ప్రత్యేక వ్యాసాలు... ప్రముఖుల ముఖాముఖిలు, వ్యాసాలు, కవితలు, ప్రేమలేఖలు మరెన్నో శీర్షికలతో మీ ముందుకు వచ్చింది తెలుగువెలుగు జనవరి సంచిక...
మీరు teluguvelugu.eenadu.net లో ముందుగా రిజిస్ట్రర్ అయ్యుంటే పూర్తి పాఠం మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడే రిజిస్ట్రర్ చేసుకోండి. తెలుగు జాతి కోసం.. తెలుగు ఖ్యాతి కోసం ఆవిర్భవించిన తెలుగువెలుగు మాసపత్రికను చదవండి. నిరంతర భాషా, సాహిత్య, సాంస్కృతిక రసవాహినిలో ఓలలాడండి.
ధైర్యమే సకల సుగుణ ప్రధానం!
మనిషికి ఎన్ని తెలివితేటలున్నా ధైర్యం లేకుంటే విజయం సాధించడం అసాధ్యం. కష్టాల్ని ఎదిరించడానికి ధైర్యమే తిరుగులేని ఆయుధం. గుండె నిండా ధైర్యం నింపుకుని, అరిషడ్వర్గాలని జయించినప్పుడే మనిషి ఉన్నత స్థానాలను అధిరోహిస్తాడు. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అంటూ మన కవులు ఏం చెప్పారో జనవరి సంచికలో చదవండి!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మంచి మానుట మంచిదోయ్ - శంకరనారాయణ
ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని ఆవిడేమో మహాతల్లి అట! రోజూ పెడుతూ ఏదో ఒకరోజు పెట్టనావిణ్నేమో నిందించడం! ఇది లోకనైజం. ‘మంచి చేసినవాడు మట్టిగొట్టుకుపోతాడు, చెడ్డచేసినవాడు పసిడి పట్టుకుపోతాడు’ అనడంలో సందేహం ఉంటే... జనవరి సంచికలో కామ్రేడ్ వితండం చదవండి!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వాకిట విరిసే ఆత్మీయ కాంతి
ఏమండి! ఇంకలెండి! వాకిటికిరానేవచ్చె సంక్రాంతి, ఏ
మేమో ఎన్నడు యోచనల్ తెగవుమీకీలాగు కూర్చుందురం
రండీ! మానండి దిగుళ్లు మీ మనసులో! ఈ లోకభారమ్ము మీ
రేమోసేరె? సుకమ్ముగా నడపలేరీ కాస్త సంసారమున్! - దేవులపల్లి కృష్ణశాస్త్రి
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అభివృద్ధికి ఆరోప్రాణం
దేశంలో ఇంజినీరింగ్ సహా సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవల కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మాతృభాషలో సాంకేతిక విద్యను ఎలా పటిష్టం చేసుకోవాలి? ఆ దిశగా మన ముందున్న సవాళ్లేంటి? అసలు దాని ఆవశ్యకత ఏంటి?... వీటి గురించి వివిధ రంగాల నిపుణులు ఏమంటున్నారు....
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వహ్వారే! సంక్రాంతి భోజనంబు!! - డా।। జి.వి.పూర్ణచందు
బకాళాబాతు పేరెప్పుడైనా విన్నారా? సరడాల పాశం ఎప్పుడైనా తిన్నారా? మనోహరాలు ఎలా చేస్తారో తెలుసా? ఇవన్నీ ఒకప్పుడు మన పెద్దలు సంక్రాంతికి వండి దేవుడికి నివేదించినవే! వీటితో పాటు మరెన్నో అలనాటి వంటకాల్ని ఈ సంక్రాంతికి మనమూ రుచిచూద్దామా....
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చదువుదాం... ఎదుగుదాం! - షేక్ అబ్దుల్ తాజుద్దీన్
పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో వివేకాన్ని పెంచేందుకు, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వారు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ‘చదవడం మాకిష్టం’ (వుయ్ లవ్ రీడింగ్) పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైన ఈ కార్యక్రమం నీతి కథలు, స్ఫూర్తిదాయక పుస్తకాల్ని పిల్లలకు చేరువ చేయనుంది. భాష మీద వారికి మక్కువ పెంచనుంది.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాహితీ భారతికి లక్ష్మీ కాంతి - అపర్ణ
‘‘నాకు వేరే జపమూ, తపమూ లేవు. సాహిత్యమే నా సాధన, కవిత్వమే యోగం’’ అంటూ సాహిత్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి పింగళి లక్ష్మీకాంతం. పింగళి-కాటూరి జంట కవుల్లో ఒకరైన లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, కవిగా, భాషా పరిశోధకుడిగా, విమర్శకుడిగా, నటుడిగా అసమాన ప్రతిభా విశేషాలను విస్తరింపజేశారు. రాయల అష్టదిగ్గజాల్లో ఒకరైన పింగళి సూరన వంశజుడైన ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి, ఉన్నది ఉన్నట్టుగా సూటిగా వ్యక్తపరుస్తూ శలాకపురుషుడిగా ఖ్యాతి పొందారు.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి భావాలు మాత్రమే - కె.కృష్ణమోహన్
మిత్రమా... రూముకు వచ్చేసరికి, ఉతకాల్సిన దుస్తులు కళ్లముందు పర్చుకున్న ఒంటెచర్మంలా ప్రత్యక్షం. మనకున్న బలానికి అలసట కలగకుండా మూడు జతల దుస్తులు ఉతకగలం.. ఉతికేశాను. ఉతుకుతుంటే బాత్రూం పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు రాలి పడ్డాయి. 20, 30 అడుగులెత్తు నుంచి కదా, పెద్ద శబ్దం వచ్చింది. ఒక్క క్షణం అర్థం కాలేదు, ఏం జరిగిందో..!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రకృతి వైద్య జ్ఞానసింధువు.. రామేశ్వర నిఘంటువు! - టీవీఆర్ నర్సయ్య
‘‘మట్టిపట్టీలు, తొట్టిస్నానాలు...’’ ఈ పదాలు అర్థమయ్యీ అవనట్లున్నాయి కదా! ‘ప్రకృతి వైద్య చికిత్స’లో పలికే మాటలివి. ‘ప్రకృతి వైద్యం’ అంటే నీరు, ఆహారం, యోగా, వ్యాయామం, ప్రకృతి జీవన విధాన పద్ధతులతో రోగనివారణ చేసే ప్రక్రియ. దీనికి సంబంధించిన పారిభాషిక పదజాలంతో తెలుగులో తొలిసారి ‘ప్రకృతి వైద్య పదకోశం’ తీసుకొచ్చారు ఆచార్య గజ్జల రామేశ్వరం.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొలి తెలుగు మధ్యాక్కర శాసనం? (పోటీపరీక్షల ప్రత్యేకం)
‘‘పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు
అలంపురీ నందనారామ విభ్రాజి మల్లోల ఫలరాజ మధురరుచికి
ఆంధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత తుంగా పయస్సు మాధుర్యమునకు
ఖండశర్కరజాతి ఖర్జూరగోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకు
అమృత నిష్యంది వల్లకాహ్లాదమునకు
రాగిణీ దివ్య సమ్మోద రాగమునకు
తేనెతేటల నవకంపు సోనలకును
సాటియగును మాతెలుగు భాషామతల్లి’’ అంటూ తెలుగు భాష విశిష్టతను కీర్తించారు సురవరం ప్రతాపరెడ్డి. ఆయా పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు...
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘ఈ జగతికి మానవతా భిక్షపెట్టు!’’ పోటీపరీక్షల ప్రత్యేకం
‘‘శారదాదేవి ‘కచ్ఛపి’ ముక్త కమనీయ సలలిత రావమ్ము తెలుగు భాష
బ్రహ్మ మానస పుత్ర రమ్య ‘మహతి’ వినిర్గళిత నినాదమ్ము తెలుగు భాష
తుంబురు హస్తాలతూగు ‘కళావతి’ వెలుయించు క్వాణమ్ము తెలుగు భాష
వినుత విశ్వావసు ‘బృహతి’ జనిత, సముజ్జ్వల మృదు ధ్యానమ్ము తెలుగు భాష
శర్కర సహిత శ్రీఘనస్తమము, విమల
జాహ్నవీ జల తుల్యంబు, చవులుపట్టు
జుంటి తెనెనే మరపించు సురుచిగల్గి
దేవభాషకు సాటి యీ తెలుగు భాష’’
అంటూ తెలుగు భాషను శ్లాఘించారు కలవకొలను సూర్యనారాయణ. ఉపాధ్యాయ, అధ్యాపక పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు...
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీసాల పురాణం
కోరమీసం, చురకత్తి మీసం, ఫ్రెంచి మీసం, కొసలు తీసిన మీసం, పెరిగీ పెరగని అరకొర మీసం.. ఇలా ఎన్నో మీసాలు! ‘‘మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె, అంబలి తాగేవాడికి మీసాలెత్తి పట్టుకునే వాడొకడు’’ లాంటి సామెతలూ బోలెడు... ఈ మీసాల మీద మరిన్ని ముచ్చట్లు జనవరి సంచికలో..!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చింతామణీ.. ఓ చరవాణీ.. - సురా
‘‘ఆడి కార్లో కూర్చోబెట్టాలని నేననుకుంటుంటే.. అగ్గిపెట్టెలాంటి ఇండికా కారులోనే మగ్గిపోతా అంటేవేంటే.. అంతా నా కర్మ.. నాకా ఆ ఫేస్‌బుక్‌కు, వాట్సప్పుల్లో చాటింగ్ రాదు.. కనీసం నువ్వన్నా చక్కగా రెండు జిల్లాలూ, విల్లాలూ వెనకేసుకుంటావని అనుకున్నా..’’ చింతామణి నాటకానికి వందేళ్ల సందర్భంగా ప్రత్యేక హాస్యస్ఫోరక కథనం జనవరి సంచికలో..!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మనిషే కేంద్రం... సంఘర్షణలే వనరులు!
మదిలో సుళ్లు తిరుగుతున్న ఆలోచనల్ని, మనసుని మెలిపెడుతున్న సంఘర్షణల్ని అక్షరాల్లోకి బదిలీ చెయ్యడమే రచనంటే. సమాజంలో జరిగే సంఘటనలు, హింస, మనుషుల జీవితాల్లోని దోపిడీ, ఆటుపోట్లు, సంఘర్షణలు, అనుబంధాలు, ఆప్యాయతలు లాంటివే సాహితీ సేద్యానికి మూల వస్తువులు. అయితే, రాయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఉద్దేశం, ఒక్కో లక్ష్యం. మరి ‘మీరే ఉద్దేశంతో రాస్తున్నారు? మీ అక్షర సృజనకు ప్రేరణ ఏంటి?’ అంటూ మన యువ తెలుగు కథా రచయితలు, కవులు కొందర్ని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘తెలుగువెలుగు’ పలకరించింది. వారి ఆలోచనలు, భావాల సమాహారమిది...
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజాశక్తులకే పురస్కారం - స్రవంతి
భారత రాజ్యాంగం అందించిన సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర భావనలు దేశ సంక్షేమానికీ, ఐక్యతకు పునాదిరాళ్లు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సార్వభౌములు. ప్రజల ఆకాంక్షలే దేశ సుస్థిరతకు పట్టుకొమ్మలుగా భావించే ఈ విధానం దేశానికి కొత్తకాదు. ఒకప్పుడు ప్రజాబలంతో షోడశ జనపదాలుగా సంఘటితమైన రాజ్యాలన్నీ గణ వ్యవస్థతో నడిచినవే. వలసపాలనలో మగ్గిన దేశంలోకి ప్రజాస్వామ్య పాలనను తీసుకురావడమంటే దేశ పూర్వ వైభవానికి పట్టంకట్టడమే.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీశ్రీకి ‘వంద’నాలు అశోక్‌కుమార్ మహా యజ్ఞం - కె.వి.యస్.వర్మ
ఎవరైనా కవి, రచయిత మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. ఆయన పుస్తకాలన్నీ కొనుక్కుని చదువుతాం. వాటిని భద్రంగా దాచుకుంటాం. మరీ వీరాభిమానం ఉంటే మన స్నేహితులకి బహుమతిగా ఆ పుస్తకాలు కొనిస్తాం. కానీ, ఆయన రాసిన, ఆయన మీద వచ్చిన పుస్తకాల ముద్రణ భారం స్వచ్ఛందంగా భుజాన వేసుకుంటే! మహాకవి శ్రీశ్రీ విషయంలో అదే చేశారు సింగంపల్లి అశోక్ కుమార్. తను ఆరాధించే మహాకవికి నూరు పుస్తకాల హారతినిచ్చి ఇంతవరకూ ఎక్కడా ఏ కవికీ జరగని అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కృతం చేశారు.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎగసిపడిన కెరటాలు - మందరపు హైమవతి
స్త్రీలకు శరీరాలు తప్ప స్వీయ వ్యక్తిత్వం ఉండకూడదని పితృస్వామ్యం తీర్మానించింది. ప్రబంధ యుగంలో కవులు అవయవానికో పద్యం చొప్పున అభివర్ణించారు. భావకవులు స్త్రీలను ఊర్వశిగా, ప్రేయసిగా భావించారు. మాతృ దేవతగా పూజించారు. కానీ ఎవరూ వారిని తోటి మనుషులుగా గుర్తించలేదు. ఈ అణచివేత, దోపిడీల మీద రచయిత్రులు బలంగా తమ వాణి వినిపించారు. ‘నీలి మేఘాలు’ కవితా సంకలనంలో వారి గర్జన ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అక్షరార్చనలో... స్వరసాధనలో! - సాహితీసుధ
‘‘పొట్టచించితే అక్షరమ్ముక్క రాదుగానీ పొగరుకేం తక్కువ లేదు!’’ అని అమ్మ అన్నప్పుడల్లా చాలాసార్లు అనుకున్నాను అక్షరాలు పొట్టలో ఉంటాయా అని. మా పూజగదిలో విష్ణుమూర్తి నాభినుంచి కమలం, అందులోంచి చతుర్ముఖ బ్రహ్మ ఉన్న చిత్తరువుని చూడగానే ధ్వన్యోత్పత్తి స్థానం నాభి అన్న డిగ్రీ తెలుగు పాఠం గుర్తుకొస్తుంది. మన పురాణ చిత్రాల్లో భాష గురించి ఇంత వివరం ఉందా! అన్న ఆశ్చర్యం కలుగుతుంది కూడా.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గెలిచి నిలిచిన ఇండోనేసియా!
భారతదేశంలాగే ఎన్నో రకాల భాషలు, విభిన్న ఆచారాలు, మతాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండోనేసియా. దీని ప్రధాన ఆర్థిక వనరు అక్కడి గనులు. ఇండోనేసియాది ప్రపంచంలోనే 15వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశాల్లో కూడా ఈ దేశం మొదటి వరసలో ఉంటుంది. 2017లో 32 కోట్ల డాలర్లు విద్య కోసం కేటాయించారు.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విలక్షణ కథా దిగ్గజం
తెలుగు గ్రామీణ ప్రజల జీవితాల్ని, మధ్యతరగతి బతుకుల్లోని ఆటుపోట్లను పాఠకుల కళ్లముందు సజీవంగా నిలిపిన విశిష్ట కథా రచయిత చాగంటి సోమయాజులు. చాసోగా ప్రసిద్ధికెక్కిన ఆయన చిన్న చిన్న సంఘటనలలోనే గాఢమైన అనుభూతికి బొమ్మకట్టారు. సమాజంలోని దోపిడీని పామరులు సైతం అర్థం చేసుకునేలా కథా రచన చేశారు.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ - నన్ను క్షమించవూ..!
ప్రియమైన భాగ్యకి!
ఎలా ఉన్నావ్? ఈ ప్రశ్న అనునిత్యం వేధిస్తుంది నన్ను. నిన్ను చూడాలని, నీతో మనసారా మాట్లాడాలని ఎన్నిసార్లు అనుకున్నానో. నువ్వు నా చిన్ననాటి జ్ఞాపకానివి. ఆనందంతో కేరింతలు వేసిన నా గతకాలపు రూపానివి. నేను బడికివెళ్తున్న రోజులవి.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ - అమ్మ మనవి
ఎలా ఉన్నావ్ చిన్నా!
లాక్డౌన్ పేరు చెప్పి ఇన్నాళ్లూ ఇళ్లనుంచి ఎవరినీ బయటికి రానివ్వలేదు. వాహనాల రొద వల్ల సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి వచ్చేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అన్నట్టూ, మన ముర్రేడు వాగు గుర్తుందా నీకు. దాన్ని చూడాలనిపించి అటుగా వెళ్లాను నిన్న. మొన్నటి వరకూ మురికిగా ఉండే నీళ్లు ఇప్పుడెంత స్వచ్ఛంగా మారాయో! మరో విషయం, దేశంలో నదులన్నీ నిర్మలంగా ప్రవహిస్తున్నాయట.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మాటకట్టు
అల్లసాని పెద్దనకి రాయలు తొడిగింది?
అదే పనిగా మాట్లాడేవారిని ఏమంటారు?
కాళిదాసు నాటకంలో కథానాయిక? లాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసా? ఇంకెదుకు ఆలస్యం! ‘తెలుగువెలుగు’ మాటకట్టును పూర్తిచేయండి.. అమ్మభాషలో మీ పరిజ్ఞానానికి ఇదో పరీక్ష మరి! సృజనాత్మక మాటకట్టులను మీరూ రూపొందించి teluguvelugu@ramojifoundation.org కు మెయిల్ చేయవచ్చు.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భాషాయణం
ఉలిపి కట్టె: ‘ఊరిదంతా ఒకదారి, ఉలిపికట్టెది ఇంకొక దారి’ అని సామెత. అందరికంటే భిన్నంగా ప్రవర్తించేవాడు, వేరే మార్గంలో నడిచేవాడు, పెడతోవ పట్టినవాడు, ఎవరితోనూ పొసగనివాడు అని చెప్పేందుకు దీన్ని వాడతారు. ఒలుపు, కుదురు, కూరాడు లాంటి మరిన్ని పలుకుబడులు, వాటి వివరణల కోసం ‘తెలుగువెలుగు’ చదవండి!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సమస్యా వినోదం
తాగుబోతు తీర్పు తగవు దీర్చె
‘తెలుగువెలుగు’ సంచికలో ఇచ్చిన సమస్యకు చక్కని పద్యం రాయండి. బహుమతి అందుకోండి. మీ పూరణం చేరడానికి గడువు ప్రతినెలా 18వ తేదీ. పూరణాన్ని మెయిల్, ఎస్.ఎం.ఎస్, వాట్సప్‌ల ద్వారా కూడా పంపవచ్చు. మరిన్ని వివరాలకు జనవరి ‘తెలుగువెలుగు’ సంచిక చదవండి!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జింజిరి
నాలుగు కాళ్ల నడక!
ధర్మం ఎప్పుడూ నాలుగు పాదాల మీద నడవాలని అంటారు.
ధర్మం సంగతి అటుంచితే ఇప్పుడు చాలా విషయాలు నాలుగు కాళ్ల మీదే నడుస్తున్నాయి!
ఒకటి ఇన్కమింగ్ కాలు!
రెండోది ఔట్ గోయింగ్ కాలు!
మూడోది కాన్ఫరెన్సు కాలు!
నాలుగోది వీడియో కాలు!
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొండ అద్దమందు...
మీ పుస్తకాలను సాహితీప్రియులకు చేరువ చేయాలనుకుంటున్నారా? తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలు అందుకు మీకు చేయూతనందిస్తాయి. సమీక్షల కోసం ప్రచురితమైన పుస్తకాలతో పాటు ఈ-పుస్తకాలనూ (పీడీఎఫ్) పంపవచ్చు. పూర్తి వివరాలకు.. tvweb@ramojifoundation.org
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కథలు
ఒకరికి ఒకరు - అత్తలూరి విజయలక్ష్మి
‘‘నీ గురించి నువ్వు పట్టించుకోవా?’’ అంటుందామె!
‘‘పిల్లలు, నువ్వే... నేను. మీ ఆనందమే నా సంతోషం’’
అంటాడతను. ఆమె కోప్పడుతుంది. అతను బుజ్జగిస్తాడు.
కానీ, ఓ రోజు ఊహించని పరిణామం! ఆ తర్వాత...
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పరివర్తన - కె.ఉషా కుమారి
పెళ్లయిన ఆరు నెలలకే శంకర్‌ని ఒక భూతం ఆవహించింది.
అనుమానం భూతం! వినీల ఏం మాట్లాడినా తప్పే. ఏం చేసినా
అనుమానమే. భర్త చేష్టలు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిందామె.
ఆ తర్వాత వాళ్ల కథ ఏమయ్యింది? శంకర్ తీరు మారిందా?
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ధిక్కారం - వరుణ్ పారుపల్లి
రైల్వే స్టేషన్లో ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు
ఎస్.కె. క్రికెట్ అకాడమీ అధిపతి సూర్య. ఆ రోజు రైలు ఆలస్యంగా
నడుస్తోంది. ‘‘మీరు ఇంటికెళ్లండి, ఆ వ్యక్తిని మేం తీసుకొస్తాం’’ అని
సహాయకుడు చెప్పినా వినడంలేదు సూర్య! ఇంతకీ ఆ వచ్చేది ఎవరు?
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మధుర క్షణాలు - పార్థసారథి చిరువోలు
కొత్తగా పెళ్లయ్యి భార్య దూరంగా ఉన్న అతనిది విరహ తాపం!
పెళ్లాం పుట్టింట్లో ఉంటే మగాళ్లు వెర్రి వేషాలు వేస్తారని ఆమె అనుమానం.
ఆ క్రమంలో ఏవేవో పిచ్చి ప్రశ్నలు, అతని చిరాకులు.
మొత్తానికి ఆమె కాపురానికొచ్చింది. వాళ్ల సంసారం ఏమయ్యింది?
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గంగాళం - కన్నోజు లక్ష్మీకాంతం
అన్ని పనుల్లో ఆదరువుగా నిలిచిన వస్తువులు కొన్నాళ్లకి కొత్త
తరానికి పనికిరానివి అయిపోతాయి. మనుషులు కూడా అంతేనా?
మాణిక్యమ్మకు కొంత కాలంగా మనసులో ఇదే గుంజాటన!
ఆ దిగులుతోనే మౌనంగా రోదిస్తున్న ఆమె కథ ఏమైంది?
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఓదెల తీర్థంబోతన్న - బాలసాని కొమురయ్యగౌడ్
తీర్థం బోవుడంటే ఎంత సరదా? ఎంత సంతసం! దానికోసం ఏడాదంతా ఎదురుచూసుడు, ఎడ్ల బండిలో సరంజామా అంతా వేసుకుని బైలెల్లుడు, తీర్థంలో నచ్చినయి కొనుక్కొనుడు... ఆ యాదిలోకి వెళితే...
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పొత్తర్లు - మన రాజు
నాలుగు పైసలు చేతిలో పడితే ఏవేవో
ఖర్చులకు కలిసొస్తాయని కపట వేషధారణకు
ఒప్పుకొన్నారు కొందరు మిత్రులు.. మరి వాళ్ల
పండగనాటి పొత్తర్ల దండయాత్ర చూడండి..
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మంచి కథలను పంచుకుందాం
సామాజిక మాధ్యమాల్లో హృదయాన్ని తట్టిలేపే చిట్టి కథలను చదివారా? ‘తెలుగువెలుగు’ ద్వారా వాటిని తెలుగువాళ్లందరితోనూ పంచుకోండి. దానికి చేయాల్సిందల్లా.. మీరు సేకరించిన కథలను teluguvelugu@ramojifoundation.org కు మెయిల్ చేయడమే.
మొబైల్లో వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి