మధ్య ద్రావిడ భాషలెన్ని?

  • 939 Views
  • 4Likes
  • Like
  • Article Share

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వివిధ గురుకుల విద్యాలయాల్లో జూనియర్‌ అధ్యాపకుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. గురుకుల డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకూ ప్రకటన వెలువడింది. ఈ రెండు పరీక్షల తెలుగు సిలబస్‌ దాదాపు సమానం. అందులోంచి కొన్ని మాదిరి ప్రశ్నలు..!
* ప్రాఙ్నన్నయ యుగంలో దేనికి బదులుగా వలపల గిలకను ఉపయోగించేవారు?    (1)
   1. ర            2. ల            3. ళ            4. ఱ

* ‘‘అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబును’’ పద్యకర్త?    (1)
   1. నన్నయ            2. తిక్కన            3. ఎర్రన            4. పోతన

* ‘‘నిండుమనంబు నవ్యనవనీత సమానము’’ పద్యపంక్తి ఎవరిది?   (2)
   1. శ్రీనాథుడు             2. నన్నయ             3. పోతన            4. ఎర్రన

* ‘‘తన కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు’’ అని తిక్కనను స్తుతించిందెవరు?    (1)
   1. ఎర్రన            2. శ్రీనాథుడు            3. పోతన            4. పెద్దన

* ‘‘శారద రాత్రులుజ్జ్వలలసత్తరతారక హారపంక్తులం’’ పద్యకర్త?   (1)
   1. నన్నయ            2. పెద్దన            3. తిమ్మన            4. మల్లన

* ‘‘స్ఫుర దరుణాంశు రాగ రుచి బొంపిరివోయి నిరస్త నీరదా’’ పద్యకర్త?   (1)
   1. ఎర్రన            2. శ్రీనాథుడు            3. పోతన            4. నారాయణామాత్యుడు

* ‘‘అబ్జాసన కల్పులందలతు నాద్యుల నన్నయ తిక్కనాద్యులన్‌’’ అని పలికిందెవరు?   (2)
   1. శ్రీనాథుడు            2. ఎర్రన            3. పోతన            4. పెద్దన

* ‘‘నన్నయభట్టు తిక్క కవినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌’’ అన్న పలుకులు ఎవరివి?   (1)
   1. ఎర్రన            2. సంకుసాల నృసింహకవి            3. పెద్దన             4. తిమ్మన

* ఎర్రన కృత గద్య పద్యాలెన్ని?     (4)
   1. 1295            2. 1395            3. 1495            4. 1595  

* ‘‘అంబనవాంబుజోజ్జ్వల కరాంబుజ’’ పద్యకర్త?   (1)
   1. ఎర్రన            2. పెద్దన            3. తిమ్మన            4. ధూర్జటి

* తొలి చంపూ రామాయణం?    (2)
   1. రంగనాథ రామాయణం            2. భాస్కర రామాయణం            3. మొల్ల రామాయణం            4. ఏదీ కాదు

* భాస్కర రామాయణ కవులు ప్రయోగించిన ఛందోభేదాలెన్ని?    (1)
   1. 17            2. 19            3. 22            4. 24

* ‘తెలుగులో జాతీయోద్యమ కవిత్వం’ గ్రంథకర్త?   (1)
   1. మద్దూరి సుబ్బారెడ్డి             2. బి.భాస్కర చౌదరి            3. పింగళి లక్ష్మీకాంతం            4. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

* ‘‘కవి అవిస్పష్ట వాంఛాంకురం, ఒక అంతర్నిగూఢ తాపం ఒక చిన్న కావ్యంలో ఊదబడితే అది భావ కవిత్వం’’ అని నిర్వచించిందెవరు?   (4)
   1. శ్రీశ్రీ            2. రాయప్రోలు            3. సినారె            4. విశ్వనాథ

* ‘‘ఏవియొ అర్థమ్ముకాని భావగీతమ్ములివి’’ అని అస్పష్టతను స్వయంగా అంగీకరించిన కవి?   (3)
    1. ఇంద్రగంటి            2. రాయప్రోలు            3. కృష్ణశాస్త్రి            4. వేదుల సత్యనారాయణశాస్త్రి

* కొత్త పాతల మేలు కలయికగా నవ్య కవిత్వానికి అంకురారోపణ చేసిందెవరు?   (3)
    1. కృష్ణశాస్త్రి             2. సినారె            3. గురజాడ            4. పానుగంటి

* ‘‘మ్రోయింపకోయ్‌ మురళి మ్రోయింపకోయ్‌ కృష్ణ/ తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు’’ అన్న మాటలెవరివి?   (3)
    1. బసవరాజు అప్పారావు            2. వేదుల            3. కృష్ణశాస్త్రి             4. ఆరుద్ర

* ప్రేయసిని ‘హృదయేశ్వరి’గా సంభావించిన కవి?    (1)
   1. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి              2. నండూరి సుబ్బారావు             3. వేదుల సత్యనారాయణ             4. కృష్ణశాస్త్రి

* ‘‘వలపెఱుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ అన్న కవి?  (2)
    1. రాయప్రోలు    సుబ్బారావు             2. బసవరాజు అప్పారావు            3. వేదుల సత్యనారాయణ             4. కొనకళ్ల వెంకటరత్నం

* అభిధ ద్వారా బోధించే అర్థం?   (4)
    1. వాచ్యం            2. అభిధేయం             3. శక్యం            4. అన్నీ

* సంకేతమయ్యే అర్థాన్ని బోధించే శబ్దవ్యాపారం?   (3)
    1. లక్షణ            2. వ్యంజన            3. అభిధ            4. అన్నీ

* ఏ శబ్దవృత్తితో బోధింపబడే అర్థం లక్ష్యం?   (2)
    1. అభిధ            2. లక్షణ            3. వ్యంజన            4. ఏదీ కాదు

* ఏ శబ్ద వృత్తితో బోధించబడే అర్థం వ్యంగ్యం?   (1)
    1.  వ్యంజన            2. లక్షణ            3. అభిధ            4. అన్నీ

* వర్ణముల కంటే భిన్నమై, వర్ణాలతో అభివ్యక్తమై అర్థబోధక నిత్యమయ్యే శబ్దం?   (1)
    1. స్ఫోటం            2. అభిధ            3. లక్షణ            4. వ్యంజన

* పదార్థబోధ తర్వాత వాక్యార్థ బోధ తెలియజేయడం ఎవరి మతం?   (1)
    1. అభిహితాన్వయవాదులు            2. అన్వితాభిదానవాదులు            3. భాక్తవాదులు            4. ఎవరూ కాదు

* వాక్యార్థబోధ తర్వాత పదార్థ బోధ తెలియజేయడం ఎవరి మతం?  (1)
    1. అన్వితాభిదానవాదులు            2. అభిహితాన్వయవాదులు            3. హేతువాదులు            4. అభ్యుదయవాదులు

* ధ్వని సిద్ధాంతాన్ని ఆనందవర్ధనుడు దేన్నుంచి గ్రహించాడు?   (1)
    1. స్ఫోటవాదం            2. భాక్తవాదం            3. హేతువాదం            4. జహల్లక్షణ

* జిహ్వాగ్రం తదితర కరణాలకు ఆయుస్థానాల తోడి సంయోగ వియోగాలు కలిగినపుడు జిహ్వాగ్రాది కరణాలతో మొదట ఉపజనితమయ్యే శబ్దం?    (4)
    1. అభిధ            2. లక్షణ            3. వ్యంజన            4. స్ఫోటం

* ఖండ కావ్య ప్రక్రియకి ఆద్యుడు?   (2)
    1. కందుకూరి            2. గురజాడ            3. రాయప్రోలు            4. చిలకమర్తి

* ‘హితసూచని’ ఏ ప్రక్రియకి సంబంధించింది?   (2)
    1. ప్రహసనం            2. వ్యాసం            3. ఏకాంకిక             4. కథ

* తుది వర్ణానికి ముందున్న వర్ణం?  (3)
    1. ఉత్తమం            2. ఉపోత్తమం            3. ఉపధ            4. సంహిత

* ‘నింద్య గ్రామ్యం’కు ఉదాహరణ?  (2)
    1. ప్రాణగొడ్డము            2. మృతకప్ప            3. కపిల కన్నులు            4. జీవగఱ్ఱ

* ‘ఆధారం’ ఎన్ని రకాలు?  (2)
    1. 2            2. 3            3. 4             4. 5

* ప్రత్యయాల గురించి వివరించే పరిచ్ఛేదం?   (1)
   1. తద్ధిత             2. ఆచ్ఛిక            3. క్రియా            4. కృదంత

* ‘టమోటా’ ఏ భాషా పదం?    (2)
    1. ఆంగ్లం            2. పోర్చుగీసు            3. తమిళం            4. కన్నడం

* తెలుగు భాషకు మూలలిపి?   (3)
    1. ఖరుషీ             2. చిత్ర            3. దక్షిణబ్రాహ్మీ            4. అన్నీ

* మధ్య ద్రావిడ భాషలెన్ని?    (3)
    1. 3            2. 8            3. 12            4. 10

* సాంఘిక విమర్శకు ఆద్యుడు?   (1)
    1.  టైనీ            2. అరిస్టాటిల్‌             3. ఇలియట్‌            4. కాల్‌రిడ్జ్‌

* ‘రఘువంశం’ కర్త?    (2)
    1. భారవి            2. కాళిదాసు            3. భాసుడు            4. మాఘడు

* సంస్కృతంలో వచన భేదాలెన్ని?    (2)
    1. 2            2. 3            3. 4            4. 6

* ‘‘పద్యాలు జీవితాన్ని చీల్చుకుని వస్తవి. అందుచేతనే బాధాకరంగా ఉంటవి. గుండెలకు తగిలేట్టు చెబుతాడు’’  అని నాయని సుబ్బారావు గురించి చెప్పినవారు?   (1)
    1. ముద్దుకృష్ణ             2. శ్రీశ్రీ             3. విశ్వనాథ            4. నండూరి

* అభ్యుదయ కవులలో ‘కవీనాం కవిః’ అనదగిన కవి?  (3)
    1. శ్రీశ్రీ             2. కుందుర్తి             3. అజంతా            4. ఆవంత్స సోమసుందర్‌

* శ్రీశ్రీ గురించి ‘‘యుగకలం ఆయన చేతిలో ఉంది. అది కదిలినా కక్కినా అందమే’’ అంది?  (1)
    1. శ్రీరమణ             2. రాచమల్లు రామచంద్రారెడ్డి            3. చలం             4. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

* ‘‘బంగారు పుట్టలో చీమ ఎవరిని ముందుగా కుట్టిందో గుర్తుండదు’’ అంటూ ‘రాజీ’వనాలు రాసిన వారు?     (1)
    1. పాటిబండ్ల రజని             2. జయప్రభ            3. కొండేపూడి నిర్మల            4. మందరపు హైమవతి

* గడియారం వారి శివభారతం గురించి ‘‘చదివితివొ శివగీతము పొదుగున మొగమిడిన లేగ పోల్కి’’ అన్నవారు?   (2)
    1. కృష్ణశాస్త్రి             2. రాయప్రోలు సుబ్బారావు            3. దాశరథి             4. విశ్వనాథ సత్యనారాయణ

* ‘‘శ్రీశ్రీ నీడ కింద చాలమంది కవులు మఱ్ఱిచెట్టుకింద మల్లెతీగల్లా నిలువలేకపోయారు’’ అన్న మాటలెవరివి?  (4)
    1. రారా             2. రావి శాస్త్రి             3. ఆవంత్స            4. చలం

* చిత్రకారుడు, శిల్పి, సంగీతవేత్త, నవలా రచయిత, కథానికా రచయిత, కవి.. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు?   (1)
   1. అడవి బాపిరాజు            2. అజంతా            3. ముద్దుకృష్ణ             4. రావి శాస్త్రి

* బాపిరాజుకి సూర్యసుతగా, యోగినిగా, నర్తకిగా, గాన సుందరిగా, దేశికగా, ప్రేయసిగా దర్శనమిచ్చింది?  (2)
   1. మోహిని             2. శశికళ             3. చంద్రకళ             4. కల్పన

 


వెనక్కి ...

మీ అభిప్రాయం