తేట తేట తెలుగులో...

  • 171 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వైరాగ్యం ప్రభాకర్‌

  • చామనపల్లి, కరీంనగర్‌
  • 9014559059
వైరాగ్యం ప్రభాకర్‌

పాఠ్యపుస్తకాలను దాటి ఆలోచించాలి. సాధారణ బోధన పద్ధతులను పక్కనపెట్టి ప్రయత్నించాలి. అప్పుడే విద్యార్థికి గురువుపై గురి కుదురుతుంది. నేర్చుకునే పాఠంపై అనురక్తి పెరుగుతుంది. 
పుట్టినప్పటి
నుంచి ఐదేళ్లు వచ్చేవరకు పిల్లవాడు అనేక సన్నివేశాలు ద్వారా, కుటుంబంలోని వారిని అనుకరిస్తూ ఎన్నోవిషయాలు నేర్చుకుంటాడు. స్వీయ అభ్యసనం ద్వారా సన్నివేశంలోని అంశాలను గ్రహిస్తాడు. కొన్ని వందల పదాలను వింటాడు. ఉచ్చరిస్తాడు. వాగ్రూపంలో నేర్చుకున్న అంశాలు లిఖిత రూపంలో మార్చడం ఒకటే పిల్లవాడికి రాదు. శ్రవణ, భాషణ నైపుణ్యాలు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుంటాయి.
      ఆ వయస్సులో పాఠశాలలో చేరిన పిల్లవాడు పదిహేనేళ్ల వరకు అంటే పదేళ్లు పాఠశాల్లోనే ఉంటాడు. ఉపాధ్యాయుల బోధన వల్ల, తోటి విద్యార్థులు, పరిసరాల ద్వారా స్వయంగా నేర్చుకుంటాడు. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం... ఈ నాలుగు నైపుణ్యాలను విద్యార్థుల్లో పాదుకొల్పడమే భాషాబోధకుల ప్రథమ కర్తవ్యం. వీటితోపాటు పదజాలాభివృద్ధి, వ్యాకరణాంశాలు, ప్రశంస, ప్రాజెక్టు పనులు వంటి సామర్థ్యాలను బోధనా విధానంలో లక్ష్యంగా పెట్టుకున్నాం.
      నల్లబల్ల పథకం (్న్ప్చ౯్చ్మi్న- ్జః్చ‘ఁ ్జ్న్చ౯్ట) నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం (ద్న్ఝ్పి౯’్త’-(i్ర’ ద్ని-్మi-్య’ ని్ర్చః్య్చ్మi్న-) వరకు అనేక రకాలైన పథకాలు, ప్రణాళికలు, వ్యూహాలు, లక్ష్యాలు నిర్ధరించుకుని ముందుకెళ్లినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. భాషాదోషాలు లేకుండా పట్టుమని పదివాక్యాలు రాసేవారు కరవయ్యారు. స్నాతకోత్తర స్థాయి విద్యార్థుల్లో కూడా భాషాదోషాలుండటం విచారకరం. స్పష్టంగా సరైన ఉచ్చారణతో,  ఆత్మవిశ్వాసంతో సంభాషించలేని పరిస్థితి. ఉచ్చారణా దోషాలు లేకుండా చదవలేని స్థితి.
      విద్యార్థుల్లో ఈ సామర్థ్యాలు సాధించలేక పోవడానికి అనేక కారణాలున్నాయి. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలున్నట్లు. అందులో ఒకటి ఉపాధ్యాయుని బోధనా విధానం. ఇప్పటికీ సనాతన సంప్రదాయాలని వీడనితనం,  విద్యార్థిని భాషవైపు ఆకర్షించలేని విద్యాబోధన.
      ఇంటికి పునాది ఎంత అవసరమో. విద్యార్థికి ప్రాథమిక విద్యా అంతే ముఖ్యం. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు బోధించే ప్రతి అంశం కొత్తదిగా, ఆకర్షణీయంగా ఉండాలి. కృత్యాధారబోధన, బోధనోపకరణాల వినియోగం, ఆటపాటలతో విద్య నేర్పినప్పుడు విద్యార్థి పాఠశాలకు రావడానికి తహతహలాడతాడు. ఇలాంటి ప్రాథమిక విద్యను నేర్పిస్తే పిల్లవాడిలో భాషాభిమానం కలుగుతుంది. దోషాలు లేకుండా చదువుతాడు, రాస్తాడు. పాఠం పూర్తి చేయడం ముఖ్యం కాదు, విద్యార్థికి పాఠాన్ని ఏ మేరకు అవగాహన కలిగించామన్నది ముఖ్యం. భాషలో పట్టు సాధించిన విద్యార్థి భాషేతర అంశాల్లో కూడా ముందుంటాడు.
      ఇదే ఉరవడి ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల్లో కూడా చూపించే ప్రయత్నం ఉపాధ్యాయుడు చేసినప్పుడే విద్యార్థి భాషాధ్యయనంలో సఫలీకృతుడవుతాడు. ఉపాధ్యాయులు సత్ఫలితాలను పొందుతారు. 
      సహజంగా విద్యార్థికి పద్యాలు అంత తొందరగా అవగతం కావు. పద్యభాగాన్ని  ఉపాధ్యాయుడు సరళీకృతం చేసి బోధిస్తే విద్యార్థి పద్య మాధుర్యంలో ఓలలాడుతాడు. పద్యంలోని కమ్మదనం, అలంకారంలోని అమృతత్వం, పదాల వినియోగంలోని విశిష్టత్వాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ కవిని ప్రశంసిస్తాడు.
పద్య బోధన పద్ధతులు 
* కవి చిత్రపటం ద్వారా జీవిత విశేషాలు, రచనలు, శైలి, సమకాలికుల వివరాలు తెలియజేయడం.
* సొంతవాక్య ప్రయోగాల ద్వారా కఠిన పదాలకు అర్థాలు చెప్పడం.
* ప్రముఖ శతకాలు, రచయితల వివరాలను పట్టికతో పరిచయం చేయడం.
* పాఠంలోని పద్యాలు ముందుగా రాగయుక్తంగా, భావయుక్తంగా రెండుసార్లు పాడాలి.
* పద్యాల్లోని సంధి పదాలను విడదీసి అర్థం భావస్ఫురణకు వచ్చేలా చదవడం.
* మెరుపు అట్టలపై ప్రతి పదం అర్థాన్ని రంగుల కలాలతో రాసి విద్యార్థి  బృందాలకివ్వడం. 
      పద్యం ఆధారంగా వాటిని వరుస క్రమంలో, అన్వయక్రమంలో అమర్చమనాలి. విద్యార్థులు వాటిని పేర్చి, తమ దగ్గర ఉన్న పుస్తకంలో రాసుకుంటారు. పద అర్థాలను వరసక్రమంలో రాయగా వచ్చిందే తాత్పర్యం.
      ఈ కృత్యంలో పరస్పర సహకారం, ఆలోచన, విచక్షణ, క్రమపద్ధతిలో పేర్చడం, స్వీయాభ్యసనం, భాషణం, లేఖనం, శ్రవణ నైపుణ్యాలు వినియోగం జరుగుతాయి. విద్యార్థుల్లో ఆసక్తి, పోటీతత్వం పెరుగుతుంది.
పర్యాయపదాల్ని ఇలా నేర్పుదాం
ఆ పదాలన్నీ ఒకే పరిచ్ఛేదంలో వచ్చేట్లు తయారుచేయాలి. అందులోని పర్యాయపదాలను గుర్తించమనటం, మళ్లీ అలాంటి పరిచ్ఛేదాలు తయారుచేయమనాలి.
కనకం: పర్యాయపదాలు గురించి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.
రామయ్య తన కూతురు వివాహ నిమిత్తం 50గ్రాముల బంగారంతో నగలు చేయించాలనుకున్నాడు. అది సరిపోదేమోనన్న ఉద్దేశంతో మరో 20 గ్రాముల పసిడిని కొన్నాడు. స్వర్ణకారుడికి ఆ మొత్తం పుత్తడిని ఇచ్చాడు. వారం రోజుల్లో ఆభరణాలు తయారుచేసివ్వాలని కోరాడు.
‘అర్థాని’కి నానార్థాలు తెలుసా!
ఈ లోకంలో ధనం అందరికీ అవసరమని దాని ప్రయోజనాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి. శబ్దార్థాలు నేర్చుకోవడానికి తరగతిలోని ప్రతి విద్యార్థికి ఒక పదం వచ్చేలా చిట్టీలు రాసి ఉంచాలి. ఆ పదాల అర్థాలు మరొక గదిలో నల్లబల్లపై కానీ, చిత్రాలు గీసే పత్రం పైగానీ రాసి ఉండాలి. ప్రతి విద్యార్థి తనకు వచ్చిన పదానికి అర్థం అందులో వెతికి, గుర్తించి, తిరిగొచ్చి  తరగతి గదిలోని నల్లబల్లపై ఆ పదం అర్థాన్ని రాస్తాడు. ఇలా తరగతి గది సంఖ్యకు సమానంగా పదాల అర్థాలు ఒకే సమయంలో విద్యార్థులందరూ నేర్చుకుంటారు. 
      ప్రకృతి వికృతులు, జతపరచడం, మాటకట్టు నమూనాలో కృత్యాధార రూపంలో ఇవ్వొచ్చు.
      ఇలా ప్రతి అంశాన్నీ ఉపన్యాస పద్ధతిలో కాకుండా కృత్యాధార పద్ధతిలో బోధించాలి. ఈ విధానం విద్యార్థికి స్వీయ అభ్యసనానికి పునాది వేస్తుంది. మార్గదర్శకంగానూ ఉంటుంది. విద్యార్థుల భాషాధ్యయనమూ సులభతరమవుతుంది. ఈ పద్ధతిలో సంపాదించుకున్న జ్ఞానం విద్యార్థుల మదిలో చిరస్థాయిగా నిలుస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం