తొలి తెలుగు మధ్యాక్కర శాసనం?

  • 31 Views
  • 4Likes
  • Like
  • Article Share

‘‘పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు అలంపురీ నందనారామ విభ్రాజి మల్లోల ఫలరాజ మధురరుచికి ధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత తుంగా పయస్సు మాధుర్యమునకు ఖండశర్కరజాతి ఖర్జూరగోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకు అమృత నిష్యంది వల్లకాహ్లాదమునకు రాగిణీ దివ్య సమ్మోద రాగమునకు తేనెతేటల నవకంపు సోనలకును సాటియగును మాతెలుగు భాషామతల్లి’’ అంటూ తెలుగు భాష విశిష్టతను కీర్తించారు సురవరం ప్రతాపరెడ్డి. ఆయా పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు...
(1) ‘‘చూడి కొడుత్తాళ్‌’ అనే తమిళ పదసంపుటికి సంస్కృతీకరణమైన ప్రబంధం?

    అ) మనుచరిత్ర      ఆ) వసుచరిత్ర    
    ఇ) ఆముక్తమాల్యద    ఈ) విజయవిలాసం
(2) ‘‘తగ సంస్కృతము దెనుగుగజేయ దెనుగు సంస్కృతముగ జేయంగ జతురమతివి’’ అని రామకృష్ణకవిని గురించి పలికిందెవరు? 
    అ) శ్రీకృష్ణదేవరాయలు     ఆ) విరూరి వేదాద్రిమంత్రి
    ఇ) భట్టుమూర్తి     ఈ) పింగళి సూరన
(3) ‘చీకటి రాజ్యం’ నవలా కర్త? 
    అ) తెన్నేటి సూరి      ఆ) శాంతి నారాయణ    
    ఇ) వి.ఆర్‌.రాసాని      ఈ) కె.కె.మీనన్‌
(4) అర్థోపక్షేపకాలలో ఒకటి?
    అ) ప్రకరి     ఆ) నియతాప్తి    ఇ) చూళిక   ఈ) గర్భసంధి
(5) రేఫ శ్లిష్టానికి - అశ్లిష్టానికి, లకార శ్లిష్టానికి - అశ్లిష్టానికి ప్రాస చెల్లితే అది ఏ ప్రాస అవుతుందని అప్పకవి పేర్కొన్నాడు? 
    అ) ఉభయ ప్రాస     ఆ) సంయుతా సంయుత ప్రాస
    ఇ) త్రిప్రాస       ఈ) ఖండాఖండ ప్రాస
(6) ‘విరసం’లో చేరని దిగంబర కవి?
    అ) నగ్నముని     ఆ) జ్వాలాముఖి
    ఇ) నిఖిలేశ్వర్‌    ఈ) భైరవయ్య
(7) ‘భ - మ - స - భ - న - న - న - య’ అనే గణక్రమం ఉండే వృత్త పద్య భేదం? 
    అ) కవిరాజ విరాజితం    ఆ) స్రగ్ధర
    ఇ) తరళం        ఈ) క్రౌంచపదం
(8) తొలి తెలుగు మధ్యాక్కర శాసనం?
    అ) కందుకూరు   ఆ) రుద్రవరం
    ఇ) బెజవాడ       ఈ) ఆరుంబాక
(9) ‘‘తలచినంతనె తన్మయత్వము కల్గి తీపినొందించు పీయూష తెలుగు భాష’’ అన్న కవి? 
    అ) విశ్వనాథ      ఆ) సురవరం ప్రతాపరెడ్డి
    ఇ) మిరియాల రామకృష్ణ   ఈ) సినారె
(10) ‘మాండుక్యోపనిషత్తు’ ఏ వేదానికి సంబంధించింది? 
    అ) ఋగ్వేదం    ఆ) యజుర్వేదం
    ఇ) సామవేదం    ఈ) అధర్వణవేదం
(11) సంస్కృతంలో ‘ఛందస్సూత్రము’ అనే ఛందశ్శాస్త్ర గ్రంథం రాసిందెవరు? 
    అ) అనంతుడు    ఆ) మల్లియ రేచన
    ఇ) పింగళుడు    ఈ) రాజశేఖరుడు
(12) లభిస్తున్న సంస్కృత కావ్య శాస్త్రాలలో దేనిలో మొదటిసారిగా మహా కావ్య లక్షణాలు చెప్పారు? 
    అ) రుద్రటుని ‘కావ్యాలంకారం’    ఆ) భామహుని ‘కావ్యాలంకారం’
    ఇ) రాజశేఖరుని ‘కావ్యమీమాంస’   ఈ) విద్యాధరుని ‘ఏకావళి’
(13) ఆర్‌ఎస్‌ బాగ్స్‌ విభజించిన గుంపులో ఆహార పానీయాలు ఏ గుంపునకు సంబంధించినవి? 
    అ) ఎ   ఆ) ఎఫ్‌   ఇ) ఎమ్‌   ఈ) ఎన్‌
(14) ‘‘ఎ గైడ్‌ ఫర్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఇన్‌ ఫోక్‌లోర్‌’ గ్రంథకర్త? 
    అ) కె.ఎస్‌.గోల్డ్‌స్టీన్‌   ఆ) బాగ్స్‌
    ఇ) స్టిత్‌ థాంసన్‌     ఈ) ఆంటి ఆర్నె
(15) 1928లో ‘మార్ఫాలజీ ఆఫ్‌ ఫోక్‌టేల్‌’ గ్రంథాన్ని ప్రచురించిందెవరు?     
    అ) డార్సన్‌      ఆ) వి.జె.ప్రాప్‌
    ఇ) విలియమ్‌ ఆర్‌. బాస్కమ్‌    ఈ) లెవిస్ట్రాస్‌
(16) ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - యుగ విభజనము’ అనే వ్యాసంలో వాఙ్మయ పరిణామక్రమంలో ప్రధాన లక్షణాలను బట్టి ఆరు యుగాలుగా విభజించిందెవరు? 
    అ) దివాకర్ల వేంకటావధాని  ఆ) ఆరుద్ర
    ఇ) కోరాడ రామకృష్ణయ్య  ఈ) గురజాడ శ్రీరామమూర్తి
(17) కిరాత శబ్ద భవమైన చిలాత శబ్దం క్రీ.శ. ఏ శతాబ్దినాటి ప్రాకృత శాసనంలో లభిస్తోంది? 
    అ) 3    ఆ) 5   ఇ) 7   ఈ) 9
(18) ‘‘శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు శివపదవర రాజ్య సేవితుండు’’ అన్న సీస పద్యం తొలిసారిగా ఏ శాసనంలో కనిపిస్తుంది? 
    అ) ధర్మవరం   ఆ) కందుకూరు
    ఇ) అద్దంకి    ఈ) విప్పర్తి
(19) ‘‘చందన తమాలతరులందు నగరుద్రుమములందు గదళీవ్యములందులవలీమా...’’ అన్న నన్నయ పద్యం ఏ వృత్తానికి సంబంధించింది? 
    అ) ఉత్పలమాల    ఆ) కవిరాజ విరాజితం
    ఇ) లయగ్రాహి    ఈ) మాలిని
(20) ‘‘ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల గావ్యగర్తవై’’ అని ఎర్రనను ప్రశంసించిందెవరు? 
    అ) శ్రీనాథుడు   ఆ) ఎఱపోత సూరి
    ఇ) చదలవాడ మల్లన    ఈ) శ్రీనాథుడు
(21) భారతంలోని ఏ పర్వ కథ పిన వీరభద్రుని ‘జైమిని భారతం’లో వర్ణితమయింది? 
    అ) కర్ణ  ఆ) శల్య  ఇ) అశ్వమేధ ఈ) ఆశ్రమవాస
(22) సంస్కృతంలో వేదాంత బోధకమైన ఆరంకాల కృష్ణమిశ్రుడి దృశ్యకావ్యం ‘ప్రబోధ చంద్రోదయము’ను నంది మల్లయ, ఘంట సింగయలు ఎన్ని ఆశ్వాసాల శ్రవ్య కావ్యంగా అనువదించారు? 
    అ) 8     ఆ) 7    ఇ) 6   ఈ) 5
(23) ‘పురా+అనక్తి పురాణమ్‌’ అని ఏ పురాణం నిర్వచించింది? 
    అ) భవిష్య    ఆ) బ్రహ్మాండ  

    ఇ) పద్మ    ఈ) స్కాంథ
(24) ‘ఎఱ్ఱన శ్రీనాథుల సూక్తి వైచిత్రి’ గ్రంథకర్త?
    అ) పింగళి లక్ష్మీకాంతం    ఆ) జి.నాగయ్య
    ఇ) కట్టమంచి      ఈ) విశ్వనాథ
(25) ‘‘భూమి తన చుట్టూ తాను తిరుగుతూ/ ధనవంతుడి చుట్టూ తిరుగుతోంది’’ అన్న కవి? 
  అ) కుందుర్తి     ఆ) కాళోజీ   ఇ) తిలక్‌    ఈ) రెంటాల
(26) ‘సంస్థానముల సాహిత్య సేవ’ గ్రంథకర్త? 
    అ) తూమాటి దొణప్ప         ఆ) కేశవపంతుల నరసింహశాస్త్రి
    ఇ) వడ్డాది సుబ్బారాయుడు ఈ) సెట్టి లక్ష్మీనరసింహం
(27) ‘‘ఇయ్యగ నిప్పింపంగల/ యయ్యలకేగాని మీసమందరికేలా’’ పద్యం ఏ శతకంలోది?
    అ) భాస్కర        ఆ) కవి చౌడప్ప
    ఇ) భక్తమందార    ఈ) సుమతీ
(28) ‘‘ఈ దేశంలో దేశానికి వెన్నెముక గ్రామం/ గ్రామానికి వెన్నెముక రైతు/ వెన్నెముక ఎప్పుడూ వెనకే ఉంటుంది/ రైతు ఎన్నడూ వెనకబడే ఉంటున్నాడు’’ అన్న కవి? 
    అ) అలిశెట్టి ప్రభాకర్‌        ఆ) రావి రంగారావు    
    ఇ) పోతుకూచి సాంబశివరావు    ఈ) రాళ్లబండి 
(29) ‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావి అయినా కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు’’ అన్న కవి?    
    అ) చంద్రసేన్‌        ఆ) వసీరా
    ఇ) గోపాలచక్రవర్తి        ఈ) ఎన్‌.గోపి
(30) ‘సాహితీ విమర్శ సూత్రం - అన్వయం’ గ్రంథకర్త?
    అ) కోవెల సంపత్కుమారాచార్య     ఆ) ఎస్వీ రామారావు
    ఇ) ముదిగొండ వీరభద్రయ్య ఈ) వడలి మందేశ్వరరావు
(31) ‘నా అనుభవాలు’ పేరుతో స్వీయచరిత్ర రాసుకున్నదెవరు?
    అ) కె.ఎన్‌.కేసరి    ఆ) చలం
    ఇ) బుచ్చిబాబు    ఈ) సంగం లక్ష్మీబాయి
(32) ‘‘హృదంతరాళపు రెటీనా మీద/ నా బొమ్మ పూర్తిగా ముద్రపడకముందే/ నన్నొక పొట్లంలో బంధించిన పువ్వును చేసి/ నీ చేతికందించారు’’ అని ‘అవ్యక్త వేదనా రాగం’ పేరుతో కవిత రాసిందెవరు?
    అ) మందరపు హైమవతి     ఆ) ఘంటసాల నిర్మల
    ఇ) ఓల్గా   ఈ) కె.వరలక్ష్మి
(33) ‘రణరంగం కాని చోటు భూ స్థలమంతా వెదికిన దొరకదు/ గతమంతా తడిసె రక్తమున...’’ అన్నదెవరు? 
    అ) దాశరథి    ఆ) శివసాగర్‌ ఇ) శ్రీశ్రీ  ఈ) కాళోజీ 
(34) ‘ఎ డిఫెన్స్‌ ఆఫ్‌ పొయెట్రీ’ ప్రసిద్ధ విమర్శ గ్రంథకర్త? 
    అ) బ్లేక్‌  ఆ) షెల్లీ    ఇ) బైరన్‌   ఈ) కీట్స్‌
(35) ‘‘స్వతంత్ర సమరం సాగిందోయ్‌ పదండి వేగమె - పదండి ముందుకు  జాతీయ జెండాచ్ఛాయల్లోనే’’ అంటూ సమరాహ్వానం పలికిందెవరు? 
    అ) యాదగిరి        ఆ) మిక్కిలినేని భగవంతరావు
    ఇ) కాశీ విశ్వనాథం   ఈ) సుద్దాల హనుమంతు
(36) ‘తెలుగు ఛందోవికాసం’ గ్రంథకర్త? 
    అ) మాదిరాజు రంగారావు ఆ) వేగుంట మోహన్‌ప్రసాద్‌
    ఇ) కోవెల సంపత్కుమారాచార్య    ఈ) శీలా వీర్రాజు
(37) ‘‘రయవిచలత్తురంగమ తరంగములన్‌ మదనాగనక్ర...’’ పద్యకర్త?
    అ) శ్రీనాథుడు  ఆ) తిక్కన 3) పెద్దన  4) నన్నయ
(38)  నందిమల్లయ, ఘంటసింగయల వరాహపురాణం ఎన్ని అశ్వాసాల గ్రంథం?
    అ) 10     ఆ) 11    ఇ) 12     ఈ)14


వెనక్కి ...

మీ అభిప్రాయం