కూచిపూడి కేత‌నం

  • 66 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రవి నెల్లి

  • హైదరాబాదు.

గురువుగా, పరిశోధకులుగా కూచిపూడి నృత్యానికి విశేష సేవలందించారు మునుకుంట్ల సాంబశివ. హైదరాబాదు ఇసామియాబజార్‌కు చెందిన ఆయన 1961లో మల్లికాంబ, చంద్రయ్య దంపతులకు జన్మించారు. ముగ్గురు కుమారుల్లో సాంబశివ పెద్దవారు. డిగ్రీ వరకు చదివారు. చిన్నతనం నుంచే నాట్యం మీద మక్కువ పెంచుకున్న ఆయన పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం, పద్మశ్రీ శోభానాయుడుల వద్ద శిక్షణ పొందారు. రంగస్థల కళల్లో ఎ.ఆర్‌.కృష్ణ శిక్షణలో డిప్లొమా అందుకున్నారు. స్థానికంగా ‘నిశుంభిత నాట్యజ్ఞాన్‌పీఠ్‌ పేరిట’ నాట్యాలయం స్థాపించి ఎందరో శిష్యుల్ని తీర్చిదిద్దారు. ‘హస్తాభినయం’ మీద అనేక పరిశోధనలు చేశారు. ఆయన రాసిన ‘హస్తాభినయం’ గ్రంథం విశేష ప్రాచుర్యం పొందింది. దానికి మరికొన్ని మార్పులు చేసి ‘శ్రీ హస్తాభినయం’ పేరిట ప్రచురించిన గ్రంథం పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సాంబశివ మంచి వక్త కూడా. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబయి, పుణే, దిల్లీ తదితర ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. కవితలు, లలితగీతాలు కూడా రాశారు. ఆకాశవాణి ముంబయి కేంద్రం నుంచి మూడుసార్లు తన రచనలకు బహుమతులు పొందారు. ‘నాట్యమంజరి, గేట్‌వే టూ కూచిపూడి’ తదితర గ్రంథాలు ప్రచురించారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలు కూచిపూడికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఈ జులైలో కన్నుమూశారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం