‘పద్మవ్యూహం’ నాటకకర్త?

  • 42 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘కవుల కంటె తుహిన కర్పూర నిభకీర్తి/ తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి!/ సాహితీ తరంగ సంగీత రసధుని/ దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్నారు నండూరి రామకృష్ణమాచార్యులు. సరిగమపదనిసలకు ఆలవాలమైన భాష మనది. తెలుగు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సాధన కోసం రూపొందించిన మాదిరి ప్రశ్నలివి..!  
1. సముద్ర మథన వృత్తాంతం ఉన్న శ్రీనాథుడి రచన? 

    అ) శృంగార నైషధం    ఆ) కాశీఖండం     
    ఇ) భీమఖండం        ఈ) హరవిలాసం
2. ‘‘ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధురీ’’ పద్యకర్త? 
    అ) పెద్దన  ఆ) తిమ్మన  ఇ) భట్టుమూర్తి    ఈ) ధూర్జటి
3. ‘అభినవ కౌముది’ వృత్తాంతం ఏ ప్రబంధంలోది? 
    అ) వసుచరిత్ర     ఆ) కళాపూర్ణోదయం  ఇ) పాండురంగ మాహాత్మ్యం  ఈ) రామాభ్యుదయం
4. ‘అమృతాంజన’ శతక కర్త?    
    అ) కరి నారాయణాచార్యులు  ఆ) వావిలికొలను సుబ్బారావు    
    ఇ) అద్దంకి గంగాధర కవి
    ఈ) మండపాక పార్వతీశ్వర కవి
5. అర్థ వ్యవస్థలో సరాసరి అన్వయించ గలిగిన భావప్రకటన కనిష్ఠాంశం? 
    అ) వర్ణం  ఆ) పదాంశం    ఇ) సవర్ణం  ఈ) వాక్యం
6. ‘భోగట్టా’ ఏ భాషాపదం? 
    అ) తమిళం    ఆ) ఒరియా  ఇ) కన్నడం  ఈ) తెలుగు
7. ‘కాడి’ నవలా కర్త? 
    అ) కె.కె.మీనన్‌     ఆ) ఎస్‌.వెంకటరామారెడ్డి      ఇ) కె.ఎన్‌.వై.పతంజలి   ఈ) చిలుకూరి దేవపుత్ర
8. ‘నల్లజర్ల రోడ్డు’ కథా రచయిత?    
    అ) కవనశర్మ    
    ఆ) మల్లాది రామకృష్ణశాస్త్రి    
    ఇ) తిలక్‌        ఈ) కరుణ కుమార్‌
9. ‘యువతరం శివమెత్తితే / నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా? చీకటే మాసిపోదా?’’ అని యువతను చైతన్యపరుస్తూ కవిత్వం రాసిందెవరు? 
    అ) శ్రీశ్రీ ఆ) శివసాగర్‌    ఇ) నార్ల చిరంజీవి     ఈ) కాళోజీ
10. ‘‘దరిద్రుడు బిడ్డలతో నా శరీరాన్ని పుచ్చించి/ తన జాతిని కొనసాగిస్తే/ ధనికుడు మరిన్ని మందులతో/ నా గర్భాన్ని ఎడారిలా ఎండగడుతున్నాడు’’ అన్నదెవరు? 
    అ) జయప్రభ     ఆ) వసంత కన్నబిరాన్‌     ఇ) శ్రీమతి     ఈ) ఓల్గా
11. ‘కంబుకంధర చరిత్ర’ నవలాకర్త? 
    అ) తడకమళ్ల కృష్ణారావు     ఆ) జి.వి.కృష్ణారావు     ఇ) నరహర గోపాల కృష్ణమ శెట్టి    ఈ) కందుకూరి
12. భండారు అచ్చమాంబ కథ? 
    అ) లలిత    ఆ) విశాఖ ఇ) ధనత్రయోదశి      ఈ) శారద
13. ‘వస్తు కవిత’ను ‘నిసర్గ కవిత’ అని, నిసర్గ కవిత అంటే ‘సహజ కవిత’ అని పేర్కొన్నదెవరు? 
    అ) ఖండవల్లి లక్ష్మీరంజనం   ఆ) కోరాడ రామకృష్ణయ్య
    ఇ) అమరేశం రాజేశ్వరశర్మ  ఈ) వేదం వేంకటరాయశాస్త్రి
14. నన్నెచోడుడు తన ‘కుమార సంభవాన్ని’ ఏమని పేర్కొన్నాడు? 
    అ) దివ్యసుకృతి      ఆ) దివ్య కథ      ఇ) సద్రస బంధురమగు ప్రబంధము    ఈ) అన్నీ
15. శ్రీతో ప్రారంభమై మంగళ మహాశ్రీతో ముగిసిన పాల్కురికి సోమన రచన?     
    అ) అనుభవసారము     ఆ) చతుర్వేద సారము
    ఇ) చెన్నమల్లు సీసములు   ఈ) పండితారాధ్య చరిత్ర
16. అన్యసాహిత్యాల నుంచి రాని సాహిత్య ప్రక్రియ? 
    అ) కథాకావ్యం        ఆ) చారిత్రక కావ్యం            ఇ) ఇతిహాసం        ఈ) ఉదాహరణం 
17. ‘‘ఎవ్వరి దాన వీవు హరిణేక్షణ! యెయ్యది నీకు బేరు’’      పద్యం ఏ కావ్యంలోది? 
    అ) హంసవింశతి    ఆ) కేయూరబాహు చరిత్ర        ఇ) మనుచరిత్ర        ఈ) వసుచరిత్ర
18. ‘‘అజినాషాఢధరుండు ఫ్రౌఢతర భాషాతి ప్రగల్భుండు’’ అన్న పద్యం ఏ కావ్యంలోది? 
    అ) హరవిలాసం    ఆ) కాశీఖండం       ఇ) భీమఖండం    ఈ) శృంగారనైషధం
19. ‘‘తెలుగులో మొట్టమొదటి ఆధునిక కవి గురజాడ. ఆయన ప్రారంభించిన నవ్య కవితా రీతి ఆధునికతకి ఆరంభం’’ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందెవరు? 
    అ) వెల్చేరు నారాయణరావు    ఆ) పింగళి లక్ష్మీకాంతం
    ఇ) కడియాల రామమోహనరాయ్‌    ఈ) కె.వి.రమణారెడ్డి
20. ‘‘కన్నియను పెండ్లియాడునొ, కన్నె తండ్రి యర్పణము జేయు శుల్కదివ్యాప్సరను పెండ్లియాడునో’’ అన్న పలుకులెవరివి? 
    అ) వేదుల సత్యనారాయణ శాస్త్రి     ఆ) రాయప్రోలు సుబ్బారావు   ఇ) బసవరాజు అప్పారావు    ఈ) వేంకట పార్వతీశ్వర కవులు
21. ‘భగ్నహృదయం’ కర్త? 
    అ) విశ్వనాథ        ఆ) చలం     ఇ) దువ్వూరి రామిరెడ్డి    ఈ) కవికొండల వెంకటరావు
22. ‘‘ఊహాగానం- ఇతర కృతులు’ ఎవరి రచన? 
    అ) అబ్బూరి రామకృష్ణారావు ఆ) మల్లవరపు విశ్వేశ్వరరావు
    ఇ) విశ్వనాథ             ఈ) కాటూరి వేంకటేశ్వరరావు
23. శ్రీశ్రీ ఏ ధోరణికి నిదర్శనంగా ‘‘5, 3, 2 ఆముక్తమాల్యద ఆటవెలది ద్విపదకత్తగారు’ అని ప్రకటించారు? 
    అ) డాడాయిజమ్‌    ఆ) సర్రియలిజమ్‌      ఇ) ఇమేజిజం      ఈ) ఎగ్జిస్టెన్షియలిజమ్‌
24. ‘‘మానవ స్వాతంత్య్ర మాగ్నకార్టాలైన కర్తాక్షరాలతో వ్రాలు చేసేశాను’’ అన్న కవి? 
    అ) అనిశెట్టి సుబ్బారావు        ఆ) తెన్నేటి సూరి
    ఇ) ఆవంత్స సోమసుందర్‌    ఈ) రెంటాల గోపాలకృష్ణ


25. ‘‘కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి దివ్యంగా, బాధా దగ్ధ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా’’ అని ప్రపంచపు బాధని తన కంఠంలో పలికించిన కవి? 
    అ) బోయి భీమన్న    ఆ) ఆలూరి భైరాగి    ఇ) గోపాల చక్రవర్తి    ఈ) ఆరుద్ర
26. ‘‘ప్రయోజనం తండ్రిగా, పరమ సౌందర్యం తల్లిగా, పలికే ప్రతి పలుకు రసానంద కల్పవల్లిగా, నా దారి నాది’’ అని కవితా ప్రయోజనాన్ని, కవితా తత్త్వాన్ని వెల్లడించిందెవరు? 
    అ) కుందుర్తి        ఆ) కె.వి.రమణారెడ్డి        ఇ) పురిపండా        ఈ) పఠాభి
27. ‘‘జన్మమెత్తిన మానవునకు జీవితమె పరమధనం, అయితే అది ఒకమారే, అతని కొసగబడిన వరం’’ అన్నదెవరు?
    అ) అజంతా            ఆ) ఆవంత్స సోమసుందర్‌
    ఇ) గంగినేని వెంకటేశ్వరరావు  ఈ) బెల్లంకొండ రామదాసు
28. తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’కి ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? 
    అ) 1960    ఆ) 1970        ఇ) 1965    ఈ) 1975
29. శీలా వీర్రాజు రచన?    
    అ) ముళ్లరెమ్మ      ఆ) కొడిగట్టిన సూర్యుడు     ఇ) అద్దె గది      ఈ) అన్నీ
30. ‘కవిసేన’ సభ్యుల రచనలతో వెలువడిన వచన కవితా సంకలనం? 
    అ) అంతర్జాల       ఆ) కొమ్ములు చీల్చుకుని వస్తున్న పూలు    ఇ) అంతర్లయం      ఈ) క్షణికం
31. ‘సాహిత్య దర్శనం’ విమర్శా గ్రంథకర్త?
    అ) శిష్టా లక్ష్మీకాంతశాస్త్రి       ఆ) కె.వి.ఆర్‌.నరసింహం        
    ఇ) జనమంచి శేషాద్రిశర్మ       ఈ) శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి
32. ‘తెలుగు నవలా సాహిత్య వికాసం’ గ్రంథకర్త? 
    అ) పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు        ఆ) వల్లంపాటి వెంకటసుబ్బయ్య        
    ఇ) మొదలి నాగభూషణశర్మ    ఈ) బి.వి.కుటుంబరావు
33. కోరాడ రామచంద్రశాస్త్రి ‘మంజరీ మధుకరీయం’ ఏ సంవత్సరంలో వెలువడింది? 
    అ) 1852     ఆ) 1858      ఇ) 1860    ఈ) 1862
34. ‘పద్మవ్యూహం’ నాటకకర్త? 
    అ) విశ్వనాథ      ఆ) కాళ్లకూరి నారాయణరావు      ఇ) త్రిపురనేని       ఈ) చలం
35. రాఘవయ్య పాత్ర ఉన్న నవల?
    అ) అతడు అడవిని జయించాడు     ఆ) ఊబిలో దున్న    ఇ) చదువు   ఈ) అల్పజీవి
36. ‘లోనారసి’ పదప్రయోగం చేసిన కవి? 
    అ) పెద్దన    ఆ) తిక్కన  ఇ) తిమ్మన    ఈ) నన్నయ
37. రెక్కలు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందని సుగమ్‌ బాబు పేర్కొన్నారు? 
    అ) 2000    ఆ) 2002       ఇ) 2008    ఈ) 2010
38. ‘మణిపూసలు’ ప్రక్రియ సృష్టికర్త?
    అ) విశ్వేశ్వర వర్మ భూపతిరాజు         ఆ) నూతక్కి రాఘవేంద్రరావు
    ఇ) వడిచర్ల సత్యం        ఈ) భీంపల్లి శ్రీకాంత్‌
39. ఆచార్య ఎన్‌.గోపి నానీలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో సృష్టించారు? 
    అ) 1992    ఆ) 1995     ఇ) 1997     ఈ) 1999
40. ‘నాడీ జంఘుని వృత్తాంతం’ భారతం ఏ పర్వంలోది? 
    అ) మౌసల    ఆ) అనుశాసనిక      ఇ) శాంతి    ఈ) ఆశ్రమవాస
41. ‘జానపద సంగీతం’ మీద పరిశోధన చేసిందెవరు? 
    అ) నాయని కృష్ణకుమారి   ఆ) వింజమూరి సీతాదేవి
    ఇ) టేకుమళ్ల అచ్యుతరావు  ఈ) రఘుమారెడ్డి
42. అష్టాదశ పురాణాల మాదిరిగానే జైనుల్లోని పురాణాలెన్ని? 
    అ) 18     ఆ) 20      ఇ) 24      ఈ) 42


వెనక్కి ...

మీ అభిప్రాయం