పల్లెదనం చల్లని చద్ది బువ్వ

  • 21 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। పి.విజయకుమార్‌

  • సహాయ ఆచార్యులు
  • అనంతపురం
  • 9063702546
డా।। పి.విజయకుమార్‌

‘‘ఆంధ్రభాష యమృత మంధ్రాక్షరంబులు/ మురువు లొలుకు గుండ్ర ముత్తియములు/ ఆంధ్ర దేశమాయు రారోగ్య వర్ధకం/ బాంధ్రజాతి నీతి ననుసరించు’’ అంటూ కీర్తించారు వేటూరి ప్రభాకరశాస్త్రి. తెలుగు నెట్, సెట్‌లకు సన్నద్ధమయ్యే వారు, పరిశోధక అభ్యర్థుల సాధన కోసం కొన్ని మాదిరి ప్రశ్నలు..

(1) కాశీఖండానికి మల్లంపల్లి శరభేశ్వరశర్మ రాసిన వ్యాఖ్య? 
    అ) సంజీవని            ఆ) మణికర్ణికా    
    ఇ) సురభి            ఈ) భావప్రకాశిక
(2) ‘‘రమ్యం జుగుప్సిత ముదార మధాపి నీచం’’ అని కావ్యంలో వర్ణించిన వస్తువు ఏదైనా కవి రమ్యంగా చిత్రిస్తాడని చెప్పిన ఆలంకారికుడు? 
    అ) భామహుడు        ఆ) ధనుంజయుడు
    ఇ) దండి            ఈ) రుద్రటుడు
(3) కవి శబ్దాన్ని మొట్టమొదట వేదాల్లో ఏ అర్థంలో వాడారు? 
    అ) వర్ణించేవాడు        ఆ) పరమాత్మ    
    ఇ) వినిపించేవాడు        ఈ) రాసేవాడు
(4) ‘‘శక్తి ర్నిపుణతా లోక శాస్త్ర కావ్యా ద్యవేక్షణాత్‌/ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతిహేతు స్తదుద్భవే’’ అని కావ్య హేతువుల గురించి చెప్పిందెవరు?
    అ) భామహుడు        ఆ) దండి     
    ఇ) రుద్రటుడు        ఈ) మమ్మటుడు
(5) చలించకుండా స్థిరంగా ఉండే భావం? 
    అ) సాత్త్విక భావం        ఆ) వ్యభిచారీభావం
    ఇ) స్థాయీభావం        ఈ) విభావం
(6) ‘‘శ్మశానంలోంచే రానక్కరలేదు మార్పు.. సౌందర్య నిరంతరాన్వేషణలోంచి రావచ్చు’’ అన్న కవి? 
    అ) పేర్వారం జగన్నాథం                ఆ) కోవెల సుప్రసన్నాచార్యులు
    ఇ) కోవెల సంపత్కుమారాచార్య     ఈ) వే.నరసింహారెడ్డి
(7) ‘‘భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా ఝంఝని ప్రసరిస్తాను’’ అన్న కవి? 
    అ) కె.వి.రమణారెడ్డి        ఆ) శ్రీశ్రీ
    ఇ) జ్వాలాముఖి        ఈ) నిఖిలేశ్వర్‌
(8) ‘‘పల్లెదనం/ చల్లని చద్దిబువ్వ/ పట్నవాసం/ వేడివేడి ఫాస్ట్‌ఫుడ్‌’’ అన్న నానీ ఎవరిది?
    అ) ఎన్‌.గోపి            ఆ) పెన్నా శివరామకృష్ణ
    ఇ) సోమేపల్లి వెంకట సుబ్బయ్య    ఈ) బి.వి.వి.ప్రసాద్‌
(9) ‘‘కుంపటి మా ఇంటి తోటలో పూసే సూర్య పుష్పం’’ అన్న కవి? 
    అ) జూలూరి గౌరీశంకర్‌    ఆ) బాణాల శ్రీనివాస్‌
    ఇ) సీతారాం        ఈ) దేవరపల్లి మస్తాన్‌రావు
(10) అష్టాదశ పురాణాల్లో లేని పురాణం? 
    అ) నారదీయ        ఆ) వరాహ
    ఇ) బసవ        ఈ) స్కాంద
(11) ఆముక్తమాల్యద ఎన్నో ఆశ్వాసంలో గోదాదేవి విరహం వర్ణితమైంది? 
    అ) నాలుగో        ఆ) అయిదో
    ఇ) ఆరో        ఈ) ఏడో
(12) ‘‘శీతాహార్య సుతాళినీ వికచ రాజీవంబు విశ్వేశ్వర’’ అనే పద్యం పాండురంగ మహత్మ్య ప్రారంభంలో ఏ పురాన్ని వర్ణిస్తుంది?
    అ) మధుర         ఆ) కాశీ
    ఇ) వైకుంఠపురం    ఈ) ప్రయాగ
(13) ‘‘మాటలు నేర్పులా సరసమార్గములా కొలువుండు రీతులా’’ అని రఘునాథ నాయకుడి మూర్తిని స్పష్టంగా చిత్రించిన కవి? 
    అ) చిత్రకవి పెద్దన       ఆ) చేమకూర వేంకటకవి    
    ఇ) ప్రోలుగంటి చెన్నశౌరి  ఈ) క్రాంజ వేంకటాద్రి
(14) కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి రచన?
    అ) తారకబ్రహ్మం        ఆ) దిలీపచరిత్రం    
    ఇ) ప్రబోధచంద్రోదయం    ఈ) అన్నీ
(15) ‘శేషధర్మం’ ప్రబంధ కర్త? 
    అ) వెణుతురుపల్లి విశ్వనాథకవి     ఆ) కోదండరామ కవి
    ఇ) మండపాక పేరయ      ఈ) పీసపాటి వెంకటేశ్వరులు
(16) ‘విజయరామ’ శతక కర్త? 
    అ) గోగులపాటి కూర్మనాథ కవి    ఆ) అడిదము సూరకవి
    ఇ) పోలిపెద్ది వెంకటరాయకవి ఈ) శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి
(17) ‘అమరుకా’న్ని పద్యరూపంలో ఆంధ్రీకరించి వెంకటపతి నాయునికి అంకితమిచ్చింది? 
    అ) సర్వశాస్త్రి            ఆ) కుమార ధూర్జటి
    ఇ) దిట్టకవి రామచంద్రకవి    ఈ) బుర్రా శేషగిరిరావు
(18) ‘రాఘవ వాసుదేవీయం’ ద్వ్యర్థి కావ్య కర్త? 
    అ) సింగరాచార్యుడు        ఆ) పోకూరి కాశీపతి
    ఇ) కాణాదం పెద్దన సోమయాజి                ఈ) పెదసోమభూపాలుడు
(19) కృష్ణలీలా తరంగిణిని ‘ఆంధ్రాష్టపది’ పేరిట తెనిగించింది?
    అ) కొటికలపూడి వీరరాఘవాచార్యులు            ఆ) ఆదిపూడి ప్రభాకరకవి
    ఇ) కామసముద్రము అప్పలాచార్యులు            ఈ) కర్నమడకల అనంతాచార్యులు
(20) ‘సురభిమల్లా? నీతివాచస్పతీ!’ అనే మకుటంతో ‘మల్లభూపాలీయం’ పేరిట భర్తృహరి సుభాషిత త్రయిని అనువదించిందెవరు? 
    అ) ఏనుగు లక్ష్మణకవి        ఆ) ఎలకూచి బాలసరస్వతి
    ఇ) పుష్పగిరి తిమ్మన        ఈ) కళువె వీరరాజు
(21) ‘మన్వంతరం’ అనేది ఏ ప్రక్రియ లక్షణాల్లో ఒకటి? 
    అ) ఇతిహాసం ఆ) పురాణం ఇ) ప్రబంధం    ఈ) దండకం
(22) విశ్వనాథుడు ‘సాహిత్యదర్పణంలో’ పేర్కొన్న ఉపరూపకాలెన్ని? 
    అ) 14     ఆ) 10       ఇ) 18     ఈ) 22
(23) అర్థాన్ని బట్టి మధ్యమ కావ్యంగా పేర్కొనే కావ్యభేదం? 
    అ) ధ్వనికావ్యం    ఆ) గుణీభూతవ్యంగ్యం
    ఇ) చిత్రకావ్యం    ఈ) అన్నీ
(24) ‘‘జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషా యశః కాయే జరామరణజంభయమ్‌’’ అన్నదెవరు?
    అ) భామహుడు        ఆ) మమ్మటుడు
    ఇ) భర్తృహరి            ఈ) అభినవగుప్తుడు
(25) రసం ‘నట’ నిష్ఠమని ప్రతిపాదించిందెవరు? 
    అ) భట్టలోల్లటుడు        ఆ) శ్రీశంకుకుడు
    ఇ) భట్టనాయకుడు        ఈ) అభినవగుప్తుడు
(26) ‘ఉజ్జ్వల నీలమణి’ గ్రంథకర్త? 
    అ) విశ్వనాథుడు        ఆ) రూపగోస్వామి
    ఇ) భోజుడు            ఈ) భానుదత్తుడు
(27) శృంగారాన్ని ‘అయోగ, సంభోగ, విప్రలంభ’ అని మూడు రకాలుగా విభజించిందెవరు?
    అ) ధనుంజయుడు        ఆ) భామహుడు
    ఇ) వామనుడు        ఈ) దండి
(28) ‘‘సజాతీయైర్విజాతీయై రతిరస్మృతమూర్తిమాన్‌/ యావద్రసం వర్తమానః స్థాయిభావ ఉదాహృతః’’ అని స్థాయిభావం గురించి ఏ గ్రంథం చెబుతుంది?
    అ) కావ్యాలంకారం    ఆ) దశరూపకం    
    ఇ) కావ్యాదర్శం    ఈ) ప్రతాపరుద్ర యశోభూషణం
(29) ‘‘పదమెత్తం గల హంసలీల, యధర స్పందంబు సేయన్‌’’ పద్యకర్త?    
    అ) నంది తిమ్మన        ఆ) రామరాజభూషణుడు
    ఇ) మాదయగారి మల్లన    ఈ) తెనాలి రామకృష్ణ కవి
(30) ‘రోదరం’ అనేది ఏ లక్షణ భేదానికి ఉదాహరణ?
    అ) లక్షిత లక్షణ    ఆ) విపరీత లక్షణ
    ఇ) జహల్లక్షణ    ఈ) అజహల్లక్షణ
(31) సంలక్ష్యక్రమ వ్యంగ్య భేదం?
    అ) శబ్దశక్తి మూలం        ఆ) అర్థశక్తి మూలం
    ఇ) ఉభయశక్తి మూలం    ఈ) అన్నీ
(32) కావ్యానికి అర్థం కుదరనప్పుడు వ్యంగ్యార్థం వల్ల అర్థం కుదిరితే అది ఏ గుణీభూత వ్యంగ్యభేదం? 
    అ) వాచ్యాంగం       ఆ) అపరాంగం
    ఇ) అగూఢం           ఈ) కాక్వాక్షిప్తం
(33) ‘‘ప్రపంచం దిగంబరం కావాలి, విశ్వం దిగంబరం కావాలి’’ అన్న దిగంబర కవి? 
    అ) నగ్నముని       ఆ) నిఖిలేశ్వర్‌
    ఇ) జ్వాలాముఖి       ఈ) చెరబండరాజు
(34) ‘‘భావకవుల నపుంసక హావభావాలకు సవాల్‌’’ అన్న కవి? 
    అ) భైరవయ్య       ఆ) నిఖిలేశ్వర్‌    
    ఇ) మహాస్వప్న       ఈ) కె.వి.రమణారెడ్డి
(35) ‘‘దిగంబర కవిత్వోద్యమం తాటాకుల మంటలా ఎలా వచ్చిందో అలా పోతుంది’’ అన్న విమర్శకుడు? 
    అ) రాచమల్లు రామచంద్రారెడ్డి    ఆ) విశ్వనాథ
    ఇ) కేతవరపు రామకోటిశాస్త్రి     ఈ) ఆవంత్స 
(36) ‘‘ఈ మట్టి నాకు పట్టెడన్నం పెట్టి పాలు తాపింది’’ అన్న కవి? 
    అ) సుబ్బారావు పాణిగ్రాహి    ఆ) గద్దర్‌
    ఇ) చెరబండరాజు        ఈ) శివసాగర్‌
(37) ‘‘మాట్లాడబోతే ఎవరూ వినిపించుకోరు అందుకో మరెందుకో ఈ గొంతు మూగవోయింది’’ అన్న కవయిత్రి? 
    అ) జయప్రభ      ఆ) వాణీ రంగారావు 
    ఇ) రేవతీదేవి        ఈ) సావిత్రి
(38) ‘‘నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే ముందుగా పైటని తగలెయ్యాలి’’ అన్న కవయిత్రి? 
    అ) జయప్రభ        ఆ) కొండేపూడి నిర్మల
    ఇ) రావులపల్లి సునీత        ఈ) భవానీదేవి
(39) ‘కన్నీటి కెరటాల వెన్నెల’ ఎవరి నవల? 
    అ) చలం          ఆ) గోపీచంద్‌  
    ఇ) ఓల్గా          ఈ) రావిశాస్త్రి
జవాబులు
1) ఆ 2) ఆ 3) ఆ 4) ఈ 5) ఇ 6) ఆ 7) ఆ 8) ఇ 
9) ఆ 10) ఇ 11) ఆ 12)ఆ 13) ఆ 14) ఈ 15) అ 
16) అ 17) అ 18) అ 19) ఇ 20) ఆ 21) అ 22) ఇ 23) ఆ 24) ఇ 25) ఆ 26) ఆ 27)అ 28) ఆ 29) ఆ 
30) అ 31) ఈ 32) అ 33) అ 34) ఆ 35) ఆ 36)ఇ 37) ఇ 38) అ 39) ఇ 


వెనక్కి ...

మీ అభిప్రాయం