‘మల్లెపూవుకంటె మంచి గంధముకంటె/ పంచదార కంటె పాల కంటె/ తెలుగు భాష లెస్స దేశభాషలకు సం/ గీత భాష తెలుగు జాతి భాష’ అన్నారు రసరాజు. తెలుగు భాషను అధ్యయనం చేస్తున్న వారి కోసం, ఆయా పోటీ పరీక్షల కోసం సాహిత్యం, భాషాశాస్త్రం, అలంకార శాస్త్రం, విమర్శ, వ్యాకరణాంశాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు...
1. ‘క్షేత్రలక్ష్మి’ పద్యకావ్య కర్త?
(అ) ఏటుకూరి వెంకట నరసయ్య (ఆ) చదలవాడ మల్లన (ఇ) సారంగు తమ్మయ్య (ఈ) కామినేని మల్లారెడ్డి
2. మరింగంటి సింగరాచార్యులు ఎన్నో ఏట వరదరాజస్తుతి, శ్రీరంగ శతకం రచించాడు?
(అ) పదహారో (ఆ) పన్నెండో (ఇ) తొమ్మిదో (ఈ) పదో
3. ‘చిత్ర భారతం’ అనే ఎనిమిదాశ్వాసాల ప్రబంధ రచయిత?
(అ) వెలగపూడి వెంగయామాత్యుడు (ఆ) శంకర కవి
(ఇ) చరిగొండ ధర్మన్న (ఈ) రామరాజు రంగప్పరాజు
4. ‘చంద్రభాను చరిత్ర’ కర్త?
(అ) హరి భట్టు (ఆ) తరిగొప్పుల మల్లన (ఇ) ఎడపాటి ఎర్రన (ఈ) బొడ్డుచెర్ల చిన తిమ్మయ
5. బొడ్డుచెర్ల చిన తిమ్మయ ‘ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధా’న్ని ఎవరికి అంకితమిచ్చాడు?
(అ) రఘునాథ నాయకునికి (ఆ) విజయ రాఘవ నాయకునికి
(ఇ) నంద్యాల తిమ్మరాజుకి (ఈ) శహాజీకి
6. ‘సూతసంహిత’ అనే ఏడు ఆశ్వాసాల పద్య గ్రంథకర్త?
(అ) మల్లారెడ్డి (ఆ) కామారెడ్డి
(ఇ) పట్టమెట్ట సోమనాథ సోమయాజి (ఈ) కామినేని ఎల్లారెడ్డి
7. ‘కామిగాని వాడు కవిగాడు రవిగాడు’ అన్నదెవరు?
(అ) బద్దెన (ఆ) వేమన (ఇ) మారద వెంకయ్య (ఈ) పోతులూరి వీరబ్రహ్మం
8. ‘చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో’ అన్న పద్యం ఏ శతకంలోది?
(అ) దాశరథి (ఆ) భాస్కర
(ఇ) దేవకీ నందన (ఈ) ఒంటిమిట్ట రఘువీర శతకం
9. భావకవి, చిత్రకారుడు, శిల్పి, సంగీతవేత్త, నటుడు, నవలా, కథా రచయిత అయిన బహుముఖ ప్రజ్ఞావంతుడు?
(అ) నండూరి వేంకట సుబ్బారావు (ఆ) అడవి బాపిరాజు
(ఇ) దువ్వూరి రామిరెడ్డి (ఈ) వేదుల సత్యనారాయణ శాస్త్రి
10. ‘మ్రొక్కిన కొలంది కాలితో ద్రొక్కుచున్న ఈ కఠిన లోకమెల్ల బహిష్కృతమ్ము’ అన్న పలుకులెవరివి?
(అ) శివశంకర శాస్త్రి (ఆ) వేదుల సత్యనారాయణ శాస్త్రి (ఇ) నోరి నరసింహశాస్త్రి (ఈ) మల్లవరపు విశ్వేశ్వరరావు
11. ‘సంధ్యారాగం’ పేరుతో 1922లో ఖండకావ్య సంపుటి వెలువరించిందెవరు?
(అ) కొడవటిగంటి వెంకట సుబ్బయ్య (ఆ) నాయని సుబ్బారావు
(ఇ) పిలకా గణపతిశాస్త్రి (ఈ) బసవరాజు అప్పారావు
12. ‘‘ప్రసిద్ధాంధ్ర కవులు మ్రోయించిన కవితావీణలు నా పనితనంలో నన్నాకర్షించాయి. నేనూ ఒక వీణ మ్రోయించాలి అనుకొన్నాను. ప్రయత్నం మీద నాకు లభించినది వీణకాదు, సితార. అది నా కవిత- వినిపించింది ప్రజలకు కాని ప్రభువులకు కాద’’న్నవారు?
(అ) అజంతా (ఆ) జాషువా (ఇ) శ్రీశ్రీ (ఈ) కుందుర్తి
13. ‘‘దూదిపింజెల్లాంటి కొత్త మబ్బుల్తో తొంగిచూడ్డమే పునర్నవం’’ అన్న కవి?
(అ) తిలక్ (ఆ) అనిశెట్టి (ఇ) దాశరథి (ఈ) పఠాభి
14. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట గాథను ‘స్వాతంత్య్ర వీరుడు’ పేరుతో వీరరస ప్రధానంగా రచించిన వారు?
(అ) బోడేపూడి వెంకటరావు (ఆ) బెళ్లూరి శ్రీనివాసమూర్తి (ఇ) పాణ్యం నరస రామయ్య (ఈ) వజ్జల కాళిదాసు
15. ‘మృత్యుంజయుడు’ ఎవరి నవల?
(అ) వట్టికోట ఆళ్వారుస్వామి (ఆ) లక్ష్మీకాంత మోహన్ (ఇ) బొల్లిముంత శివరామకృష్ణ
(ఈ) పురాణం సూర్యప్రకాశరావు
16. ‘తెలుగు తీరులు’ పేరుతో వ్యాస సంపుటి వెలువరించిందెవరు?
(అ) ఎస్వీ జోగారావు (ఆ) కేశవ పంతులు నరసింహశాస్త్రి
(ఇ) పుట్టపర్తి నారాయణాచార్యులు (ఈ) ఆర్.ఎస్.సుదర్శనం
17. ‘‘ఖలుడిల దప్పులే వెదకు గావ్యరసానుభవంబు సేయలేడు’’ అన్నదెవరు?
(అ) కంకంటి పాపరాజు (ఆ) నన్నెచోడుడు (ఇ) సంకుసాల నృసింహకవి (ఈ) తిక్కన
18. సోమకవి ఏ రచనకు ‘విద్వజ్జన రంజనీ’ వ్యాఖ్య రచించాడు?
(అ) రాఘవ పాండవీయం (ఆ) హరిశ్చంద్ర నలోపాఖ్యానం
(ఇ) వసుచరిత్ర (ఈ) మనుచరిత్ర
19. ఓ వాక్యం వల్ల ఇంకొక వాక్యం అనుస్యూతంగా స్ఫురిస్తుంటే ఈ రెండు వాక్యాల మధ్య సంబంధాన్ని ఏమంటారు?
(అ) అర్థానిర్దిష్ట సత్యా సత్యత (ఆ) వాక్యాసంబద్ధత
(ఇ) అనుగతి (ఈ) వివరణాత్మక సత్యం
20. సంశ్లేషణాత్మక భాష?
(అ) చైనీస్ (ఆ) టర్కీష్ (ఇ) ద్రావిడ భాషలు (ఈ)లాటిన్
21. 1818లో అగష్టవోన్ ష్లెగెల్ ప్రపంచ భాషలన్నిటినీ లక్షణాలు అనుసరించి ఎన్ని సముదాయాలుగా విభజించాడు?
(అ) రెండు (ఆ) మూడు (ఇ) ఆరు (ఈ) ఎనిమిది
22. 14వ శతాబ్దిలో వెలువడిన ‘లీలాతిలకం’తో ఏ భాషకు వ్యాకరణం మొదలైంది?
(అ) తమిళం (ఆ) కన్నడం (ఇ) మలయాళం (ఈ)ఒరియా
23. ఒకే ఒకసారి కరణం స్థానాన్ని తేలిగ్గా స్పృశించి వదిలివేసినప్పుడు పుట్టే ధ్వని?
(అ) పార్శ్వికం (ఆ) తాడితం
(ఇ) మూర్ధన్యం (ఈ) దంతమూలీయం
24. దంతమూలీయ తాడితం?
(అ) న (ఆ) శ (ఇ) ట (ఈ) ర
25. ఏ అచ్చుల ఉచ్చారణలో నాలుక వెనక్కి వెళ్లి కుంచించుకుని ఉండటంతో మృదుతాలువుకీ, నాలుకకీ మధ్య సన్నని మార్గం ఉంటుంది?
(అ) అగ్రాచ్చులు (ఆ) పశ్చిమాచ్చులు (ఇ) కేంద్రాచ్చులు (ఈ) అన్నీ
26. ‘బహువ్యాపక వర్ణనిర్మాణం’ శాఖని స్థాపించిందెవరు?
(అ) ఛోమ్స్కీ (ఆ)ఫర్త్ (ఇ) యాకోబ్సన్ (ఈ) బ్లూమ్ఫీల్డ్
27. ఎదుటి వారిని గురించి చెప్పే పురుష భేదం?
(అ) ప్రథమ (ఆ) మధ్యమ (ఇ) ఉత్తమ (ఈ) ఎగువ
28. స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులు వాని విశేషణాలను వ్యాకరణంలో ఏమంటారు?
(అ) అమహత్తులు (ఆ) మహత్తులు
(ఇ) మహతీ వాచకం (ఈ) క్లీబం
29. ఉదంతమైన తద్ధర్మార్థ విశేషణానికి అచ్చు పరమైనప్పుడు ఆగమంగా వచ్చేది?
(అ) టు (ఆ) ను (ఇ) దు (ఈ) రు
30. ‘కలికి’లో ఉత్తమం?
(అ) క (ఆ) లి (ఇ) కి (ఈ) ఇ
31. శేషేంద్రశర్మ నాయకత్వంలో ‘కవిసేన’ ఎప్పుడు ఏర్పాటయ్యింది?
(అ) 1957 (ఆ) 1967 (ఇ) 1977 (ఈ) 1987
32. ‘‘దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే... అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే’ అన్నదెవరు?
(అ) నగ్నముని (ఆ) చెరబండరాజు (ఇ) భైరవయ్య (ఈ) నిఖిలేశ్వర్
33. పడవ నడిపేవారు పాడే ‘ఏలెస్సా ఏలెస్సా ఓలెస్సా’ అన్నది ఏ తరహా గేయం?
(అ) బాలగేయం (ఆ) శృంగార గేయం
(ఇ) శ్రామిక గేయం (ఈ) పారమార్థిక గేయం
34. బొడ్డుచర్ల తిమ్మన రచించిన ‘ప్రసన్న రాఘవం’ ఎన్ని అంకాల నాట్య ప్రబంధం?
(అ) 4 (ఆ) 6 (ఇ) 7 (ఈ) 8
35. షేక్స్పియరు ‘జూలియస్ సీజర్’ను ‘సీజరు చరిత్రము’ పేర ఆంధ్రీకరించి ప్రకటించిందెవరు?
(అ) కోరాడ రామచంద్ర శాస్త్రి
(ఆ) వావిలాల వాసుదేవ శాస్త్రి
(ఇ) కొక్కొండ వేంకటరత్నం పంతులు
(ఈ) పరవస్తు వేంకటరంగాచార్యులు
36. కొండముది గోపాలరాయశర్మ నాటకం?
(అ) కాంచన మాల (ఆ) శబరి
(ఇ) ఎదురీత (ఈ) త్రిశూలము
37. శృంగార కవి సర్వారాయుడు రాసిన ఏకాంకిక?
(అ) సముద్ర తీరము (ఆ) గ్రామ కచేరి
(ఇ) దెయ్యాల లంక (ఈ) స్వతంత్రం