తెలుగువెలుగు ఫిబ్రవరి సంచిక విశేషాలు

  • 974 Views
  • 48Likes
  • Like
  • Article Share

ప్రత్యేక వ్యాసాలు... ప్రముఖుల ముఖాముఖిలు, వ్యాసాలు, కవితలు, ప్రేమలేఖలు మరెన్నో శీర్షికలతో మీ ముందుకు వచ్చింది తెలుగువెలుగు ఫిబ్రవరి సంచిక... 
మీరు teluguvelugu.eenadu.net ‌లో ముందుగా రిజిస్ట్రర్‌ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్‌ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.

పొట్టికి లేదు పోటీ - శంకరనారాయణ
‘‘మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు’’ అని మహా కవి గురజాడ అప్పారావు చెప్పారు గానీ అది సరికాదు. ఎవరు మంచి? ఎవరు చెడ్డ ఎవరు తేల్చి చెప్పగలరు! అలా కాకుండా పొట్టి పొడుగు అనేవి రెండు వర్గాలు అని ఉంటే అదిరిపోయేది. ఈ రెండింటిలో పొట్టికి లేదు పోటీ అంటే తిరుగులేదు.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాది కవితా కులం 
‘‘పద్యం కమ్మగా పాడువాడు.. పద్యవిద్యను కాపాడువాడు.. పద్యద్వేషనలతో రాపాడువాడు’’ అంటూ ఆశావాది ప్రకాశరావును కీర్తించారు సినారె. కఠినమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ఎదురొడ్డి అష్టావధానిగా ఎదిగారు ఆశావాది. తెలుగువారికే సొంతమైన అవధాన విద్యకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని సముపార్జించి పెట్టారు. పద్యమే శ్వాసగా జీవిస్తున్న ఆయనతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆదివాసీ నృత్యంలో అద్వితీయ కేతనం 
నెమలీకల టోపీతో, బండారు సంచి నడుముకి చుట్టుకుని, పులిచర్మం ధరించి విలక్షణమైన ఆహార్యంతో చేసే గోండు గిరిజన నాట్యరూపమే గుస్సాడీ. అయిదు దశాబ్దాలుగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, వేలమందికి శిక్షణ ఇస్తూ గుస్సాడి రాజుగా పేరుపొందిన కనక రాజుకి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మృదంగ మహారాణి 
తండ్రి నుంచి వారసత్వంగా మృదంగాన్ని అందిపుచ్చుకున్న సుమతి.. ఆ తర్వాత భర్త, ప్రముఖ విద్వాంసులు దండమూడి రామ్మోహనరావు శిష్యరికంలో రాటుదేలారు. వేల కచ్చేరీల్లో మహామహులతో కలిసి ప్రదర్శనలిచ్చారు. ఆరు దశాబ్దాలుగా సంగీత సేవ చేస్తున్న ఆవిడ ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికయ్యారు. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాయులీన మాంత్రికుడు 
చిన్ననాట పొలం పనులు చేసిన ఆ చేతులే వయొలిన్‌ మీద సుమధుర స్వరాలు పలికించాయి. గురువును వెతుక్కుంటూ రూపాయితో విజయవాడ వచ్చిన ఆయన ఆ తర్వాత కాలంలో దేశవిదేశాల్లో కచ్చేరీలు చేసి, ఎందరికో సంగీత పాఠాలు బోధించారు. ఈ ఏడాదికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన అన్నవరపు రామస్వామి ప్రస్థానమిది..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏ చోట ఉన్నా.. నీ వెంట లేనా! - డి.కస్తూరిరంగనాథ్‌ 
‘‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. చేసినాను ప్రేమ క్షీరసాగర మథనం.. మింగినాను హలాహలం’’.. ఇది ఓ ప్రేమికుడి హృదయఘోష. క్షీరసాగర మథనంలో అమృతంతో పాటు హాలాహలం పుట్టినట్టు, ప్రేమసాగర మథనంలో మధురానుభూతులు, మరపురాని జ్ఞాపకాలతోపాటు విరహవేదనలు, విషాద కథలూ జనిస్తాయి. ‘‘మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది’’ అంటూ మనసు గాయాల బాధను పంటిబిగువన ఓర్చుకునే ప్రేమికులెందరో! ఆ భగ్న హృదయాల ప్రణయ లోతులను చూడాలంటే సినీ సాహితీ సాగరంలోకి ప్రవేశించాల్సిందే!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజీపడని విమర్శకుడు శిల్పమెరిగిన కథకుడు - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
‘శ్రీశ్రీ’ అనే పేరుతో ప్రసిద్ధుడైన రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. అలాగే ‘రా.రా’ పేరిట ప్రసిద్ధుడైన రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి. ఈ ఇద్దరి మధ్య ఈ సామ్యం ఉండటం ఒక వాస్తవం కాగా, శ్రీశ్రీ రారాను క్రూరుడైన విమర్శకుడని నిర్వచించడం మరో వాస్తవం. ఈ ఇద్దరూ మార్క్సిస్టు సాహిత్యం తానులో పోగులే.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతరించే భాషల జీవనాలుక! 
ప్రపంచీకరణ, ఇతర కారణాల వల్ల ఏటా ప్రపంచంలో ఎన్నో భాషలు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు మానవ సమూహాల జీవన వాహికలుగా నిలిచినవే. వారి పురోగతికి తోడ్పడినవే. ఇవి అంతరించడమంటే ఒక జాతి సంస్కృతి, సంగీతం, కళలు లాంటివన్నీ కనుమరుగవడమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే అంతరించే భాషల్ని పరిరక్షించేందుకు శ్రమిస్తోంది ‘వికీటంగ్స్‌’. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా ఈ సంస్థ నిస్వార్థ కృషి మీద ప్రత్యేక వ్యాసమిది..

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కటకటాల కథలూ.. కన్నీళ్లూ! - డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 
పదహారణాల ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి. నలభై ఆరు సంవత్సరాల ఆళ్వారుస్వామి జీవితం పలు పోరాటాల అనుభవసారం. చెదరని చిరునవ్వుతో అనేక బాధల్ని ఎదుర్కొన్న ఆయన దాశరథి చెప్పినట్టు ‘‘నిత్య ధారావాహిని వంటి జీవన విధానం’’తో బతికిన రచయిత. ప్రజాకవి కాళోజీ, మహాకవి దాశరథి ప్రాణపాత్రుడైన వట్టికోట వారిద్దరిలానే ఆనాటి నిజాం వ్యతిరేక ఉద్యమ దృశ్యాల్ని తన రచనల్లో ఆవిష్కరించారు. తాను స్వయంగా అనుభవించిన జీవితపు వాతావరణాన్నే తన రచనల్లో చూపించారు. ‘తెలంగాణ గోర్కీ’గా మన్ననలందుకున్న వట్టికోట కథా సంపుటి ‘జైలు లోపల’. 1952లో ప్రచురణ పొందిన ఈ సంపుటిలోని కథలు ఆనాటి తెలంగాణ వర్ధమాన కథా రచయితలకు గొప్ప నమూనాలుగా నిలిచాయి.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాల్పనిక కావ్య మణిదీపం - ఎస్‌.ధర్మారావు 
దేవకార్య నిర్వహణలో పట్టువిడుపులు తెలిసిన కార్యశీలి, రాజతంత్ర వ్యూహంలో రాజన్యులను మించిన బుద్ధిశాలి, కార్యసాధనలో అసామాన్య ప్రతిభ చూపిన శుచిముఖి అనే హంస ప్రధాన భూమికగా పింగళి సూరన చేసిన అద్భుత కావ్యసృష్టి ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’. కావ్యకథానాయకులకు సమంగా యుక్తితో కార్యసఫలతకు యత్నించిన హంస మేధోక్తికి నిలువుటద్దం ఈ కావ్యం. ఇందులో రచనా చమత్కృతి పరంగా సూరన చేసిన కనికట్టు, నాటకీయతలో రసపట్టు, ఆయా శాస్త్రాల మీద ఆయనకున్న అద్భుత పట్టు పాఠకులను అబ్బురపరుస్తాయి. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు వికీకి దన్ను! 
అంతర్జాలంలో ప్రాంతీయ భాషల్లో సమాచారం, విజ్ఞానానికి పట్టం కట్టేందుకు హైదరాబాదులోని అంతర్జాతీయ సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (ట్రిపుల్‌ ఐటీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం వికీపీడియాలో, డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రాంతీయ భాషలు విస్తృతంగా వెలిగేందుకు 2019లో డిసెంబరులో ‘ఇండిక్‌ వికీ ప్రాజెక్టు’ను ఈ సంస్థ ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదట తెలుగు వికీపీడియాను అభివృద్ధిచేసే కృషి జరుగుతోంది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముక్కు తిమ్మన ముక్కు కథ - డా।। సంగనభట్ల నరసయ్య
కృష్ణ రాయల వైదుష్యానికి, సాహిత్య ప్రేమకు వన్నెలద్దే అష్టదిగ్గజ కవులు, ఇతర అతిథి సాహితీవేత్తలతో భువన విజయం సభా భవనం కళకళలాడేది. వారిలో విశిష్టుడు నంది తిమ్మన మహాకవి. అల్లసాని పెద్దనలానే రాయలకు ఆంతరంగికుడు. పారిజాతాపహరణ ప్రబంధాన్ని రాసి, రాయలకంకితం ఇచ్చాడు. ఈ కవికి ముక్కు తిమ్మన అని మరో పేరు. కారణం ఏంటో తెలియరాకున్నా దీని మీద చాలామంది ఊహలు చేశారు. ఇంతకూ ఈయనకు ఆ పేరు ఎలా వచ్చింది?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశ్వవిఖ్యాత ప్రణయాంక వేదమిద్ది! 
ప్రేమ.. ఈ పదాన్ని తలచుకోగానే ప్రతి ఒక్కరి మదిలో అసంకల్పితంగా మెదిలేది తాజ్‌మహల్‌. ఎప్పుడో నాలుగు శతాబ్దాల కిందట తన భార్య ముంతాజ్‌ ప్రేమ చిహ్నంగా షాజహాన్‌ కట్టించిన ఈ సమాధి.. స్వచ్ఛమైన అనురాగానికి చిహ్నమైంది. భారతీయ భాషల్లో ఎన్నో కవితలు, కావ్యాలు, గేయాలు, కథలు, నవలలకు ప్రేరణగా నిలిచింది. తెలుగు కవితల్లో ఈ పాలరాతి సౌధం ఎలా ప్రతిఫలించిందో చూద్దాం!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నైతిక వర్తనానికి నిలువుటద్దం
మూఢవిశ్వాసాలతో కునారిల్లిన సమాజాన్ని నీతి మాత్రమే చక్కదిద్దగలదని భావించి సాహిత్య సృజన చేసిన త్రిపురనేని రామస్వామి ‘కవిరాజు’గా ప్రసిద్ధులు. నీతి లుప్తమైనచోట సమాజం అభ్యుదయ పథంలో పురోగమించలేదనీ, నైతికత పునాది మీదనే వ్యక్తిత్వవికాసం ఆధారపడి ఉంటుందని భావించారాయన. తెలుగు నుడికారాలతో, శక్తివంతమైన పద ప్రయోగాలతో తన ‘కుప్పుసామి శతకం’లో నైతిక సూత్రాలను గుదిగుచ్చారు. మానవ జీవనగతులకు దర్పణం పడుతూ సాగే ఈ శతక పద్యాలన్నీ అనర్ఘరత్నాలే! 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భట్టుమూర్తి.. భువన విజయపు దీప్తే! - శ్రీనివాసులు అంకే 
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో భట్టుమూర్తి కూడా ఒకడని ప్రసిద్ధి. అయితే ఆధునిక సాహిత్య చరిత్రకారులు కొందరు దీన్ని అంగీకరించట్లేదు. క్రీ.శ.1544 నాటికే నరసభూపాలీయం, వసుచరిత్రలను భట్టుమూర్తి రాస్తే, 1557 నాటి చారిత్రకాంశాలు నరసభూపాలీయంలో, 1580 నాటి విషయాలు వసుచరిత్రలో ఎందుకున్నాయన్నది వారి మౌలిక ప్రశ్న. అయితే దీనికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. వాటన్నింటినీ విశ్లేషిస్తే భట్టుమూర్తి భువనవిజయంలోనే ఉన్నట్టు అవగతమవుతుంది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోటీపరీక్షల ప్రత్యేకం

‘‘కవిత్వం సముద్రాల్ని పుక్కిలించి నదుల్ని గానం చేస్తుంది’’ 
‘‘పలుకు బడులకైన పదబంధములకైన/ గీతకైన పద్యకైతకైన/ తెనుగు భాషకన్న దీటైన దేముండె/ దేశ భాషలందు తెలుగు లెస్స/ తెలుగు భాషలోని తియ్యదనము జూచి/ కృష్ణదేవరాయలే రసించి/ వ్రాసినట్టి పద్య రాజమ్ము కలిగుంది/ దేశ భాషలందు తెలుగు లెస్స/ బ్రౌను, సేను, కృష్ణరాయలు, హాల్డేను/ మెచ్చుకున్న భాష మేలి తెలుగు/ ద్రవిడ భాషలందు రాణి తెలుగు భాష/ దేశ భాషలందు తెలుగు లెస్స/ మధురమైన భాష సుధలు చిల్కెడి భాష/ తేనెలొలుకు భాష తెనుగు భాష/ అందమైన భాష ఆనందమిడు భాష/ దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్నారు ప్రయాగ కృష్ణమూర్తి. తెలుగు ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగార్థుల కోసం భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మారిది ప్రశ్నలు...

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘కవి సంశయ విచ్ఛేదం’ కర్త?  
‘‘తెలుగు భాషయనిన తియ్యమామిడి తోట/ సరస కావ్యములగు సత్ఫలములు/ పద్య భావ సుధలె ఫల రసంబులగును/ తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ/ తెలుగు భాష నీది తెలుగు వాడవు నీవు/ తెలుగు వృద్ధిబరచ దలచు నీవు/ తల్లి మొదటి సవతి తల్లులు పిమ్మట తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ’’ అన్నారు ముదిగొండ శ్రీరామ శాస్త్రి. తెలుగు నెట్, సెట్, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం కొన్ని మాదిరి ప్రశ్నలు... 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కథలు

కనకత్త కష్టం - వేణుబాబు మన్నం 
చెవులు కొరుక్కునే వారు కొరుక్కుంటున్నారు.. నవ్వుకునే వారు నవ్వుకుంటున్నారు.. కనకత్తకొచ్చిన కష్టం చూసి ‘తగిన శాస్తి’ జరిగిందిలే అనుకుంటున్నారు! కానీ, సమస్యకు అసలు కారణమేంటో ఎవరు ఊహించగలరు?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంచెర్రాయి   - శీలం భద్రయ్య 
ఒక దారుణ మారణహోమం. దానికి సాక్ష్యం బంచెర్రాయి. అక్కడ రక్తం ఏరులై గడ్డకట్టింది. తర్వాత ఊరి మీదా కిరాతకం. దానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది! ఆ ఆగ్రహ జ్వాలల్లో....

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మట్టిరోడ్డు - తన్వి కేసరి పసుమర్తి 
ఊరికి మేలుచేయని దొరంటే కిట్టూగాడికి మంట. దొర వెంట తిరుగుతూ ఇంటిని పట్టించుకోని నాన్నంటే కోపం. దొర మీద కిట్టూగాడు తిరగబడే రోజొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దృక్పథం   - తాళ్లూరి లక్ష్మి
నిన్నటి దాకా అతను ఒక రకంగా అనుకున్నాడు. అకస్మాత్తుగా అదంతా నిజం కాదని తెలిసింది! పైకి కనిపించేదంతా యథార్థం కాదని అవగతమైంది! అతణ్ని అంతలా మార్చిన ఆ సంఘటనేంటి?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పిల్లిబొమ్మ గౌను - ముచ్చి ధనలక్ష్మి 
ధన్వికి ఆ గౌనంటే చాలా ఇష్టం. దానితో అదో అనుబంధం. ఎప్పుడూ దాన్నే వెయ్యాలని అమ్మతో పోరు. అనుకోకుండా ఆ గౌను ఓ రోజు దూరమైంది! అది మళ్లీ ధన్వి దగ్గరికి వచ్చిందా? అయితే ఎలా...?

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కల్తీలేని ప్రేమ - చిక్కాల స్వామికాపు
గేదె విషయంలో అతను ఆశ వదిలేసుకున్నాడు. గుండె రాయి చేసుకున్నాడు. కానీ, యజమాని మీద దానిది నిస్వార్థ ప్రేమ! పెద్ద ఆపద నుంచి అతణ్ని కాపాడింది. అసలు ఆ గేదెకి ఏమైంది? అతను దాన్ని కాపాడుకున్నాడా? 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చెవిలో రెండు అమృతం చుక్కలు - సురా 
ఏ ముహూర్తాన మార్కోనీ ‘చెవిలోంచి అమృతం పోసే’ రేడియో కనిపెట్టాడో కానీ.. అద్భుతం అంతే! ఆ అనుభూతి దేవగణానికి కూడా దక్కలేదు. వాళ్లు నోటితో తాగారు. మనిషి చెవిలోంచి సేవించాడు. (ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా)

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాటకట్టు 
‘వాతాపి గణపతిం...’ కీర్తన రాగం?
గురజాడ రాసిన  పద్య కావ్యం?
గణ యతి ప్రాస నియమాలు కలది? లాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసా? ఇంకెదుకు ఆలస్యం! ‘తెలుగువెలుగు’ మాటకట్టును పూర్తిచేయండి.. అమ్మభాషలో మీ పరిజ్ఞానానికి ఇదో పరీక్ష మరి! 
సృజనాత్మక మాటకట్టులను మీరూ రూపొందించి teluguvelugu@ramojifoundation.org కు మెయిల్‌ చేయవచ్చు. 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భాషాయణం

అడుగులకు మడువులొత్తు
మర్యాదస్థులను ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు నేల మీద చలువ దుప్పట్లను పరుస్తారు. వాటి మీదుగా వాళ్లు నడిచి వెళ్లిన తర్వాత ఎత్తి మళ్లీ ముందు పరుస్తారు. గొప్పవారికి చేసే మర్యాద ఇది. మడువులు అంటే ఉతికి మడత పెట్టిన బట్టలు. ‘అడుగులకు మడువులొత్తు’ అనే పలుకుబడి దీంట్లోంచి పుట్టిందే.
సంచకారం, ఇలారం, రట్టగుడి, దోబూచి లాంటి మరిన్ని పలుకుబడులు, వాటి వివరణల కోసం ‘తెలుగువెలుగు’ చదవండి!

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖ-1 

నా జీవన వర్ణం నువ్వు! - ఘంటసాల వసంత్‌
అప్పుడు నా వయసెంతో గుర్తులేదు, నిన్ను చూడగానే ప్రేమలో పడ్డా. పెద్దవాళ్లంతా ఇప్పటినుంచే ఈ వేషాలేంటీ! అని ముక్కున వేలేసుకున్నారు. పేదింట్లో పుట్టిన నాకు అంత పెద్దింటితో ఏంటి అన్నారు కూడా. అయినా నా ప్రేమ అలాగే సాగింది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రేమలేఖ-2 

విజయంలోనూ... వికాసంలోనూ నువ్వే - దుర్గం భైతి
ప్రియమణి నక్షత్రకి...
‘‘గమనించావో లేదో ఓ మనసా! దాంపత్యం లాంటి మైత్రి లేనేలేదు’’ అన్నాడో కవి. ‘‘మగడు వేల్పన పాతమాటది ప్రాణమిత్రుడు నీకు’’ అన్నారు గురజాడ. దంపతుల మధ్య ప్రేమ, ప్రోత్సాహం ఎప్పటికప్పుడు వికసిస్తూ ఉంటేనే ఆనందం విరబూస్తుంది. రెండున్నర అక్షరాల ప్రేమ ముందు ఈ ప్రపంచం చాలా చిన్నది.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమస్యా వినోదం

మూఢనమ్మకములె ముదమునిచ్చు

‘తెలుగువెలుగు’ సంచికలో ఇచ్చిన సమస్యకు చక్కని పద్యం రాయండి. బహుమతి అందుకోండి. మీ పూరణం చేరడానికి గడువు ప్రతినెలా 18వ తేదీ. పూరణాన్ని మెయిల్, ఎస్‌.ఎం.ఎస్, వాట్సప్‌ల ద్వారా కూడా పంపవచ్చు. మరిన్ని వివరాలకు జనవరి ‘తెలుగువెలుగు’ సంచిక చదవండి! 

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జింజిరి 

పంచుకోవచ్చుగా!
‘‘ఏవండీ.. పక్కింటి మొగుడూ పెళ్లాలూ రోజూ గోడవపడుతున్నారు’’
‘‘వాళ్ల మధ్య వెయ్యి ఉంటాయి.. మనకెందుకు’’
‘‘వెయ్యి ఉంటే చెరో అయిదొందలు తీసుకోవచ్చు కదా. దానికి గొడవెందుకు..?’’

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొండ అద్దమందు...
మీ పుస్తకాలను సాహితీప్రియులకు చేరువ చేయాలనుకుంటున్నారా? తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలు అందుకు మీకు చేయూతనందిస్తాయి. సమీక్షల కోసం ప్రచురితమైన పుస్తకాలతో పాటు ఈ-పుస్తకాలనూ (పీడీఎఫ్‌) పంపవచ్చు. పూర్తి వివరాలకు.. tvweb@ramojifoundation.org

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంచి కథలను పంచుకుందాం
సామాజిక మాధ్యమాల్లో హృదయాన్ని తట్టిలేపే చిట్టి కథలను చదివారా? ‘తెలుగువెలుగు’ ద్వారా వాటిని తెలుగువాళ్లందరితోనూ పంచుకోండి. దానికి చేయాల్సిందల్లా.. మీరు సేకరించిన కథలను teluguvelugu@ramojifoundation.org కు మెయిల్‌ చేయడమే.

మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనక్కి ...

మీ అభిప్రాయం