‘రసచంద్రిక’ కర్త?

  • 36 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। పి.విజయకుమార్‌

  • సహాయ ఆచార్యులు
  • అనంతపురం
  • 9063702546
డా।। పి.విజయకుమార్‌

తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే అధ్యాపక ఉద్యోగాల పరీక్షల్లో లోతైన ప్రశ్నలు తారసపడుతున్నాయి. ప్రధానంగా భాష, అలంకార శాస్త్రం, విమర్శ, వ్యాకరణం, సాహిత్యానికి సంబంధించి ఎవరూ ఊహించని ప్రశ్నలు అడుగుతున్నారు. వాటిని ఎదుర్కోవాలంటే కూలంకషమైన అధ్యయనం తప్పనిసరి. ఆ కోణంలో అభ్యర్థుల సాధన కోసం కొన్ని మాదిరి ప్రశ్నలివి..!

1. ‘రైతులు పంటలు పండిస్తారు’లో అర్థకాల సంఖ్య?  
    అ. 3    ఆ. 6    ఇ. 9    ఈ. 12
2. ‘రాగి’ అనేది ఏ మాండలిక భేదానికి చెందిన పదం? 
    అ. పూర్వ మండలం (కళింగ)            
ఆ. దక్షిణ మండలం (రాయలసీమ)        
    ఇ. ఉత్తర మండలం (తెలంగాణ)            
ఈ. మధ్య మండలం (కోస్తా)
3. శబ్ద పల్లవానికి ఉదాహరణ?  
    అ. దయచేయు        ఆ. ఇల్లిల్లు 
    ఇ. తీపిమాట         ఈ. కుంభకోణం
4. ఈ కింది వాటిలో జాతీయం?  
    అ. నాంది పలుకు    ఆ. వాడిచూపు        
ఇ. ముష్టివాడు        ఈ. మంచం కాలు
5. ‘భాషాభివృద్ధి: భాషాయోజన’ వ్యాసకర్త?  
    అ. చేకూరి రామారావు    ఆ. పోరంకి దక్షిణామూర్తి        ఇ. జి.ఎన్‌.రెడ్డి        ఈ. భద్రిరాజు కృష్ణమూర్తి
6. సంస్కృత భాగవతంలో హరిస్తుతి చేస్తూ ‘కిరాత హుణాంధ్ర పుళిందాది జాతులు తమతమ పాపాల నుంచి విముక్తి పొందడానికి హరిని ఆశ్రయించార’నేది ఎవరు?  
    అ. ప్రహ్లాదుడు        ఆ. బలిచక్రవర్తి            ఇ. శుకుడు        ఈ. విరోచనుడు
7. ‘శతక వాఙ్మయ సర్వస్వము’ గ్రంథకర్త?  
    అ. వేదం వేంకట కృష్ణశర్మ  ఆ. నిదడవోలు వేంకటరావు    ఇ. వారణాశి వేంకటేశ్వర్లు      ఈ. దివాకర్ల వేంకటావధాని
8. ‘కర్ణాటక ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ఎవరి రచన?  
    అ. రత్నాకరం శంకరనారాయణరాజు                ఆ. పుల్లాభొÄట్ల వేంకటేశ్వర్లు                ఇ. త్రిపురనేని వెంకటేశ్వరరావు  ఈ. శివలెంక శంభుప్రసాద్‌
9. ‘సాహిత్య నేపథ్యం’ ఎవరి వ్యాసావళి?  
    అ. ఆర్వీయస్‌ సుందరం        ఆ. ఆర్‌.ఎస్‌.సుదర్శనం    ఇ. తంగిరాల సుబ్బారావు       ఈ. వంగూరి సుబ్బారావు
10. ‘కమ్మని లతాంతముల కుమ్మెనసి వచ్చు మధుపమ్ముల’ అంటూ లయగ్రాహి వృత్తంలో వసంత రుతువర్ణన చేసింది?  
    అ. నన్నయ  ఆ. తిక్కన  ఇ. ఎర్రన  ఈ. నాచన సోమన
11. ‘చక్కని తల్లికి చాంగుభళా, తన చక్కెర మోవికి చాంగుభళా’ అన్న పాట ఎవరిది?  
    అ. రామదాసు        ఆ. త్యాగయ్య             ఇ. అన్నమయ్య        ఈ. క్షేత్రయ్య
12. గౌరన ‘నవనాథ చరిత్ర’లో ఎవరి కథ కనిపిస్తుంది  
    అ. నలుడు         ఆ. సారంగధరుడు            ఇ. యయాతి         ఈ. శర్మిష్ఠ
13. అనంతామాత్యుడి ‘భోజరాజీయం’లోని కథ?  
    అ. దుష్ట సతీసత్పతుల చరిత్ర                ఆ. చండాల దంపతుల చరిత్ర                ఇ. గోవ్యాఘ్ర కథ        ఈ. అన్నీ
14. మొల్ల ఎన్ని గద్య పద్యాలతో తెలుగులో రామాయణాన్ని రచించి శ్రీరాముడికి అంకితం చేసింది?  
    అ. 571    ఆ. 671    ఇ. 871      ఈ. 971    
15. ‘గుప్త విద్య యొకటి కులకాంత వంటిది’ అన్న పలుకులెవరివి?  
    అ. పోతులూరి వీరబ్రహ్మం    ఆ. వేమన        ఇ. రామదాసు            ఈ. అన్నమయ్య
16. ‘ప్రబంధోచితమైన ఆలంకారిక శైలికిని, సమతా గుణాలంకృత మైన సమపాద సీస పద్య రచనకును, పదసంవిధాన నైపుణి కిని, రస పోషణకును, స్త్రీపాత్ర సౌందర్య వర్ణనకును నైష ధమే ఆంధ్ర ప్రబంధ కవులకు భిక్ష పెట్టినది’ అన్నదెవరు?  
    అ. వేటూరి ప్రభాకరశాస్త్రి        ఆ. పింగళి లక్ష్మీకాంతం    ఇ. కె.వి.ఆర్‌.నరసింహం        ఈ. కొర్లపాటి శ్రీరామమూర్తి
17. ‘మాసిన చీర గట్టుకొని మౌనము తోడ నిరస్తభూషయై’ పద్యకర్త?  
    అ. పెద్దన  ఆ. తిమ్మన  ఇ. సూరన   ఈ. భట్టుమూర్తి
18. ‘‘శ్రీవిద్యనిధియై మహామహిమచే’’ అనే కృత్యాది పద్యంలో మంగళా చరణమే కాకుండా భావికథా సూచన చేసిన కవి?  
    అ. తెనాలి రామకృష్ణ కవి        ఆ. ధూర్జటి        ఇ. మాదయగారి మల్లన        ఈ. కృష్ణదేవరాయలు
19. ‘శక్తిర్నిపుణతా లోకశాస్త్ర కావ్యాద్య వేక్షణాత్‌/ కావ్యాజ్ఞ శిక్షయాభ్యాస ఇతిహేతు స్తదుద్భవే’ అన్నదెవరు?  
    అ. ఆనంద వర్ధనుడు      ఆ. మమ్మటుడు            ఇ. భామహుడు          ఈ. ఉద్భటుడు
20. వెల్లంకి తాతంభట్టు రచన?  
    అ. కావ్యానుశాసనము      ఆ. ఛందోదర్పణము        ఇ. కావ్య చింతామణి      ఈ. అన్నీ
21. ‘పింగళి సూరనార్యుడు’ విమర్శనా గ్రంథాన్ని వెలువరించింది?  
    అ. వింజమూరి రంగాచార్యులు                ఆ. పుదుప్పాకం సుబ్రహ్మణ్య అయ్యర్‌            ఇ. కాశీభట్ట బ్రహ్మయశాస్త్రి       ఈ. వెన్నేటి రామచంద్రరావు
22. తిరుపతి వేంకట కవుల ‘గీరతం’ ఏ కవులతో వాదాలకు సంబంధించిన గ్రంథం?  
    అ. పింగళి-కాటూరి    ఆ. ఓలేటి కవులు            ఇ. కొప్పరపు కవులు    ఈ. సత్యాంజనేయ కవులు
23. తిరుపతి వేంకట కవులు కొప్పరపు కవులతో కూడిన వివాదం గురించి ఏ రచనలో వివరించారు?  
    అ. కోనసీమ        ఆ. గుంటూరు సీమ             ఇ. రాయలసీమ        ఈ. పల్నాటి సీమ
24. ‘సత్కవి కల్పనా కథలు సానల దీరిన జాతిరత్నాలు’ అని చెప్పిన కవి? 
    అ. పింగళి సూరన    ఆ. భట్టుమూర్తి            ఇ. శ్రీనాథుడు        ఈ. పెద్దన
25. ఈ కింది వాటిలో వ్యభిచారి భావ భేదం?  
    అ. లీల   ఆ. విలాసం   ఇ. వేపధువు    ఈ. గ్లాని
26. భట్టనాయకుడి సిద్ధాంత వాదం?  
    అ. అభివ్యక్తి    ఆ. భుక్తి      ఇ. ఉత్పత్తి   ఈ. అనుమితి
27. వాచ్యార్థాన్ని బోధించేది?  
    అ. అభిధ  ఆ. భావుకత్వం  ఇ. భోజకత్వం     ఈ. వ్యంజన
28. ‘రసచంద్రిక’ కర్త?  
    అ. భానుదత్తుడు    ఆ. విశ్వేశ్వరుడు            ఇ. భోజుడు        ఈ. విశ్వనాథుడు
29. ‘నేలయు నింగియు దాళముల్‌గా జేసి యేపున రేగి వాయించి చూడ’ పద్యంలో తిక్కన ఎవరి అంతరంగాన్ని రౌద్రరస పూరితంగా వర్ణించాడు?  
    అ. అర్జునుడు        ఆ. దుర్యోధనుడు             ఇ. భీముడు         ఈ. కృష్ణుడు
30. ఒక శబ్దం తనకున్న అర్థాన్ని కోల్పోయి, తనకు సంబంధించిన అర్థాన్ని ఎక్కడ బోధిస్తుందో ఆ వృత్తి ఏ లక్షణ భేదానికి చెందింది?  
    అ. జహల్లక్షణ        ఆ. అజహల్లక్షణ            ఇ. సారోపలక్షణ        ఈ. సాధ్యవసాయ లక్షణ
31. ‘భువనవిజయం’ నవలా కర్త?  
    అ. చిలకమర్తి        ఆ. ధూళిపాళ్ల శ్రీరామమూర్తి        ఇ. తెన్నేటి సూరి    ఈ. చిలుకూరి వీరభద్రరావు
32. ‘‘కథ అనేది మొదట్లో కుతూహలాన్ని, చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తికట్టిస్తూ చెప్పుకోవాలి’’ అన్నదెవరు? 
    అ. తిలక్‌    ఆ. చలం      ఇ. గోపీచంద్‌    ఈ. ఆరుద్ర
33. ‘గోవు’ అనేది?  
    అ. సంస్కృతం          ఆ. సంస్కృత సమం         ఇ. ప్రాకృత సమం     ఈ. పాకృత భవం
34. అనుదంత తెనుగు డుమంతానికి నిత్యంగా వచ్చే ఆగమం?  
    అ. ను    ఆ. ని      ఇ. దు         ఈ. రు
35. సముఖం వేంకట కృష్ణప్పనాయకుడు ‘జైమినీ భారతం’ వచనంలో రాసి ఎవరికి అంకితమిచ్చాడు?   
    అ. రఘునాథ  నాయకుడికి ఆ. విజయరంగ చొక్కనాథుడికి    ఇ. శహాజీకి          ఈ. తుక్కోజీకి
36. రజోపురాణాలలో ఒకటిగా భావించే పురాణం?  
    అ. భాగవతం      ఆ. పద్మ     ఇ. శివ    ఈ. బ్రహ్మ
37. సంస్కృతంలో కృష్ణమిశ్రుడు ఏ రాజు కోరిక మీద ‘ప్రబోధచంద్రోదయ’ నాటకాన్ని రచించాడు?  
    అ. యశోవర్మ             ఆ. కీర్తివర్మ
    ఇ. ఉమాపతి ధరుడు        ఈ. విగ్రహరాజు
38. ‘మంగళాద్రి నారసింహ శతక’ కర్త?  
    అ. మండపాక పార్వతీశ్వరశాస్త్రి                 ఆ. ధర్మపురి శేషప్పన్న కేసరి                ఇ. తిరువాయి వేంకట కవి ఈ. తాడేపల్లి పానకాలరాయకవి
39. ‘భేతాళ పంచవింశతి’ కథాకావ్య కర్త?  
    అ. వెన్నెలకంటి అన్నయ్య     ఆ. పుత్తేటి రామభద్ర కవి        ఇ. కూచిరాజు ఎర్రన     ఈ. బైచిరాజు వెంకటనాథుడు
40. ‘కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి / రత్నాంబరమ్ములే రాయడిచ్చు’ అన్న చాటు పద్యం ఏ కవి అవసాన దశలో చెప్పుకున్నట్లు తెలుస్తోంది?  
    అ. పోతన    ఆ. శ్రీనాథుడు  ఇ. పెద్దన    ఈ. తిమ్మన
41. ‘సరస సాహిత్య లక్షణ విచక్షుడు’ అనేది ఏ కవి బిరుదు?  
    అ. మడికి సింగన    ఆ. గౌరన                ఇ. నాచన సోమన    ఈ. దగ్గుపల్లి దుగ్గన
42. ‘పాంచజన్యం’ కర్త?  
    అ. కవిరాజ మూర్తి    ఆ. కారుమంచి వెంకటేశ్వరరావు    ఇ. బోయి భీమన్న    ఈ. గజ్జెల మల్లారెడ్డి
సమాధానాలు: 1.(ఇ); 2.(ఆ); 3.(అ); 4.(అ); 5.(ఆ); 6.(ఇ); 7.(అ); 8.(అ); 9.(ఆ); 10.(అ); 11.(ఇ); 12.(ఆ); 13.(ఈ); 14.(ఇ); 15.(ఆ); 16.(ఆ); 17.(ఆ); 18.(ఆ); 19.(ఆ); 20.(ఈ); 21.(అ); 22.(ఆ); 23.(ఆ); 24.(ఆ); 25.(ఈ); 26.(ఆ); 27.(అ); 28.(ఆ); 29.(ఇ); 30.(అ); 31.(ఆ); 32.(ఈ); 33.(ఆ); 34.(ఆ); 35.(ఆ); 36.(ఈ); 37.(ఆ); 38.(ఈ); 39.(ఈ); 40.(ఆ); 41.(ఆ); 42.(ఆ)


వెనక్కి ...

మీ అభిప్రాయం