కారుమబ్బు చీల్చవోయ్‌.. కాంతిరేఖ చూపవోయ్‌!

  • 42 Views
  • 0Likes
  • Like
  • Article Share

వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెపూలను ఆఘ్రాణిస్తే కలిగే గొప్ప అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అన్నారు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. శబ్ద సంపద, సౌష్ఠవం, భావ వ్యక్తీకరణ, శ్రావ్యతల్లో తెలుగు మేటి.. దీనికి విభిన్న స్రవంతుల్ని తనలో లీనం చేసుకునే సమర్థత ఉంది అన్నారు జె.బి.ఎస్‌.హోల్డెన్‌. తెలుగు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి సాధన కోసం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలివి..!
(1)    ప్రాఙ్నన్నయ యుగంలో సంస్కృత శాసనాలలో ‘చేంబ్రోలు’ అనే తెలుగు పేరు ఏవిధంగా సంస్కృతీకరణకు గురైంది? 

    అ) చిన్నపుర      ఆ) చెంచెఱువు      ఇ) తామ్రపురీ     ఈ) చూయిపాక
(2) జయసింహ వల్లభుని విప్పర్తి శాసన కాలం? 
    అ) 542  ఆ) 580    ఇ) 670  ఈ) 641
(3) ‘‘వివిధోత్తుంగ తరంగ ఘట్టిత చలద్వే లావనై లావలీ’’ అనే సముద్రవర్ణన చేసిన పద్యకర్త? 
    అ) తిక్కన  ఆ) ఎర్రన     ఇ) నన్నయ  ఈ) శ్రీనాథుడు
(4) అన్య సాహిత్యాల నుంచి ఎరువుగా రాని సాహితీ ప్రక్రియ?
    అ) పురాణం         ఆ) ఇతిహాసం     ఇ) ఉదాహరణ కావ్యం     ఈ) దండకం
(5) పాల్కురికి సోమన ‘బసవ పురాణం’ అనేది..? 
    అ) తొలి స్వతంత్ర పురాణం    ఆ) తొలి ద్విపద రచన
    ఇ) తొలి వీరశైవ పురాణం    ఈ) అన్నీ
(6) ‘ఎవ్వని వాకిట నిభమద పంకంబు, రాజభూషణ రజరాజినడుగు’ పద్యకర్త? 
    అ) తిక్కన      ఆ) శ్రీనాథుడు        ఇ) పెద్దన     ఈ) భట్టుమూర్తి
(7) దోనయామాత్యుని ‘సస్యానందం’ ఏ శాస్త్ర గ్రంథం? 
    అ) గణిత  ఆ) వర్ష   ఇ) సామాన్య   ఈ) సాంఘిక 
(8) శ్రీనాథుడి ఏ రచనలో ‘చిరుతొండనంబి కథ’ కనిపిస్తుంది?
    అ) భీమ ఖండం    ఆ) కాశీ ఖండం
    ఇ) హరవిలాసం    ఈ) శృంగార నైషధం
(9) ‘నవనాథచరిత్ర’ను గౌరనకు పూర్వమే ఏ కవి పద్య ప్రబంధంగా రచించాడని చెబుతారు? 
    అ) చదలవాడ మల్లన        ఆ) శ్రీగిరి కవి
    ఇ) పిల్లలమర్రి పినవీరభద్రుడు       ఈ) బైచరాజు వేంకటనాథుడు
(10) నంది మల్లయ, ఘంట సింగనలు రచించిన ‘ప్రబోధ చంద్రోదయ’ కావ్యంలోని ప్రధాన రసం? 
    అ) శృంగారం   ఆ) శాంతం      ఇ) వీరం    ఈ) కరుణం
(11) ‘శయ పూజాంబుజముల్‌ ఘటిందడబడన్‌ జన్దోయి లేగౌనుపై’ అనే ప్రసిద్ధ పద్యం ఏ ప్రబంధంలోది? 
    అ) మనుచరిత్ర        ఆ) వసుచరిత్ర
    ఇ) ఆముక్త మాల్యద        ఈ) కళాపూర్ణోదయం
(12) ‘శిష్ట్లాది గొప్ప విప్లవారంభం’ అన్నదెవరు? 
    అ) ముద్దుకృష్ణ    ఆ) పఠాభి    
    ఇ) పురిపండా        ఈ) ఆరుద్ర
(13) ‘శివ రామాభ్యుదయము’ కర్త? 
    అ) మంత్రి ప్రెగడ సూర్యప్రకాశం      ఆ) పోడూరి పెదరామామాత్యుడు
    ఇ) లంకా మృత్యుంజయుడు     ఈ) అయ్యలరాజు రామభద్రుడు
(14) చిత్రకవి సింగరాచార్యుని రచన? 
    అ) రాఘవ వాసుదేవీయం  ఆ) రాఘవయాదవీయం
    ఇ) సౌగంధిక పారిజాతం  ఈ) అచలాత్మజా పరిణయం
(15) ఈ కింది వాటిలో తిట్టు కవిత్వానికి చెందిన రచన? 
    అ)చంద్రరేఖా విలాపం  ఆ) నైషధ పారిజాతీయం
    ఇ)రాఘవ వాసుదేవీయం  ఈ) రామకృష్ణోఖ్యానం
(16) పొన్నికంటి తెలగన ‘యయాతి చరిత్ర’ ఎన్ని ఆశ్వాసాల అచ్చతెనుగు కావ్యం? 
    అ) 4  ఆ) 5    ఇ) 6     ఈ) 8
(17) కందుకూరి రుద్రకవి రచించిన సాంఘిక ప్రబంధం? 
    అ) సుగ్రీవ విజయం     ఆ) నిరంకుశోపాఖ్యానం
    ఇ) జనార్థనాష్టకం      ఈ) అన్నీ
(18) సారంగుతమ్మయ్య ‘వైజయంతీ విలాసం’ను ఎవరికి అంకితమిచ్చాడు? 
    అ) శివునికి          ఆ) శ్రీరామచంద్రునికి
    ఇ) మల్లికార్జునస్వామికి  ఈ) విజయరాఘవ నాయకునికి
(19) రంగాజమ్మ ఏ రాజు ద్వారా కనకాభిషేకం చేయించుకుంది? 
    అ) రఘునాథ నాయకుడు      ఆ) విజయ రాఘవ నాయకుడు
    ఇ) శహాజీ              ఈ) తుక్కోజీ
(20) రంగాజమ్మ రచించిన మన్నారు దాసవిలాసాన్ని యథాతథంగా గ్రహించి పాత్రల పేర్లు మార్చి ‘అల్లాడ విజయ సింహభూపతి సింహవిలాసం’ పేరిట తన పేర ప్రకాశం చేసుకున్న కవయిత్రి? 
    అ) కృష్ణాజీ    ఆ) రంగాజీ  ఇ) చంద్రరేఖ    ఈ) సౌందరి
(21) ‘శిశిరోషస్సు’ కర్త? 
    అ) జయధీర్‌ తిరుమలరావు    ఆ) వరవరరావు
    ఇ) కె.వి.రమణారెడ్డి        ఈ) చెరబండరాజు
(22) ‘ఎప్పుడూ ఇంతే’ ఎవరి ఏకాంకిక? 
    అ) విశ్వనాథ కవిరాజు  ఆ) భమిడిపాటి కామేశ్వరరావు
    ఇ) భమిడిపాటి రాధాకృష్ణ       ఈ) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
(23) భావాభ్యుదయ కవి? 
    అ) రెంటాల గోపాలకృష్ణ    ఆ) దాశరథి 
    ఇ) కాళోజీ      ఈ) తిలక్‌
(24) ‘తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం’ ఎవరి రచన?
    అ) జి.వి.సుబ్రమణ్యం        
    ఆ) కొత్తపల్లి వీరభద్రరావు
    ఇ) నేలటూరి వేంకటరమణయ్య 
    ఈ) పింగళి లక్ష్మీకాంతం
(25) ‘దారినపోయే దానయ్య’ హాస్య నాటక కర్త? 
    అ) ఆత్రేయ     ఆ) అనిసెట్టి           ఇ) పినిసెట్టి   ఈ) బుచ్చిబాబు
(26) రమేశచంద్ర దత్తు ‘లేక్‌ ఆఫ్‌ పామ్స్‌’ నవలను చిలకమర్తి ఏ పేరుతో ఆంధ్రీకరించారు? 
    అ) హేమలత        ఆ) సుధా శరత్‌చంద్ర
    ఇ) అహల్యబాయి    ఈ) కర్పూరమంజరి
(27) ‘మద్రాసు కథలు’ రాసిందెవరు?
    అ) వెదురుమూడి శేషగిరిరావు  ఆ) వెంకట సుబ్బయ్య    ఇ) చింతా దీక్షితులు    ఈ) మాడపాటి హనుమంతరావు
(28) ‘సాహిత్య ప్రయోజనం’ విమర్శ గ్రంథకర్త? 
    అ) ఆర్‌.యస్‌.సుదర్శనం           ఆ) ఆర్‌.వి.యస్‌. సుందరం    
    ఇ) కొడవటిగంటి కుటుంబరావు     ఈ) అద్దేపల్లి రామమోహనరావు
(29) ‘తెలుగు సమాసాల పరిశీలన’ పేరుతో పరిశోధన చేసిందెవరు?    
    అ) కూచిబొట్ల హరి        ఆ) జాస్తి సూర్యనారాయణ
    ఇ) జి.వి.జి.కృష్ణమాచార్యులు            ఈ) చల్లా రాధాకృష్ణ శర్మ
(30) ‘తెలుగు సాహిత్యంలో తమిళ మౌలికత’ అంశం మీద పరిశోధన చేసిందెవరు?
    అ) చల్లా రాధాకృష్ణ శర్మ     ఆ) జి.ఎస్‌.రెడ్డి    
    ఇ) కోరాడ మహాదేవశాస్త్రి            ఈ) చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి
(31) ‘బాకీ కథలు’ కర్త?
    అ) కాళీపట్నం రామారావు    ఆ) రావిశాస్త్రి    
    ఇ) మద్దిపట్ల సూరి         ఈ) రాంభట్ల కృష్ణమూర్తి
(32)    కోలాచలం శ్రీనివాసరావు రాసిన మొదటి నాటకం? 
    అ) సుల్తానా చాంద బీబీ       ఆ) విజయనగర రాజ్య పతనము    
    ఇ) సునందినీ పరిణయము  ఈ) చంద్రగిర్యభ్యుదయము
(33) పాలవేకరి కదిరీపతి ఏ శతాబ్దపు కవి? 
    అ) 15వ   ఆ) 17వ      ఇ) 19వ    ఈ) 20వ
(34) ‘యక్షగాన సరణి’ని, జాదురు(జాజర)లను పేర్కొన్న ప్రాచీన కవి? 
    అ) ఎర్రన    ఆ) చదలవాడ మల్లన     ఇ) శ్రీనాథుడు    ఈ) తిక్కన
(35) సి.పి.బ్రౌన్‌ సేకరించిన జానపద గేయం? 
    అ) కామమ్మ కథ     ఆ) కుమార రాముని కథ
    ఇ) పల్నాటి వీరచరిత్ర     ఈ) అన్నీ
(36) ఏ పురాణంలో అంధకులు యాదవ జాతికి చెందినవారని, ద్వారకా నగర సంరక్షులని పేర్కొన్నారు? 
    అ) మత్స్య    ఆ) భాగవత  ఇ) వాయు    ఈ) బ్రహ్మ
(37) ‘అక్షరములు సూక్తులార్యులకు గర్ణరసాయన లీల గ్రాలగాన్‌’ అన్న పలుకులెవరివి? 
    అ) నన్నెచోడుడు     ఆ) పాల్కురికి సోమన
    ఇ) నాచన సోమన    ఈ) తిక్కన
(38) తాలవ్యీకరణం క్రీ.పూ.30లకూ క్రీ.శ. మొదటి కొద్ది శతాబ్దాలకు మధ్యకాలంలో జరిగి ఉంటుందని భావించిందెవరు? 
    అ) కోరాడ  ఆ) కాల్డెవెల్‌  ఇ) బరో   ఈ) భద్రిరాజు


వెనక్కి ...

మీ అభిప్రాయం