అదే నూనెతో అంగమర్దనము చేయించుకొని సాముచేసి, సవారిచేసి, కుస్తీలు పట్టెడువాడని పీస్‌ అను విదేశీ వ్రాసెను. ఆ కాలంలో జనులకు సాముచేయుటలో ఆసక్తి యుండెను. వాడవాడలలో సాము గరిడీలు (తాలీంఖానాలు, అఖాడాలు) ఉండెను. సాము సాలెలతో భూమిని లోతుగా త్రవ్వి మన్ను తీసివేసి అందిసుక సగము వరకు నింపి పై భాగమును ఎర్రమట్టితో నింపెడివారు. అట్టిరంగమందు సాము నేర్చుటకు కావలసిన గదలు (ముద్గరములు- వీటినే వర్ణ వ్యత్యయముతో ఉర్దూలో ముగ్దర్‌ అందురు), సంగడములు (వీటి నుర్దూలో సింగ్‌ తోలా అనిరి. అవి మధ్య ఇరుసు, ఇరుప్రక్కల చిన్న రాతి చక్రములు కలవి) ఉండెడివి. సాములోను, కుస్తీలోను బాగా గడితేరిన వారిని జెట్టీలనియు హొంతకారులనియు పిలిచిరి’’ - ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సురవరం ప్రతాపరెడ్డి

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మభాషకే అగ్రపూజ 
తయారీ రంగంలో తిరుగులేని అభివృద్ధికి చిరునామా జర్మనీ. పాలిటెక్నిక్, వృత్తివిద్య, ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్నత విలువలతో కూడిన విద్యకూ ఈ దేశం పెట్టింది పేరు. అమ్మభాషలో చదువుల ద్వారానే పారిశ్రామిక ప్రగతిని సాధించిన జర్మనీ స్ఫూర్తి కథనమిది. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇళ్లలోన పండగంట.. కళ్లలోన కాంతులంట!!   - మనీష పరిమి
డిసెంబరు నెల రాగానే క్రీస్తు విశ్వాసుల ఇంటింటా నక్షత్రాలు వెలుగుతాయి. చిమ్మ చీకట్లలో మిణుకు మిణుకుమంటూ కాంతులు విరజిమ్ముతాయి. మంచు దుప్పట్లను తొలగిస్తూ క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటుతాయి. చక్కటి పాటలు పాడుతూ యేసు జన్మదిన వేడుకలు చేసుకుంటారు భక్తులు. విశ్వ మానవాళికి ప్రేమ, కరుణలను ప్రబోధించిన యేసును పుట్టినరోజు వృత్తాంతంతో పాటు ఆయన సందేశాన్ని వినిపించే ఆ గీతాల్లో కొన్నింటి సాహితీ పరిచయమిది!  

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోటీపరీక్షల ప్రత్యేకం

కారుమబ్బు చీల్చవోయ్‌.. కాంతిరేఖ చూపవోయ్‌!

వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెపూలను ఆఘ్రాణిస్తే కలిగే గొప్ప అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అన్నారు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. శబ్ద సంపద, సౌష్ఠవం, భావ వ్యక్తీకరణ, శ్రావ్యతల్లో తెలుగు మేటి.. దీనికి విభిన్న స్రవంతుల్ని తనలో లీనం చేసుకునే సమర్థత ఉంది అన్నారు జె.బి.ఎస్‌.హోల్డెన్‌. తెలుగు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి సాధన కోసం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలివి..!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘సెట్‌’కి సిద్ధమా? 
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ‘సెట్‌’ 2020 ప్రకటన వెలువరించింది. విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యులు, అధ్యాపక ఉద్యోగాలకు సెట్‌/ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. పీహెచ్‌డీ చేయాలనుకునే వారికీ ‘సెట్‌’ అర్హత కీలకమే. డిసెంబరు 20న ఈ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ‘సెట్‌’ పాఠ్యప్రణాళికలోని కీలక భాగాలు, కొన్ని మాదిరి ప్రశ్నలను చూద్దాం. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యెంకి చిలుక మనసె మనసు - ఎ.ఎన్‌.ఎస్‌.శంకరరావు 
‘‘నాకూ బసవరాజు అప్పారావుకూ నెయ్యిమేర్పడింది యెంకిపాటల కవి ద్వారా. సుబ్బారావూ నేనూ కాలేజీలో చదువుకునే వాళ్ళం... ‘ప్రేమకుంగల్గు కారణం బేమనగల?’ అంటూ అప్పారావు అలా పాడుతుండగానే అందుకునేవాడు సుబ్బారావు; రివ్వుమని తారాజువ్వలాగా గొంతు విసిరేవాడు. అప్పుడు నండూరి గొంతు కొండవాగు. గలగలలూ గంతులూ, సుడులూ వడులూ- ఒకచోట పుట్టి, ఒకదారిన ప్రవహించి, ఒకచోట కలిసిపోయేది. సుబ్బారావు పాట నిభృతసుందరం’’  - దేవులపల్లి కృష్ణశాస్త్రి 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శమంతకమణి రహస్యం - డా।। ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు
శమంతకమణి అంటే నిజంగా రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ప్రసాదించేదేనా? అయినట్టయితే ఆ బంగారం భౌతిక రూపంలోని కనకమా? లేదా ఆ మాట వెనక అంతరార్థం ఏమైనా ఉందా? అసలు ‘శం అంతకం’ అంటే ఏంటి? శమంతకమణి కథలోని నిగూఢార్థాలేంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చూడచూడ మాణిక్యాలు..! - చింతలపల్లి హర్షవర్ధన్‌ 
కొండలలో నెలకొన్న కోనేటిరాయుడి సొగసు చూడతరమా! చూపుతిప్పుకోనివ్వనంత చక్కదనంతో మెరిసిపోయే ఆ మూర్తిని ఎందరో తనవితీరా వర్ణించారు. వారిలో పదకవితా పితామహుడు అన్నమయ్య బాణీనే వేరు. అలిమేలుమంగాపతిని ఆపాదమస్తకం వర్ణిస్తూ ఆయన గానం చేసిన కీర్తన వింటుంటే, ఆ దివ్యమంగళ స్వరూపం అలా సాక్షాత్కరించేస్తుంది

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కర్షక కవి.. అభ్యుదయ రవి - అపర్ణశంకర్‌  
హలాన్ని పట్టి.. ధర్మఘర్మ జలాల చేరిక చేసి.. భువి ధాన్యపు మొలకలను ముంచెత్తడం మాత్రమే కాదు, అక్షరసేద్యం చేసి కవితార్తుల ఆకలి తీర్చగలిగినవారిలో దువ్వూరి రామిరెడ్డి ముఖ్యులు. కవికోకిలగా గుర్తింపు పొందినా, కర్షక పక్షపాతి అన్న మాటకు పొంగిపోయే మంచి మనిషి. సరళ పదజాలంతో, ఊహలకు తావు లేని వర్తమానాన్ని కన్నులకద్దినట్లు చూపించటంలో ఆయనది అందెవేసిన చేయి. ఇది ఆయన 125వ జయంతి సంవత్సరం. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పురాణ కథా పారిజాతం - స్రవంతి
‘‘మారన కథా విధానము జాఱలాడి/ కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి/ మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె/ నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు’’ అని వెంకట రామకృష్ణకవులు సరదాగానే అన్నా ‘మనుచరిత్ర’కు మూలం మారన రచనే. అదే ‘మార్కండేయ పురాణం.’ తొలి తెలుగు పురాణంగా ఇది సుప్రసిద్ధం.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పులిరాజు వెడలె పులిహోరను కలుపగ.. - సురా 
అరివీరభయంకర శత్రువులు ఒకరినొకరు తెలియక డీకొన్ననూ అచ్చట మౌనమే ఇరువురకూ శరణ్యము. బంధుజన పరివారమునందెవ్వరో ఒకరు ఎదురు పడ్డనూ అచ్చట వైరియగును. చాటుగ నిలుచుటకు సమ్మతి తెలిపిన అపరిచితుడెవ్వడో అచ్చట మిత్రుడగును. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలా ఇప్పటికీ నేనొక్కణ్నే! : మల్లాది వెంకట కృష్ణమూర్తి 
మల్లాది వెంకట కృష్ణమూర్తి.. తెలుగు పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరిది. 1970లో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, ఇప్పటి వరకు 109 పత్రికల్లో 3500కి పైగా కథలు, 1200కి పైగా వ్యాసాలు, 70కి పైగా వివిధ శీర్షికలు, సంపాదకత్వాలు, 106 నవలలు రాశారు. 22 సినిమాలు, 9 టీవీ ధారావాహికలకు కథలు అందించారు. రచయితగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న మల్లాదితో ‘తెలుగువెలుగు’ ముఖాముఖీ..  

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాసేకొద్దీ అర్థం చేసుకున్నా! : విశ్వ 
కథానాయకులను హుషారెత్తించే పాటలతో పరిచయం చేసినా.. ‘ఆశాపాశం..’ అంటూ ఆలోచనను రగిలించే గీతాలను గుండెల్లో మోగించినా.. ‘డోలే డోలే..’ అంటూ.. సొగసైన పదాలతో సరాగాలు అల్లినా.. ఆయనకే చెల్లింది! తెలుగు సినీ పాటకు సాహిత్యాన్ని, బాణీలను అందించడమే కాకుండా ప్రతినాయకులకు గాత్రాన్ని అరువిస్తూ దూసుకుపోతున్న బహుముఖ ప్రతిభాకెరటం విశ్వ.  ‘తెలుగువెలుగు’తో ఆయన తన ప్రయాణ విశేషాలను ఇలా పంచుకున్నారు.. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కథలు

కొత్తపెళ్లాం ముక్కుపుడక - ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు
కార్తవరాయుడిది చిరకాల కోరిక.
మనసులో గిలిగింతలు పెట్టే కోరిక.
ఆరు నూరైనా రాజీకి తావులేని కోరిక. 
మరి ఆ కోరిక తీరిందా? అతని కథేంటి? 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాపమ్మ సందుగ - రమాదేవి బాలబోయిన
దేవుని అర్రల సందుగల బాపమ్మ 
ఏదో దాచింది! ఆ అర్రలకు ఎవ్వలని 
రానియ్యది! సందుగ తాకనియ్యది!
అందుల బాపమ్మ ఏం దాచింది?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆనందార్ణవం  - సింహప్రసాద్‌ 
మొన్నటిదాకా ప్రవచనాలు చెప్పిన జగన్నాథశర్మ అకస్మాత్తుగా వాటిని ఆపేశారు! తర్వాత ఆయనలో ఏదో సంఘర్షణ, ఆవేదన. ఆయన ఇంటికి ఓ బాలుడొచ్చి అంతా మార్చేశాడు! ఆ పిల్లాడు ఎవరు?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిర్ణయం - మలిపెద్ది సూరిబాబు 
వసుధకి గొప్ప పెళ్లి సంబంధం వచ్చింది. 
కానీ, వాళ్ల నిబంధన గురించే ఆలోచిస్తోంది!
ఎటూ తేల్చుకోలేకపోతోంది! తల్లిని సలహా 
అడిగింది. అసలు ఆ నిబంధన ఏంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదేదో సామెత చెప్పినట్లు - చేగొండి రామజోగయ్య 
నిన్నటిదాకా అందరూ అభిమానించిన
సుశీలతో ప్రస్తుతం ఎవరూ మాట్లాడటంలేదు! 
ఆమె అంటేనే అంతా మండిపడుతున్నారు!
ఎందుకని, సుశీల చేసిన నేరమేంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెడ్‌లైట్‌ - భాగవతుల సత్యనారాయణమూర్తి 
కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని సామెత! మరి, లంచావతారులను దేంతో కొట్టాలి? అందరినీ పీడించుకుతినే భీమశంకరానికి ఊహించని దెబ్బే తగిలింది! అదేంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీనియర్‌ సిటిజన్‌ సుబ్బారావు - కె.కె.రఘునందన 
తెలిసినవారు పలకరిస్తే, సుబ్బారావు
తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. బ్యూటీ 
క్లినిక్‌కి వెళ్లి రూపం మార్చేసుకున్నాడు!
అసలు అతనికొచ్చిన ఇబ్బంది ఏంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రత్యేక శీర్షికలు

భాషాయణం
ఎరువుల సొమ్ము బరువుల సేటు
‘‘ఎరువుల సొమ్ము బరువుల సేటు
తియ్యాసేటు తీపుల చేటు’’
- పెళ్లికో, పేరంటానికో వెళ్లేటప్పుడు ఇతరుల నగలను అరువుగా తెచ్చుకుని అలంకరించుకుంటారు కొంతమంది. దీని వల్ల సమస్యే తప్ప సుఖం ఉండదనే ఉద్దేశంతో తెలంగాణలో వ్యవహరించే సామెత ఇది. తనది కాని సొమ్ము వల్ల బరువు తప్ప ఏమీ ఉండదనీ, ఆ సరుకుపోతే దాని విలువ ఇచ్చుకోవలసి ఉంటుందనే హితోక్తి ఇందులో ఉంది. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ - 1
అమ్మనయ్యాకే తెలిసింది!
ఎలా ఉన్నావ్‌ అమ్మా!
నేనూ.. నీ చిన్నకూతుర్ని. నేనిప్పుడు అమ్మనే అయినా, నీకు నేను పాపనే కదమ్మా! నేను అమ్మనైనప్పటినుంచీ నా ప్రతి అనుభవంలోనూ నువ్వే గుర్తొస్తున్నావమ్మా! నా అనుభూతులను నీతో పంచుకోవాలనిపించి ఇలా ఉత్తరం రాస్తున్నాను.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ - 2 
నన్నొదిలి ఆరేళ్లయిందానే..!
ప్రియమైన నైనమ్మకు..
నేనపుడూ ఆరో తరగతి సదువుతున్న.. ఓనాడు సిన్న తాతోళ్లతోని నువ్వు, తాత కలిసి యాదిగిరిగుట్ట సూడనికపోయిరు. గప్పుడు కూడా నీకు నాకోసం ఏమన్న తేవాలనే యాదికున్నాదే..!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమస్యా వినోదం
ఎలుక ఓటు వేసె పిల్లి గెలువ
* మీ పూరణం చేరేందుకు గడువు: ప్రతినెలా 18వ తేదీ. మీ పూరణాలను మెయిల్, ఎస్‌.ఎం.ఎస్, వాట్సప్‌ల ద్వారా కూడా పంపవచ్చు.
* ఏ నెలలో ఇచ్చిన సమస్య ఆ నెలలోనే పూరించి పంపాలి. రచయిత ఒక పద్యం మాత్రమే పంపాలి. పూరణం సరళ భాషలో రసానుభూతిని కలిగించేలా ఉండాలి.
* వచ్చిన పూరణాల్లో అత్యుత్తమమైన అయిదింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం.
* ప్రచురితమైన ఒక్కో పూరణానికి Rs100 బహుమతి. 
బహుమతికి ఎంపికైన పూరణల కోసం...

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాటకట్టు 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింజిరి 
వివాహభోజనంబు చిత్రంలో స్త్రీ ద్వేషిగా రాజేంద్రప్రసాద్‌ చెప్పే సంభాషణలు ఇవి. కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం మీరూ ఓసారి చేయండి మరి..
సోదరులారా! మీ అందరికి తెలుసు. నేను స్త్రీ ద్వేషిని. ఈ జీవితాన్ని ఇలాగే ఎలమార్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలో పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేము ఇద్దరం మగవాళ్లమే. మా సెక్రెటరీ కైలాసం మగవాడు. మా పనిమనిషి సన్యాసి మగవాడు. ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉండే దేవుడి బొమ్మలు కూడా మగవాళ్లవే.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొండ అద్దమందు

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనక్కి ...

మీ అభిప్రాయం