‘మాకున్నది సిద్ధాంతం నమ్మము మీ వేదాంతం’

  • 41 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। పి.విజయకుమార్‌

  • సహాయ ఆచార్యులు
  • అనంతపురం
  • 9063702546
డా।। పి.విజయకుమార్‌

‘‘కైలాస శిఖరాన కాశ్మీర కన్యక చిన్నారి పెదవిపై చిందునవ్వు/ సహ్య శైలము మీది శబర కన్య గళాన వ్రేలాడు తెలి గురివెంద దండ/ కావేరి తీరాన గానమ్ము చేసెడి మాతంగి కొప్పులో మల్లెమాల/ మంత్ర మోహినియైన మలయాళ సుందరి స్తన చక్రముల మీది చందనంబు/ మానస సరస్సులోపల మలయు హంస/ తిరుమల చిటారు శిఖరాన తెల్లమెయిలు/ మలయగిరి మాఘ మాసపు మంచువాన/ చెలువు మీరిన దీనాడు తెలుగు కీర్తి’’ అంటూ అమ్మభాషను శ్లాఘించారు డా।। ప్రసాదరాయ కులపతి. తెలుగు ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగార్థుల కోసం కొన్ని మాదిరి ప్రశ్నలివి..!

(1) మధురభక్తి నాటకం ‘శబరి’ కర్త? 
    అ) ముద్దుకృష్ణ    ఆ) చింతా దీక్షితులు    
    ఇ) చలం        ఈ) విశ్వనాథ
(2) ‘బ్లాక్‌ వాయిస్‌’ ఎవరి కవితాసంపుటి? 
    అ) ఖాజా        ఆ) ఇక్బాల్‌ చంద్‌
    ఇ) హనీఫ్‌        ఈ) కరీముల్లా
(3) ‘‘బాల్యాన్ని/ గుర్తుచేసుకోవడమంటే/ జీవితాన్ని / తడిమి చూసుకోవడమే’’ అన్న నానీ ఎవరిది? 
    అ) ఎన్‌.గోపి            ఆ) ఎస్‌.ఆర్‌.భల్లం
    ఇ) సోమేపల్లి వెంకటసుబ్బయ్య
    ఈ) తమ్మిడి నాగభూషణం
(4) ‘తిరుపతి వేంకట కవుల కవితా వైభవం’ గ్రంథకర్త?
    అ) జి.వి.సుబ్రమణ్యం    ఆ) విశ్వనాథ
    ఇ) పింగళి లక్ష్మీకాంతం    ఈ) వల్లంపాటి 
(5) ‘‘మహాబలిపురంలో పెద్ద అలలు వచ్చి మొహానికి తగిలితే కలిగిన షాక్‌ లాంటి అనుభూతి కలిగిందని’’ దిగంబర కవుల గురించి చెప్పింది? 
    అ) కె.వి.రమణారెడ్డి         ఆ) ఆరుద్ర
    ఇ) ఆర్‌.యస్‌.సుదర్శనం    ఈ) ఆవంత్స 
(6) ‘‘వెన్నలాంటి దుస్తుల్ని తొడగడం కాదు/ వెన్నెల్లా బతకడం మనక్కావాలి’’ అన్నదెవరు? 
    అ) కోవెల సంపత్కుమారాచార్య
    ఆ) పేర్వారం జగన్నాథం    
    ఇ) సుప్రసన్న         ఈ) వే.నరసింహారెడ్డి
(7) ‘గోపాలరావు’ పాత్ర ఉన్న కథానిక? 
    అ) గులాబీ అత్తరు    ఆ) గోదావరి నవ్వింది
    ఇ) దిద్దుబాటు    ఈ) నీ రుణం తీర్చుకున్నా
(8) ‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో’’ ఏ కావ్యంలోనిది?
    అ) ఆముక్తమాల్యద    ఆ) హంపీ క్షేత్రము
    ఇ) పారిజాతాపహరణం    ఈ) మనుచరిత్ర
(9) ‘‘హేతువాదితోనే హిస్టరీ పుట్టెరా’’ అన్నదెవరు? 
    అ) త్రిపురనేని        ఆ) నార్ల
    ఇ) ముప్పాళ్ల రంగనాయకమ్మ
    ఈ) ఆమంచర్ల గోపాలరావు
(10)    ‘‘మాకున్నది సిద్ధాంతం, నమ్మము మీ వేదాంతం’’ అన్నదెవరు? 
    అ) సుబ్బారావు పాణిగ్రాహి    ఆ) వరవరరావు
    ఇ) గద్దర్‌            ఈ) శివసాగర్‌
(11)    ‘భూమి పుత్రుడు’ నవలాకర్త? 
    అ) బి.ఎస్‌.రాములు    ఆ) ముదిగంటి సుజాతారెడ్డి
    ఇ) కాలువ మల్లయ్య    ఈ) పెద్దింటి అశోక్‌కుమార్‌
(12) ‘గుక్క’ ఎవరి దీర్ఘకవిత? 
    అ) జూలూరు గౌరీశంకర్‌
    ఆ) సుంకిరెడ్డి నారాయణరెడ్డి
    ఇ) కాసుల ప్రతాపరెడ్డి    ఈ) బి.యస్‌.రాములు
(13) సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేంద్ర రాజుల సంపాదకత్వంలో తెలంగాణ సాంస్కృతిక వేదిక ద్వారా వెలువడిన కవితా సంకలనం? 
    అ) పొక్కిలి        ఆ) మత్తడి
    ఇ) తెలుగు దీప్తి    ఈ) చైతన్య దీప్తి
(14)    ‘కాలానికి అవసరమైన విమర్శ కట్టమంచిది. కాలగమనం ఇష్టం లేక అన్నీ తాటాకుల్లోనే ఉన్నాయనే తత్త్వం ఆయన వ్యతిరేకులది’ అన్నదెవరు?
    అ)    కాళ్లూరి వ్యాసమూర్తి      ఆ) చేకూరి రామారావు    
    ఇ)    ఆర్‌.యస్‌.సుదర్శనం ఈ) రాచమల్లు రామచంద్రారెడ్డి
(15) సంస్కృతంలో ఏ కావ్యాన్ని ‘లక్ష్యంతకావ్యం’ అంటారు? 
    అ) కిరాతార్జునీయం    ఆ) శిశుపాల వధ
    ఇ) హర్షనైషధం    ఈ) కుమారసంభవం
(16) సంస్కృత కవుల్లో ఎవరి నామాంతరం ‘వ్యాసదాసు’?  
    అ) క్షేమేంద్రుడు    ఆ) శంఖకుడు
    ఇ) భారవి        ఈ) మాఘుడు
(17) క్షేమేంద్రుడి ‘బృహత్కథామంజరి’లోని స్తబకాలెన్ని? 
    అ) 1000    ఆ) 1500   ఇ) 1800    ఈ) 2200
(18) ‘మైత్రేయుడు’ అనే విదూషకుడి పాత్ర ఉన్న సంస్కృత నాటకం? 
    అ) ముద్రారాక్షసం        ఆ) మృచ్ఛకటికం
    ఇ) అభిజ్ఞానశాకుంతలం        ఈ) దేవీచంద్రగుప్తం
(19) అళియరామరాయల మనుమడి మనుమడైన కోదండరామరాజుకు అంకితమిచ్చిన రచన? 
    అ) సిద్ధేశ్వర చరిత్ర    ఆ) నరపతి విజయం
    ఇ) కృష్ణరాయవిజయం    ఈ) శకుంతలా పరిణయం
(20) ‘‘తెలుగు కవులు ‘వచనం’ అనే పదాన్ని కన్నడం నుండి గ్రహించి ఉంటారనడంలో సందేహం లేదు’’ అన్నదెవరు? 
    అ) ఎం.కులశేఖరరావు        ఆ) పింగళి లక్ష్మీకాంతం
    ఇ) వేటూరి ప్రభాకర శాస్త్రి    ఈ) నేలటూరి 
(21) కూచిమంచి జగ్గకవి ‘సోమదేవ రాజీయం’ ఏ కావ్యం? 
    అ) పద్యకావ్యం        ఆ) గద్యకావ్యం
    ఇ) చంపూ కావ్యం        ఈ) నిరోష్ఠ్య కావ్యం
(22) ‘చిత్త బోధ’ శతక కర్త? 
    అ) తాడేపల్లి పానకాల రాయకవి
    ఆ) పరశురామపంతులు లింగమూర్తి
    ఇ) తోట నరసింహ కవి    ఈ) జక్కేపల్లి జగ్గకవి
(23) అయ్యలరాజు నారాయణామాత్యుడు ఏ శతాబ్దపు కవి? 
    అ) 16    ఆ) 14       ఇ) 19      ఈ) 17
(24) ‘‘మాసిన చీరగట్టుకొని మౌనముతోడ నిరస్తభూషయై’’ పద్యకర్త?
    అ) మాదయగారి మల్లన    ఆ) నంది తిమ్మన
    ఇ) భట్టుమూర్తి        ఈ) పింగళి సూరన
(25) ‘రామకృష్ణోఖ్యానం’ కర్త? 
    అ) శ్రీపాద వేంకటేశ్వరుడు 
    ఆ) చిత్రకవి సింగరాచార్యుడు
    ఇ) పోడూరి పెదరామామాత్యుడు    
    ఈ) కామేశ్వరామాత్యుడు
(26)    సిద్ధరామేశ్వరుడికి కామినేని మల్లారెడ్డి అంకితమిచ్చింది? 
    అ) షట్చక్రవర్తి చరిత్రం        ఆ) శివధర్మోత్తరం
    ఇ) పద్మపురాణం        ఈ) పైవన్నీ
(27) మిత్రవిందోపాఖ్యానం కర్త?
    అ) చరిగొండ ధర్మన్న
    ఆ) మొదటి వేంకట నృసింహాచార్యులు
    ఇ) వెలగపూడి వెంగయామాత్యుడు    ఈ) శంకరకవి
(28) కృష్ణదేవరాయలతో చదరంగం ఆడి మెప్పించి కొప్పోలును అగ్రహారంగా పొందిన కవిగా ఎవరు ప్రసిద్ధులు?  
    అ) ఎడపాటి ఎర్రన    ఆ) బొడ్డుచెర్ల చినతిమ్మయ
    ఇ) కాసే సర్వప్ప    ఈ) అందుగుల వెంకయ్య
(29) ‘చెప్పేతీరు ఎంత బాగున్నా చెప్పిన కథలో పసలేకపోవడం చేత ఈ కావ్యం అంత రాణించదు’ అని మట్లి అనంతరాజు ‘కాకుత్థ్య విజయం’ గురించి పేర్కొన్నదెవరు? 
    అ) కొర్లపాటి శ్రీరామమూర్తి    ఆ) ఆరుద్ర
    ఇ) శిష్ట్లా రామకృష్ణశాస్త్రి    ఈ) జి.నాగయ్య
(30) దగ్గుపల్లి దుగ్గన రచన?
    అ) నాసికేతోపాఖ్యానం        ఆ) నాగర ఖండం
    ఇ) జ్ఞానసూర్యోదయం        ఈ) కాళిందీ పరిణయం
(31) ‘ప్రసన్న రాఘవ శతకం’ కర్త?
    అ) జూలూరు లక్ష్మణకవి
    ఆ) వంగూరి ముద్దు నరసకవి    ఇ) లక్ష్మీనరసింహ కవి    ఈ) మంగిపూడి వీరయ సిద్ధాంతి
(32) ‘విమర్శ మార్గమును బాహిర జగత్తు నుండి అంతర జగత్తుకు కొనిపోయిన ప్రథమాంధ్ర విమర్శన గ్రంథము కవిత్వ తత్త్వ విచారము’ అని భావించిన విమర్శకుడు? 
    అ) ఆరుద్ర            ఆ) పింగళి లక్ష్మీకాంతం
    ఇ) కె.వి.రమణారెడ్డి        ఈ) రా.రా
(33) ‘అద్యంతనాంధ్రకవి ప్రపంచ నిర్మాతలు’గా వాసికెక్కింది?  
    అ) పింగళి కాటూరి కవులు  ఆ) తిరుపతి వేంకటకవులు
    ఇ) వేంకట పార్వతీశ్వర కవులు 
    ఈ) వేంకట రామకృష్ణ కవులు
(34) రవీంద్రుని గీతాంజలికి అనువాదం కాకపోయినా తెలుగు గీతాంజలిగా ఖ్యాతి పొందిన గ్రంథం? 
    అ) కృష్ణపక్షం        ఆ) శుక్లపక్షం
    ఇ) ఏకాంతసేవ    ఈ) స్నేహలత
(35) ‘‘అప్పారాయోపజ్ఞకమైన రసగీతాలను రాయప్రోలు సుబ్బారావు గారందుకొన్నారు’’ అన్నవారు? 
    అ) ఖండవల్లి లక్ష్మీరంజనం    ఆ) విశ్వనాథ
    ఇ) నోరి నరసింహశాస్త్రి      ఈ) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
(36) ‘‘తపసుచే, తాల్మిచే, ధ్యానధారచేత/ లీనమై ఐక్యమీయ జాలినదె ప్రేమ’’ అన్నదెవరు? 
    అ) బసవరాజు అప్పారావు    ఆ) వేదుల 
    ఇ) రాయప్రోలు సుబ్బారావు    ఈ) నండూరి 
(37) ‘ఉదయని’ కావ్య సంకలనంతో అభ్యుదయ కవిగా ప్రసిద్ధిగాంచిన కవి? 
    అ) బెల్లంకొండ రామదాసు    ఆ) చాసో
    ఇ) కె.వి.రమణారెడ్డి      ఈ) సంగినేని వేంకటేశ్వరరావు
(38) ‘అదిగో అరుణ పతాకం, పేదవారికి ప్రాణం, పీడిత ప్రజకాధారం’ అని మార్క్సిస్టు సిద్ధాంత దృక్పథంతో రాసిందెవరు? 
    అ) అనిసెట్టి సుబ్బారావు    ఆ) గోపాల చక్రవర్తి
    ఇ) రెంటాల గోపాలకృష్ణ    ఈ) అజంతా
(39) ‘హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి’    అని వర్ణించి ఆకలి జీవుల ప్రతినిధి అయిన కవి? 
    అ) బోయి భీమన్న    ఆ) ఆలూరి బైరాగి
    ఇ) విద్వాన్‌ విశ్వం    ఈ) ఎల్లోరా
(40) ‘నవయుగంబున నాజా వృత్తుల, నగ్ననృత్యమింకెన్నాళ్లు, పోలీసు అండను దౌర్జన్య శక్తులు, పోషణ బొందెదెన్నాళ్లు’’ అని రజాకార్ల మీద గర్జించి ప్రజలను ఉత్తేజపరచిన కవి? 
    అ) దాశరథి        ఆ) కాళోజీ
    ఇ) కుందుర్తి        ఈ) సోమసుందర్‌
(41) ‘సంప్రదాయాన్ని మన్నించటమంటే, సమస్తం అనుకరించడం కాదు. అయినా పాత మా పునాది, నన్నయ నుంచి నాదాకా తెలుగు కవిత అంతా నాది’’ అన్న కవి? 
    అ) సినారె        ఆ) కె.వి.రమణారెడ్డి
    ఇ) కుందుర్తి        ఈ) తెన్నేటి సూరి
(42) ‘కూలియన్నల కుతుకం’ ఎవరి రచన? 
    అ) కవికొండల వేంకటరావు    
    ఆ) అబ్బూరి రామకృష్ణారావు
    ఇ) మల్లవరపు విశ్వేశ్వరరావు    
    ఈ) నాయని సుబ్బారావు
(43) ‘రాజవాహన విజయం’ ప్రబంధంలో రాజులను ‘వ్యాళస్వాంతులు’గా వర్ణించిన కవి? 
    అ) కాకమాని మూర్తికవి        
    ఆ) దామెర్ల అంకరాజు
    ఇ) దామెట్ల వేంగళ నాయకుడు    
    ఈ) పురుషకారి కేశవయ్య
(44) ‘సవరము చిన నారాయణ పలుకు పై చూపునకు మాత్రమే కాదు లోచూపునకు ప్రౌఢమే’ అని పేర్కొన్నదెవరు? 
    అ) దేవళ్ల చిన్న కృష్ణయ్య    
    ఆ) ఖండవల్లి లక్ష్మీరంజనం
    ఇ) శిష్ట్లా రామకృష్ణశాస్త్రి    ఈ) ఆరుద్ర

జవాబులు
1) ఆ    2) ఆ 3) ఆ    4) అ 5) ఆ 6) ఆ     7) ఇ    8) ఆ 9) ఆ    
10) అ 11) ఇ 12) ఇ 13) ఆ 14) ఆ 15) అ 16) అ 17) ఇ    
18) ఆ 19) ఆ 20) అ 21) ఇ 22) అ 23) ఇ 24) ఆ 
25) అ 26) ఈ 27) ఆ 28) ఆ 29) ఆ 30) అ 31) ఆ 
32) ఆ 33) ఆ 34) ఇ 35) ఆ 36) ఇ  37) ఈ 38) ఇ    
39) ఆ 40) ఆ 41) ఇ 42) అ 43) అ 44) అ


వెనక్కి ...

మీ అభిప్రాయం