‘భావి నా ఉజ్జ్వల నేత్రం’ అన్న కవి?

  • 29 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘దినదినము వర్ధిల్లు తెలుగుదేశం/ దీప్తులను వెదజల్లు తెలుగుతేజం/ తేనెకన్నా తీయనిది తెలుగుభాష/ దేశ భాషలందు లెస్స తెలుగు భాష’’ అన్నారు వేటూరి సుందరరామమూర్తి. పరిశోధనాభిలాష ఉన్నవారి కోసం ఆర్‌ సెట్‌ నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని మాదిరి ప్రశ్నలివి..! 
1. సారంగధర చరిత్రకు దీపాల పిచ్చయ్య శాస్త్రి రాసిన వ్యాఖ్య? 

    (అ) సురభి వ్యాఖ్య    (ఆ) చంద్రికా వ్యాఖ్య     
    (ఇ) జితకాశి వ్యాఖ్య    (ఈ) మందర వ్యాఖ్య 
2. గుణీభూత వ్యంగ్య భేదాలెన్ని? 
    (అ) 6    (ఆ) 8   (ఇ) 10    (ఈ) 12
3. పూర్వాంకంలోని పాత్రలు ఉత్తరాంక కథ సూచించి, తర్వాతి అంకంలో వారే ప్రవేశిస్తే అది ఏ అర్థోపక్షేపక భేదం? 
    (అ) విష్కభం     (ఆ) చూళిక       (ఇ) అంకాస్యం    (ఈ) అంకావతారం 
4. అర్థ ప్రకృతుల్లో ఒకటి? 
    (అ) ప్రాప్త్యాశ  (ఆ) పతాక  (ఇ) నియతాప్తి  (ఈ) ప్రవేశం 
5. ‘‘నవల అంటే కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహానిర్మిత కథ’’ అన్నదెవరు? 
    (అ) ఉప్పలపాటి శ్రీరామమూర్తి   (ఆ) ఆర్‌.ఎస్‌.సుదర్శనం 
    (ఇ) యండమూరి సత్యనారాయణరావు  (ఈ) విశ్వనాథ 
6. విశ్వనాథ ‘హాహాహూహూ’ ఏ ప్రక్రియకు చెందిన రచన? 
    (అ) కథానిక   (ఆ) నాటకం   (ఇ) నవల  (ఈ) నాటిక 
7. ‘‘కథ అనేది మనకి జీవితంతో జీవిత రహస్యంతో, జీవిత వైచిత్రితో కొంత కొత్త పరిచయం కలుగచెయ్యాలి. కథ చెప్పే విధానమే కథకి అందాన్నీ బలాన్నీ ఇస్తుంది’’ అన్నవారు? 
    (అ) చలం   (ఆ) గోపీచంద్‌   (ఇ)తిలక్‌   (ఈ) బొడ్డు బాపిరాజు 
8. ‘మాటల నేర్పులా సరస మార్గములా కొలువుండు రీతులా’ అన్న పద్యం ఏ ప్రబంధంలోది? 
        (అ) మనుచరిత్ర     (ఆ) వసుచరిత్ర   
    (ఇ) విజయవిలాసం     ఈ) కళాపూర్ణోదయం 
9.  ఉప రూపక భేదాల్లో ఒకటి? 
    (అ) డిమం  (ఆ) తోటకం   (ఇ) వీధి  (ఈ) అంకం 
10. శాస్త్రకావ్యం, కావ్యశాస్త్రం అని కావ్యాన్ని రెండు విధాలుగా విభజించిందెవరు? 
        (అ) భోజుడు    (ఆ) అప్పకవి  
    (ఇ) క్షేమేంద్రుడు    (ఈ) జగన్నాథుడు
11. ‘యతి విటుడు గాకపోవుటెట్లస్మదీయ, కావ్య శృంగార వర్ణనమున’ అన్న పలుకులు ఏ గ్రంథంలోవి? 
    (అ) యయాతి చరిత్ర    (ఆ) కవికర్ణ రసాయనము  (ఇ) శృంగార నైషధం      (ఈ) విజయ విలాసం
12. వసుచరిత్రను యథాతథంగా ఆరాశ్వాసాల్లో సంస్కృతీకరించిన అప్పయ్య దీక్షితుల శిష్యుడు? 
    (అ) అడిదం సూరకవి      (ఆ) కాళహస్తి కవి  
    (ఇ) పిండిప్రోలు లక్ష్మణ కవి     (ఈ) చిత్రకవి సింగరాచార్యుడు 
13. ‘రామకృష్ణార్జున రూప నారాయణీయం’ త్య్రర్థి కావ్యకర్త? 
    (అ) అయ్యగారి వీరభద్ర కవి  (ఆ) ఓరుగంటి సోమేశ్వరకవి   
    (ఇ) పోకూరి కాశీపతి       (ఈ) నెల్లూరి వీరరాఘవకవి
14. ‘మహానాటక సుధానిధి’ అనే పేరుతో రామాయణ కథను చంపూ కావ్యంగా రాసిందెవరు? 
    (అ) ఇమ్మడి ప్రౌఢ దేవరాయలు   (ఆ) రఘునాథ నాయకుడు 
    (ఇ) విజయ రాఘవ నాయకుడు   (ఈ) శహాజీ 
15. మనుచరిత్రలో రాయలను పెద్దన ఏమని వర్ణించాడు? 
    (అ) భోజ క్షమాపతి విద్యాపరిపాక    (ఆ) నిస్తంద్ర ప్రతిభా (ఇ) ప్రతికల ప్రౌఢిప్రియంభావుకా  (ఈ) పై అన్ని విధాలుగా 
16. ‘శ్రీమదనగోపాల మంత్రవరప్రసాదలబ్ద సారస్వత సుకవి జన హితవబోవైభవుడ’ని ఆశ్వాసాంత గద్యంలో చెప్పుకున్న కవి? 
    (అ) పొన్నికంటి తెలగన  (ఆ) ములుగు పాపయారాధ్యులు 
    (ఇ) కూచిమంచి తిమ్మకవి    (ఈ) కందుకూరి రుద్రకవి 
17. ‘చెప్పవలె గప్పురంబులు, కుప్పలుగా బోసినట్లు కుంకుమపైపై’ అన్న పద్యకర్త? 
    (అ) సంకుసాల నృసింహకవి       (ఆ) చేమకూర వేంకటకవి 
    (ఇ) రఘునాథ నాయకుడు     (ఈ) వెలగపూడి వెంగయామాత్యుడు 
18. పింగళి- కాటూరి కవుల ‘సౌందరనందం’ను ప్రేమోపనిషత్తని శ్లాఘించిందెవరు? 
    (అ) ఉన్నవ       (ఆ) విశ్వనాథ    
    (ఇ) కృష్ణశాస్త్రి    (ఈ) వేదుల సత్యనారాయణ శాస్త్రి 
19. సాహితీ సమితి తరఫున శివశంకర శాస్త్రి (స్వామి) సంపాదకత్వంలో 1920లో స్థాపితమైన పత్రిక? 
    (అ) చందమామ    (ఆ) కళాకేళి    
    (ఇ) సాహితి    (ఈ) స్రవంతి
20. ‘‘తెప్పవోలిక చంద్రబింబం తేలిపోతోంది నింగిని, అందులో నా ప్రేయసి ఉంది కాబోలు’’ లాంటి లలిత గీతాలతో భావకవిగా పేరు పొందినవారు? 
    (అ) పిలకా గణపతిశాస్త్రి    (ఆ) మల్లవరపు విశ్వేశ్వరరావు
    (ఇ) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (ఈ) బసవరాజు అప్పారావు 
21. సంకీర్ణమైన ఇతివృత్తంతో, అనేకానేక కల్పనలతో భాసించే ప్రత్యేక కథారూపాన్ని ‘మార్షెన్‌’ అంటారు. ‘మార్షెన్‌’ ఏ భాషా పదం? 
    (అ) ఫ్రెంచి  (ఆ) పోర్చుగీస్‌  (ఇ) డచ్చి  (ఈ) జర్మన్‌ 
22. ‘లక్ష్యార్థ సిద్ధి’కి ఉదాహరణ?  
    (అ) పత్రం  (ఆ) సూది  (ఇ) ఛాందసుడు (ఈ) సాహెబు 
23. ‘వస్తాదు’ ఏ అర్థపరిణామానికి ఉదాహరణ?
    (అ) అర్థ వ్యాకోచం      (ఆ) అర్థ సంకోచం  
    (ఇ) సభ్యోక్తి      (ఈ) మృదూక్తి 
24. శబ్దపల్లవానికి ఉదాహరణ? 
    (అ) నిలబడు      (ఆ) ఇల్లిల్లు  
    (ఇ) నిండుకొను      (ఈ) కుంభకోణం
25. ‘గ’ అన్నది జానపదోచ్చారణలో ఎలా మారుతుంది?
    (అ) గా    (ఆ) గి    (ఇ) గె    (ఈ) గు
26. ‘ఈ రాజన్యుని మీదనే గవిత సాహిత్య స్ఫురన్మాధురీ’ పద్యం ఏ ప్రబంధంలోది? 
    (అ) మనుచరిత్ర      (ఆ) పాండురంగ మాహాత్మ్యం  
    (ఇ) శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం (ఈ) వసుచరిత్ర 
27. తపతీ సంవరణోపాఖ్యానం మహాభారతంలో ఏ పర్వంలో కనిపిస్తుంది? 
    (అ) ఆది   (ఆ) సభా   (ఇ) ఉద్యోగ   (ఈ) విరాట
28. బాయ్‌ లీ రాయలసీమలో రాజకీయోద్యోగిగా ఎన్ని పాటలు సేకరించి ఇండియన్‌ ఆంటీక్వరీలో ప్రచురించాడు?
    (అ) 6    (ఆ) 9    (ఇ) 100    (ఈ) 212
29. భానుదత్తుడు పేర్కొన్న ‘జృంభ’ ఏ భేదానికి చెందింది? 
    (అ) గుణం (ఆ) రీతి  (ఇ) సాత్విక భావం     (ఈ) అర్థవృత్తి 
30. కింది వాటిలో శబ్దవృత్తి భేదం? 
    (అ) కైశికి   (ఆ) ప్రసాదం  (ఇ) వ్యంజన  (ఈ) భారతి 
31. సామెతకు పర్యాయపదం? 
    (అ) లోకోక్తి  (ఆ) శాస్త్రం  (ఇ) జనశృతి  (ఈ) అన్నీ 
32. ‘ముస్తాబు’ ఏ భాషా పదం? 
    (అ) పోర్చుగీసు  (ఆ) ఉర్దూ  (ఇ) తెలుగు   (ఈ) డచ్చి
33. ‘జాతీయాలు - పుట్టు పూర్వోత్తరాలు’ గ్రంథ కర్త? 
    (అ) నేదునూరి గంగాధరం    (ఆ) ముసునూరి వెంకటశాస్త్రి 
    (ఇ) రెంటాల గోపాలకృష్ణ  (ఈ) చిలుకూరి నారాయణరావు 
34. ‘జుంజప్ప జాతర’ ఏ జిల్లాలో మూడురోజుల పాటు జరుగుతుంది? 
    (అ) కర్నూలు (ఆ) చిత్తూరు (ఇ) అనంతపురం (ఈ) కడప 
35. ‘తెలుగు సాహిత్యంలో క్రీడా వినోదాలు’ గ్రంథకర్త? 
    (అ) వడ్లా సుబ్రహ్మణ్యం    (ఆ) నేదునూరి గంగాధరం 
    (ఇ) వేమూరి శ్రీనివాసరావు (ఈ) నాళం కృష్ణారావు
36. ఏ దేశ ప్రసిద్ధ జానపద విజ్ఞానవేత్తల్లో అగ్రగణ్యుడిగా ‘ఆంటి ఆర్నె’ను భావిస్తారు? 
    (అ) అమెరికా (ఆ) ఇంగ్లండ్‌ (ఇ) ఫిన్లాండ్‌ (ఈ) రష్యా 
37. ప్రసిద్ధ జానపద విజ్ఞానవేత్త థియోడర్‌ బెన్జ్‌ కాలం? 
    (అ) 1867 - 1925     (ఆ) 1894- 1947 
    (ఇ) 1885- 1976     (ఈ) 1809- 1881
38. ‘ఫోక్‌లోర్‌’ శబ్ద బ్రహ్మగా విఖ్యాతి చెందిందెవరు? 
        (అ) ఫ్రాన్సిస్‌ డై బైల్‌    (ఆ) ఆర్బర్‌ టేలర్‌   
    (ఇ) విలియం జాన్‌ థామ్స్‌    (ఈ) ఎవరూ కాదు
39. ‘అక్షర తూణీరం’ గ్రంథకర్త? 
    (అ) కె.వి.రమణారెడ్డి        (ఆ) దువ్వూరి రామిరెడ్డి 
    (ఇ) కట్టమంచి రామలింగారెడ్డి (ఈ) సురవరం ప్రతాపరెడ్డి 
40. థామ్స్‌ ‘ఫోక్‌లోర్‌’ పదం సృష్టించిన అయిదేళ్లకు తొలిసారి ఈ పదాన్ని ఒక గ్రంథనామంగా సూచించిందెవరు? 
    (అ) థామస్‌ స్టెన్‌ బెర్గ్‌      (ఆ) జాకబ్‌   
    (ఇ) విల్‌ హెల్‌్మ       (ఈ) డార్సన్‌ 
41. ‘భావి నా ఉజ్వలనేత్రం’ అన్న కవి? 
    (అ) ఇస్మాయిల్‌      (ఆ) ఇంద్రగంటి శ్రీకాంతశర్మ   (ఇ) కె.వి.రమణారెడ్డి    (ఈ)  అజంతా
42. ఏ కవిత్వాన్ని సమాజానికి ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’గా విమర్శకులు భావించారు? 
    (అ) విప్లవ  (ఆ) దిగంబర  (ఇ) భావ  (ఈ) అభ్యుదయ 


వెనక్కి ...

మీ అభిప్రాయం