‘‘ఈ జగతికి మానవతా భిక్షపెట్టు!’’

  • 29 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘శారదాదేవి ‘కచ్ఛపి’ ముక్త కమనీయ సలలిత రావమ్ము 
    తెలుగు భాష
బ్రహ్మ మానస పుత్ర రమ్య ‘మహతి’ వినిర్గళిత నినాదమ్ము 
    తెలుగు భాష
తుంబురు హస్తాలతూగు ‘కళావతి’ వెలుయించు క్వాణమ్ము 
    తెలుగు భాష
వినుత విశ్వావసు ‘బృహతి’ జనిత, సముజ్జ్వల మృదు 
    ధ్యానమ్ము తెలుగు భాష
శర్కర సహిత శ్రీఘనస్తమము, విమల
జాహ్నవీ జల తుల్యంబు, చవులుపట్టు
జుంటి తెనెనే మరపించు సురుచిగల్గి
దేవభాషకు సాటి యీ తెలుగు భాష’’
అంటూ తెలుగు భాషను శ్లాఘించారు కలవకొలను సూర్యనారాయణ. ఉపాధ్యాయ, అధ్యాపక పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు...

(1) ‘విజయరాజ్య సంవత్సరంబుళ్‌’ ప్రయోగం ఏ శాసనంలో కన్పిస్తుంది? 
    అ) కందుకూరు        ఆ) ధర్మవరం 
    ఇ) విప్పర్తి            ఈ) అద్దంకి
(2)  కర్మణి ప్రయోగాలు తెలుగులోకి ఏ భాషా ప్రభావం వల్ల వచ్చి చేరాయి? 
    అ) ప్రాకృతం            ఆ) సంస్కృతం 
    ఇ) ఆంగ్లం            ఈ) తమిళం
(3) ‘అణపోతులు రేవణకాలు పుద్దణకాలు ఇచ్చిన పన్నస పెన్పాటె ఇశెరేనికిన్‌’ అన్న పంక్తులు ఏ శాసనంలోవి? 
    అ) పొట్లదుర్తి మాలెపాడు    ఆ) ఆరుంబాక    
    ఇ) గూడూరు        ఈ) బెజవాడ
(4) ‘‘పలుకులు పొందులేక రసభంగముసేయుచు బ్రాతవడ్డ’’ పద్యం ఏ రచనలోది?
    అ) తిక్కన భారతం    ఆ) నిర్వచనోత్తర రామాయణం    
    ఇ) నన్నయ భారతం    ఈ) ఎర్రన భారతం
(5)  కర్ణ జనన వృత్తాంతం ఆదిపర్వంలో ఎన్ని గద్యపద్యాలలో ఉంది? 
    అ) 10    ఆ) 12   ఇ) 14     ఈ) 17
(6) కర్ణ జనన వృత్తాంతం అరణ్యపర్వశేషంలో ఎన్ని గద్యపద్యాల్లో కనిపిస్తుంది? 
    అ) 26    ఆ) 36       ఇ) 46     ఈ) 56
(7)  ‘మనిషిలోపలి విధ్వంసం’ ఎవరి కథ? 
    అ) కేతు విశ్వనాథరెడ్డి         ఆ) అల్లం రాజయ్య
    ఇ) గంటేడ గౌరునాయుడు   ఈ) బలివాడ 
(8) ‘ఆంధ్రపద నిదానము’ అచ్చ తెలుగు నిఘంటువు సంపాదకులు?
    అ) వెంకనార్యుడు    ఆ) తూము రామదాస కవి
    ఇ) కస్తూరి రంగకవి    ఈ) అడిదము సూరకవి
(9) ‘‘చదివిన జదువకయున్నన్‌/ ముదితలు విద్వాంసురాండ్రు పుట్టువు చేతన్‌’’ అన్న కవయిత్రి? 
    అ) చావలి బంగారమ్మ         ఆ) కాంచనపల్లి కనకమ్మ
    ఇ) ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ  ఈ) రంగాజమ్మ
(10) సామినేని ముద్దునరసింహ నాయుడు తన ప్రమేయాలను ఏ పత్రికలో ప్రచురించారు? 
    అ) సత్యదూత        ఆ) హితవాది
    ఇ) వైజయంతి        ఈ) సాహిత్య స్రవంతి
(11) ‘గోపాత్రుడు’ ఎవరి నవల? 
    అ) కె.ఎన్‌.వై.పతంజలి  ఆ) రావులపాటి సీతారాం
    ఇ) మహీధర రామమోహనరావు    ఈ) కేశవరెడ్డి
(12) ‘తెలుగు నవలల్లో కుటుంబ జీవనం’ ఎవరి రచన? 
    అ) సి.ఆనందారామం    
    ఆ) బొడ్డపాటి కుటుంబరాయశర్మ
    ఇ) కోడూరి శ్రీరామమూర్తి    ఈ) మృణాళిని
(13) ‘‘మేము మర్రిచెట్టు కింద మల్లె తీగలం
     పెరగకుండా బతకాలి’’ అన్నదెవరు? 
    అ) సలంద్ర   ఆ) గుంటూరు ఏసుపాదం
    ఇ) అడిగోపుల వెంకటరత్నం  ఈ) కత్తి పద్మారావు
(14) ‘నూరేండ్ల సాహిత్యంలో కొన్ని ధోరణులు - దృక్పథాలు’ గ్రంథకర్త? 
    అ) అక్కిరాజు రమాపతిరావు  ఆ) వడలి మందేశ్వరరావు
    ఇ) పి.వి.రమణ         ఈ) ఎస్వీ రామారావు
(15) ‘‘ఎన్ని సందేహాలను మోసిందో ఈ చేతికర్ర
    ప్రశ్నార్థకంగా వంగిపోయింది’’ అంటూ ‘తాతయ్య చేతికర్ర’ మీద కవిత రాసిందెవరు?     
    అ) ప్రసేన్‌     ఆ) సీతారాం
    ఇ) శిఖామణి    ఈ) కాట్రగడ్డ దయానంద్‌
(16) ‘పరివర్తన’ నాటక కర్త? 
    అ) గోపీచంద్‌    ఆ) ఆత్రేయ
    ఇ) బోయి భీమన్న    ఈ) నార్ల వెంకటేశ్వరరావు
(17) ‘‘నీ ఆశయం సూర్యుణ్ని మాత్రం పిడికిట్లోంచి జారవిడవకు/ ప్రాణాన్ని పణం పెట్టయినా, ఈ జగతికి మానవతా భిక్ష పెట్టు’’ అన్న కవి? 
    అ) చెరబండరాజు    ఆ) నగ్నముని
    ఇ) నిఖిలేశ్వర్‌    ఈ) భైరవయ్య
(18) ‘‘వింత వీధులలో పరుగు తీయడంలో మహా సాహసికుడు’’ అని శ్రీశ్రీ గురించి పేర్కొన్నదెవరు? 
    అ) చలం        ఆ) ముద్దుకృష్ణ
    ఇ) కె.వి.రమణారెడ్డి    ఈ) మిరియాల రామకృష్ణ
(19) ‘‘గతం చూసి గర్వించడం మంచిదే కాని ప్రస్తుతం పఠించడం మరీ మంచిది’’ అన్న కవి? 
    అ) శేషేంద్ర            ఆ) కుందుర్తి  
    ఇ) కాళోజీ              ఈ) పఠాభి
(20) ‘‘ఎప్పుడో మానిషాదతో పుట్టిందట మొదట కవిత్వం
    ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం’’ అన్నదెవరు? 
    అ) శ్రీశ్రీ            ఆ) ఆరుద్ర  
    ఇ) శివసాగర్‌            ఈ) రెంటాల 
(21) పాల్కురికి సోమన బసవపురాణం ఎన్నో ఆశ్వాసంలో 38 ద్విపదలలో ఉద్భటుని కథ ఉంది? 
    అ) నాలుగో            ఆ) అయిదో  
    ఇ) ఆరో            ఈ) ఏడో
(22) ఏ గ్రంథానికి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ‘భావ ప్రకాశిక’ పేరుతో వ్యాఖ్యానం రాశారు? 
    అ) మనుచరిత్ర    ఆ) కళాపూర్ణోదయం
    ఇ) వసుచరిత్ర    ఈ) విజయవిలాసం
(23) ‘శబ్ద సంస్కార మెచ్చటను జారగనీక పదమైత్రి యర్థ సంపదలబొదల’ పద్యం ఏ ప్రబంధంలోది? 
    అ) పాండురంగ మహాత్మ్యం    
    ఆ) ప్రభావతీ ప్రద్యుమ్నం
    ఇ) కళాపూర్ణోదయం     ఈ) వసుచరిత్ర
(24) ‘‘రసోచిత చమత్క్రియా కల్పభవ్యంబుగా’’ వర్ణనలను చేర్చి 800 గద్య పద్యాలతో భట్టుమూర్తి రచించిన గ్రంథం?
    అ) వసుచరిత్ర    ఆ) హరిశ్చంద్రనలోపాఖ్యానం
    ఇ) నరసభూపాలీయం    ఈ) విజయవిలాసం
(25) ‘వరదాంబికా పరిణయం’ పేర సంస్కృతంలో చంపూ కావ్యం రాసిందెవరు? 
    అ) లీలావతి        ఆ) నాచి 
    ఇ) తిరుమలాంబ    ఈ) మోహనాంగి
(26) ‘రామాయణ సార కావ్యతిలకము’ ఎవరి రచన? 
    అ) రామభద్రాంబ    ఆ) మధురవాణి
    ఇ) శారద        ఈ) త్రివేణి
(27) ‘తిరుకామకవి’ అని నామాంతరం గల కవి?
    అ) లింగనముఖి కామేశ్వర కవి        
    ఆ) కుందుర్తి వేంకటాచలపతి
    ఇ) పాలవేకరి కదిరీపతి            
    ఈ) కళవె వీరరాజు
(28)  స్కాంధపురాణాంతర్గతమైన ‘శివరహస్య ఖండము’ను తెనిగించిందెవరు? 
    అ) నైషధము తిమ్మకవి            
    ఆ) కోడూరు వేంకటాచల కవి
    ఇ) కాణాదము పెద్దన సోమయాజి    
    ఈ) పురుషకారి కేశవయ్య
(29) నుదురుపాటి వెంకన తన ‘ఆంధ్ర భాషార్ణవము’  నిఘంటువును విజయ రఘునాథుడి ప్రేరణతో రచించి ఎవరికి అంకితం చేశాడు?    
    అ) ఆంజనేయ స్వామికి    ఆ) శ్రీరాముడికి
    ఇ) భూతేశ్వరస్వామికి        ఈ) బ్రహ్మదేవుడికి
(30) ‘‘బ్రహ్మానంద శతక’’ కర్త?
    అ) గంగాధరకవి    ఆ) గోపీనాథము వేంకటకవి
    ఇ) బొడ్డు లక్ష్మీనారాయణకవి    
    ఈ) పుసులూరి సోమరాజ కవి
(31) పుష్పగిరి తిమ్మన రాసిన ‘సమీరకుమార విజయము’ అనే ఏడాశ్వాసాల పురాణ కావ్యం ఎవరికి అంకితమిచ్చాడు?
    అ) బ్రహ్మకి        ఆ) పుష్పగిరి పీఠాధిపతికి
    ఇ) శ్రీరాముడికి    ఈ) ఆంజనేయుడికి
(32) ‘సాగరసంగ మాహాత్మ్యము’ కర్త?
    అ) కూచిమంచి తిమ్మకవి   ఆ) కంకంటి పాపరాజు
    ఇ) కనుపర్తి అబ్బయామాత్యుడు    
    ఈ) దిట్టకవి నారాయణ కవి
(33) ఆంధ్ర భాషా జాన్‌సన్, మహా మహోపాధ్యాయ బిరుదాంకితులు? 
    అ) కొక్కొండ వేంకటరత్నం పంతులు    
    ఆ) వావిలకొలను సుబ్బారావు
    ఇ) జనమంచి శేషాద్రిశర్మ
    ఈ) మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
(34) ‘‘కన్నియను పెండ్లియాడునొ, కన్నెతండ్రి యర్పణము జేయు శుల్క దివ్యాప్సరసను పెండ్లియాడునో’’ అన్నవారు? 
    అ) దువ్వూరి రామిరెడ్డి     ఆ) రాయప్రోలు సుబ్బారావు
    ఇ) వేదుల సత్యనారాయణ శాస్త్రి    
    ఈ) దుర్భాక రాజశేఖర శతావధాని
(35) భావ కవిత్వాన్ని ఒక స్థాయికి తెచ్చి దాని తత్వాన్ని లక్ష్య లక్షణ సమన్వితంగా ఊరూరా ప్రచారం చేసిన కవి? 
    అ) రాయప్రోలు    ఆ) కృష్ణశాస్త్రి
    ఇ) అబ్బూరి రామకృష్ణారావు    
    ఈ) కవికొండల వెంకటరావు
(36) ‘తన మార్గం’ ఎవరి కథానిక? 
    అ) కుప్పిలి పద్మ       ఆ) బుచ్చిబాబు
    ఇ) శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి ఈ) అబ్బూరి ఛాయాదేవి
(37) ‘‘ఒక జాతి జాతీయతకు దాని సంప్రదాయ పునాది అనే భావనతో విశ్వనాథ శారద విశ్వరూపము ప్రదర్శించినది. రామాయణ కల్పవృక్షంలో దివ్యాదివ్య భావ సంఘర్షణము చిత్రించబడినది’’ అన్నదెవరు? 
    అ) వేటూరి ప్రభాకరశాస్త్రి
    ఆ) కేతవరపు రామకోటిశాస్త్రి
    ఇ) పింగళి లక్ష్మీకాంతం        
    ఈ) కోవెల సంసత్కుమారాచార్య
(38) వచన రూపంలో వెలువడిన రామాయణాలలో ఏ కవి రచించిన రామాయణం మొదటిది? 
    అ) శ్యామరాయ కవి        
    ఆ) కళువె వీరరాజు
    ఇ) రఘునాథ నాయకుడు 
    ఈ) విశ్వనాథ సత్యనారాయణ
(39) సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు తన ‘జైమిని భారతము’ వచనైక పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు? 
    అ) విజయరంగ చొక్కనాథుడికి    
    ఆ) విజయ రాఘవ నాయకుడికి
    ఇ) ఏకోజీకి   ఈ) శహాజీకి
(40) ‘వల్లభాభ్యుదయం’ పేరుతో ఆంధ్ర విష్ణువు అభ్యుదయాన్ని వివరించే అయిదాశ్వాసాల కావ్యం రాసిందెవరు? 
    అ) భట్లపెనుమర్తి కోదండరామకవి    
    ఆ) కాసె సర్వప్ప
    ఇ) అందుగుల వెంకయ్య
    ఈ) దిట్టకవి నారాయణకవి
(41) ‘కదన కుతూహలరాగం’ గేయంలో మహోద్వేగంతో విప్లవ శంఖం పూరించిందెవరు? 
    అ) శ్రీశ్రీ     ఆ) శివసాగర్‌
    ఇ) గద్దర్‌    ఈ) నారాయణబాబు
(42) ‘సాహిత్య సమవాకారం’ అనే రచనలో సమకాలీన కవుల లోపాలను, బలహీనతలను హేళన చేసిన కవి? 
    అ) తెన్నేటి సూరి    ఆ) పిలకా గణపతిశాస్త్రి
    ఇ) సోమసుందర్‌    ఈ) అనిసెట్టి సుబ్బారావు
(43)  రాజకీయోద్యమంలో రహస్య జీవితం గడుపుతున్న సుంకర సత్యనారాయణకు ‘ప్రజాకవికి బహిరంగ లేఖ’ పేరుతో రాసిందెవరు? 
    అ) బెల్లంకొండ రామదాసు    ఆ) రెంటాల గోపాలకృష్ణ
    ఇ) కె.వి.రమణారెడ్డి        ఈ) కాళోజీ
(44) ‘‘అమ్మక చెల్ల నా హృదయ మమ్మకచెల్లదు వీనికియ్యెడన్‌’’ అన్న పల్కులు ఏ ప్రబంధంలోవి? 
    అ) మనుచరిత్ర        ఆ) విజయవిలాసము
    ఇ) కళాపూర్ణోదయము        ఈ) సుభద్రా కళ్యాణము
(45) ‘‘మధురైక ధురంధరాంధ్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా’’ అని సర్గాంత గద్యలలో చెప్పుకున్న కవయిత్రి? 
    అ) రామభద్రాంబ   ఆ) మధురవాణి
    ఇ) రంగాజమ్మ        ఈ) సౌందరి
(46) తరిగొండ వేంకమాంబ రచించిన ‘రాజయోగ సారము’ ఎన్ని ప్రకరణాల ద్విపద వేదాంత గ్రంథం? 
    అ) 2      ఆ) 3      ఇ) 6     ఈ) 8
(47) ‘‘ప్రపంచంతో ఏకమైననాడే కవికంఠం సరిగ్గా పలకగలుగుతుందని నా నమ్మకం. ప్రపంచానుభూతితో స్వీయానుభూతి పరమైనప్పుడే ఉత్తమ కవిత ఉద్భవిస్తుందని నా విశ్వాసం’’ అని పేర్కొన్న కవి? 
    అ) గోపాల చక్రవర్తి    ఆ) రెంటాల గోపాలకృష్ణ
    ఇ) ఆలూరి బైరాగి    ఈ) ఏల్చూరి సుబ్రహ్మణ్యం
(48) ‘‘వ్రాతకజుడు కర్త, చేతకు తా కర్త’’ అన్న పల్కులెవరివి? 
    అ) బద్దెన        ఆ) వేమన
    ఇ) మారద వెంకయ్య    ఈ) ఏనుగు లక్ష్మణకవి
(49) ‘‘వేమన ఒక రకమైన అద్వైతి’’ అని ‘వేమన యోగ సిద్ధి- మత ప్రచారము’ శీర్షికతో సుదీర్ఘంగా చర్చించి సిద్ధాంతీకరించిందెవరు? 
    అ) ఎన్‌.గోపి        
    ఆ) రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
    ఇ) తిమ్మావజ్జల కోదండరామయ్య    
    ఈ) త్రిపురనేని వేంకటేశ్వరరావు
(50) ‘భద్రగిరి’ శతక కర్త? 
    అ) భల్లా పేరయ్య        
    ఆ) గోగులపాటి కూర్మనాథుడు
    ఇ) పరమానందయతి        
    ఈ) పరశురామపంతుల లింగమూర్తి


వెనక్కి ...

మీ అభిప్రాయం