ఎల్లలు లేని చర్చావేదిక ‘వీధి అరుగు’

  • 123 Views
  • 3Likes
  • Like
  • Article Share

ప్రపంచ చర్చా వేదిక ‘వీధి అరుగు’ కార్యక్రమం జనవరి 31న నార్వే భూమికగా 16 దేశాల ప్రవాస తెలుగువాళ్ల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 నుంచి ఎనిమిది గంటల వరకు జరిగిన తొలి అంతర్జాల చర్చా వేదికలో నార్వేలోని భారత రాయబారి బి.బాలభాస్కర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. అవధాని గరికిపాటి నరసింహారావు విశిష్ట అతిథిగా మాట్లాడారు. తెలుగు సంస్కృతిలో గొప్ప స్థానం ఉన్న వీధి అరుగు పేరు మీదగా చర్చా కార్యక్రమం ప్రారంభించడం గొప్ప ఆలోచన అని బాలభాస్కర్‌ అన్నారు. ఒక తరం అనుభవాలు, వాళ్లు ఆర్జించిన విజ్ఞానాన్ని మరో తరానికి అందించడంలో మాతృభాష ప్రధాన భూమికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘వీధి అరుగు’ ద్వారా తెలుగు భాష, సంస్కృతి ముందు తరాలకు అందాలని ఆకాంక్షించారు. వీధి అరుగు గొప్పదనం, తెలుగు భాషా సంస్కృతుల విశిష్టత గురించి గరికిపాటి ప్రసంగించారు. ప్రపంచంలో ఎవరెక్కడున్నా జన్మభూమిని మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఘంటసాల, అడివి బాపిరాజు, నటరాజ రామకృష్ణ, నేరెళ్ల వేణుమాధవ్‌ లాంటి తెలుగు దిగ్గజాల ప్రతిభాపాటవాల గురించి ఆయన మాట్లాడారు. ప్రసంగం మధ్యలో చక్కని పద్యాలు, చమత్కారాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమాన్ని నిబద్ధతతో నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం