గురుకుల పరీక్ష... ప్రశ్నలు ఇలా...! 

  • 923 Views
  • 2Likes
  • Like
  • Article Share

తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎక్కువమంది పోటీపడుతున్నారు. దానికి తగ్గట్టుగా అభ్యర్థులూ విస్తృత అధ్యయనం చేస్తున్నారు. తెలుగు టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు సంబంధించి మూడో ప్రశ్నపత్రంలో 100 మార్కులకు వంద ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్‌లో తెలుగుభాషా సాహిత్యాలకు చాలా ప్రాధాన్యం ఉన్నందున ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలిద్దాం.

*  ‘ట’కారానికి కరణం?   (2)

    1. పరివేష్టిత జిహ్వాగ్రం    2. జిహ్వాగ్రం      3. తాలవ్యం    4. పైపెదవి

*  శాసనభాషలో ‘అమ్మ’?  (1)

    1. ఉభయలింగం     2. స్త్రీలింగం        3. పుంలింగం         4. నపుంసకలింగం

*  తెలుగు భారతంలో లేని ఘట్టం?  (1)

    1. శశిరేఖాభిమన్యుల ఘట్టం         2. సౌప్తిక ప్రణయం      3. ఉత్తరాభిమన్యుల వివాహం       4. ద్రుపద పురోహిత రాయబారం

*  రోలు అనే పదం ఏర్పడటానికి కారణం?  (3)

    1. వర్ణనాశం       2. తాలవ్యీకరణం       3. వర్ణవ్యత్యయం     4. వర్ణ సమీకరణం

*  ‘టొమేటో’ ఏ భాషాపదం?   (3)

    1. తెలుగు       2. ఆంగ్లం      3. పోర్చుగీసు      4. డచ్చి

*  దేశింగురాజు కథలోని కథాస్థలం?  (1)

    1. తమిళనాడు    2. కర్ణాటక     3. కేరళ         4. తెలుగునాడు

*  వ్యంజనాశక్తిలో బోధించే అర్థం?          (2)

    1. వాచ్యార్థం    2. వ్యంగ్యార్థం      3. తుల్యార్థం    4. ప్రతిపదార్థం

*  నాటకాన్ని‘చాక్షుషక్రతువు’గాపేర్కొన్న గ్రంథం? (4)

    1. దశరూపకం    2. నాట్యశాస్త్రం     3. కాదంబరి    4. మాళవికాగ్నిమిత్రం

*  నాటక లక్షణాలు చెప్పిన మొదటి తెలుగు లాక్షణికుడు?   (3)

    1. విన్నకోట పెద్దన      2. కోరాడ రామచంద్రశాస్త్రి       3. చిత్రకవి పెద్దన     4. ధర్మవరం కృష్ణమాచార్యులు

*  తెలుగు భాషకు సహజమైన యతిప్రాసల ప్రాముఖ్యాన్ని కావ్య సన్నివేశాలలో ప్రస్తావించిన కవి?  (1)

    1. రామభద్రుడు      2. గౌరన      3. కొఱవి గోపరాజు   4. నారాయణకవి

*  జన జీవితాలకు సంబంధించిన అనేక అంశాలను పట్టికలుగా కూర్చిన గ్రంథం?   (1)

    1. హంసవింశతి       2. వాల్మీకి చరిత్ర       3. నవనాథ చరిత్ర    4. వేంకటాచల మాహాత్మ్యం

*  ‘హైకూ’ ప్రక్రియ ఏ దేశానికి చెందింది?  (3)

    1. అమెరికా     2. జర్మనీ       3. జపాన్‌        4. రష్యా

*  ‘‘ఒక ఛాయ నవపాయ పిక గేయ సముదాయం’’ అనే పద్యం ఉన్న ప్రబంధం?  (3)

    1. ఆముక్తమాల్యద     2. మనుచరిత్ర        3. వసుచరిత్ర       4. విజయవిలాసం

*  చమత్కారానికి ప్రాధాన్యమిచ్చిన ఆలంకారికుడు?  (2)

    1. దండి         2. విశ్వేశ్వర కవి చంద్రుడు     3. విద్యానాథుడు     4. భట్టలోల్లటుడు

*  ‘సాహిత్యం-వాస్తవికత’ గ్రంథకర్త? (3)

    1. ఆర్‌.ఎస్‌.సుదర్శనం        2. కట్టమంచి      3. త్రిపురనేని మధుసూదనరావు        4. పింగళి లక్ష్మీకాంతం

*  ‘తెలంగాణ’ కావ్యకర్త? (2)

    1. నగ్నముని        2. కుందుర్తి     3. గోపాలచక్రవర్తి    4. శీలా వీర్రాజు

*  ‘రవ్వలురాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద ఆంధ్రవాణికిన్‌’ అన్న కవి?   (3)

    1. శ్రీశ్రీ    2. గురజాడ      3. జాషువా    4. సినారె

*  ‘మహబూబ్‌నగర్‌ జిల్లా జానపద కథలు’ గ్రంథకర్త?  (2)

    1. కె.సుమతి        2. బుక్కా బాలస్వామి      3. బిరుదురాజు     4. నాయని కృష్ణకుమారి

*  జానపద కథాధ్యయనం శాస్త్రీయంగా సాగడానికి నాందిపలికినసిద్ధాంతం?(3)

    1. పురాణమూల సిద్ధాంతం          2. భారతమూల సిద్ధాంతం     3. ఇండోయూరోపియన్‌ సిద్ధాంతం      4. బహుమూల సిద్ధాంతం

*  ‘నా చెల్లీ చంద్రమ్మా’ కథాగేయ రచయిత? (2)

    1. శివశంకర్‌    2. శివసాగర్‌     3. శివరామకృష్ణ    4. చెరబండ రాజు

*  ‘‘కాలం నా కంఠమాల’’ అన్న కవి? (3)

    1. శ్రీశ్రీ     2. గద్దర్‌      3. దాశరథి     4. వరవరరావు

*  ‘తెల్లకాకులు’ ఎవరి కథ?   (2)

    1. మధురాంతకం రాజారాం       2. తుమ్మల రామకృష్ణ       3. కె.ఎస్‌.రమణ      4. సయ్యద్‌ సలీం

*  ‘అసలు’ ఏ భాషా పదం? (4)

    1. తెలుగు     2. పోర్చుగీసు     3. సంస్కృతం     4. ఉర్దూ

*  ‘బొమ్మలగుట్ట శాసనం’ ఏ ప్రాంతంలో ఉంది?  (4)

    1. బెజవాడ     2. బొబ్బిలి      3. ధర్మవరం     4. కరీంనగర్‌

*  ‘జానపదుల తిట్లు’ గ్రంథకర్త?  (2)

    1. బిరుదురాజు     2. జి.ఎస్‌.మోహన్‌    3. ఆర్వీయస్‌ సుందరం   4. నేదునూరి గంగాధరం

*  చారిత్రకంగా A, B గా మారింది అనడానికి భాషాశాస్త్రంలో ఇలా గుర్తిస్తాం?  (1)

    1. A>B     2. BA      4. A-->B

*  వర్ణనాత్మకంగా A, B గా మారింది (సంధివశంగా) అనడానికి భాషాశాస్త్రంలో ఇలా గుర్తిస్తాం?   (2)

    1. A-->B     2. B-->A     3. A>B      4. B>A

*  ‘ఆంధ్రం, తెనుగు,తెలుగు’వ్యాసకర్త?(4)

    1. పి.ఎన్‌.సుబ్రహ్మణ్యం    2. బూదరాజు రాధాకృష్ణ     3. మహదేవశాస్త్రి    4. జి.ఎన్‌.రెడ్డి

*  ‘తెలుగులో అన్యదేశ్యాలు’ వ్యాసం రాసిందెవరు?  (1)

    1. వి.స్వరాజ్యలక్ష్మి      2. చేకూరి రామారావు      3. భద్రిరాజు      4. తూమాటి దొణప్ప

*  ‘లక్ష్యార్థసిద్ధి’ పొందిన పదం?  (2)

    1. కంపు     2. దాహం     3. చీర     4. చెంబు

*  ఆదాన మిశ్రమానికి ఉదాహరణ?  (1)

    1. గర్భగుడి         2. అనేక పర్యాయాలు     3. సందర్భోచితం   4. బావినీరు

*  తెలుగు మాండలికాలు- ప్రమాణ భాష వ్యాసకర్త? (4)

    1. మహదేవశాస్త్రి     2. రంగనాథాచార్యులు     3. కందప్ప చెట్టి      4. భద్రిరాజు కృష్ణమూర్తి

*  శాసనభాషా పరిణామంపై పరిశోధన చేసిన భాషావేత్త? (4)

    1. కందప్ప చెట్టి           2. బూదరాజు రాధాకృష్ణ     3. రంగనాథాచార్యులు   4. పై అందరూ

*  ఇవటూరి సోమనారాధ్యుడు ఎవరి గురువు? (4)

    1. కేతన     2. తిక్కన     3. ఎర్రన     4. పోతన

*  పరీక్షిన్మహారాజు కోరిక మేరకు వామనావతార ఘట్టాన్ని వినిపించిందెవరు?  (3)

   1. ధర్మరాజు     2. శ్రీకృష్ణుడు    3. శుకమహర్షి 4. ద్రోణుడు

*  దంతమూలీయ వర్ణం?  (3)

   1. క    2. చ      3. ల     4. డ

*  శాసనభాషా పరిణామంపై పరిశోధన చేసిన భాషావేత్త?  (4)

1. కందప్ప చెట్టి    2. బూదరాజు    3. రంగనాథాచార్యులు    4. పై అందరూ 


వెనక్కి ...

మీ అభిప్రాయం