‘‘కవిత్వం సముద్రాల్ని పుక్కిలించి నదుల్ని గానం చేస్తుంది’’

  • 35 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘పలుకు బడులకైన పదబంధములకైన/ గీతకైన పద్యకైతకైన/ తెనుగు భాషకన్న దీటైన దేముండె/ దేశ భాషలందు తెలుగు లెస్స/ తెలుగు భాషలోని తియ్యదనము జూచి/ కృష్ణదేవరాయలే రసించి/ వ్రాసినట్టి పద్య రాజమ్ము కలిగుంది/ దేశ భాషలందు తెలుగు లెస్స/ బ్రౌను, సేను, కృష్ణరాయలు, హాల్డేను/ మెచ్చుకున్న భాష మేలి తెలుగు/ ద్రవిడ భాషలందు రాణి తెలుగు భాష/ దేశ భాషలందు తెలుగు లెస్స/ మధురమైన భాష సుధలు చిల్కెడి భాష/ తేనెలొలుకు భాష తెనుగు భాష/ అందమైన భాష ఆనందమిడు భాష/ దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్నారు ప్రయాగ కృష్ణమూర్తి. తెలుగు ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగార్థుల కోసం భాషా సాహిత్యాలకు సంబంధించి కొన్ని మారిది ప్రశ్నలు...
(1) ‘‘ధవళ గుణో ధవళ యశో ధవళిత దిఙ్మండలోవ దమితారాతిః’’ అన్న పంక్తులు ఏ శాసనంలోవి? 

    అ) బెజవాడ      ఆ) అరుంబాక    
    ఇ) కందుకూరు    ఈ) అద్దంకి
(2) నన్నెచోడుడు నన్నయకు ప్రాచీనుడని, క్రీ.శ.940 నాటి వాడని ఎవరి అభిప్రాయం? 
    అ) జయంతి రామయ్య పంతులు        ఆ) వేటూరు ప్రభాకర శాస్త్రి
    ఇ) నిడదవోలు వేంకటరావు        ఈ) మానవల్లి రామకృష్ణ కవి
(3) ‘‘కాము శక్తి నోర్వగలరె జనులు’’ అన్న పలుకులెవరివి? 
    అ) తిక్కన    ఆ) ఎర్రన   ఇ) నన్నయ   ఈ) శ్రీనాథుడు
     అ) ఆరుద్ర     ఆ) తిలక్‌
    ఇ) నగ్నముని    ఈ) సోమసుందర్‌
(5) ‘‘కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరసిపోయిన భావాల అక్షరాకృతి భావకవిత’’ అని పేర్కొన్నదెవరు? 
    అ) కవికొండల వెంకటరావు     ఆ) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
    ఇ) శ్రీశ్రీ     ఈ) విశ్వనాథ
(6) అబ్బూరి రామకృష్ణారావు వస్త్వాశ్రయ రీతిలో రచించిన ఖండ కావ్యం? 
    అ) స్నేహలత    ఆ) మెరుపులు
    ఇ) మల్లికాంబ    ఈ) జడకుచ్చులు
(7) కులపాలికా ప్రణయాన్ని పరమోదాత్తంగా రాసిన వారిలో అగ్రేసరులుగా ఎవరిని భావించవచ్చు? 
    అ) దువ్వూరి రామిరెడ్డి     ఆ) వేంకట పార్వతీశ్వర కవులు
    ఇ) కృష్ణశాస్త్రి        ఈ) విశ్వనాథ
(8) ‘తెలుగు సీమ’ కావ్యం వెలువరించిన కవి?
    అ) దుగ్గిరాల బలరామకృష్ణయ్య    
    ఆ) మంగిపూడి వేంకటశర్మ
    ఇ) త్రిపురనేని రామస్వామి    
    ఈ) పులుపుల వెంకటశివయ్య
(9) ‘‘మేం మనుషులం కాదు, ఇంకేదో పేరుంది మాకు’’ అన్నదెవరు? 
    అ) జ్వాలాముఖి     ఆ) మహాస్వప్న
    ఇ) చెరబండరాజు     ఈ) నిఖిలేశ్వర్‌
(10) ‘‘ధర్మవీర ఏవ రసానాం రసః’’ అని రస సంప్రదాయంలో సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు? 
    అ) బసవరాజు అప్పారావు    ఆ) జి.వి.సుబ్రహ్మణ్యం
    ఇ) విశ్వనాథ   ఈ) కరుణశ్రీ
(11) ‘రహస్తంత్రి’ స్త్రీవాద కవిత్వం ఎవరిది? 
    అ) కె.గీత         ఆ) కొండేపూడి నిర్మల    
    ఇ) రజియాబేగం     ఈ) పాటిబండ్ల రజని
(12) ‘‘లొంగుబాటు సంగీతాన్ని వినిపించినన్నాళ్లూ/ నేను నీ సహచరిని/ తిరుగుబాటు సంగీతాన్నయిన నాడు/ నీ కంట్లో నలుసుని’’ అన్నదెవరు? 
    అ) ఓల్గా       ఆ) సుధ
    ఇ) ఘంటసాల నిర్మల     ఈ) మందరపు హైమవతి
(13) ‘అనగనగా మెరిట్‌’ ఎవరి కవిత? 
    అ) జూలూరి గౌరీశంకర్‌     ఆ) చెరుకు సుధాకర్‌    
    ఇ) సతీష్‌చందర్‌         ఈ) మద్దూరి నగేష్‌బాబు
(14) ‘‘బొంత మన శ్రామిక జన సంస్కృతికి ప్రతీక/ మమకారాల సుతారపు అల్లికకు పతాక’’ అన్న కవి?
    అ) ప్రసాదమూర్తి        ఆ) ఎన్‌.గోపి    
    ఇ) ఎ.దుర్గాప్రసాద్‌        ఈ) పగడాల నాగేందర్‌
(15) ‘‘అలలపైన నిఘా! అలలు కనే కలలపైన నిఘా/ అలలపై అనురాగం చూపే - చిరుగాలి సితారా సంగీతంపైన నిఘా’’ అన్న కవి? 
    అ) గద్దర్‌     ఆ) సుబ్బారావు పాణిగ్రాహి
    ఇ) శివసాగర్‌     ఈ) వరవరరావు
(16) ‘‘అదిగో మన జయ ధ్వజం అదుగదుగో భద్రగజం’’ అంటూ జాతీయ పతాక ప్రాశస్త్యాన్ని తెలియజేసిందెవరు? 
    అ) కాటూరి వెంకటేశ్వరరావు        
    ఆ) వానమామలై వరదాచార్యులు
    ఇ) నెల్లూరు వెంకట రామానాయుడు    
    ఈ) గురజాడ రాఘవశర్మ
(17) ‘‘కవిత్వం కలల్నీ కన్నీళ్లనే కాదు/ సముద్రాల్ని పుక్కిలించి/ నదుల్ని గానం చేస్తుంది/ కవిత్వం అడవుల్ని పాడుతుంది/ అడవుల మీద విహరించే సూర్యుణ్నీ చంద్రుణ్నీ గానం చేస్తుంది’’ అన్న పలుకులెవరివి? 
    అ) విమల     ఆ) విజయలక్ష్మి
    ఇ) సావిత్రి     ఈ) కొండేపూడి నిర్మల
(18) ‘‘జాతీయోద్యమ స్పృహ సాహిత్యోద్యమంగా రూపొందడమే సామాజిక సాహిత్య స్పృహగా నవ్య సంప్రదాయ వాదులు సంభావిస్తారు’’ అన్న భావన ఎవరిది? 
    అ) జి.వి.సుబ్రహ్మణ్యం   ఆ) వడలి మందేశ్వరరావు
    ఇ) విశ్వనాథ       ఈ) పింగళి లక్ష్మీకాంతం
(19) ‘‘అపస్మారక మనసు నుండి స్వప్నలోక రహస్యాలను సంగ్రహించడానికి చేసే ప్రయత్నం సర్రియలిజమ్‌’’ అన్నదెవరు? 
    అ) శ్రీశ్రీ     ఆ) నారాయణబాబు
    ఇ) పఠాభి     ఈ) శిష్ట్లా
(20) అర్థోపక్షేపకాలలో ఒకటి?
    అ) బిందువు        ఆ) అంకాస్యం
    ఇ) ముఖ సంధి    ఈ) పతాక
(21) చలం ‘సావిత్రి’ ఏ ప్రక్రియకు చెందింది? 
    అ) నవల       ఆ) కథానిక  
    ఇ) పౌరాణిక రూపకం    ఈ) నాటకం
(22) ‘నిశాంతం’ ఎవరి కావ్యం? 
    అ) చలం      ఆ) ఆర్‌.ఎస్‌.సుదర్శనం
    ఇ) వేగుంట మోహన్‌ ప్రసాద్‌    ఈ) ఇస్మాయిల్‌
(23) ‘‘కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి’’ అన్న కవి? 
    అ) అజంతా   ఆ) ఎల్లోరా
    ఇ) రెంటాల గోపాలకృష్ణ     ఈ) తిలక్‌
(24) ‘‘ఈనాడు సమాజంలో అమలులో ఉన్న లైంగిక వివక్షనూ, జండర్‌ మీద ఆధారపడే పితృస్వామ్యాన్నీ వ్యతిరేకించేదే ఫెమినిజం’’ అన్నదెవరు?
    అ) కె.సత్యవతి   ఆ) పద్మలత
    ఇ) ఆచార్య కాత్యాయనీ విద్మహే    ఈ) ఓల్గా
(25) ‘‘కౌరవసేన జూచి వడకందొడగెన్‌ మదితోన మేనునీ...’’ అన్న తిక్కన పద్యం ఏ పర్వంలోది? 
    అ) ఉద్యోగ   ఆ) విరాట     ఇ) స్త్రీ     ఈ) శాంతి
(26) తెలుగులో మొట్టమొదటి వచన కావ్యకర్త? 
    అ) కృష్ణమాచార్యుడు        ఆ) గోన బుద్ధారెడ్డి
    ఇ) బద్దెన    ఈ) తాళ్లపాక పెద తిరుమలాచార్యులు
(27) 1990లో ‘కలంతో కాలమ్‌’ పేరుతో పత్రికా వ్యాస సంపుటి వెలువరించిందెవరు?
    అ) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ    ఆ) జి.వి.సుబ్రహ్మణ్యం
    ఇ) నిడదవోలు వెంకటరావు    ఈ) పింగళి లక్ష్మీకాంతం
(28) ‘‘హిమకరుదొట్టి పూరు భరతేశ కురు ప్రభు పాండు భూపతుల్‌’’ పద్యం ‘ఆంధ్ర మహాభారతం’లోని ఏ పర్వంలోది? 
    అ) ఆది    ఆ) సభా   ఇ) అరణ్య    ఈ) విరాట
(29) నన్నయని ప్రథమాచార్యుడిగా, అధర్వణుడిని ద్వితీయాచార్యుడిగా పేర్కొన్నదెవరు?    
    అ) వేములవాడ భీమకవి    ఆ) అధర్వణాచార్యుడు
    ఇ) మల్లియ రేచన    ఈ) పావులూరి మల్లన
(30) ‘‘తల్లిదండ్రుల బూజించి తగవెఱింగి మన్న పొడవైనవే యత్తమామలనియె’’ పద్యం ఏ కావ్యంలోది?
    అ) శృంగార శాకుంతలం    ఆ) కుమార సంభవం    
    ఇ) హరవిలాసం  ఈ) హరివంశం
(31) కింది వాటిలో ద్విపద కావ్యం?
    అ) భోజరాజీయం    ఆ) అష్టమహిషీ కల్యాణం
    ఇ) విజయ విలాసం    ఈ) ఉత్తర హరివంశం
(32) ‘భారత గర్భ రామాయణము’ కర్త? 
    అ) రావిపాటి లక్ష్మీనారాయణ
    ఆ) చిత్రకవి సింగరాచార్యుడు    
    ఇ) కామేశ్వరామాత్యుడు        
    ఈ) శ్రీనివాసాచార్యుడు
(33) ఓరుగంటి సోమేశ్వరుని రచన? 
    అ) రాఘవయాదవ పాండవీయం    
    ఆ) యాదవ రాఘవ పాండవీయం
    ఇ) రామకృష్ణార్జున రూప నారాయణీయం    
    ఈ) రావణ దమ్మీయం
(34) ‘‘ధారాశుద్ధి బ్రసిద్ధిగాంచి ఘన శబ్దస్ఫూర్తి వర్తిల్లగా’’ అనే పద్యంలో ధారాశుద్ధి, శబ్దస్ఫూర్తి, రసస్థితి ఉత్తమ కవిత్వ లక్షణాలుగా పేర్కొన్న కవి? 
    అ) మాదయగారి మల్లన
    ఆ) అయ్యలరాజు రామభద్రుడు    
    ఇ) సంకుసాల నృసింహకవి    
    ఈ) తెనాలి రామకృష్ణ కవి
(35) ‘ద్విపదకు చిన్నన్న, పదమునకు పెదతిరుమలయ్య, పద్యగద్య శ్రేణికి నరసింగన్న ప్రసిద్ధులు’ అని ఎవరు చెప్పినట్లుగా ఓ చాటుపద్యం అప్పకవీయంలో ఉదాహృతమయ్యింది? 
    అ) ధూర్జటి     ఆ) భట్టుమూర్తి
    ఇ) తెనాలి రామకృష్ణుడు     ఈ) మాదయగారి మల్లన
(36) కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోదయానికి సంస్కృతంలో ‘చంద్రికా’ వ్యాఖ్యను రాసిందెవరు? 
    అ) నాదెండ్ల గోపన
    ఆ) అద్దంకి గంగాధరుడు
    ఇ) మరింగంటి సింగరాచార్యులు    
    ఈ) కూచిమంచి తిమ్మకవి
(37) ‘పరమ యోగి విలాసము’ అనే అయిదాశ్వాసాల చంపూ ప్రబంధం రచించి మంగళగిరి నృసింహస్వామికి అంకితం ఇచ్చిందెవరు? 
    అ) కందుకూరి రుద్రకవి        
    ఆ) సిద్దిరాజు తిమ్మరాజు
    ఇ) సారంగు తమ్మయ్య        
    ఈ) కామినేని మల్లారెడ్డి
(38) ఆదర్శ వ్యాఖ్య ఏ గ్రంథానికి వచ్చిన వ్యాఖ్య? 
    అ) మనుచరిత్ర      ఆ) వసుచరిత్ర
    ఇ) రాఘవపాండవీయం    ఈ) ఆముక్తమాల్యద
(39) ‘‘ఈనాటి యువకవులకు - అభ్యుదయవాదులైనా, మానవతావాదులైనా, విప్లవవాదులైనా ధ్వజమూ, వాహనము కూడా వచనమే’’ అన్నదెవరు? 
    అ) పాటిబండ మాధవశర్మ    
    ఆ) పానుగంటి లక్ష్మీనరసింహారావు
    ఇ) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ    
    ఈ) వేలూరి శివరామశాస్త్రి
(40) బొబ్బిలి యుద్ధ వృత్తాంతాన్ని ‘రంగరాయ కదనరంగ చరిత్ర’ పేర మూడాశ్వాసాల ప్రబంధంగా రచించిందెవరు? 
    అ) దిట్టకవి నారాయణ కవి    
    ఆ) విజయ రాఘవ నాయకుడు
    ఇ) రఘునాథ నాయకుడు    
    ఈ) దోనూరు కోనేరు నాథుడు
(41) ముక్తకోపనిషత్తు ప్రకారం మొత్తం ఉపనిషత్తులెన్ని?
    అ) 18       ఆ) 54       ఇ) 108       ఈ) 116
(42) ‘‘పురా + అనక్తి పురాణం’’ అని ఏ పురాణంలో ఉంది? 
    అ) భవిష్య      ఆ) బ్రహ్మాండ      
    ఇ) వాయు       ఈ) విష్ణు
(43) ‘ఆంధ్ర సాహిత్య సంగ్రహ చరిత్ర’ కర్త? 
    అ) పింగళి లక్ష్మీకాంతం     ఆ) కె.వి.ఆర్‌.నరసింహం
    ఇ) వారణాశి వేంకటేశ్వర్లు    ఈ) ఆరుద్ర
(44) ‘‘ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ శ్రాంతుడై చిక్కెనో’’ అన్న పోతన భాగవత పద్యం ఏ స్కంధంలోది? 
    అ) ఆరు    ఆ) ఏడు  ఇ) ఎనిమిది    ఈ) దశమ
(45) ‘నవనాథ చరిత్రము’ను గౌరనకు ముందే పద్య ప్రబంధంగా రాసిన కవి? 
    అ) మడికి సింగన        ఆ) శ్రీ గిరి
    ఇ) దగ్గుపల్లి దుగ్గన   ఈ) నారాయణ కవి
(46) శూద్రకుని ‘మృచ్ఛకటికం’లో ప్రధాన రసం?
    అ) వీరం      ఆ) శృంగారం
    ఇ) భయానకం   ఈ) బీభత్సం 
(47) శ్రీ హర్షుని ‘నైషధ చరితం’లోని సర్గలెన్ని?
    అ) 12      ఆ) 16      ఇ) 22    ఈ) 28
(48) భారవి ‘కిరాతార్జునీయం’ ఇతివృత్తం దేన్నుంచి గ్రహించాడు? 
    అ) రామాయణం        ఆ) మహాభారతం
    ఇ) భాగవతం            ఈ) దశకుమార చరిత్ర


వెనక్కి ...

మీ అభిప్రాయం