‘కవి సంశయ విచ్ఛేదం కర్త’

  • 33 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘తెలుగు భాషయనిన తియ్యమామిడి తోట/ సరస కావ్యములగు సత్ఫలములు/ పద్య భావ సుధలె ఫల రసంబులగును/ తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ/ తెలుగు భాష నీది తెలుగు వాడవు నీవు/ తెలుగు వృద్ధిబరచ దలచు నీవు/ తల్లి మొదటి సవతి తల్లులు పిమ్మట తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ’’ అన్నారు ముదిగొండ శ్రీరామ శాస్త్రి. తెలుగు నెట్, సెట్, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం కొన్ని మాదిరి ప్రశ్నలు... 
(1) కన్యాశుల్కం నాటకం ‘రెండో కూర్పు’ వెలువడిన సంవత్సరం? 

    అ) 1897     ఆ) 1900   ఇ) 1909   ఈ) 1910
(2) ‘చెంచురాణి’ ఎవరి కథ? 
    అ) చింతా దీక్షితులు   ఆ) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
    ఇ) చలం        ఈ) గురజాడ
(3) ‘‘జన్మభూమి కన్న స్వర్గంబు వేరేది/ మాతృభాష కన్న మధురమేదీ’’ అన్న కవి? 
    అ) ఆరుద్ర         ఆ) రాయప్రోలు    
    ఇ) నార్ల చిరంజీవి     ఈ) సి.నారాయణరెడ్డి
(4) వల్లంపాటి వెంకట సుబ్బయ్య ‘కథా శిల్పం’ గ్రంథానికి ఏ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది?
    అ) 1996   ఆ) 1997   ఇ) 1998    ఈ) 1999
(5) 1848లో సామవేదాన్ని జర్మన్‌ భాషలోకి అనువదించిందెవరు? 
    అ) ఓల్డన్‌ బెర్గ్‌     ఆ) థియోడార్‌ బెన్ఫే
    ఇ) గ్రిఫిత్‌         ఈ) గ్రాస్‌మన్‌
(6) సంస్కృతంలో మధ్య సిద్ధాంత కౌముది, లఘు సిద్ధాంత కౌముది రచించిందెవరు? 
    అ) వరదరాజు       ఆ) భట్టోజి
    ఇ) జగన్నాథుడు     ఈ) హరిదీక్షితుడు
(7) ‘అస్తి’తో ఆరంభించిన కాళిదాసు రచన? 
    అ) మేఘ సందేశం     ఆ) కుమారసంభవం
    ఇ) రఘువంశం      ఈ) మాళవికాగ్నిమిత్రం
(8) ‘మైత్రేయుడు’ అనే విదూషకుడి పాత్ర ఉన్న సంస్కృత ప్రకరణం?
    అ) ముద్రారాక్షసం     ఆ) మృచ్ఛకటికం
    ఇ) దేవీ చంద్రగుప్తం    ఈ) అభిజ్ఞాన శాకుంతలం
(9) ‘పుట్టెణ్డు’లో ఎణ్డు అన్నది ఏ అర్థక ప్రత్యయం? 
    అ) వైభాజికార్థకం     ఆ) పూరణార్థకం
    ఇ) పరిమాణార్థకం     ఈ) చేదర్థకార్థకం
(10) నామ ప్రాతిపదికలు ఎన్ని రకాలు? 
    అ) 2    ఆ) 4      ఇ) 6     ఈ) 3
(11) పదాదిలో రాని వ్యంజనాలు? 
    అ) ట, డ, ణ         ఆ) య, ణ, ళ    
    ఇ) ల, శ, య    ఈ) చ, జ, ళ
(12) సంశ్లిష్ట ప్రాతిపదికలు ఎన్ని రకాలు? 
    అ) 3    ఆ) 2    ఇ) 4       ఈ) 6
(13) కింది వాటిలో దక్షిణ మండలానికి చెందిన పదం? 
    అ) గొలుసు  ఆ) చిలుకు  ఇ) గొండ్లెం  ఈ) పోము
(14) ‘అర్థ గౌరవానికి’ ఉదాహరణ?
    అ) కైంకర్యం     ఆ) వస్తాదు ఇ) ముహూర్తం  ఈ) చీర
(15) యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో లభిస్తున్న మధ్యాక్కర పద్యాలెన్ని? 
    అ) 4    ఆ) 5    ఇ) 7    ఈ) 8
(16) ‘‘నరనుత! నీప్రసాదమున నాకుదయించిన నందనున్‌ మహీ...’’ పద్యకర్త? 
    అ) శ్రీనాథుడు   ఆ) పాల్కురికి సోమన
    ఇ) నన్నయ     ఈ) తిక్కన
(17) ‘‘సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనిన వీడను నెలుకకు దొడవైన వాడు’’ అన్న సీస పద్యకర్త? 
    అ) మారన   ఆ) సూరన   ఇ) కేతన   ఈ) పెద్దన
(18) ‘‘కొమ్మలు తలలూపగ కమ్మని కోకిల కూజితాలకు/ వెన్నెల విహారములకు/ కన్నెగాలి కౌగిళ్లకు ఇది కాలం కాదంది’’ అని భావ కవిత్వంలోని ప్రణయాన్ని నిరసించిందెవరు? 
    అ) పఠాభి   ఆ) శిష్ట్లా      ఇ) కుందుర్తి  ఈ) నారాయణ బాబు
(19) ‘పాంచజన్యం’ కర్త? 
    అ) శశాంక          ఆ) కారుమంచి వెంకటేశ్వరరావు
    ఇ) కవిరాజమూర్తి    ఈ) అవసరాల సూర్యారావు
(20) ‘సింహ గర్జన’ ఎవరి నవల? 
    అ) లక్ష్మీకాంత మోహన్‌    ఆ) కేశవరెడ్డి
    ఇ) రంగాచార్య     ఈ) జాతశ్రీ
(21) ‘‘కాలాన్ని వాహనంగా వాడుకునేవాడు/ కదలకుండా కూర్చోడం నేర్చుకోవాలి/ కళ్లెం బిగిపట్టడం రావాలి/ లేదా కందకంలో కూలడం తప్పదు’’ అన్న పలుకులెవరివి? 
    అ) ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య     ఆ) ఆచార్య పేర్వారం జగన్నాథం
    ఇ) వే.నరసింహారెడ్డి    ఈ) కోవెల సుప్రసన్నాచార్యులు
(22) గణపవరపు వేంకట కవి రాసిన దండకం? 
    అ) రాజగోపాల    ఆ) విద్యావతీ 
    ఇ) బృహన్నాయిక    ఈ) నీలకంఠ
(23) ‘చిత్రకవి’ పెద్దన రాసిన ఉదాహరణం? 
    అ) వేంకటేశ్వరోదాహరణం ఆ) హనుమోదాహరణం
    ఇ) శేషార్యోదాహరణం    ఈ) వీరభద్రోదాహరణం
(24) ‘‘సహజం అనిపించే అసహజం కథ’’ అని కథను నిర్వచించిందెవరు?
    అ) మల్లాది రామకృష్ణశాస్త్రి    ఆ) గోపీచంద్‌
    ఇ) కేతు విశ్వనాథరెడ్డి     ఈ)బొడ్డపాటికుటుంబరాయశర్మ
(25) ‘కవిరాజు’ రాసిన నాటకం? 
    అ) కురుక్షేత్ర సంగ్రామం   ఆ) శంబూక వధ
    ఇ) ఖూనీ       ఈ) అన్నీ
(26) ‘‘అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం/ అనాథుడికీ, ఆగర్భ శ్రీమంతుడికీ మధ్య’’ అన్న కవి? 
    అ) ఆరుద్ర ఆ) దాశరథి ఇ) కాళోజీ ఈ) బోయి భీమన్న
(27) ‘‘ఒక చాయ ననపాయ పికగేయ సముదాయ/ మొక సీమ నానా మయూర నినద’’ పద్యం ఏ ప్రబంధంలోది?
    అ) మనుచరిత్ర       ఆ) వసుచరిత్ర
    ఇ) కళాపూర్ణోదయం  ఈ) విజయ విలాసం
(28) ‘కవి సంశయ విచ్ఛేదం’ కర్త? 
    అ) అడిదము సూరకవి     ఆ) పైడిపాటి లక్ష్మణకవి    
    ఇ) దాసరి లక్ష్మణకవి     ఈ) జయదేవుడు
(29) ‘కాహళి’ ఎవరి రచన?    
    అ) శ్రీశ్రీ    ఆ) అజంతా   ఇ) ఆవంత్స  ఈ) సినారె
(30) ‘అహల్యాబాయి’ ఎవరి కావ్యం?
    అ) కొటికలపూడి సీతమ్మ   ఆ) భండారు అచ్చమాంబ    
    ఇ) చిలకపాటి సీతాంబ     ఈ) చేబ్రోలు సరస్వతీ దేవి
(31) పచ్చకప్పురపు తిరువేంగళ కవి రచించిన చొక్కనాథ చరిత్రకు నామాంతరం?
    అ) చొక్కనాథ విలాసం  ఆ) చౌషష్ఠి లీలా విలాసం
    ఇ) మధురాపురాణం    ఈ) అన్నీ
(32) ‘న-భ-ర-స-జ-జ-గ’ అనే గణక్రమం ఉండే వృత్త పద్య భేదం?
       అ) మత్తకోకిల   ఆ) తరళం
    ఇ) స్రగ్ధర          ఈ) మహాస్రగ్ధర
(33) ‘మ-ర-ఱ-త-వ’ అనే అయిదింటిలో ఏ అక్షరానికి ఆ అక్షరమే యతి చెల్లితే అది...?
    అ) భిన్నయతి     ఆ) ఎక్కటియతి
    ఇ) ఏకతరయతి   ఈ) అభేదయతి
(34) దర్భా గిరిరాజ కవి ఎవరి ఆస్థాన కవి? 
    అ) శహాజీ       ఆ) రఘునాథ నాయకుడు    
    ఇ) విజయరాఘవ నాయకుడు    ఈ) ఏకోజీ
(35) కామారెడ్డి ప్రేరణతో ‘సూతసంహిత’ అనే ఏడాశ్వాసాల గ్రంథాన్ని రచించి సిద్ధరామేశ్వరుడికి అంకితమిచ్చింది? 
    అ) మల్లారెడ్డి                ఆ) రాపాక లక్ష్మీపతి
    ఇ) పట్టమెట్ట సోమనాథ సోమయాజి            ఈ) శేషాద్రి రమణ కవులు
(36) ‘ఉమాపత్యభ్యుదయము’ అనే ఏకాశ్వాస ప్రబంధం రాసిందెవరు? 
    అ) రాపాక వేంకటదాస కవి ఆ) ఆదిపూడి ప్రభాకర కవి
    ఇ) పోడూరి వెంకట రాజ కవి    
    ఈ) మామిడిపూడి వెంకటరంగయ్య
(37) ఏ కవి తిట్టు ‘సుత్తిపెట్టు’గా ప్రసిద్ధికెక్కింది? 
    అ) శ్రీపాద వేంకటాచలపతి    ఆ) అడిదము సూరకవి
    ఇ) చాటరాతి లక్ష్మీనరసకవి   ఈ) నడిమింట రామయోగి  
(38) ‘విజయనగర యుగపు తెలుగు సాహిత్యంపై వైష్ణవ తత్త్వ ప్రభావం’ అంశంగా పరిశోధన చేసిందెవరు? 
    అ) వేటూరి ఆనందమూర్తి   ఆ) మాదిరాజు రంగారావు
    ఇ) వి.కామేశ్వరరావు        ఈ) పి.పి.ఎల్‌.ప్రసాదరావు
(39) ‘ఆంధ్ర శాసన సారస్వతంలోని ఉర్దూ - మరాఠీ పదాలు’ పరిశోధన ఎవరిది? 
    అ) భద్రిరాజు కృష్ణమూర్తి   ఆ) లకంసాని చక్రధరరావు
    ఇ) పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం   ఈ) కె.కె.రంగనాథాచార్యులు
(40) ‘ఆంధ్ర సాహిత్యంలో దేశి కవితోద్యమం: పాల్కురికి సోమనాథుని పాత్ర’ మీద పరిశోధించిందెవరు? 
    అ) చల్లా రాధాకృష్ణశర్మ      
    ఆ) తిమ్మావజ్జల కోదండరామయ్య
    ఇ) జాస్తి సూర్యనారాయణ ఈ) ముదిగొండ వీరభద్రశాస్త్రి
(41) ‘జుంజప్ప’ ఉత్సవం ఏయే నెలల్లో కొత్తూరులో జరుగుతుంది? 
    అ) జనవరి, ఫిబ్రవరి          ఆ) ఏప్రిల్, మే
    ఇ) ఆగస్టు, సెప్టెంబరు          ఈ) అక్టోబరు, నవంబరు
(42) మొహర్రం నెలలో ఎన్నోరోజు ‘అలావు’ తొక్కుతారు? 
    అ) మొదటి రోజు        ఆ) ఆరో రోజు
    ఇ) ఎనిమిదో రోజు        ఈ) పదో రోజు
(43) ‘మూడునాళ్ల ముచ్చట’ ఎవరి కథానిక?
    అ) అబ్బూరి ఛాయాదేవి      ఆ) ఓల్గా
    ఇ) పి.సత్యవతి        ఈ) కుప్పిలి పద్మ


వెనక్కి ...

మీ అభిప్రాయం