వచన రచనలో మేటి

  • 257 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

సాహితీవేత్త శ్రీపాద కృష్ణమూర్తి పశ్చిమ గోదావరిజిల్లా పాలకొల్లుకు సమీపంలోని గుమ్మలూరులో 1933 అక్టోబర్‌ 13న జన్మించారు. విజయవాడలోని ప్రాచ్య కళాశాలలో భాషాప్రవీణ పట్టా పొందారు. చిన్నతనం నుంచీ 
సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువగా ఉండటంతో అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు. అదే ఆసక్తితో ‘భారతి’ పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. అలాగే, నిఘంటువులకు ఎక్కని  తెలుగు పదాలను సేకరించి ప్రత్యేక వ్యాసం రచించారు. సాహిత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయటం కోసం రాజమహేంద్రవరంలో ప్రముఖ కవి మల్లంపల్లి శరభయ్యతో కలిసి అభ్యాసం చేశారు. అదే సమయంలో తణుకులో కవి బాలగంగాధర తిలక్‌ వద్ద భావ కవిత్వం అధ్యయనం చేశారు. తర్వాత కాలంలో రచనా వ్యాసంగం మీద పూర్తిగా పట్టుసాధించి పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి చరిత్ర, రంగనాధ రామాయణం, కాశీఖండం పద్యకావ్యాలను తెలుగులో వచనాలుగా రచించారు. వచన రచనలో శ్రీపాదది ప్రత్యేక శైలి. తెలుగు సాహిత్యంలో విశిష్టతల మీద కేంద్ర సాహిత్య అకాడమీ వెలువరించిన గ్రంథమాలలో భాగంగా మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి చరిత్రనూ గ్రంథస్తం చేశారు. పాలకొల్లు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా చేరిన శ్రీపాద, 1990లో ప్రధానాచార్యులుగా పదవీ విరమణ చేశారు. తణుకులో తంగిరాల సుబ్బారావుతో కలిసి  నన్నయ భట్టారక పీఠాన్ని స్థాపించి, అక్షరహాలికులకు ప్రోత్సాహాన్ని అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీపాద.. ఏప్రిల్‌ 27న దివంగతులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం